నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న తరిమెల రామాంజనేయులు..
పేద కుటుంబాన్ని ఆదుకున్న తరిమెల రామాంజనేయులు.. శింగనమల మండల పరిధిలోని సలకం చెరువు గ్రామంలో ఆకలితో అలమటిస్తున్న వృద్ధుల కుటుంబానికి 50 కేజీల బియ్యం ప్యాకెట్ నిత్యవసర సరుకులను సిపిఐ జిల్లా సమితి సభ్యులు తరిమెల రామాంజనేయులు బుధవారం వృద్ధుల కుటుంబానికి అందించారు,
జిల్లాలో అత్యంతకరువుతో వర్షాలు లేక వెనుకబడిన మండలాలలో వర్షాలుసింగనమల మండలం ముందు వరుసలో ఉంది, కరువుతో వ్యవసాయ కూలీలకు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు.
ఈ సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి సభ్యులు తరిమెల రామాంజనేయులు మండలంలోని సనకoచెరువు గ్రామంలో లక్ష్మి దేవి భర్త రామదాసు వృద్ధులకు పిల్లలు లేరు.
కనీసం రేషన్ కార్డు కూడా సంబంధిత అధికారులు ఇవ్వకపోవడంతో తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న సందర్భంలో వారు పడే అవస్థలనుగుర్తించి సొంత నిధులతో 50 కేజీలు బియ్యము నిత్యవసర సరుకులు తీసుకెళ్లి ఆ వృద్ధులకు ఇచ్చి సిపిఐ జిల్లా సమితి సభ్యులు తరిమెల రామాంజనేయులు మానవత్వం చాటుకున్నారు,
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్, ఇరు వెందుల శ్రీరాములు, రాజారాం,ఆదినారాయణ, సంజీవప్ప, శివప్రసాద్, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు
Dec 20 2023, 16:52