ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..

వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు..

యల్లనూరు మండలం చిలుమకూరు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి శ్రీ ఆంజనేయస్వామిని, అమ్మవారిని దర్శించుకున్నారు.

అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం సాంబశివారెడ్డి గారు రాతి దూలం లాగుడు పోటీలను ప్రారంభించారు.

ఉదయం నుంచి స్వామివారికి అర్చనలు హోమాలు అభిషేకాలను ప్రధాన అర్చకుడు బాలాజీ స్వామీతో పాటు వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ పూజలు కార్యక్రమాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. ప్రతిభ చూపిన వృషభలకు బహుమతులు ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, వైఎస్సార్సీపీ గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

బ్రేకింగ్ న్యూస్.. చంద్రబాబు ఇంటికి ప్రశాంత్ కిషోర్..

బ్రేకింగ్ న్యూస్.. చంద్రబాబు ఇంటికి ప్రశాంత్ కిషోర్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేష్ మరియు ప్రశాంత్ కిషోర్ ఒకే వాహనంలో కలిసి వెళ్లారు.* *వచ్చే ఎన్నికల్లో టిడిపి యువకర్తగా పీకే వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గత ఎన్నికల్లో పీకే వైసీపీ వ్యూహకర్తగా పనిచేశారు.

Big Breaking.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం సమీపంలో వోల్వా బస్సు ట్రాక్టర్ యాక్సిడెంట్ నలుగురు మృతి..

గార్లదిన్నె మండలం వోల్వా బస్సు ట్రాక్టర్ యాక్సిడెంట్ నలుగురు మృతి..

గుత్తి మండలం మావుడూరు గ్రామానికి చెందిన 1. చిన్న తిప్పయ్య తండ్రి ఓబన్న 2.శ్రీరాములు తండ్రి పక్కిరప్ప 3.నాగార్జున తండ్రి ఆదినారాయణ 4..శ్రీనివాసులు తండ్రి పెద్దరాజు వీరందరూ అందరూ ట్రాక్టర్లో వడ్లు వేసుకొని కల్లూరు గ్రామమునకు పోయి

రైస్ మిల్లులో ఒడ్లు ఆడించుకొని తిరిగి వారి గ్రామానికి పోతూ ఉండగా కల్లూరు సమీపంలో NH44 హైవే రోడ్డు నందు బెంగళూరు నుండి హైదరాబాద్ కు పోతున్న BusNO.NL02B3041 అను ప్రైవేటు బస్సు

ముందరపోతున్న ట్రాక్టర్కు గుద్దగా ట్రాక్టర్ లో ఉన్న పైన తెలిపిన నలుగురు అక్కడ అక్కడే చనిపోయినారు

ఒకరికి దెబ్బలు తగిలినవి *దెబ్బలు తగిన వారు* హరి తండ్రి పెద్ద తిప్పయ్య మాముడూరు గ్రామం గుత్తి మండలం

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొసం.. జనవరి 6వ తేదీన బుక్కరాయసముద్రంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పర్యటన..

జనవరి 6వ తేదీన బుక్కరాయసముద్రంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పర్యటన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర గవర్నర్ అన్ని ఏర్పాట్లు సకాలంలో చేపట్టాలి. జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్..

అనంతపురం, డిసెంబర్ 22 రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ జిల్లాలోని బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి జనవరి 6వ తేదీన రానున్నారని, గవర్నర్ పర్యటన నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

శుక్రవారం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పర్యటన నేపథ్యంలో స్థల పరిశీలన చేశారు.* *ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 6వ తేదీన మండల కేంద్రమైన బుక్కరాయసముద్రం గ్రామపంచాయతీలో నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ పాల్గొననున్నారని తెలిపారు. బికేఎస్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం కోసం ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర గవర్నర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను సకాలంలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిపిఓ ప్రభాకర్ రావు, తహసిల్దార్ హరికుమార్, ఎంపీడీవో తేజోష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ప్రజ్వల్ నేషనల్ లెవెల్ అండర్14 నేషనల్ లెవెల్ ఆర్చారీ గేమ్ లో గోల్డ్ మెడల్ రెండు సిల్వర్ మెడల్ -ఒకటి గెలిచిన ఆనంద్ కొడుకు ఘన సన్మానించిన DIG, IPS

జంతలూరు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ 14వ బెటాలియన్ నందు పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆర్మర్ ఆనంద్ కొడుకు ప్రజ్వల్ నేషనల్ లెవెల్ అండర్ -14 నేషనల్ లెవెల్ ఆర్చారీ గేమ్ లో గోల్డ్ మెడల్ - రెండు , సిల్వర్ మెడల్ -ఒకటి గెలిచిన సందర్భంగా kurnool range APSP DIG -III సి.యచ్ వెంకటేశ్వర్లు, మరియు కమాండెంట్ ఆర్ గంగాధర్ రావు IPS, ఇద్దరు కలిసి సన్మానం చేసి ఇంకా ముందుకు వెళ్ళాలి అని ప్రోత్సహించడం జరిగింది. ప్రజ్వల్ ఫ్యామిలీని అభినందించడం మరియు ఇలాగే ముందుకెళ్లాలి మా ప్రోత్సాహం ,మహా సహాయం ఉంటుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, డియస్పి లు రమణమూర్తి , దామోదర్ , అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య పాల్గొనటం జరిగింది

మహిళలతో నేరుగా ముఖాముఖి.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

మహిళల సంక్షేమానికి జగనన్న పెద్ద పీట.. మహిళలతో మన ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభం మహిళలతో నేరుగా ముఖాముఖి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.

రాష్ట్రంలో మహిళలకు జగనన్న ప్రభుత్వం పెద్ద పీట‌ వేస్తోందని, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వపరంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లి గ్రామంలో "మహిళలతో మన ఎమ్మెల్యే " కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. ముందుగా గ్రామంలోని స్థానిక నాయకులు, మహిళలు స్వాగతం పలికారు.

నాగలింగేశ్వర స్వామిని దర్శించుకొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేరుగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల పని తీరును ప్రత్యక్షంగా వారిని అడిగి తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమమే అభివృద్ధిగా పని చేస్తున్నారన్నారు. అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓర్చుకోలేకుండా ఉన్నారని విమర్శించారు.

పేదలకు మంచి జరుగుతుంటే సంతోషించడం మానేసి పథకాలను విమర్శించడం హేయమమైన చర్య అన్నారు. "మహిళలతో మన ఎమ్మెల్యే" అనే కార్యక్రమం ద్వారా నేరుగా మహిళల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి కృషి చేసే విధంగా రూపొందించామన్నారు. మహిళలు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయని, గత టిడిపి ప్రభుత్వంలో మాకు ఎలాంటి పథకాలు అందలేదని ఆరోపించారు. జగనన్న వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి గ్రామంలోని సచివాలయ వ్యవస్థని, రైతు భరోసా కేంద్రాలను, వైయస్సార్ విలేజ్ క్లినిక్ లను, ఏర్పాటుచేసి నేరుగా సంక్షేమ పథకాలను ఇంటి దగ్గరికే చేరుస్తున్నారన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకుంటామన్నారు. శింగనమల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యే కావాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పెద్ద ఎత్తున తరలివచ్చి మెగా రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయండి.. నీలం భాస్కర్ జడ్పిటిసి

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రోటరీ పురం నందు ఎస్ఆర్ఐటి కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జనహృదయనేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఉదయం 8.00 గం.లకు నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు నాయకులు డీలర్లు కార్యకర్తలు వాలంటీర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతి ఒక్కరూ హాజరై రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన నీలం భాస్కర్ బుక్కరాయసముద్రం మండల జడ్పిటిసి.. "జగనన్న మిద అబిమానం - నేను సైతం రక్తదానం"

నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న తరిమెల రామాంజనేయులు..

పేద కుటుంబాన్ని ఆదుకున్న తరిమెల రామాంజనేయులు.. శింగనమల మండల పరిధిలోని సలకం చెరువు గ్రామంలో ఆకలితో అలమటిస్తున్న వృద్ధుల కుటుంబానికి 50 కేజీల బియ్యం ప్యాకెట్ నిత్యవసర సరుకులను సిపిఐ జిల్లా సమితి సభ్యులు తరిమెల రామాంజనేయులు బుధవారం వృద్ధుల కుటుంబానికి అందించారు,

జిల్లాలో అత్యంతకరువుతో వర్షాలు లేక వెనుకబడిన మండలాలలో వర్షాలుసింగనమల మండలం ముందు వరుసలో ఉంది, కరువుతో వ్యవసాయ కూలీలకు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు.

ఈ సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి సభ్యులు తరిమెల రామాంజనేయులు మండలంలోని సనకoచెరువు గ్రామంలో లక్ష్మి దేవి భర్త రామదాసు వృద్ధులకు పిల్లలు లేరు.

కనీసం రేషన్ కార్డు కూడా సంబంధిత అధికారులు ఇవ్వకపోవడంతో తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న సందర్భంలో వారు పడే అవస్థలనుగుర్తించి సొంత నిధులతో 50 కేజీలు బియ్యము నిత్యవసర సరుకులు తీసుకెళ్లి ఆ వృద్ధులకు ఇచ్చి సిపిఐ జిల్లా సమితి సభ్యులు తరిమెల రామాంజనేయులు మానవత్వం చాటుకున్నారు,

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్, ఇరు వెందుల శ్రీరాములు, రాజారాం,ఆదినారాయణ, సంజీవప్ప, శివప్రసాద్, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు

తిరుమలలో మళ్లీ చిరుత భయం..

తిరుమలలో మళ్లీ చిరుత భయం..

అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం..

నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత సంచారం.. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో సంచరించిన చిరుత..

చిరుత సంచారంపై అప్రమత్తమైన టీటీడీ..

నడకదారి భక్తులను గుంపులుగా అనుమతిస్తున్న భద్రతా సిబ్బంది....

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహా విష్కరణ ఏర్పాట్లు పరిశీలించిన జడ్పిటిసి నీలం భాస్కర్..

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహా విష్కరణను

విజయవంతం చేయండి : నీలం భాస్కర్ జడ్పిటిసి. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు సమీపంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో

ఈనెల 21వ తేదీన ఉదయం 10:00 గంటలకు ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారి చేతుల మీదుగా, ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ సృష్టికర్త భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయ ప్రాధాన్యత మరియ ప్రజల సాధికారత కోసం, అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి అంబేద్కర్ గారి అభిమానులు, దళిత బాంధవులు, నాయకులు కార్యకర్తలు, పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

ఈ కార్యక్రమంలో నాగభూషణ, గంగరాజు, ఎస్టి సెల్ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.