SRIT కళాశాల నందు "మానవతా సమస్త" గవర్నమెంట్ హాస్పిటల్ మరియు అనంతపురం HDFC బ్యాంకు అనుబంధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్..125 యూనిట్లు బ్లడ్ ప్యాకెట్స్
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రోటరీ పురం గ్రామ సమీపంలో నందున్న SRIT కళాశాల నందు "మానవతా సమస్త" గవర్నమెంట్ హాస్పిటల్ మరియు అనంతపురం HDFC బ్యాంకు అనుబంధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ఫలితంగా 125 యూనిట్లు బ్లడ్ ప్యాకెట్స్ సేకరించారు ఈ కార్యక్రమం లో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి బాలకృష్ణ గారు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు గారు డోన్ ఆఫ్ అకాడమిక్స్ డాక్టర్ సాయి చైతన్య కిషోర్ గారు పిఎన్పి ఆఫీసర్ డాక్టర్ ఎం రంజిత్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మానవతా సంస్థ కన్వీనర్ గౌరవనీయులైన టి అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ నేటి సమాజ యువతకు రక్తదానం ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ తోటి వారికి ఎలా సాయం చేయాలి అన్న విషయం గురించి విశదీకరింపజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా HDFC బ్యాంకు మేనేజర్ అరవింద్ గారు మాట్లాడుతూ కళాశాల యువతకు రక్తదానం పట్ల అవగాహన ఉండటం గమనించి హర్షం వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమానికి కళాశాల అధ్యాపక బృందం నాన్ టీచింగ్ స్టాఫ్ తమవంతుగా రక్తదానం చేశారు మరియు ఎన్ఎస్ఎస్ పిఓ రాష్ట్రపతి అవార్డు గ్రహీత చిన్న పుల్లయ్య గారు రక్తదానం చేశారు
Nov 07 2023, 21:36