SVM హైస్కూల్లో జరిగిన "ఉచిత మెగా వైద్య శిబిరం" లో 1124 మందికి వైద్య సేవలు..

SVM హైస్కూల్లో జరిగిన "ఉచిత మెగా వైద్య శిబిరం" లో 1124 మందికి వైద్య సేవలు అందించడం జరిగింది. పాల్గొన్న వారందరికీ ఉచితంగా మందులు, భోజన సౌకర్యాలు అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఆరోగ్యం అందించటంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదములు.. సదా సేవలో మీ... సంజీవరెడ్డి మొ రు సు SVM హైస్కూల్ నార్పల

మానవత్వం పరిమలించిన వేళ.పేదవాడికి అందుబాటులోకి ఖరీదైన వైద్యం అందించిన మీకు(సంజీవరెడ్డి,రమాదేవి దంపతులకు)వైద్యులకు,పాఠశాల సిబ్బందికి, అభినందనలు..

వివాహ కార్యక్రమంకు హాజరుఅయి నూతన వధూవరులను అశ్విరాధించిన.. టీడీపీ శ్రేణులు..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలకేంద్రంలోనీ టీడీపీ నాయకుడు చెరుకూరి నారాయణస్వామి గారి కుమారుడు యాగంటిశ్వరుడు వివాహ కార్యక్రమంకు హాజరుఅయి నూతన వధూవరులను అశ్విరాధించిన శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు బి. కే. పార్థసారథి గారు,శింగనమల నియోజకవర్గ ద్విసభ్యకమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు,జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు * ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్, లక్ష్మి నారాయణ, కేశన్న,S. నారాయణస్వామి,మాజీ ఎంపీటీసీ చెరుకూరి నారాయణ స్వామి, చిత్తంబారి మరియు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు
అనంతపురం జిల్లా పేద విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్..
అనంతపురం జిల్లా పేద విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించి చాలు అనుకున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీరు గుడిబండల మారింది అని స్థానిక రాప్తాడు మండలంలో అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిరసన కార్యక్రమం తెలియజేసిన ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ ఈ సందర్భంగా సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక్క అనంతపురం జేఎన్టీయూ పరిధిలోనే 40 శాతం సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి వాటిని తృతీయ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయకుండా స్పాట్ అడ్మిషన్స్ డేటా వివరాలు సేకరించి ఖాళీ సీట్లతో కళాశాల ద్వారా వ్యాపారం చేయించాలని చూస్తోంది. విద్యార్థుల పట్ల వైసిపి ప్రభుత్వం అడుగడుగునా అలసత్వం ప్రదర్శిస్తోంది. అని అన్నారు. అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో కౌన్సిలింగ్ చేపట్టి సకాలంలో ప్రవేశాలు కల్పించిన రాష్ట్రం ఉన్నత విద్యా మండలి ఐదు నెలలు అయినా కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయడం లేదు.మూడు దపాలు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ ప్రక్రియను రెండుసార్లు నిర్వహించి చేతులెత్తేసింది. త్వరి తగతిన తృతీయ కౌన్సిలింగ్ నిర్వహించి. విద్యార్థులకు అన్యాయం చేయాలి. ఆ దిశగా జేఎన్టీయూ కళాశాల ఆవరణంలో ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేస్తామని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో సాయి, మల్లికార్జున, శివ, తదితరులు పాల్గొన్నారు.
సైకో జగన్ పాలన వద్దనడానికి ప్రజల్లో వంద కారణాలు ఉన్నాయి .... ఆలం నరసానాయుడు..
నార్పల మండలం వెంకటాంపల్లి గ్రామం లో భావితరాల భవిష్యత్తు మన ప్రాంతం మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని ఆ దిశగా ప్రతి ఒక్కరూ సైనికులై కృషిచేసి సీఎంగా చంద్రబాబునాయుడు గారిని చేయటమే లక్ష్యంగా ముందుకు వెళ్దాం అంటూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ప్రజా వేదిక,రచ్చబండ కార్యక్రమం *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కరపత్రాలు ప్రజలకు పంచుతూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన ఊరు మన ప్రాంతం అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ,ప్రజావేదిక లో స్థానిక వాసులు పలు సమస్యలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* పాల్గొన్నారు. ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు రాత్రింబవళ్లు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని రూపురేఖలే మార్చేశారన్నారు కానీ ఈ పిచ్చి సైకో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగిందని ఒకసారి ఆలోచించాలని వ్యవస్థలు నాశనం చేసాడు యువతకు ఉద్యోగాలు లేకుండా అక్రమాలు దౌర్జన్యాలు బెదిరింపులతో పాలన సాగుతుందన్నారు. అందుకే ఈసారి ప్రజలు మేలుకోకపోతే ఈ రాష్ట్రం అధోవతి పాలఅవుతుందని 2024 చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మన అందరిపై ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు బూత్ కమిటి ఇంచార్జ్ లు,గ్రామ కమిటి అధ్యక్షులు,మండల సీనియర్ నాయకులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు పాల్గొన్నారు
తెలుగుదేశం పార్టీ శింగనమల నియోజకవర్గంలో పేద ప్రజల ఇళ్లు కూల్చివేత దుర్మార్గం
తెలుగుదేశం పార్టీ శింగనమల నియోజకవర్గం పేద ప్రజల ఇళ్లు కూల్చివేత దుర్మార్గం శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో నివాసముంటున్న నిరుపేద దళితులు, గిరిజనులు నాలుగున్నరేళ్లుగా గుడిసెలుసుకుని జీవనం సాగిస్తుంటే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని *తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, అలం నరసా నాయుడు గారు ,* తెలిపారు. బాధితులతో మాట్లాడి వారీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ నిలువ నీడ లేని వాళ్ళం, రోజు కూలి పనులకు వెళ్లి, జీవనం సాగించుకుంటున్నాం, మాకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వక పోవడంతొ గ్రామ శివారులో 132 కుటుంబాల వాళ్ళం గుడిసెలుసుకొని జీవనం సాగిస్తున్నాం అని తెలిపారు. ఇది దేవుడి మాన్యం అంటూ అధికారులు నాలుగు జేసీలతో వచ్చి తమ ఇళ్లను దౌర్జన్యంగా కూల్చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మాకు మద్దతుగా వచ్చిన సిపిఎం నాయకుల పట్ల CI నరేంద్ర రెడ్డి దూరుసుగా ప్రవర్తించారని అన్నారు. చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణులు, ఉన్నారని వేడుకున్న వినకుండా ఇల్లు కూల్చేశారని వాపోయారు. ఈ కార్యక్రమంలో *కన్వీనర్ పాండు, గేట్ కృష్ణారెడ్డి, ఇల్లూరు రామాంజినేయులు, మాజీ కన్వీనర్ గోరకాటి వెంకటేసు, కల్లూరు సుధాకర్ రెడ్డి, tntuc బాబయ్య, వడ్డే వన్నూరు, తెలుగు యువత జగదీష్, i tdp అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, sc సెల్ నాయకులు నరేష్, రామాంజి, ఎగువపల్లి అశోక్, రామచంద్ర, క్లస్టర్ అంజి, i tdp శ్రీధర్,సర్పంచు నరపరెడ్డి, నెట్టికంటి, నాగేష్,* తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ పంచాయతీ-1 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
పేదల జీవితాల్లో వెలుగు: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ పంచాయతీ-1 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రభుత్వం నుంచి పొందిన లబ్దిని వివరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజల్లో సంతోషం కనిపిస్తుందన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం సీఎం జగనన్న కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ కొత్త డ్రామాలతో నమ్మించటానికి వస్తున్నారని, కానీ నమ్మే పరిస్థితిల్లో ప్రజలు లేరన్నారు. జగనన్న ప్రభుత్వం అవినీతిరహిత ప్రభుత్వమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బీటెక్ విద్యార్థిని ప్రేమ పేరుతో వేధించిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన దిశ పోలీస్ స్టేషన్ పోలీసులు వివరాలు వెల్లడించిన దిశా డిఎస్పి ఆందోనప్ప..
బీటెక్ విద్యార్థిని ప్రేమ పేరుతో వేధించిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన దిశ పోలీస్ స్టేషన్ పోలీసులు వివరాలు వెల్లడించిన దిశా డిఎస్పి ఆందోనప్ప యువతిని వేధించి అత్యాచారం చేసిన పెద్దవడుగూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి మరో నిందితుడు దివాకర్ రెడ్డి* *బెంగళూరులో software ఉద్యోగం చేస్తున్న కృష్ణారెడ్డి యువతను ప్రేమించమని ఐదేళ్లుగా వేధిస్తూ బ్లాక్మెయిల్* *యువతని బెంగళూరుకు పిలిపించుకొని సన్నిహితంగా ఫోటోలు బయట పెడతానని బెదిరించి నాలుగు రోజులు అత్యాచారం చేసిన కృష్ణారెడ్డి* *కృష్ణారెడ్డితో సన్నిహితంగా ఫోటోలు చూపించి యువతని భయపెట్టిన గుంతకల్లుకు చెందిన నిందితుడు దివాకర్* *బాధితుని నిందితుడు దివాకర్ గుంతకల్లుకు పిలిపించి రెండు రోజులు లాడ్జిలో అత్యాచారం* *నిందితుల బెదిరింపులు ఎక్కువ కావడంతో దిశా యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి* *నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన దిశ పోలీస్ స్టేషన్ పోలీసులు*
మంచి మెజార్టీతో రాప్తాడులో గెలవబోతున్నాం..! ఉప్పరపల్లిలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి..
మంచి మెజార్టీతో రాప్తాడులో గెలవబోతున్నాం..! మంచి చేసిన మాకు ప్రజాశీస్సులున్నాయి..! ●రాష్ట్ర వ్యాప్తంగా 151 కంటే మెరుగైన సంఖ్యలో సీట్లు గెలుస్తాం..! ఉప్పరపల్లిలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు..! ‘‘చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులూ అన్ని వర్గాలను వంచించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందింది. ఒక్కో కుటుంబం గరిష్టంగా రూ. 4 లక్షలకు పైగా లబ్ధి పొందారు. ఇంతటి మేలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే మళ్లీ తమ మద్దతు ఇస్తామని ప్రజలు చెబుతున్నారు. మంచి చేసిన మాకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 151 కంటే మెరుగైన సంఖ్యలో సీట్లు గెలుస్తాం’’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం అనంతపురం రూరల్‌ మండలం ఉప్పరపల్లిలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం చేపట్టారు. అధికారులు, సచివాలయ ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇంటింటీకి వెళ్లిన ఎమ్మెల్యే ప్రభుత్వం ద్వారా కల్గిన లబ్ధిని వివరించారు. లబ్ధిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతన రైతు భరోసా కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే రూ.39 లక్షల నిధులతో నిర్మించిన రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. 32 లక్షలతో పైపులైను పనులను ప్రారంభించారు. అలాగే 75 లక్షల నిధులతో ఇంటింటికీ కొళాయి కనెక్షన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారున్నారు. ఉప్పరపల్లి గ్రామంలో 250 మందికి ఇంటి పట్టాలు ఇచ్చామన్నారు. అలాగే ఉప్పరపల్లి జగనన్నకాలనీలో 2 వేల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఏ ప్రభుత్వంలోనూ చేయని విధంగా రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహ సారథులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్టోర్ డీలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు..
ఫ్లాష్ న్యూస్... చంద్రాచర్ల టిడిపి నాయకుడు రాయపాటి భాస్కర్ నాయుడు వైసీపీలో చేరిక..!
చంద్రాచర్ల టిడిపి నాయకుడు రాయపాటి భాస్కర్ నాయుడు వైసీపీలో చేరిక..! రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం చంద్రాచర్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాయపాటి భాస్కర్ నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. శుక్రవారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు భాస్కర్ నాయుడుకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గం లో అభివృద్ధి పరుగులు పెడుతోందని భాస్కర్ నాయుడు అన్నారు. కనగానపల్లి మండలంలో వైసిపి మరింత బలోపేతానికి నా వంతు కృషి చేస్తానన్నారు.
పి కొత్తపల్లి గ్రామంలో జగనన్న ఇంటి పట్టాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి

ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆలూరు సాంబ శివారెడ్డి పాల్గొన్నారు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మహిళలకు పెద్ద పీట వేశారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం పి. కొత్తపల్లి గ్రామంలో 24 మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి వైయస్సార్ జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

మహిళల పేరిట నివేశన స్థలాల పట్టాలు పంపిణీ చేయటం ద్వారా మహిళా సాధికారితకు ప్రభుత్వం పట్టం కట్టిందన్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలతో పాటు ఇంటి పట్టాలు కూడా వారి పేరు మీదనే అందజేస్తున్నామన్నారు. జగనన్న ప్రభుత్వం మహిళలను ఆర్థికాభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, మండల నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.