తహసీల్దార్ హరికుమర్ కునూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన బాలుర వసతి గృహ పూర్వ విద్యార్థులు
![]()
Breaking.. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టటంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి..
అనంతపురం జిల్లా: నార్పల మండలం కేసేపల్లి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టటంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు. మృతులు బొందలవాడ గ్రామానికి చెందిన విష్ణు(15), నార్పలకు చెందిన గౌతమ్ (14) వీరు నార్పల నుంచి కేసపల్లి గ్రామంలో ట్యూషన్ కు వెళ్తుండగా ఈ ఘటన.
Breaking.. సత్యసాయి జిల్లాలో తొలి కొవిడ్ మరణం..
సత్యసాయి జిల్లాలో తొలి కొవిడ్ మరణం
బాబా సమాధి దర్శనానికి వచ్చి కొవిడ్ తో మృతి చెందిన యూకే దేశస్తుడు
పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో యూకే పౌరసత్వం కలిగిన భాస్కర్ జోషి (79) కోవిడ్ తో మృతి.
తీవ్ర అనారోగ్యంతో వారం క్రితం ఆసుపత్రిలో చేరిన భాస్కర్ జోషి కొవిడ్ పాజిటివ్ తో చికిత్స పొందుతూ మృతి..
బాబా మహా సమాధిని దర్శించుకునేందుకు వారం రోజుల క్రితం ప్రశాంతి నిలయం వచ్చిన భాస్కర్ జోషి...
జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరు: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
![]()
కడప: జగన్‌ను గెలిపించి మనం తప్పు చేశామని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Mekapati Chandra Sekhar Reddy) అన్నారు..
కడపలో నిర్వహించిన మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ''నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అయినా నా గ్రాఫ్ బాగా లేదంటూ సీఎం జగన్ నన్ను కించపరిచారు. పార్టీ బలోపేతం కోసం ఎంతో శ్రమించా..
లేనిపోని అనుమనాలతో నా టికెట్‌నే అమ్మకానికి పెట్టారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారు. జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరు. జగన్ లాంటి వారు రాష్ట్రాన్ని పాలిస్తే ప్రజలు బాగుపడరు. రుషికొండలో భవనాలను సరదాగా కట్టుకున్నట్లు ఉంది. సీఎం పదవి భగవంతుడు ఇచ్చిన వరమని జగన్ గ్రహించాలి'' అని హితవు పలికారు..
వైకాపా నుంచి పోటీ చేసి గెలవకపోవడమే మంచిదైంది: దగ్గుబాటి వెంకటేశ్వరరావు..
బాపట్ల: పర్చూరులో వైకాపా (YSRCP) నుంచి తాను పోటీ చేసి గెలవకపోవడమే మంచిదైందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao) వ్యాఖ్యానించారు..
గెలిచి ఉంటే.. రోడ్లు వేయలేదని ప్రజలు తనని నిలదీసేవారన్నారు. కారంచేడులో స్థానికులతో ఆయన మాటామంతీ నిర్వహించారు.
వైకాపా పాలనలో కారంచేడులో ఒక్క రోడ్డు మరమ్మతు కూడా చేయలేదు. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఈ రోడ్లపై ఇంత స్వేచ్ఛగా తిరిగే వాడిని కాదు. దేవుడి దయ వల్ల పర్చూరులో నేను ఓడిపోవడం మంచిదైంది. నా కుమారుడిని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తామన్నారు. జగన్ పెట్టిన నిబంధనలకు తలొగ్గలేక సున్నితంగా తిరస్కరించాం. ఇవాళ రాజకీయాలంటే పరస్పర విమర్శలు. నేతలు తిట్టుకోవడమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు..
తన పూర్వ మిత్రుడు శ్రీరాములు కూతురు లావణ్య S.I.గా ఎంపిక..
పూర్వ మిత్రుడు శ్రీరాములు కూతురు లావణ్య ఎస్సైగా ఎంపిక ఘనంగా సన్మానించిన హాస్టల్ పూర్వ విద్యార్థులు
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలం నాయన పల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు కూతురు ఎస్సైగా ఉద్యోగం సాధించడంతో
పూర్వ విద్యాభ్యాసం హాస్టల్ విద్యార్థులు కలిసి శ్రీరాములు కూతురు లావణ్య నీ పుష్పగుచ్చలు అందజేసి ఘనంగా సన్మానించడం జరిగింది.
తన మిత్రుడు శ్రీరాములు కూతురు ఎస్సైగా ఎంపిక కావడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు అభిప్రాయపడ్డారు. ఇంకా మంచి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వెంకటేష్,వన్నూరప్ప,బాబు,ప్రసాద్ నారాయణస్వామి,శివయ్య,చిన్న వెంకటప్ప,పెద్దన్న,సూరి,సంజప్ప, లక్ష్మయ్య,నాగన్న,అంజి,నాగభూషణం తదితరులు పాల్గొన్నారు..
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు.. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఫాస్టర్లు కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన *మాజీ ఏమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు, రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు స్వామి దాస్ గారు, TNTUC జిల్లా అధ్యక్షులు పోతుల నరసింహులు గారు* ఈ సందర్బంగా ఫాస్టర్లు ప్రార్థన చేస్తూ ఈ రోజు పవిత్రమైన సమస్త మానవాళి రక్షణ కోసం దేవుడు ఏసు మానవ రూపంలో వచ్చారు అంటూ ఈ లోకంని సర్వజనులు సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు,ఫాస్టర్లు పాల్గొన్నారు
ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..
వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు..
యల్లనూరు మండలం చిలుమకూరు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి శ్రీ ఆంజనేయస్వామిని, అమ్మవారిని దర్శించుకున్నారు.
అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం సాంబశివారెడ్డి గారు రాతి దూలం లాగుడు పోటీలను ప్రారంభించారు.
ఉదయం నుంచి స్వామివారికి అర్చనలు హోమాలు అభిషేకాలను ప్రధాన అర్చకుడు బాలాజీ స్వామీతో పాటు వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ పూజలు కార్యక్రమాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. ప్రతిభ చూపిన వృషభలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, వైఎస్సార్సీపీ గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
బ్రేకింగ్ న్యూస్.. చంద్రబాబు ఇంటికి ప్రశాంత్ కిషోర్..
బ్రేకింగ్ న్యూస్.. చంద్రబాబు ఇంటికి ప్రశాంత్ కిషోర్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేష్ మరియు ప్రశాంత్ కిషోర్ ఒకే వాహనంలో కలిసి వెళ్లారు.* *వచ్చే ఎన్నికల్లో టిడిపి యువకర్తగా పీకే వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గత ఎన్నికల్లో పీకే వైసీపీ వ్యూహకర్తగా పనిచేశారు.
Jan 03 2024, 07:02