లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనలను పరిశీలించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనలను పరిశీలించిన ఎమ్మెల్యే
జొన్నలగడ్డ పద్మావతి.. మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ నుంచి లిఫ్ట్ ద్వారా త్రాగు,సాగు నీరు అవసరాలకు మడుగుపల్లి కుంటలకు నీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు.
మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ కాలువను, అలాగే పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామంలోని బైయన్న కుంటను అధికారులతో కలసి పరిశీలించారు.
హెచ్.ఎల్ .సి కెనాల్ నుంచి కుంటలకు నీటిని సరఫరా చేసే ప్రతిపాదిత అంశాలపై వారితో చర్చించారు. దాదాపు రూ.5.45 కోట్లు అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన పలు అభ్యంతరాలపై అధికారులతో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చర్చించారు.
త్వరితగతిన సమగ్ర నివేదిక అందించాలని వారిని ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతన్నలకు సాగు, త్రాగు నీటి కొరత లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారన్నారు. హెచ్.ఎల్.సి కెనాల్ నుంచి కుంటలకు నీటిని అందించడం ద్వారా నీటి కొరత లేకుండా రైతులు, ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు.
ఈ కుంటలకు నీటిని అందించటం ద్వారా చుట్టుపక్కల గ్రామాలు జంగంరెడ్డి పేట, ఎల్లుట్ల, మడుగుపల్లి, మూగె తిమ్మంపల్లి గ్రామాల రైతులకు త్రాగు నీటి కొరత తీరనుంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Dec 19 2023, 06:20