రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా నాగమల్లేశ్వర రెడ్డి..!
రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా నాగమల్లేశ్వర రెడ్డి..! వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ గా ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామానికి చెందిన సంకేపల్లి నాగమల్లేశ్వర రెడ్డిని నియమించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సూచనల మేరకు ఈ నియామకం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తూ... మరోవైపు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు.
మృతుని కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

మృతుని కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకుడు బోయ కుల్లాయప్ప(48) అనారోగ్యంతో మృతి చెందడంతో పార్థివదేహానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పూలమాల వేసి నివాళులర్పించారు.

మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం..

తెలుగుదేశం పార్టీ బాబు షూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు గారు ప్రధానకార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు ఆలంనరసానాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో * వెస్ట్ నర్సాపురం పంచాయతీ గురుగుంట్ల గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

ఈసందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు మాట్లాడుతూ* మేనిఫెస్టోలో పొందుపరిచిన *మహాశక్తి* *ఆడబిడ్డనిధి*:-18నుంచి59 ఏళ్ళ వరకు నెలకు ఒకరూ.1500 కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అందిస్తామని,* *తల్లికి వందనం*:-పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే వారికి ఏడాదికి 15000 రూ.లు. ఇస్తామని,

ఉచిత బస్సు ప్రయాణం*:-మహిళల అభ్యుదయానికి నిరంతరం కృషి చేసే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధి ఇతర అవసరాల నిమిత్తం ప్రయాణించేందుకు ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారు. *దీపం పథకం*:-లో భాగంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా* *యువగళం*:-ప్రభుత్వ పరంగా ,ప్రైవేటుపరంగా, స్వయం ఉపాధి ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అన్నదాత సుఖీభవ*:-ఏడాదికి 20000 రైతులు కు అందించడం.*ఇంటింటికి తాగునీరు* ప్రతి ఇంటికి ఉచిత కొళాయి కనెక్షన్ ద్వారా సురక్షిత మంచినీటి సరఫరా.*బీసీలకు రక్షణ చట్టం*:- వెనుకబడిన వర్గాలు వెనకనే ఉండాలనే పెత్తందారి అహంకారానికి ఏనాడో అడ్డుకట్ట వేసింది తెలుగుదేశం. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తారు. బీసీలకు ఎస్సీ ,ఎస్టీ తరహాలో ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి వారికి అండగా నిలబడతాముని వారికి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు *పూర్ టు రిచ్* :- ప్రజలు, ప్రభుత్వం ప్రైవేట్, పార్టనర్ షిప్ ఫార్ములా తో సంపద సృష్టించి పేదలను దనికులను చేయడమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం.కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాము. 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని వివరించాము

కులగణన సర్వేపై గ్రామ సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు, మండల స్థాయి సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు...

కులగణన సర్వేపై మండల పరిషత్ కార్యాలయంలో ని మీటింగ్ హాల్ నందు గ్రామ సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు, మండల స్థాయి సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు నిర్వహించడమైనది. ఈనెల 27వ తేదీ నుంచి జరగబోయే కులగణన సర్వే పై శిక్షణ తరగతులను సిపిఓ అశోక్ కుమార్ గారు,ఎంపీడీవో తెజ్యోష్ణ గారు,ఎమ్మార్వో రమాదేవి గారు, ఏఎస్ఓ పోతిరెడ్డి గారు శిక్షణ తరగతులు నిర్వహించారు. అందులో భాగంగా కులగణన సర్వేన పకడ్బందీగా చేపట్టాలని తెలపటం జరిగింది.

సర్వేని ఎలా నిర్వహించాలి అనే విషయాలపైన, మరియు యాప్ ఎలా వాడాలో ఏ ఫార్మాట్లో నిర్వహించాలో అని విషయాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. 27వ తేదీ నుంచి ఈ సర్వే ప్రారంభం అవుతుందని,ఈ సర్వే వారం రోజుల్లో మండల వ్యాప్తంగా ఈ సర్వే పూర్తి చేయాలని సూచించడం జరిగింది.

ఈఈ హౌసింగ్ క్రిష్ణారావు గారు, డిఈ హౌసింగ్ శ్రీమన్నారాయణ గారు విరూపాక్ష నగర్ నందు లబ్ధిదారులతో సమావేశం
ఈఈ హౌసింగ్ క్రిష్ణారావు గారు, డిఈ హౌసింగ్ శ్రీమన్నారాయణ గారు బుక్కరాయసముద్రం మండల పరిధిలోని విరూపాక్ష నగర్ నందు లబ్ధిదారులతో సమావేశం జరపడమైంది. లబ్ధిదారులు త్వరగా ఇల్లు నిర్మించుకొని పూర్తి చేయమని చెప్పియున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ హౌసింగ్ రాజశఖర్ రెడ్డి, బల్లే రాజ గారు , వర్క్ ఇన్స్పెక్టర్ , ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు
ఈద్గా మినార్లకు 30 వేల రూపాయలు విరాళంగా అందజేసిన మండల ఇంచార్జ్ ఆలూరు రమణారెడ్డి..
బుక్కరాయసముద్రం మండలం పొడ్రాళ్ల గ్రామం నందు ఈద్గా మినార్లకు గ్రామ ముస్లిం సోదరులు అడిగిన వెంటనే 30 వేల రూపాయలు విరాళంగా అందజేసిన మండల ఇంచార్జ్ ఆలూరు రమణారెడ్డి కార్యక్రమంలో జడ్పిటిసి నీలం భాస్కర్, మండల మాజి సింగిల్ విండో అధ్యక్షులు నాగలింగారెడ్డి, మండల కన్వీనర్ అంకె నరేష్, వైస్ ఎంపీపీ రాంగోపాల్ సర్పంచులు ఎర్రిస్వామి, నాగిరెడ్డి , ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, అప్పిరెడ్డి అనంత వెంకట్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రామిరెడ్డి, పురుషోత్తం, ముత్యాల శ్రీనివాసులు సాకే లక్ష్మీనారాయణ ముస్లిం సోదరులు ఎస్ షేక్షావలి, సాదిక్ వలి, రసూల్, పి షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.
వడియంపేట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం...

బుక్కరాయసముద్రం మండలం వడియంపేట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ సచివాలయ పరిధిలో ఉన్న వడియంపేట, B కొత్తపల్లి, పొడరాల్ల, రేగడికొత్తూరు ప్రజలకు జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు DBT&NonDBT ద్వారా సుమారు 45కోట్ల 72లక్షలు51వేలు రూపాయలు మన సచివాలయానికి రావడం జరిగింది అని తెలియజేయడం జరిగింది

మన గ్రామాల్లో పిల్లల భవిష్యత్ బాగా ఉండాలంటే మళ్ళీ జగనన్న సీఎం కావాలి. అదేవిధంగా రైతులు బాగుండాలి అని శింగనమల చెరువు లోకలైజేసన్ చేయించిన ఘనత మన ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతమ్మ గారిది అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నీలం భాస్కర్, ఎంపీపీ సునీత మండల ఇంచార్జ్ ఆలూరు రమణారెడ్డి, మాజి సింగిల్ విండో అధ్యక్షులు నాగలింగారెడ్డి మండల కన్వీనర్ అంకె నరేష్, జెసిఎస్ మండల కన్వీనర్ పసలూరు బయపరెడ్డి, వైస్ ఎంపీపీ రాంగోపాల్ సర్పంచులు ఎర్రిస్వామి, నాగిరెడ్డి , ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, అప్పిరెడ్డి Eord దామోదరమ్మ, సచివాలయ కన్వీనర్లు అనంత వెంకట్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రామిరెడ్డి, పురుషోత్తం, సాకే లక్ష్మీనారాయణ ముత్యాల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయ అధికారులు వాలంటీర్లు, గృహసారదులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు