ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ వైసీపీ రౌడీ మూకల దాడిలో గాయపడిన కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన కాండ్రు శ్యామ్ కుమార్ ను పరామర్శించిన టిడిపి నేతలు
ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ వైసీపీ రౌడీ మూకల దాడిలో గాయపడిన కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన కాండ్రు శ్యామ్ కుమార్ ను పరామర్శించిన టిడిపి నేతలు
గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్యామ్, కుటుంబ సభ్యులకు టిడిపి నేత మాజీ మంత్రి దేవినేని ఉమ, కేశినేని శివనాథ్ (చిన్ని), ఎం. ఎస్ రాజు, కనపర్తి శ్రీనివాస రావుల పరామర్శ
టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు యం. యస్ రాజు కామెంట్స్ :
సభ్యసమాజంలో కాండ్రు శ్యామ్ పై జరిగిన దాడికి వైసీపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి
డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఏదైతే జరిగిందో..
పేద దళిత కుటుంబంలో భర్త చనిపోయినా శ్యామ్ తల్లి పిల్లలను కష్టపడి ఇంజనీర్, బిఎస్సి చదివించుకుంది
స్నేహితుల మధ్య జరిగిన సంఘటనలో తప్పని చెప్పినందుకు ఆదిమూలపు సురేష్ అనుచరుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుని కుమారుడు హరీష్ రెడ్డి అనే యువకుడు గుండాలతో కారులో ఎక్కించుకెళ్లి మారణాయుధాలు కర్రలతో కొట్టారు
ఎంత దారుణం అంటే మంచినీళ్లు అడిగితే మూత్రం పోశారంటే ఈ సమాజం ఎటు వెళుతుంది ?
ఇంత దుర్మార్గం జరిగితే నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్సీ తలసిల రఘురాం అదిములపు సురేష్ అందరూ కలిసి కంచికచర్ల పోలీసులపై ఒత్తిడి తెచ్చారు
పంచాయితీ చేయాలనే ప్రయత్నం చేశారు
దెబ్బతిన్న కుర్రవాడినే అప్ స్కాడింగ్ అని చెప్పి రిపోర్టులు తయారు చేశారు
మా నాయకులు పరామర్శించడానికి వస్తే పదిమంది పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం అవుతుంది
ఇది అమానవీయమని ముఖ్యమంత్రి దీనిపై ఏం సమాధానం చెబుతారని లోకేష్ బాబు ట్వీట్ పెట్టారు
మూత్రం పోసి దవడ పగలగొట్టి ప్రైవేట్ పార్ట్ ల్లో కొట్టారంటే ఎంత దారుణం
డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం మొదలుకొని చివరకు ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా బాధితుడిని అని చెప్పారు
జగన్మోహన్ రెడ్డి పిల్లల పాలిట మేనమామ కాదు కంస మామ మంత్రి సురేష్ నీకు ఏమాత్రం సిగ్గు శరం నీలో ప్రవహించే ది దళిత రక్తం అయితే ఈ అవానియా సంఘటనపై నువ్వు ఏం సమాధానం చెబుతావో హెచ్చరిస్తూ ఈ రెండు రోజుల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోతేనందిగామ నీ సంభింప చేస్తాం : టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు యం. యస్ రాజు
దీనిపై సంబంధిత వారిపై వెంటనే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలి సంఘటనపై సమగ్ర విచారణ చేయాలి
Nov 05 2023, 06:55