తన పూర్వ మిత్రుడు శ్రీరాములు కూతురు లావణ్య S.I.గా ఎంపిక..
పూర్వ మిత్రుడు శ్రీరాములు కూతురు లావణ్య ఎస్సైగా ఎంపిక ఘనంగా సన్మానించిన హాస్టల్ పూర్వ విద్యార్థులు
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలం నాయన పల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు కూతురు ఎస్సైగా ఉద్యోగం సాధించడంతో
పూర్వ విద్యాభ్యాసం హాస్టల్ విద్యార్థులు కలిసి శ్రీరాములు కూతురు లావణ్య నీ పుష్పగుచ్చలు అందజేసి ఘనంగా సన్మానించడం జరిగింది.
తన మిత్రుడు శ్రీరాములు కూతురు ఎస్సైగా ఎంపిక కావడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు అభిప్రాయపడ్డారు. ఇంకా మంచి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వెంకటేష్,వన్నూరప్ప,బాబు,ప్రసాద్ నారాయణస్వామి,శివయ్య,చిన్న వెంకటప్ప,పెద్దన్న,సూరి,సంజప్ప, లక్ష్మయ్య,నాగన్న,అంజి,నాగభూషణం తదితరులు పాల్గొన్నారు..
Jan 03 2024, 07:20