ట్యాంక్ బండ్ పైన కేక్ కటింగ్ వేడుకలు నిషేధం

హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాంక్ బండ్‌పై జన్మదిన వేడుకల సందర్భంగా అర్ధ రాత్రి కేక్ కటింగ్ వేడుకలపై జీ‌హెచ్‌ఎమ్ సీ నిషేధం విధించింది.

ఇలా వేడుకలను జరుపుకుంటున్న వారందరు మద్యం బాటిళ్లు, మాంసం, ఇతర వ్యర్థాలను పడేయడం తో అపరిశుభ్రత నెలకొటుంది.

అదే విధంగా నీళల్లో చెత్తా చెదారం వేసినా చర్యలు ఉంటాయని జీ‌హెచ్ ఎమ్‌సీ అధికారులు హెచ్చరిక బోర్డును ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేశారు.

సీసీ కెమెరాలు ఉన్నాయని ఎవరు కూడా ఈ నిషేదాజ్ఞాలు ఉల్లగించినా వారిని రికార్డయినా దృశ్యాల‌తో గుర్తించి చర్యలు తీసుకుంటామని జీ హెచ్‌ఎమ్‌సీ అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Election) నేపథ్యంలో ఎన్నికల కమిషన్ (Election Commission) కీలక నిర్ణయం (key Decision) తీసుకుంది..

ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చే వారి కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంకు పెట్టాలని నిర్ణయించింది.

సహాయంగా వచ్చే వ్యక్తి కూడా అదే బూత్‌కు చెందిన ఓటరై ఉండాలని, అతను ఓటు వేశాకే మరొకరికి సహాయకుడిగా వెళ్లాలని ఈసీ స్పష్టం చేసింది..

ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు పెడతారని వివరించింది. కాగా ఈసారి ఉదయం 5.30 గంటల నుంచే మాక్ పోలింగ్ (Mock Polling) ప్రారంభిస్తారని, పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్, వార్డు సభ్యులు కూడా కూర్చోవచ్చునని ఎన్నికల కమిషన్ పేర్కొంది..

Venkaiah Naidu: ఎన్నికల హామీల్లో ఉచితాలకు నేను వ్యతిరేకం..

న్యూఢిల్లీ: ఎన్నికల హామీల్లో ఉచితాలకు తాను పూర్తి వ్యతిరేకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former Vice President Venkaiah Naidu) అన్నారు..

బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆర్ధిక పరిస్థితులు, భవిష్యత్‌లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఆర్ధిక వనరులు ఉంటాయా అని అంచనా వేయకుండా హామీలు ఇస్తుంటారని విమర్శించారు.

పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను పొడిగిస్తూ మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఎందుకంటే దేశంలో పేద, మధ్యతరగతి, మధ్యతరగతికి దిగువన అనేక మంది ప్రజలు ఉన్నారని మాజీ ఉపరాష్ట్రపతి అన్నారు.

ఢిల్లీ కాలుష్యం జాతీయ సమస్య...

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంపై మాట్లాడుతూ... ఢిల్లీ కాలుష్యం జాతీయ సమస్య అని చెప్పుకొచ్చారు. కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతోందన్నారు. కాలుష్య నియంత్రణ అనేది ఢిల్లీ ప్రభుత్వానిదే కాదు కేంద్రం, పక్క రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా అని అన్నారు.

ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణకి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది చాలా కీలక సమయమని.. మాజీ ఉపరాష్ట్రపతిగా ప్రజా జీవితంలో ఉన్న సమస్యలను పరిశీలిస్తున్నట్లు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

వైఎస్‌ షర్మిలను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నాం

తెలంగాణ ప్రజలను మోసం చేసిన వైఎస్ఆర్‌టీపీని, వైఎస్‌ షర్మిల ను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నాం. ఆమె ఇక్కడ అవసరం లేదు. రాజకీయ ద్రోహి.. మమ్మల్ని నట్టేట ముంచింది..’ అని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు.

తెలంగాణలో తిరిగితే అడ్డుకుంటామని, ఆమె ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని వారు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు గట్టు రామచందర్‌ రావు, బోయిన్‌పల్లి సత్యవతి, క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షుడు డేవిడ్‌ శాంతరాజ్‌ తదితరులు మాట్లాడారు.

పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నామని చెప్పి ఆ పత్రాలను ప్రదర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరును నాశనం చేశారని, తమను మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర షర్మిల గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రజలను మోసం చేసిన షర్మిల వెంటనే తెలంగాణను విడిచిపెట్టాలని డిమాండ్‌ చేశారు.

ఎవరితోనూ చర్చించకుండానే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలుపుతున్నామని చెప్పి, మమ్మల్ని నడిరోడ్డు మీద నిలబెట్టారని ఆరోపించారు. న్యాయపరంగా ముందుకు పోతామని, మమ్మల్ని మోసం చేసిన ఆమెపై చీటింగ్‌ కేసులు పెడుతామన్నారు.

రెండు మూడు రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో పార్టీ వివిధ జిల్లాల సమన్వయకర్తలు గౌతం ప్రసాద్‌, సుధారాణి, లావణ్య, కవితా దేవి, అయూబ్‌ ఖాన్‌,యర్రవరపు రమణ,శ్రీనివాస్‌ నాయక్‌, గణేష్‌ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు...

కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతుంటే.. నేతలు కూడా తమకు కలిసొచ్చే పార్టీలోకి జంప్ చేస్తున్నారు.

తాజాగా.. బిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం పై ఎప్పటికప్పుడు దుమ్మెత్తి పోసిన చింత పండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హస్తం గూటికి లోకి చేరారు.

గత కొంత కాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరగ్గా.. ఆ ప్రచారానికి తెర దించుతూ ఆయన హస్తం గూటికి చేరారు.గతంలో బీజేపీ పార్టీలో చేరిన మల్లన్న.. అందులో నుంచి బయటకు వచ్చి అధికార పార్టీతో పాటు బీజేపీపై కూడా తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ సపోర్ట్‌ చేస్తున్నట్టుగానే.. మల్లన్న తీరు ఉండటం ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు కొనసాగించటంతో హస్తం గూటికి చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న.. జైలుకు కూడా వెళ్లి వచ్చారు.

గతంలో జరిగిన హుజూర్‌నగర్ ఉపఎన్నికలు, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్ట్ బ్లాక్ పార్టీ తరఫున ఆయన బరిలోకి దిగుతున్నారన్న ప్రచారం కూడా సాగింది. తెలంగాణలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున సీఎం అభ్యర్థి తీన్మార్ మల్లన్నే అని పార్టీ వర్గాలు సైతం ప్రకటించాయి.

ఈ మేరకు మల్లన్నతో పార్టీ వర్గాలు చర్చలు కూడా జరిపాయి. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసేందుకు మల్లన్న టీంకు పార్టీ వర్గాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇలా పొలిటికల్ సర్కిల్‌లో ప్రచారం జరగుతుండగానే.. ఆయన అనుహ్యంగా సీఎం అభ్యర్థిత్వాన్ని వదులుకొని కాంగ్రెస్ గూటికి చేరారు...

Ponguleti: ఈ ఎన్నికల్లో BRS పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి

ఖమ్మం జిల్లా: ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు..

"ఈ ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించాలి. కేసీఆర్ మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. డబ్బుతో మూడోసారి ముఖ్యమంత్రి అవుతా అని పగటి కలలు కంటున్నాడు కేసీఆర్. ఆయన కలల్ని కలలుగానే ప్రజలు ఉంచాలి.

ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ రాజ్యం కోసం హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇందిరమ్మ రాజ్యం వస్తే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం. రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తాం. భూమిలేని నిరుపేదలకు ప్రతి సంవత్సరం 12 వేలు ఇస్తాం.

తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు కలలు కన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి సంవత్సరం లోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం. నిరుపేదలకు రెండు వందల కరెంటు యూనిట్లు ఉచితంగా ఇస్తాం. తెలంగాణలో దొరల పరిపాలన కావాలా ప్రజల పరిపాలన కావాలా ఆలోచించండి. మూడోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న చంద్రశేఖర్ రావు దోచుకున్న డబ్బుతో 100ల కోట్ల డబ్బు పెట్టి ఓడించాలని చూస్తున్నాడు."అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు..

Bharat Jodo Yatra 2.0: రెండో విడత భారత్ జోడో యాత్ర ఎప్పుడు మొదలవుతోందంటే..?

న్యూఢిల్లీ: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) గత ఏడాది చేపట్టిన తొలివిడత భారత్ జోడో యాత్ర (Bharat Jodi Yatra) విజయవంతం కావడం కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపింది..

ఇదే ఉత్సాహంతో ''భారత్ జోడో యాత్ర రెండో దశ''కు ఆ పార్టీ ముమ్మర సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్యలో ''భారత్ జోడో యాత్ర 2.0'' మొదలయ్యే అవకాశం ఉంది.

రాహుల్ గాంధీ గత ఏడాది సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను ప్రారంభించి 2023 జనవరి 30న కశ్మీర్‌లో ముగించారు. 4,081 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, 75 జిల్లాలు, 76 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగింది.

కాంగ్రెస్ పార్టీకి భారత్ జోడో యాత్ర కొత్త ఊపిరిలిచ్చింది. దీంతో 'భారత్ జోడో యాత్ర 2.0'కు ఆలోచన చేస్తున్నట్టు ఆ పార్టీ ఇటీవల ప్రకటించింది. ఈసారి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకూ భారత్ జోడో యాత్ర నిర్వహించాలని ఇటీవల పునర్వవస్థీకరించిన సీడబ్ల్యూసీ తొలి సమావేశం కోరింది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్టు పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం తెలిపారు..

రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన తొలివిడత 'భారత్ జోడో యాత్ర'లో ఆయన 12 బహిరంగ సమావేశాల్లో, 100కు పైగా వీధి సమావేశాల్లో, 13 ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో విపక్ష పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, శివసేన ఆదిత్య థాకరే, ప్రియాంక చతుర్వేది, సంజయ్ రౌత్, ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే తదితరులు రాహుల్ యాత్రలో ఉత్సాహాన్ని నింపారు..

ఓటు వజ్రయుధం అమ్ముకోవద్దు:సీఎం కెసిఆర్

మందమర్రిలోమంగళవారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు.

మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిసింది కాంగ్రెస్ పార్టే. తెలంగాణ రాకముందు వరకు భయంకర పరిస్థితులు ఉండేవి.

సింగరేణిలో 49శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్సే. వారి పాలనలో నష్టాల్లోకి వెళ్లిన సింగరేణి.. ప్రస్తుతం రూ.2.184కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చాం. రైతు బంధు వద్దు.. ధరణి పోర్టల్ వద్దు, కరెంటు వద్దు అంటూ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు.

వీటన్నింటినీ తీసేసి మళ్లీ దళారుల, పైరవీకారుల రాజ్యాన్ని తీసుకురావాలని చూస్తున్న కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రావొద్దు. ఇక, నరేంద్ర మోడీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టింది. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.అన్నారు..

చెన్నూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో కెసిఆర్ మాట్లాడుతూ..బాల్క సుమన్ రాక ముందు.. వచ్చిన తర్వాత చెన్నూరు ఎలా ఉందో ఆలోచించాలి. చెన్నూరులో సుమన్ చాలా అభివృద్ధి పనులు చేశారు. ఎక్కువ సమయం సుమన్ నా దగ్గరే ఉంటూ పార్టీ కోసం పనిచేస్తుంటడు. సిఎం దగ్గర ఉండే సుమన్ ను గెలిపించుకుంటే వేగంగా పనులు జరుగుతాయి.. కాబట్టి సుమన్ ను 50వేల మెజారిటీతో గెలిపించాలి” అని కేసీఆర్ పేర్కొన్నారు......

CM Jagan: రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..

శ్రీసత్యసాయి: రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (CM YS Jaganmohan Reddy) అన్నారు. మంగళవారం పుట్టపర్తిలో వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు.

53 నెలల్లో గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం హయాంలో జరగని విధంగా చూడని విధంగా రైతులకు పెట్టుబడి సాయం చేశామన్నారు. వైయస్సార్ రైతు భరోసా ద్వారా ప్రతి యేటా 53 లక్షల మంది రైతులకు 13500 ఇచ్చామని చెప్పారు.

పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం ఇదే అని అన్నారు. పంటల భీమాకు ప్రీమియం చెల్లిస్తూ రైతన్నలకు తోడుగా ఉంటున్నామన్నారు..

దేవుడు దయతో ఐదు సంవత్సరాలు ఎక్కడా కరువు లేదన్నారు. చంద్రబాబు హయాంలో ఐదు సంవత్సరాలు కరువే కరువు అంటూ వ్యాఖ్యలు చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి గతంలో చంద్రబాబు ఏమీ చేయలేదన్నారు. ''కరువు రావడం రాకపోవడం మన చేతుల్లో ఉండదు... ఆదుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది'' అని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్రాప్ ద్వారా ప్రత్యేక ఎకరా నమోదు చేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు..

Chandrababu: ఎల్వీప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు.. కొనసాగుతున్న కంటి ఆపరేషన్

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) మంగళవారం ఉదయం ఎల్వీప్రసాద్ ఆస్పత్రికి (LV Prasad Hospital) చేరుకున్నారు..

ప్రస్తుతం చంద్రబాబుకు ఎల్వీప్రసాద్ వైద్యులు కంటికి శస్త్ర చికిత్స చేస్తున్నారు. నిన్న(మంగళవారం) ఏఐజీ ఆస్పత్రిలో (AIG Hospital) టీడీపీ అధినేతకు వైద్యులు చర్మ సంబంధిత పరీక్షలు నిర్వహించారు.

కాగా.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు అవసరం వైద్యులు సూచించడంతో ఆ తరువాతి రోజు టీడీపీ అధినేత హైదరాబాద్‌కు వచ్చారు.

రెండు రోజుల పాటు ఏఐజీ ఆస్పత్రిలో టీడీపీ చీఫ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఎల్వీ ప్రసాద్‌కు వెళ్లగా బాబుకు వైద్యులు కంటికి సంబంధించిన పరీక్షలు చేశారు. ఈరోజు బాబు కంటికి శస్త్ర చికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు. అలాగే నిన్న మరోసారి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబుకు అక్కడి వైద్యులు చర్మ సంబంధిత పరీక్షలు చేశారు. ప్రస్తుతం నేడు ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబు కంటి శస్త్ర చికిత్స కొనసాగుతోంది. జూన్‌లో ఎడమ కంటికి చంద్రబాబు సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే..