అంగన్వాడీ వర్కర్లకు మంచి జరిగింది అంటే అది కేవలం జగనన్న ప్రభుత్వంలో మాత్రమే.. జడ్పిటిసి నీలం భాస్కర్
అంగన్వాడీ వర్కర్లకు మేలు చేస్తున్నది జగనన్న ప్రభుత్వం మాత్రమే. జడ్పిటిసి నీలం భాస్కర్ . చంద్రబాబు 14 సంవత్సరాల పరిపాలన కాలంలో అంగన్వాడీల కోసం ఈ మంచి పని చేశాము అని ధైర్యంగా చెప్పగలిగే దమ్ము ఈ తెలుగుదేశం
నాయకులకు లేదు. అంగన్వాడీ వర్కర్లకు మంచి జరిగింది అంటే అది కేవలం జగనన్న ప్రభుత్వంలో మాత్రమే. గతంలో అంగన్వాడీ వర్కర్లు చాలీచాలని జీతాలతో ఎంతో దయనీయమైన పరిస్థితుల మధ్య
అంగన్వాడీ సెంటర్లను నడిపే వాళ్ళు కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక అంగన్వాడి సెంటర్ల రూపురేఖలు మారిపోయాయి అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచుతూ నాడు నేడు ప్రోగ్రాం కింద అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తూ మన పిల్లలకు సరైన పౌష్టికాహారాల అందిస్తూ దేశంలోనే గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు అంగన్వాడి సెంటర్లు నడుస్తున్నాయి.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించి మహిళా పోలీసులతో జుట్టు పట్టి లాగి, చాలా కర్కశంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. 14 సంవత్సరాలు తెలుగు దేశ ప్రభుత్వం అధికారంలో ఉండి అంగన్వాడీ వర్కర్ల కోసం మా హయాంలో ఈ మంచి పని చేసాము అని ధైర్యంగా చెప్పుకో లేని స్థితిలో ఈ తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ప్రతి సందర్భాన్ని రాజకీయంతో ముడిపెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందాలనుకున్న ఇలాంటి ప్రతిపక్ష నాయకులు ఉండటం మన యొక్క దౌర్భాగ్యం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు హయాంలో అంగన్‌వాడీ వర్కర్ల జీతం నెలకు రూ. 7 వేలు, హెల్పర్లకు రూ. 4,500 మాత్రమే పొందేవారు. కానీ జగనన్న ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొదటి మూడు వారాల్లోనే వారికి జీతాలు పెంచుతూ ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 18 జారీ చేసింది. అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు నెలకు రూ 7 వేలు నుంచి రూ. 11,500కు అలాగే హెల్పర్లకు జీతాలు నెలకు రూ. 4,500 నుంచి రూ. 7 వేలకు పెంచుతూ 2019 జూన్ 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గత ప్రభుత్వంలో అంగన్‌వాడీలకు పదోన్నతులు లేవు అసలు వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జగనన్న ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చి 560 గ్రేడ్–2 సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేసింది. ఈ సూపర్‌వైజర్ పోస్టులకు పరీక్షలు రాసే వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచి ఎక్కువ మందికి అవకాశం కల్పించింది. అంగన్‌వాడీ కేంద్రాల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి పర్యవేక్షించడంతో పాటు వర్కర్లు, హెల్పర్లకు వార్షిక సెలవులు, ప్రసూతి సెలవులు, పదవి విరమణ సమయంలో ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం పాటు బీమా సౌకర్యం కల్పించి భరోసా ఇస్తున్నాది జగనన్న మాత్రమే.
Dec 20 2023, 08:26