తెలుగుదేశం పార్టీ శింగనమల నియోజకవర్గంలో పేద ప్రజల ఇళ్లు కూల్చివేత దుర్మార్గం
తెలుగుదేశం పార్టీ శింగనమల నియోజకవర్గం పేద ప్రజల ఇళ్లు కూల్చివేత దుర్మార్గం శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో నివాసముంటున్న నిరుపేద దళితులు, గిరిజనులు నాలుగున్నరేళ్లుగా గుడిసెలుసుకుని జీవనం సాగిస్తుంటే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని *తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, అలం నరసా నాయుడు గారు
,* తెలిపారు. బాధితులతో మాట్లాడి వారీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ నిలువ నీడ లేని వాళ్ళం, రోజు కూలి పనులకు వెళ్లి, జీవనం సాగించుకుంటున్నాం, మాకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వక పోవడంతొ గ్రామ శివారులో 132 కుటుంబాల వాళ్ళం గుడిసెలుసుకొని జీవనం సాగిస్తున్నాం అని తెలిపారు. ఇది దేవుడి మాన్యం అంటూ అధికారులు నాలుగు జేసీలతో వచ్చి తమ ఇళ్లను దౌర్జన్యంగా కూల్చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మాకు మద్దతుగా వచ్చిన సిపిఎం నాయకుల పట్ల CI నరేంద్ర రెడ్డి దూరుసుగా ప్రవర్తించారని అన్నారు. చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణులు, ఉన్నారని వేడుకున్న వినకుండా ఇల్లు కూల్చేశారని వాపోయారు. ఈ కార్యక్రమంలో *కన్వీనర్ పాండు, గేట్ కృష్ణారెడ్డి, ఇల్లూరు రామాంజినేయులు, మాజీ కన్వీనర్ గోరకాటి వెంకటేసు, కల్లూరు సుధాకర్ రెడ్డి, tntuc బాబయ్య, వడ్డే వన్నూరు, తెలుగు యువత జగదీష్, i tdp అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, sc సెల్ నాయకులు నరేష్, రామాంజి, ఎగువపల్లి అశోక్, రామచంద్ర, క్లస్టర్ అంజి, i tdp శ్రీధర్,సర్పంచు నరపరెడ్డి, నెట్టికంటి, నాగేష్,* తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Nov 05 2023, 12:19