వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొసం.. జనవరి 6వ తేదీన బుక్కరాయసముద్రంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పర్యటన..
జనవరి 6వ తేదీన బుక్కరాయసముద్రంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పర్యటన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర గవర్నర్ అన్ని ఏర్పాట్లు సకాలంలో చేపట్టాలి. జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్..
అనంతపురం, డిసెంబర్ 22 రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ జిల్లాలోని బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి జనవరి 6వ తేదీన రానున్నారని, గవర్నర్ పర్యటన నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
శుక్రవారం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పర్యటన నేపథ్యంలో స్థల పరిశీలన చేశారు.* *ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 6వ తేదీన మండల కేంద్రమైన బుక్కరాయసముద్రం గ్రామపంచాయతీలో నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ పాల్గొననున్నారని తెలిపారు. బికేఎస్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం కోసం ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర గవర్నర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను సకాలంలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ ప్రభాకర్ రావు, తహసిల్దార్ హరికుమార్, ఎంపీడీవో తేజోష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Dec 23 2023, 08:13