అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలి.. 3వరోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన మాజీజడ్పీటీసీ కె.రామలింగారెడి..
అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలి.. మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి.. 3వరోజు కొనసాగుతున్న అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరవధిక సమ్మె.... మద్దతు తెలిపిన తెదేపా మరియు సిఐటియు నాయకులు.. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలకేంద్రంలో రాష్ట్రంలో ఉన్న లక్షమంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్ల వేతనాలు, గ్రాట్యూటీ తదితర సమస్యలను పరిష్కరించాలని, సమగ్ర శిశు సంక్షేమ పథకాన్ని బలోపేతం చేయాలని కోరుతూ ఈ నెల 12వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు ప్రారంభించిన నిరవధిక సమ్మె గురువారానికి మూడవ రోజుకు చేరింది.
ఇందులో భాగంగా గురువారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు తెదేపా మరియు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా *జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి రామలింగారెడ్డి గారు* మాట్లాడుతూ అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాట్యూటీ తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్,ఐసిడిఎస్‌కు నిధులు పెంచాలని, ప్రీ స్కూలును బలోపేతం, నూతన విద్యా విధానం రద్దు, సంక్షేమ పథకాలు అమలు,వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని తదితర సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ అశోక్ కుమార్, లక్ష్మి నారాయణ, కేశన్న,తూముచెర్ల బాబా ఫక్రుద్దీన్ వలి,, చదళ్ళ నారాయణస్వామి, బాబయ్య, దాసి,నరసింహుడు, టోపీ బాషా సిఐటియు మండల కార్యదర్శి సి.నాగేంద్ర, రైతు సంఘం మండల నాయకులు సంజీవరెడ్డి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ నాయకురాలు కాత్యాయని తులసి,రత్న,విమల, సుభాషిణి, విజయ కుమారి, గూడూరు సరళ,గీత, లలిత తదితరులు పాల్గొన్నారు.
Dec 16 2023, 11:36