రేకులకుంట గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన వైసిపి కార్యకర్త.. పూలమాలలు వేసి నివాళులర్పించిన జడ్పిటిసి మరియు మండల ఇంచార్జ్ జేసెస్ మండల కన్వీనర్..
రేకులకుంట గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన వైసిపి కార్యకర్త.. పూలమాలలు వేసి నివాళులర్పించిన జడ్పిటిసి మరియు మండల ఇంచార్జ్ జేసెస్ మండల కన్వీనర్..

బుక్కరాయసముద్రo మండలం రేకులకుంట గ్రామంలో సాకే లక్ష్మినారాయణ చిన్నాన్న సాకే నల్లప్ప గుండెపోటుతో మృతి చెందినారు విషయం తెలుసుకున్న ఆలూరు రమణారెడ్డి గారు పూలమాల వేసి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరితో పాటు జెడ్పీటీసీ నీలం భాస్కర్, st సెల్ జిల్లా అద్యక్షులు సాకే రామకృష్ణ, JCS మండల కన్వీనర్ పసలూరు బయపరెడ్డి, ముత్యాల రంగనాథ్ పాల్గొన్నారు..
ఫ్లాష్ న్యూస్.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను అండగా ఉంటామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం..! క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందేలా చర్యలు..! ●రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..! ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను అండగా ఉంటామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు తెలిపారు. ఆదివారం ఉదయం అనంతపురం లోని సర్వజన ఆసుపత్రికి వెళ్లి షఫీ, సూరప్ప మృతదేహాలను ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. జరిగిన ఘటనకు సంబంధించి వివరాలను స్థానిక నాయకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించేలా వైద్యాధికారులను ఆదేశించారు. #ThopudurthiPrakashReddy #RapthaduMLA #TeamTPR
నాగులగుడ్డం గ్రామం లో బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారంటీ : బూత్ ఇంచార్జ్ దాసరి రాధాకృష్ణ..
నాగులగుడ్డం గ్రామం లో బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారంటీ : బూత్ ఇంచార్జ్ దాసరి రాధాకృష్ణ.. *అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు గారు ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు ఆలం నరసనాయుడుగారి ఆదేశాల మేరకు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో* శింగనమల మండలంలోని నాగులగుడ్డం గ్రామం లో " *బాబు షూరిటీ " భవిష్యత్తు* *గ్యారెంటీ "* కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2024 లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే రాష్ట్ర ప్రజలకు మేనిపెస్టో లో ఇచ్చిన హామీలను అమలు చేస్తాం,అని రాత పూర్వకంగా ప్రజలకు తెలియచేస్తూ ప్రతి ఇంటికి *నారా చంద్రబాబు నాయుడు గారు " బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ " కార్డు లని అందజేయడం వాటి పథకాలను వివరిస్తూ,* తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో నాగులగుడ్డం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
14వ బెటాలియన్ జంతలూరు నందు మౌలానా అబూల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు ....
14వ బెటాలియన్ జంతలూరు నందు మౌలానా అబూల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు .... ఈరోజు 14 వ బెటాలియన్ నందు మౌలానా అబూల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు హెడ్ క్వార్టర్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమాండెంట్ ఆర్. గంగాధర్ రావు ఐపిఎస్, మాట్లాడుతూ శ్రీ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి గొప్పతనమును గురుంచి, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని ఎనలేని నిస్వార్థమైన సేవ చేశారని, అలాగే ఇతను భారత ప్రభుత్వంలో మొట్ట మొదటి విద్యా మంత్రి అయ్యాడాని చెప్పుతూ, ఇతను చేసిన మంచి పనులను వారి గొప్పతనం గుర్తుచేసుకున్నారు.

తరువాత కొత్తగా ఇద్దరు గ్రూప్ -1, DSP లు రెండు వారాలు బెటాలియన్ ట్రైనింగ్ పూర్తి చేసుకోని ఈ రోజు అనంతపురం జిల్లా కు రిలీవ్ అయిన సందర్భంగా వారిని సన్మానం చేయటం జరిగింది.

ఈ కార్యక్రమం లో అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, ట్రైనీ డిఎస్పి లు హేమంత కుమార్, పృథ్వి తెలా, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సీతారామ రావు, ఆర్.ఎస్.ఐ లు, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య ఇతర సిబ్బంది పాల్గొనటం జరిగింది.
కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

కుల, మత, పార్టీలకతీతంగా ప్రజలకు సంక్షేమ పాలన అందించడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సఫలీకృతులయ్యారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గార్లదిన్నె మండలం పెనకచెర్ల, పి.కొత్తపల్లి గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిని ఆయా కుటుంబాలకు బుక్ లెట్ ద్వారా వివరించారు.స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులకు వివరించి పరిష్కరించాలని సూచించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. కేవలం వారి వర్గానికే సంక్షేమ పథకాలను అందించడానికి నాటి టీడీపీ ప్రభుత్వం పని చేసిందని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

స్టేట్ లెవెల్ గేమ్స్ కి సెలెక్ట్ అయిన వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు...
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల విద్యార్థులు అండర్ 17 ఏజ్ విభాగంలో బాక్సింగ్ క్రీడ నందు S.అస్వియ, 42 కేజీలు క్యాటగిరిలోను, వై కుసుమాంజలి(42-44 kg) వెయిట్ విభాగంలోను, జి భావన(46-48 kg) వెయిట్ విభాగంలోను, జి వందన (57-60 kg) వెయిట్ విభాగంలోనూ, నఫీత కౌసర్ (70-75 kg) వెయిట్ విభాగంలోనూ బాక్సింగ్ లో స్టేట్ లెవెల్ లో సెలెక్ట్ కావడం గమనార్హం. అదేవిధంగా అండర్ 14 ఏజ్ విభాగంలో త్రో బాల్ గేమ్ నందు డి చందన శ్రీ స్టేట్ లెవెల్ లో సెలెక్ట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మెరుగైన ఆటను ప్రదర్శించి బహుమతులు తీసుకురావాలని మన పాఠశాలను మరింత మంచి పేరు వచ్చేలా ప్రయత్నం చేయాలని పిల్లలను ఆశీర్వదించారు.
సబ్సిడీ స్ప్రేయర్ లను సద్వినియోగం చేసుకోండి...ఎంపీపీ శ్రీమతి దాసరి సునీత..
సబ్సిడీ స్ప్రేయర్ లను సద్వినియోగం చేసుకోండి...ఎంపీపీ శ్రీమతి దాసరి సునీత గారు వ్యవసాయ సలహా మండలి సమావేశం ఈ దినం వ్యవసాయ కార్యాలయం లో మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు శ్రీ పెద్ద కొండయ్య గారి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో ఎంపీపీ శ్రీమతి దాసరి సునీత గారు మాట్లాడుతూ ఉద్యానశాఖలో రైతులకు 50% సబ్సిడీ తో హోండా కంపెనీ థైవాన్ స్ప్రే యర్ లను సప్లై చేస్తున్నారని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మాట్లాడుతూ తీవ్ర వర్షభావ పరిస్థితులు ఉన్నందులవలన రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని తక్కువ వ్యవది లో చేతికి వచ్చే చిరుధాన్యలను సాగు చేసుకోవాలని తెలియజేసారు. పసుసంవర్ధక శాఖ ఎ డి ఎ శ్రీ రత్నకుమార్ గారు మాట్లాడుతూ 4నుండి 8 నెలల ఆడ పెయ్య దూడలకు బృసెల్లోసిస్ వ్యాధి కారకాలు వస్తున్నందులవలన ఉచితంగా 10/11/2023 నుండి 30/11/23 వరకు టీకాలు వేయుచున్నామని తెలియజేసారు.ఉద్యానశాఖధికారి శ్రీమతి శైలజ గారు మాట్లాడుతూ రైతులు పొలములలో ఫార్మ్పాండ్లను ఏర్పాటు చేసుకోవాలని వీటికి సబ్సిడీ ఇస్తామని తెలియజేసారు ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయధికారి శ్యాం సుందర్ రెడ్డి,సభ్యులు బోయకొట్టాల నాగరాజ గారు దాసరి నారాయణస్వామి గారు తహసీల్దార్ ఆఫీస్ ప్రతినిధి మస్తాన్ గారు ఆదర్శ రైతులు ఏ ఇ ఒ జ్ఞాన జ్యోతి రైతుభరోసా కేంద్ర ఇంచార్జి లు పాల్గొన్నారు..
సలకంచెరువులో సచివాలయ కార్యదర్శి కి వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఐ మండల కార్యదర్శి తరిమెల రామాంజనేయులు...
రైతులనుకూలీలనుప్రభుత్వంఆదుకోవాలి,, సిపిఐ మండల కార్యదర్శి తరిమల రామాంజనేయులు విశాలాంధ్ర-శింగనమల మండల వ్యాప్తంగా గతంలో 50 సంవత్సరాల లో లేని కరువు ఈ సంవత్సరం వచ్చిందని, రైతులను కూలీలను ప్రభుత్వంఆదుకోవాలని, సిపిఐ మండల కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో శుక్రవారం చల్లకంచెరువు సచివాలయ కార్యదర్శి కి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులువేసిన ప్రతి పంట ఎండిపోయి లక్షలాది రూపాయలు పంట నష్టం సంభవించిందని, మండలంలో పూర్తిగా కరువు అలముకొని అలమటిస్తున్నారని, ఈ సమయంలో రైతులను, కూలీలనుఆదుకోవాలని డిమాండ్ చేశారు, వేసవిని తలపిస్తున్నట్లు కరెంటు కోతలు అధికమవడం వల్ల మరోపక్క వర్షాలు లేనందున బోరుబావుల్లో నీరు అడగండి పోతుందని బోర్ల కింద వేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయన్నారు, ఇప్పటికే వరుస కరువులవల్ల రైతాంగం పూర్తిగా దెబ్బతిని ఆర్థికంగాచితికిపోయారని, అప్పుల మీద అప్పులు పెరిగిపోయి కుటుంబ పోషణ భారమై తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ప్రభుత్వం రైతులు తీసుకున్న అన్ని పంట రుణాలు వెంటనే రద్దుచేసి, కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు, వ్యవసాయ పంటలకుఎకరాకు 50 వేల రూపాయలు,హార్టికల్చర్ పంటలకి ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని. వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పని దినాలు పెంచి పని అడిగిన ప్రతి కూలికి వెంటనే పని కల్పించి అటు రైతులను ఇటు వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో స్వర నాగప్ప, దైవత్వం, నరేష్, బాలిరెడ్డి, దొడ్డెన్న, చంద్రనారాయణ, లక్ష్మీదేవి, కుల్లయప్ప, ముత్యాలు, రామాంజనేయులు, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు
బాల్య వివాహాన్ని అడ్డుకున్న బుక్కరాయసముద్రం పోలీసుల..
బాల్య వివాహాన్ని అడ్డుకున్న బుక్కరాయసముద్రం పోలీసులు ఇరు వైపుల తల్లి తండ్రులపై కేసు నమోదు జిల్లా కలెక్టర్, ఎస్పీల చొరవతో బాలికను కెజిబివి పాఠశాలలో చేర్పించిన పోలీసులు బుక్కరాయసముద్రం పోలీసులు, ఇతర విభాగాలతో కలిసి బాల్య వివాహాన్ని ఆపారు. మైనర్లకు పెళ్లి చేసేందుకు సిద్ధమైన ఇరువైపుల తల్లిదండ్రులపై కేసు నమోదు చేశామని బుక్కరాయ సముద్రం సి.ఐ నాగార్జున రెడ్డి తెలిపారు. గోవిందంపల్లి పంచాయతీ పరిధిలోని ఓ కాలనీలో బాలుడు(17 సం.), బాలిక (13 సం.) కు వారి ఇంటి ముందే బుధవారం పెళ్లి చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. అనంతపురం రూరల్ డీఎస్పీ బి.వి శివారెడ్డి ఆదేశాల మేరకు తాను, ఎస్సై శ్రీనివాస్ మరియు సిబ్బంది బాల్య వివాహం జరుగుతున్న కాలనీకి వెళ్లి అడ్డుకున్నారు. మైనర్ల వయస్సు నిర్దారణ చేసుకున్నాక ఇరువైపుల తల్లిదండ్రులపై కేసు నమోదు చేశామని సి.ఐ చెప్పారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.గౌతమి IAS గారు, జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ IPS గారి చొరవతో తదుపరి చర్యలలో భాగంగా ఆ బాలికను ఆరవ తరగతి చేర్పించారు. అనంతపురం రూరల్ డీఎస్పీ ఆ బాలికకు ప్రవేశ పత్రం అందజేశారు. బాలుడిని కూడా ఏదైనా విద్యా సంస్థలో చేర్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రగతికి దిక్సూచి జగనన్న పాలన - ఎమ్మెల్యే.. జొన్నలగడ్డ పద్మావతి.. ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే.. కార్యక్రమం ఘనంగా ప్రారంభం..
ప్రగతికి దిక్సూచి జగనన్న పాలన - ఎమ్మెల్యే.. జొన్నలగడ్డ పద్మావతి.. ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే.. కార్యక్రమం ఘనంగా ప్రారంభం.. ◆నాలుగున్నరేళ్లల్లో అన్నీ రంగాల్లో పురోభివృద్ధి ◆విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో నమూల మార్పులు ◆అందుకే రాష్టానికి జగనన్న మరోసారి అవసరం రాష్ట్రానికి సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి అవసరం ఎందుకు ఉందో , ఈ నాలుగున్నరేళ్ల రాష్ట్ర అభివృద్ధి సూచీలను చూస్తే అర్థమవుతుందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లి గ్రామ సచివాలయం వద్ద _*"ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే"*_ అనే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. గ్రామ సచివాలయ పరిధిలో వైస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం లబ్ధిదారుల జాబితాను ఆవిష్కరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ లబ్ధిని వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చారన్నారు. ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాలన్న దృఢ సంకల్పంతో జగనన్న రాష్ట్రంలో అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించి గ్రామాల్లో సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశారని చెప్పారు. శింగనమల నియోజకవర్గంలో రైతన్నలు సంతోషంగా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి చూపిన చొరవన్నారు. నాలుగున్నరేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పరిపాలనలో చెదళ్ల గ్రామ సచివాలయ పరిధిలో ప్రజలకు దాదాపు రూ.24.23 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి చేరాయన్నారు. చంద్రబాబు హయాంలో 2018-19లో రాష్ట్ర తలసరి ఆదాయం దేశవ్యాప్తంగా 17వ స్థానంలో ఉండగా జగనన్న వచ్చాక 2022-23 నాటికి 9వ స్థానానికి చేరిందన్నారు. గడచిన నాలుగున్నర సంవత్సరాలలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేశామని దీన్ని వారికి తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నారు. ప్రజల సంక్షేమాన్ని కోరుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.