కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
కుల, మత, పార్టీలకతీతంగా ప్రజలకు సంక్షేమ పాలన అందించడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సఫలీకృతులయ్యారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గార్లదిన్నె మండలం పెనకచెర్ల, పి.కొత్తపల్లి గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిని ఆయా కుటుంబాలకు బుక్ లెట్ ద్వారా వివరించారు.స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులకు వివరించి పరిష్కరించాలని సూచించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. కేవలం వారి వర్గానికే సంక్షేమ పథకాలను అందించడానికి నాటి టీడీపీ ప్రభుత్వం పని చేసిందని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Nov 11 2023, 18:59