నియోజకవర్గ వ్యాప్తంగా "వై ఏపీ నీడ్స్ జగన్" కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి
నేటి నుంచి "వై ఏపీ నీడ్స్ జగన్"
నే
టి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా "వై ఏపీ నీడ్స్ జగన్" కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి తెలిపారు.
బుక్కరాయసముద్రం, శింగనమల మండలాల ఎంపిపి కార్యాలయాల్లో "వై ఏపీ నీడ్స్ జగన్" అనే కార్యక్రమంపై ఆయా ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.
సాంబ శివారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారికీ సంక్షేమ పథకాలను అందచేశామని తెలిపారు. ఇటు రాష్ట్ర అభివృద్ధిని మెరుగుపరుస్తూనే అటు సంక్షేమంపై దృష్టి పెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులన్నీ ప్రజలకు చెప్పుకోవడంలో తప్పేమీ లేదన్నారు.
సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే చేర్చిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు. పూర్తి పారదర్శక పాలనతో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల ఖాతాల్లోకి చేరాయన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఉండాలంటే జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సి ఉంటుందన్నారు. రేపటి దినం అనగా 09-11-2023 తేదీన బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లి, నార్పల- బండ్లపల్లి, గార్లదిన్నె- కేశవాపురం, పుట్లూరు- సి. వెంగన్నపల్లి, యల్లనూరు- 85 నిట్టూరు పరిధిలోని గ్రామాల్లో సాయంత్రం 3.00 గంటలకు "వై ఏపీ నీడ్స్ జగన్ " కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆయా గ్రామాల వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Nov 09 2023, 06:46