డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహా విష్కరణ ఏర్పాట్లు పరిశీలించిన జడ్పిటిసి నీలం భాస్కర్..
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహా విష్కరణను
విజయవంతం చేయండి : నీలం భాస్కర్ జడ్పిటిసి. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు సమీపంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో
ఈనెల 21వ తేదీన ఉదయం 10:00 గంటలకు ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారి చేతుల మీదుగా, ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ సృష్టికర్త భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయ ప్రాధాన్యత మరియ ప్రజల సాధికారత కోసం, అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి అంబేద్కర్ గారి అభిమానులు, దళిత బాంధవులు, నాయకులు కార్యకర్తలు, పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో నాగభూషణ, గంగరాజు, ఎస్టి సెల్ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Dec 20 2023, 09:01