బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించిన సర్పంచ్ చీమల పెద్దన్న పార్థివ్ దేహమునకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆలం నర్సా నాయుడు
శింగనమల నియోజకవర్గం నార్పల మండలం బి పప్పూరు గ్రామ సర్పంచ్ చీమల పెద్దన్న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నిన్నటి రోజున అనంతపురంలోని పావని హాస్పిటల్ లో చేరడం జరిగింది. ఆ విషయం తెలిసిన రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు డాక్టర్స్ తో మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకుని వైద్యం అందించాలని కోరారు.అలాగే కుటుంబ సభ్యులకు కూడా దైర్యం చెప్పారు. వీరితో పాటు రాష్ట్ర ఎస్సి సెల్ అధ్యక్షులు ఎం ఎస్ రాజు గారు, టీడీపీ జిల్లా నాయకులు అలం వెంకట నరసానాయుడు గారు కూడా పాల్గొన్నారు. డాక్టర్స్ ఎంత ప్రయతించిన చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో సర్పంచ్ చీమల పెద్దన్న తుది శ్వాస విడిచారు.
మృతదేహాన్ని బి పప్పూరు గ్రామానికి తీసుకెళ్లడంతో రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు, జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు అక్కడికి వెళ్లి మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, అంత్యక్రియలు పూర్తి అయ్యేదాకా అక్కడే ఉండి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
సర్పంచ్ పెద్దన్న తెలుగుదేశం పార్టీ సర్పంచ్ గా ఎన్నికై తక్కువ సమయం లోనే పంచాయతీ కోసం చాలా కష్టపడ్డారని మరియు గ్రామంలోని ప్రతి ఒక్కరి దగ్గర అభిమానాన్ని చురగొన్నారని అలాంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఆకస్మికంగా మరణించిన వార్తని జీర్ణించుకోలేక పోతున్నానని తెలియజేశారు. సర్పంచ్ పెద్దన్న కుటుంబాన్ని తాను వ్యక్తిగతంగా మరియు తెలుగుదేశం పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో మాజీ మండల అధ్యక్షుడు పిట్టు రంగారెడ్డి, మండల అధ్యక్షులు ఎర్రినాగప్ప, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్, గంగనపల్లి రాము, బండ్లపల్లి సర్పంచ్ వెంకట నారాయణమ్మ, నదిమిదొడ్డి సర్పంచ్ నాగార్జున, గూగుడు మాజీ ఎంపీటీసీ రాజన్న,క్లస్టర్ ఇంచార్జ్ కుళ్లాయప్ప,గుంజేపల్లి కుళ్ళాయప్ప, పప్పూరు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.
Jan 04 2024, 07:55