పలు గ్రామాల్లో మూడు వేలకు పెరిగిన పెన్షన్ పథకమును లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
పేదల జీవితాల్లో ఆనందం.. పండుగలా పింఛన్ల పంపిణీ.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల జీవితాల్లో ఆనందం నింపడానికి సంక్షేమ పథకాలు అందుస్తున్నారని అందులో భాగంగా వైయస్ఆర్ పింఛన్ల కానుక రూ. 3,000 పెంచారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
గార్లదిన్నె మండలం బూదేడు గ్రామ సచివాలయం ఆవరణలో, శింగనమల మండల పరిషత్ కార్యాలయంలో, నార్పల మండలం కేశేపల్లి గ్రామ సచివాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన వైయస్సార్ పింఛన్ల కానుక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, పింఛన్ కార్డు మరియు రూ.3,000 అందజేశారు.
వీటితో పాటు పాత లబ్దిదారులకు రూ.3,000 పింఛన్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎన్నికల ముందు ఇచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకుంటూ పెన్షన్ మొత్తాన్ని ఏటేటా పెంచుకుంటూ ప్రస్తుతం ఉన్న రూ.2,750 జనవరి నుంచి రూ.3,000 చొప్పున ఇస్తున్నారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నా పింఛన్ల మంజూరుకు అప్పటి జన్మభూమి కమిటీ సభ్యులు ఇబ్బందులు పెట్టడాన్ని స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నెల నుంచి కొత్తగా మరో 841మందికి పింఛన్లు మంజూరు చేశారన్నారు. మొత్తంగా 45,261 వేల మందికి రూ. 13.558 కోట్లను విడుదల అయిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Jan 04 2024, 08:07