మంచి మెజార్టీతో రాప్తాడులో గెలవబోతున్నాం..! ఉప్పరపల్లిలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి..
మంచి మెజార్టీతో రాప్తాడులో గెలవబోతున్నాం..! మంచి చేసిన మాకు ప్రజాశీస్సులున్నాయి..! ●రాష్ట్ర వ్యాప్తంగా 151 కంటే మెరుగైన సంఖ్యలో సీట్లు గెలుస్తాం..! ఉప్పరపల్లిలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు..! ‘‘చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులూ అన్ని వర్గాలను వంచించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందింది. ఒక్కో కుటుంబం గరిష్టంగా రూ. 4 లక్షలకు పైగా లబ్ధి పొందారు. ఇంతటి మేలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే మళ్లీ తమ మద్దతు ఇస్తామని ప్రజలు చెబుతున్నారు. మంచి చేసిన మాకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 151 కంటే మెరుగైన సంఖ్యలో సీట్లు గెలుస్తాం’’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం అనంతపురం రూరల్‌ మండలం ఉప్పరపల్లిలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం చేపట్టారు. అధికారులు, సచివాలయ ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇంటింటీకి వెళ్లిన ఎమ్మెల్యే ప్రభుత్వం ద్వారా కల్గిన లబ్ధిని వివరించారు. లబ్ధిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతన రైతు భరోసా కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే రూ.39 లక్షల నిధులతో నిర్మించిన రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. 32 లక్షలతో పైపులైను పనులను ప్రారంభించారు. అలాగే 75 లక్షల నిధులతో ఇంటింటికీ కొళాయి కనెక్షన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారున్నారు. ఉప్పరపల్లి గ్రామంలో 250 మందికి ఇంటి పట్టాలు ఇచ్చామన్నారు. అలాగే ఉప్పరపల్లి జగనన్నకాలనీలో 2 వేల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఏ ప్రభుత్వంలోనూ చేయని విధంగా రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహ సారథులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్టోర్ డీలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు..
ఫ్లాష్ న్యూస్... చంద్రాచర్ల టిడిపి నాయకుడు రాయపాటి భాస్కర్ నాయుడు వైసీపీలో చేరిక..!
చంద్రాచర్ల టిడిపి నాయకుడు రాయపాటి భాస్కర్ నాయుడు వైసీపీలో చేరిక..! రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం చంద్రాచర్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాయపాటి భాస్కర్ నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. శుక్రవారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు భాస్కర్ నాయుడుకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గం లో అభివృద్ధి పరుగులు పెడుతోందని భాస్కర్ నాయుడు అన్నారు. కనగానపల్లి మండలంలో వైసిపి మరింత బలోపేతానికి నా వంతు కృషి చేస్తానన్నారు.
పి కొత్తపల్లి గ్రామంలో జగనన్న ఇంటి పట్టాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి

ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆలూరు సాంబ శివారెడ్డి పాల్గొన్నారు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మహిళలకు పెద్ద పీట వేశారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం పి. కొత్తపల్లి గ్రామంలో 24 మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి వైయస్సార్ జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

మహిళల పేరిట నివేశన స్థలాల పట్టాలు పంపిణీ చేయటం ద్వారా మహిళా సాధికారితకు ప్రభుత్వం పట్టం కట్టిందన్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలతో పాటు ఇంటి పట్టాలు కూడా వారి పేరు మీదనే అందజేస్తున్నామన్నారు. జగనన్న ప్రభుత్వం మహిళలను ఆర్థికాభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, మండల నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం కుళ్లాయప్ప కు మాతృవియోగం.. 102 సంవత్సరములు బ్రతికి మునిమనములను చూసిన మాతృమూర్తి

సిపిఎం కుళ్లాయప్ప కు మాతృవియోగం.. 102 సంవత్సరములు బ్రతికి మునిమనములను చూసిన మాతృమూర్తి...

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిపిఎం మండల కార్యదర్శి అయిన కుల్లాయప్ప గారి మాతృమూర్తి 102 సంవత్సరాలు జీవనం సాగించి మునిమనముల వరకు తన సంతానాన్ని చూసి చివరికి నిన్నటి రోజున తనుvu చాలించింది ఈమెకు ఆరు మంది కొడుకులు ముగ్గురు బిడ్డలు సంతానం.. ఎంతో ఘనంగా ఈ మాతృమూర్తి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు

ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ వైసీపీ రౌడీ మూకల దాడిలో గాయపడిన కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన కాండ్రు శ్యామ్ కుమార్ ను పరామర్శించిన టిడిపి నేతలు

ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ వైసీపీ రౌడీ మూకల దాడిలో గాయపడిన కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన కాండ్రు శ్యామ్ కుమార్ ను పరామర్శించిన టిడిపి నేతలు

గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్యామ్, కుటుంబ సభ్యులకు టిడిపి నేత మాజీ మంత్రి దేవినేని ఉమ, కేశినేని శివనాథ్ (చిన్ని), ఎం. ఎస్ రాజు, కనపర్తి శ్రీనివాస రావుల పరామర్శ 

 టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు యం. యస్ రాజు కామెంట్స్ : 

సభ్యసమాజంలో కాండ్రు శ్యామ్ పై జరిగిన దాడికి వైసీపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి

డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఏదైతే జరిగిందో.. 

పేద దళిత కుటుంబంలో భర్త చనిపోయినా శ్యామ్ తల్లి పిల్లలను కష్టపడి ఇంజనీర్, బిఎస్సి చదివించుకుంది 

స్నేహితుల మధ్య జరిగిన సంఘటనలో తప్పని చెప్పినందుకు ఆదిమూలపు సురేష్ అనుచరుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుని కుమారుడు హరీష్ రెడ్డి అనే యువకుడు గుండాలతో కారులో ఎక్కించుకెళ్లి మారణాయుధాలు కర్రలతో కొట్టారు

ఎంత దారుణం అంటే మంచినీళ్లు అడిగితే మూత్రం పోశారంటే ఈ సమాజం ఎటు వెళుతుంది ? 

ఇంత దుర్మార్గం జరిగితే నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్సీ తలసిల రఘురాం అదిములపు సురేష్ అందరూ కలిసి కంచికచర్ల పోలీసులపై ఒత్తిడి తెచ్చారు

పంచాయితీ చేయాలనే ప్రయత్నం చేశారు

దెబ్బతిన్న కుర్రవాడినే అప్ స్కాడింగ్ అని చెప్పి రిపోర్టులు తయారు చేశారు

మా నాయకులు పరామర్శించడానికి వస్తే పదిమంది పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం అవుతుంది 

ఇది అమానవీయమని ముఖ్యమంత్రి దీనిపై ఏం సమాధానం చెబుతారని లోకేష్ బాబు ట్వీట్ పెట్టారు

మూత్రం పోసి దవడ పగలగొట్టి ప్రైవేట్ పార్ట్ ల్లో కొట్టారంటే ఎంత దారుణం

డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం మొదలుకొని చివరకు ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా బాధితుడిని అని చెప్పారు

జగన్మోహన్ రెడ్డి పిల్లల పాలిట మేనమామ కాదు కంస మామ మంత్రి సురేష్ నీకు ఏమాత్రం సిగ్గు శరం  నీలో ప్రవహించే ది దళిత రక్తం అయితే ఈ అవానియా సంఘటనపై నువ్వు ఏం సమాధానం చెబుతావో హెచ్చరిస్తూ ఈ రెండు రోజుల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోతేనందిగామ నీ సంభింప చేస్తాం : టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు యం. యస్ రాజు

దీనిపై సంబంధిత వారిపై వెంటనే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలి సంఘటనపై సమగ్ర విచారణ చేయాలి

ఇల్లూరు గ్రామంలో ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి అన్న గారు ఆధ్వర్యంలో*"బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారంటీ"రచ్చబండ" కార్యక్రమం.

శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలంలోని ఇల్లూరు గ్రామంలో ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి అన్న గారు ఆధ్వర్యంలో"బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారంటీ"రచ్చబండ" కార్యక్రమం నిర్వహించారు జరిగింది. ఈ సందర్బంగా ముంటిమడుగు కేశవరెడ్డి అన్న గారు మాట్లాడుతూ  వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే వారికి ఏడాది 15000 రూపాయలు,ఆడబిడ్డనిధి క్రింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1500 రూపాయలు, దీపం పేరుతొ ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ లు ,మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 3000 నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ఏడాదికి 20000 ఆర్థిక సాయం తదితర పథకాలతో ప్రతి ఇంటికి ఏడాదికి 1,22,000 రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో. గార్లదిన్నె మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఇల్లూరు గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*

భావితరాల భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం.. ఆలం నరసానాయుడు..
నార్పల మండలం కేసేపల్లి గ్రామం లో భావితరాల భవిష్యత్తు మన ప్రాంతం మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని ఆ దిశగా ప్రతి ఒక్కరూ సైనికులై కృషిచేసి సీఎంగా చంద్రబాబునాయుడు గారిని చేయటమే లక్ష్యంగా ముందుకు వెళ్దాం అంటూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ప్రజా వేదిక, రచ్చబండ కార్యక్రమం *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పై ప్రజలకు వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండలో గ్రామస్తులు స్థానిక సమస్యలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* పాల్గొన్నారు. ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిపై రాజకీయ కక్ష ధోరణితో అక్రమ కేసులు పెట్టిన ప్రజాభిమానం ముందు అక్రమ కేసులు ఏమాత్రం పని చేయమన్నారు వైసీపీ పార్టీకి గడ్డుకాలం దాపురించిందని ప్రజల చేతిలో భూస్థాపితం చేయడం ఖాయమన్నారు.బాబు -షూరిటీ సూరిటి భవిష్యత్తు గ్యారెంటీ పథకాన్ని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ ముందు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు బూత్ కమిటి ఇంచార్జ్ లు, మండల సీనియర్ నాయకులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు పాల్గొన్నారు
అర్హత ఉన్న అందిరికీ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సచివాలయం-3 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు. స్థానికులు హారతులతో ఘన స్వాగతం పలికారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వలంటీర్లతో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆయా కుటుంబాలకు అందిన సంక్షేమ పథకాలు లబ్ధిని ప్రజలకు లబ్దిపత్రాల ద్వారా వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనకు, గత టిడిపి ప్రభుత్వ పాలనకు తేడా చూడాలన్నారు. ముఖ్యమంత్రి జగనన్న అవినీతికి తావు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తుంటే, ఓటమి భయంతో ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. జగనన్న పరిపాలనను చూసి ఇంటింటా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ కార్యకర్త ను ఆపద లో ఆదుకున్న ఆలం నరసానాయుడు.....

నార్పల మండలం బి పప్పూరు గ్రామ టీడీపీ కార్యకర్త చీమల కుళ్లాయప్ప రోడ్డు ప్రమాదంలో గాయపడి అనంతపురం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని గ్రామ టీడీపీ నాయకులు *టీడీపీ రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారి* దృష్టికి తీసుకెళ్లారు. అలం నరసానాయుడు గారు స్పదించి బి పప్పూరు గ్రామ టీడీపీ నాయకులు ద్వారా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బి పప్పూరు గ్రామ టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు ఎల్లప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు అపద వచ్చిందంటే తక్షణమే స్పoదిస్తూ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మంచి మనసున్న మా అన్న అలం నరసానాయుడు గారు అని కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బి పప్పూరు సత్తి,గుత్తానాయుడు, తిరుపతయ్య, వెంకటేష్ సర్పంచ్ పెద్దన్న, నరసన్న, నారాయణప్ప, రామకృష్ణ, కుళ్లాయప్ప తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

పండుటాకులతో పద్మావతి... నార్పల మండల కేంద్రంలో సచివాలయం 1 నందు గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
సంక్షేమ పాలనకు అండగా నిలవాలి : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనకు ప్రజలంతా అండగా నిలవాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. నార్పల మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం-1 పరిధిలో అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి సీఎం జగనన్న పాలనలో ఆయా కుటుంబాలకు జరిగిన మేలును సంబంధించిన సంక్షేమ పథకాల కర పత్రాల ద్వారా తెలియజేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులకు తెలిపి పరిష్కరించాలని సూచించారు. పేదల కుటుంబాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గత నాలుగున్నరేళ్లల్లో దాదాపు రూ.5,89,088 లక్షల మేర లబ్ధి చేకూరిందని లబ్ధిదారుడు వందన సూర్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.