మహిళలతో నేరుగా ముఖాముఖి.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
మహిళల సంక్షేమానికి జగనన్న పెద్ద పీట.. మహిళలతో మన ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభం మహిళలతో నేరుగా ముఖాముఖి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
రాష్ట్రంలో మహిళలకు జగనన్న ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వపరంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లి గ్రామంలో "మహిళలతో మన ఎమ్మెల్యే " కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. ముందుగా గ్రామంలోని స్థానిక నాయకులు, మహిళలు స్వాగతం పలికారు.
నాగలింగేశ్వర స్వామిని దర్శించుకొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేరుగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల పని తీరును ప్రత్యక్షంగా వారిని అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమమే అభివృద్ధిగా పని చేస్తున్నారన్నారు. అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓర్చుకోలేకుండా ఉన్నారని విమర్శించారు.
పేదలకు మంచి జరుగుతుంటే సంతోషించడం మానేసి పథకాలను విమర్శించడం హేయమమైన చర్య అన్నారు. "మహిళలతో మన ఎమ్మెల్యే" అనే కార్యక్రమం ద్వారా నేరుగా మహిళల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి కృషి చేసే విధంగా రూపొందించామన్నారు. మహిళలు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయని, గత టిడిపి ప్రభుత్వంలో మాకు ఎలాంటి పథకాలు అందలేదని ఆరోపించారు. జగనన్న వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి గ్రామంలోని సచివాలయ వ్యవస్థని, రైతు భరోసా కేంద్రాలను, వైయస్సార్ విలేజ్ క్లినిక్ లను, ఏర్పాటుచేసి నేరుగా సంక్షేమ పథకాలను ఇంటి దగ్గరికే చేరుస్తున్నారన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకుంటామన్నారు. శింగనమల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యే కావాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Dec 26 2023, 11:05