తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం..
తెలుగుదేశం పార్టీ బాబు షూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు గారు ప్రధానకార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు ఆలంనరసానాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో * వెస్ట్ నర్సాపురం పంచాయతీ గురుగుంట్ల గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం
నిర్వహించడం జరిగింది*
ఈసందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు మాట్లాడుతూ* మేనిఫెస్టోలో పొందుపరిచిన *మహాశక్తి* *ఆడబిడ్డనిధి*:-18నుంచి59 ఏళ్ళ వరకు నెలకు ఒకరూ.1500 కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అందిస్తామని,* *తల్లికి వందనం*:-పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే వారికి ఏడాదికి 15000 రూ.లు. ఇస్తామని,
ఉచిత బస్సు ప్రయాణం*:-మహిళల అభ్యుదయానికి నిరంతరం కృషి చేసే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధి ఇతర అవసరాల నిమిత్తం ప్రయాణించేందుకు ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారు. *దీపం పథకం*:-లో భాగంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా* *యువగళం*:-ప్రభుత్వ పరంగా ,ప్రైవేటుపరంగా, స్వయం ఉపాధి ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అన్నదాత సుఖీభవ*:-ఏడాదికి 20000 రైతులు కు అందించడం.*ఇంటింటికి తాగునీరు* ప్రతి ఇంటికి ఉచిత కొళాయి కనెక్షన్ ద్వారా సురక్షిత మంచినీటి సరఫరా.*బీసీలకు రక్షణ చట్టం*:- వెనుకబడిన వర్గాలు వెనకనే ఉండాలనే పెత్తందారి అహంకారానికి ఏనాడో అడ్డుకట్ట వేసింది తెలుగుదేశం. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తారు. బీసీలకు ఎస్సీ ,ఎస్టీ తరహాలో ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి వారికి అండగా నిలబడతాముని వారికి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు *పూర్ టు రిచ్* :- ప్రజలు, ప్రభుత్వం ప్రైవేట్, పార్టనర్ షిప్ ఫార్ములా తో సంపద సృష్టించి పేదలను దనికులను చేయడమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం.కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాము. 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని వివరించాము
Nov 24 2023, 19:07