ప్రగతికి దిక్సూచి జగనన్న పాలన - ఎమ్మెల్యే.. జొన్నలగడ్డ పద్మావతి.. ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే.. కార్యక్రమం ఘనంగా ప్రారంభం..
ప్రగతికి దిక్సూచి జగనన్న పాలన - ఎమ్మెల్యే.. జొన్నలగడ్డ పద్మావతి.. ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే.. కార్యక్రమం ఘనంగా ప్రారంభం.. ◆నాలుగున్నరేళ్లల్లో అన్నీ రంగాల్లో పురోభివృద్ధి ◆విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో నమూల మార్పులు ◆అందుకే రాష్టానికి జగనన్న మరోసారి అవసరం రాష్ట్రానికి సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి అవసరం ఎందుకు ఉందో , ఈ నాలుగున్నరేళ్ల రాష్ట్ర అభివృద్ధి సూచీలను చూస్తే అర్థమవుతుందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లి గ్రామ సచివాలయం వద్ద _*"ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే"*_ అనే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. గ్రామ సచివాలయ పరిధిలో వైస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం లబ్ధిదారుల జాబితాను ఆవిష్కరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ లబ్ధిని వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చారన్నారు. ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాలన్న దృఢ సంకల్పంతో జగనన్న రాష్ట్రంలో అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించి గ్రామాల్లో సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశారని చెప్పారు. శింగనమల నియోజకవర్గంలో రైతన్నలు సంతోషంగా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి చూపిన చొరవన్నారు. నాలుగున్నరేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పరిపాలనలో చెదళ్ల గ్రామ సచివాలయ పరిధిలో ప్రజలకు దాదాపు రూ.24.23 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి చేరాయన్నారు. చంద్రబాబు హయాంలో 2018-19లో రాష్ట్ర తలసరి ఆదాయం దేశవ్యాప్తంగా 17వ స్థానంలో ఉండగా జగనన్న వచ్చాక 2022-23 నాటికి 9వ స్థానానికి చేరిందన్నారు. గడచిన నాలుగున్నర సంవత్సరాలలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేశామని దీన్ని వారికి తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నారు. ప్రజల సంక్షేమాన్ని కోరుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు వేరుశనగ పంట నష్టపరిహారం చెల్లించాలని బ్యాంకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పాల్యం నారాయణ స్వామి ఆధ్వర్యంలో ధర్నా..
గోవిందం పల్లి పంచాయతీ సచివాలయం దగ్గర సిపిఐ కార్యక్రమం రైతులకు వేరుశనగ పంట నష్టపరిహారం చెల్లించాలని బ్యాంకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేయడం జరిగినది రుణమాఫీ వెంటనే ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేయడం జరిగినది ఈ సమావేశానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాలెం నారాయణ స్వామి గారు సింగనమల నియోజవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి గారు బుక్కరాయసముద్రం మండల కార్యదర్శి కె మర్రి స్వామి అధ్యక్షతన బుక్కరాయసముద్రం మండల సహాయ కార్యదర్శులు శ్రీనివాసరావు తిరుపతయ్య ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ రైతు సంఘం నాయకులు రాము మండల కార్యవర్గ సభ్యులు నాగేంద్ర మధు మహిళా సమైక్య నాయకులు ఆజ్మీ రాఘవేంద్ర కాలనీ కమిటీ సభ్యులు హాజరు కావడం జరిగినది
ఫ్లాష్ ఫ్లాష్.. సచివాలయాల్లోని అవినీతి సిబ్బంది పై చర్యలకు ప్రభుత్వ నిర్ణయం...
ఫ్లాష్ ఫ్లాష్.. సచివాలయాల్లోని అవినీతి సిబ్బంది పై చర్యలకు ప్రభుత్వ నిర్ణయం* *అవినీతి ఆరోపణలు & నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సచివాలయ సిబ్బంది పై చర్యలకు రంగం సిద్దం...* *వారిపై క్రమశిక్షణా చర్యలకు డివిజనల్ అభివృద్ధి అధికారులకు అదనపు బాధ్యతలు...* *జిల్లా కలెక్టర్లకు రిపోర్టు చేసేందుకు/ నివేదిక అందజేసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...* *జీవో నెంబర్ 8 విడుదల...*
బాబుష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి:..

బాబుష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి: జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు

 బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకుగ్యారెంటీ కార్యక్రమంపై జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు , జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారి

 ఆధ్వర్యంలో ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలకేంద్రంలో నందు క్లస్టర్ ఇంచార్జ్ లకు,ఐ-టీడీపీ సభ్యులు, బూత్ ఇంచార్జ్ లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతి ఇంటికీ భరోసా కల్పిస్తూ చేపడుతున్న "బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ" పథకాన్ని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్,మాజీసర్పంచ్ లక్ష్మినారాయణ, కేశన్న, S. నారాయణస్వామి,మల్లికార్జున రెడ్డి,అదిశేషయ్య, వెంకట రెడ్డి, నరేంద్రయాదవ్,రామకృష్ణ రెడ్డి , గంపన్న మరియు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

నియోజకవర్గ వ్యాప్తంగా "వై ఏపీ నీడ్స్ జగన్" కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి

నేటి నుంచి "వై ఏపీ నీడ్స్ జగన్"

నేటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా "వై ఏపీ నీడ్స్ జగన్" కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి తెలిపారు.

బుక్కరాయసముద్రం, శింగనమల మండలాల ఎంపిపి కార్యాలయాల్లో "వై ఏపీ నీడ్స్ జగన్" అనే కార్యక్రమంపై ఆయా ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.

సాంబ శివారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారికీ సంక్షేమ పథకాలను అందచేశామని తెలిపారు. ఇటు రాష్ట్ర అభివృద్ధిని మెరుగుపరుస్తూనే అటు సంక్షేమంపై దృష్టి పెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులన్నీ ప్రజలకు చెప్పుకోవడంలో తప్పేమీ లేదన్నారు. 

సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే చేర్చిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు. పూర్తి పారదర్శక పాలనతో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల ఖాతాల్లోకి చేరాయన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఉండాలంటే జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సి ఉంటుందన్నారు. రేపటి దినం అనగా 09-11-2023 తేదీన బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లి, నార్పల- బండ్లపల్లి, గార్లదిన్నె- కేశవాపురం, పుట్లూరు- సి. వెంగన్నపల్లి, యల్లనూరు- 85 నిట్టూరు పరిధిలోని గ్రామాల్లో సాయంత్రం 3.00 గంటలకు "వై ఏపీ నీడ్స్ జగన్ " కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆయా గ్రామాల వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు కంటికి ఆపరేషన్ పూర్తి..
చంద్రబాబు కంటికి ఆపరేషన్ పూర్తి.. 45 నిమిషాల్లో క్యాటరాక్ట్ ఆపరేషన్ పూర్తి చేసిన వైద్యులు.. ఆపరేషన్ అనంతరం ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకున్న చంద్రబాబు..
టీడీపీ కార్యకర్త కుటుంబానికి 20వేల రూ. ఆర్థికసాయం చేసిన మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు.
టీడీపీ కార్యకర్త కుటుంబానికి 20వేల రూ.లు ఆర్థికసాయం చేసి అండగా నిలిచిన మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో అనారోగ్యం మరణించిన టీడీపీ కార్యకర్త రాగే యల్లప్ప తల్లి గారి పార్థవదేహం కు పూలమాలతో నివాళులు అర్పించి, బాధలో ఉన్న కుటుంబసభ్యులకు తమవంతుగా *జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు ₹10000/- రూపాయలు మరియు జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు ₹10000/- రూపాయలు* ఆర్థికసాయం చేసి వారి కుటుంబానికి అండగా నిలిచారు. భవిష్యత్తులో కూడా బుక్కరాయసముద్రం మండలంలో కష్టలలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తమవంతుగా ఆర్థికంగా అండగా ఉంటాము అని తెలియజేసిన *మాజీజడ్పీటీసీ కటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు*. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు, లక్ష్మినారాయణ గారు, కేశన్న గారు, బోలె అక్కులప్ప గారు,నరేంద్ర యాదవ్ గారు, బండి మధు గారు తదితరులు పాల్గొన్నారు.
నూతన గృహప్రవేశానికి హాజరై బహుమతి అందజేసిన బుక్కరాయసముద్రం మండల జడ్పిటిసి నీలం భాస్కర్..

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో తలారి లక్ష్మీదేవి w/o రామకృష్ణ (కాంట్రాక్టరు) వారి నూతన గృహప్రవేశానికి హాజరై బహుమతి అందజేసిన బుక్కరాయసముద్రం మండల జడ్పిటిసి నీలం భాస్కర్ . కార్యక్రమంలో చేతుల సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కొర్రపాడు వైస్ సర్పంచ్ ఆర్ శ్రీనివాసరెడ్డి వార్డ్ మెంబర్ రాజారెడ్డి చికెన్ నారాయణస్వామి పి. కొత్తపల్లి భాస్కర్ రెడ్డి మరియు సాయి తదితరులు

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఘనంగా సన్మానించి జ్ఞాపక అందజేసిన జర్నలిస్టులు..

పుట్టపర్తిలో సీఎం జగన్ కు జర్నలిస్టుల సన్మానం జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పుట్టపర్తిలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన జర్నలిస్టులు సీఎం జగన్ కు జ్ఞాపిక అందజేసి శాలువాతో సన్మానించిన జర్నలిస్టులు శివారెడ్డి (సాక్షి టివి), రామచంద్రారెడ్డి (సాక్షి), అనిల్ కుమార్ రెడ్డి (అనంత భూమి ఎడిటర్), శ్రీనివాసులు (ఎన్టీవీ), నరేష్ (టీవీ 9), సాయినాథ్ రెడ్డి (వైఎస్సార్ టివి) మరియు తదితరులు

ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన ఎమ్మెల్యే దంపతులు..
సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రైతు భరోసా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి .