బుక్కరాయసముద్రం హాస్పిటల్ నందు PLHIV ఫెసిలిటేషన్, పౌస్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి అతిథిగా విచ్చేసిన ఎం.పీ.పీ సునీత..
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు DAPCU వారి ఆదేశాలమేరకు , చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ వారు బుక్కరాయసముద్రం హాస్పిటల్ నందు PLHIV ఫెసిలిటేషన్ మరియు పౌస్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సమావేశానికి అతిథిగా విచ్చేసిన ఎం.పీ.పీ సునీత గారు మాట్లాడుతూ హెచ్.ఐ.వి.తో జీవిస్తున్న వారు మందులతో పాటు మంచి పౌష్ఠికాహారం తీసుకోవాలని అలాగే పౌష్ఠిాహార దతలకి కృతజ్ఞతలు తెలియజేశారు. వైద్యాధికారిని స్వాతిలక్ష్మీ మరియు తెహరున్నిసా మాట్లాడుతూ హెచ్.ఐ.వి తో జీవిస్తున్న వారిని చిన్న చూపు, వివక్షతకు గురి చేయకూడదని వారిని ప్రేమతో ఆదరించాలని తెలిపారు..
ఈ కార్యక్రమంలో డీ.పి.ఎం వెంకట రత్నం గారు డి.ఎస్ రమణ గారు మాట్లాడుతూ విధిగా మందులు మింగడం తో పాటు తగిన పౌష్ఠికాహారం తీసుకోవడం ద్వారా జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవచ్చని తెలిపారు.అలాగే వైరల్ లోడ్ CD4 కౌంట్ గురించి తెలియజేశారు.
డీ అర్ పి రమేష్ యాదవ్ మాట్లాడుతూ చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ వారు దాతల సహకారంతో పౌష్ఠికాహారం సేకరించి 30 మంది హెచ్. ఐ.వి.తో జీవిస్తున్న వారికి పంపిణీ చేశారు.కార్యక్రమం లో ఎం.పీ.పీ సునీత గారు, మెడికల్ ఆఫీసర్ స్వాతి లక్ష్మి, రెండవ మెడికల్ ఆఫీసర్ తెహరున్నిషా, డీ.పీ.ఎం వెంకటరత్నం, డి.స్ రమణ, సి.హెచ్.ఓ మోహనరావు,
విహాన్ పీడీ రామాంజనేయులు, డీ.అర్.పి రమేష్ యాదవ్, పీ.హెచ్.ఎన్ చెన్నమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ ఈశ్వరమ్మ, హెల్త్ అసిస్టెంట్ ధనుంజయ,జోనల్ సూపర్వైజర్ పెద్దన్న, ఎం&ఈ హస్సన్ ,లింక్ వర్కర్స్ నాగరాజ్,నాగేంద్ర,v.భారతి,స్వప్న,శ్రీరాములు,విజయ్, మారుతి ప్రసాద్, లక్ష్మీ నారాయణమ్మ, విహాన్ ఈశ్వరయ్య, మరియు YRG కేర్ CCF భారతి తదితరులు పాల్గొన్నారు.
Dec 19 2023, 11:00