సొంత భూమిని ఒక్కొక్కరికి 2.5 సెంట్లు ప్రకారం 165 మందికి రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను పేదలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ పయ్యావుల కేశవ్ గారు..


ఉరవకొండ నియోజకవర్గం మైలారంపల్లిలో 6 .50 ఎకరాల సొంత భూమినిఒక్కొక్కరికి 2.5 సెంట్లు ప్రకారం 165 మందికి రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను పేదలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ పయ్యావుల కేశవ్ గారు

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పయ్యావుల వెంకటరమణప్ప, వేలూరు నారాయణస్వామి, పయ్యావుల ఎర్రిస్వామి,

 వేలూరు కేశన్న, EX MPTC నాగన్న, వడ్డే సురేష్, హరిజన లాలేప్ప ,వడ్డే ఆదినారాయణ ఇతర నాయకులు పాల్గొన్నారు.

జంతలూరు గ్రామం గోవిందం పల్లి సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ దాసరి సునీత..

బుక్కరాయసముద్రం మండలం జంతలూరు గ్రామం గోవిందం పల్లి సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా గౌరవ ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి దాసరి సునీత గారు, మరియు గ్రామ సర్పంచ్ లక్ష్మిరెడ్డి గారు,రాష్ట్ర జగనన్న ఆరోగ్య సురక్ష నోడల్ ఆఫీసర్ కె శ్రీనివాసులు రెడ్డి గారు, జిల్లా మలేరియా అధికారి డి ఓబుల్ గారు వచ్చారు,

గౌరవ ఎంపీపీ గారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గత అక్టోబర్లో నిర్వహించినప్పుడు మండల వ్యాప్తంగా 6,393 మంది చూపించుకోవడం జరిగింది వారిలో 282 మందిని పెద్ద ఆసుపత్రులకు రిఫర్ ( ఆరోగ్యశ్రీ కింద) చేయడం జరిగింది. ఈ 282 కేసుల్లో 281 కేసులు 281 కేసులు ఇప్పటి వరకు ట్రీట్మెంట్ పూర్తి చేసుకోవడం జరిగింది, అలాగే కంటికి సంబంధించి 243 మంది ఆపరేషన్లకు అవసరం కాక ఇప్పటివరకు 92 మందికి ఆపరేషన్లు చేయడం జరిగింది, మిగతా వారికి కంటి అద్దాలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది,

ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రధాన కార్యక్రమముగా తీసుకొని ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారని వారు తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమాలు నిర్వహించే ప్రతి చోట ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు తెలియజేశారు, రాష్ట్ర నోడల్ ఆఫీసర్ గారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి అనారోగ్యంతో ఉన్న వారిని అలాగే దీర్ఘకాలిక రోగాలతో ఉన్న వారిని కంటి ఆపరేషన్లు, మరియు అద్దాలు అవసరమైన వారిని గుర్తించి , జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వారు వచ్చి క్యాంపును విజయవంతం చేసేటట్లు గ్రామ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలని వారు తెలియజేశారు, అలాగే జిల్లా మలేరియా అధికారి మాట్లాడుతూ పేషెంట్లకు అవసరమైన అన్ని రకాల ల్యాబ్ టెస్టులు, డాక్టర్లు రాసినటువంటి మందులు తప్పనిసరిగా ఇచ్చి జగనన్న ఆరోగ్య సురక్ష బ్యాగులో వారికి పంపిణీ చేయాలని తెలియజేశారు, అలాగే ఈరోజు స్కూల్ పిల్లలకు గ్రామ ప్రజలకు కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ స్వాతి లక్ష్మి గారు, స్పెషలిస్ట్ డాక్టర్లు శరత్ రెడ్డి గారు జనరల్ ఫిజీషియన్, డాక్టర్ శివ జ్యోతి శ్రీ. గైనకాలజీ డాక్టర్ ( స్త్రీ సంబంధిత , గర్భవతి బాలింత ప్రత్యేక వైద్యురాలు) , ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కంటికి సంబంధించి ఆప్తమిక్ అసిస్టెంట్ ప్రసాదు, సౌమ్యకృష్ణ, సిహెచ్ మోహన్ రావు గారు, సూపర్వైజర్ స్టాప్, ఐసిడిఎస్ వారు, సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు ఆశా కార్యకర్తలు , గోవిందం పల్లి సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలు పాల్గొన్నారు,

 ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఓపి 359 హాజరయ్యారు, 02 కేసెస్ రెఫర్ చేయడం జరిగింది 48 మందికి కంటి అద్దాల కోసం పరీక్షించడం జరిగింది

మృతుని కుటుంబానికి అండగా ఉంటాం: ఆలూరు సాంబశివారెడ్డి..

గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు బోయ కుళ్లాయప్ప(48) కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.మృ తుని కుటుంబాన్ని ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి పరామర్శించి ఆర్థిక భరోసా కల్పించారు. వైఎస్సార్సీపీ తమ కార్యకర్తల కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, సర్పంచు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

27 మందితో రెండో జాబితాని అధికారికంగా ప్రకటించిన వైఎస్ఆర్సిపి పార్టీ

సామాజిక సమీకరణాల కారణంగా మరియు గెలుపే ప్రమాణికంగా దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్సిపి 27 మంది తో జాబితా విడుదల చేసింది ఈ జాబితాని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారికంగా ప్రకటించడం జరిగింది. అనంతపురం పార్లమెంట్ సభ్యులుగా మాజీమంత్రి శంకర్ నారాయణ గారిని ప్రకటించడం జరిగింది

వైయస్సార్సీపి ఇన్చార్జిలుగా రెండో జాబితా విడుదల..

సామాజిక సమీకరణాల కారణంగా మరియు గెలుపే ప్రమాణికంగా దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్సిపి 27 మంది తో జాబితా విడుదల చేసింది ఈ జాబితాని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడం జరిగింది. అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ సభ్యురాలుగా శాంత గారిని ప్రకటించడం జరిగింది

తహసీల్దార్ హరికుమర్ కునూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన బాలుర వసతి గృహ పూర్వ విద్యార్థులు

Breaking.. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టటంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి..
అనంతపురం జిల్లా: నార్పల మండలం కేసేపల్లి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టటంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి . మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు. మృతులు బొందలవాడ గ్రామానికి చెందిన విష్ణు(15), నార్పలకు చెందిన గౌతమ్ (14) వీరు నార్పల నుంచి కేసపల్లి గ్రామంలో ట్యూషన్ కు వెళ్తుండగా ఈ ఘటన.
Breaking.. సత్యసాయి జిల్లాలో తొలి కొవిడ్ మరణం..

సత్యసాయి జిల్లాలో తొలి కొవిడ్ మరణం

బాబా సమాధి దర్శనానికి వచ్చి కొవిడ్ తో మృతి చెందిన యూకే దేశస్తుడు

పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో యూకే పౌరసత్వం కలిగిన భాస్కర్ జోషి (79) కోవిడ్ తో మృతి.

తీవ్ర అనారోగ్యంతో వారం క్రితం ఆసుపత్రిలో చేరిన భాస్కర్ జోషి కొవిడ్ పాజిటివ్ తో చికిత్స పొందుతూ మృతి..

బాబా మహా సమాధిని దర్శించుకునేందుకు వారం రోజుల క్రితం ప్రశాంతి నిలయం వచ్చిన భాస్కర్ జోషి...

జగన్‌ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరు: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

కడప: జగన్‌ను గెలిపించి మనం తప్పు చేశామని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Mekapati Chandra Sekhar Reddy) అన్నారు..

కడపలో నిర్వహించిన మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ''నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అయినా నా గ్రాఫ్‌ బాగా లేదంటూ సీఎం జగన్‌ నన్ను కించపరిచారు. పార్టీ బలోపేతం కోసం ఎంతో శ్రమించా..

లేనిపోని అనుమనాలతో నా టికెట్‌నే అమ్మకానికి పెట్టారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని జగన్‌ సర్వనాశనం చేశారు. జగన్‌ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరు. జగన్‌ లాంటి వారు రాష్ట్రాన్ని పాలిస్తే ప్రజలు బాగుపడరు. రుషికొండలో భవనాలను సరదాగా కట్టుకున్నట్లు ఉంది. సీఎం పదవి భగవంతుడు ఇచ్చిన వరమని జగన్‌ గ్రహించాలి'' అని హితవు పలికారు..

వైకాపా నుంచి పోటీ చేసి గెలవకపోవడమే మంచిదైంది: దగ్గుబాటి వెంకటేశ్వరరావు..

బాపట్ల: పర్చూరులో వైకాపా (YSRCP) నుంచి తాను పోటీ చేసి గెలవకపోవడమే మంచిదైందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao) వ్యాఖ్యానించారు..

గెలిచి ఉంటే.. రోడ్లు వేయలేదని ప్రజలు తనని నిలదీసేవారన్నారు. కారంచేడులో స్థానికులతో ఆయన మాటామంతీ నిర్వహించారు. 

వైకాపా పాలనలో కారంచేడులో ఒక్క రోడ్డు మరమ్మతు కూడా చేయలేదు. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఈ రోడ్లపై ఇంత స్వేచ్ఛగా తిరిగే వాడిని కాదు. దేవుడి దయ వల్ల పర్చూరులో నేను ఓడిపోవడం మంచిదైంది. నా కుమారుడిని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తామన్నారు. జగన్‌ పెట్టిన నిబంధనలకు తలొగ్గలేక సున్నితంగా తిరస్కరించాం. ఇవాళ రాజకీయాలంటే పరస్పర విమర్శలు. నేతలు తిట్టుకోవడమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు..