జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరు: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
![]()
కడప: జగన్‌ను గెలిపించి మనం తప్పు చేశామని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Mekapati Chandra Sekhar Reddy) అన్నారు..
కడపలో నిర్వహించిన మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ''నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అయినా నా గ్రాఫ్ బాగా లేదంటూ సీఎం జగన్ నన్ను కించపరిచారు. పార్టీ బలోపేతం కోసం ఎంతో శ్రమించా..
లేనిపోని అనుమనాలతో నా టికెట్‌నే అమ్మకానికి పెట్టారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారు. జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరు. జగన్ లాంటి వారు రాష్ట్రాన్ని పాలిస్తే ప్రజలు బాగుపడరు. రుషికొండలో భవనాలను సరదాగా కట్టుకున్నట్లు ఉంది. సీఎం పదవి భగవంతుడు ఇచ్చిన వరమని జగన్ గ్రహించాలి'' అని హితవు పలికారు..
Dec 29 2023, 16:54