AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..

అమరావతి: ఈ రోజు కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న కేబినెట్‌ సమావేశ మందిరంలో ఈ సమావేశం కానుంది కేబినెట్..

పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గ సమావేశం.. సుమారు 19 వేల కోట్ల రూపాయాల విలువైన పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది..

విశాఖలో ట్రాన్సిట్ అకామిడేషన్ కమిటీ నివేదికపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ కల్యాణ మస్తు – షాది తోఫా మూడో విడత, జగనన్న విద్యా దీవెన మూడో విడతకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.

గ్రూప్ 1, గ్రూప్ 2 ఖాళీల భర్తీ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటన, బాధితులకు ప్రభుత్వ పరిహారం, జగనన్న ఆరోగ్య సురక్షా తదితర అంశాల పై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..

విశాఖ నుంచి పాలన దిశగా వైఎస్‌ జగన్‌ సర్కార్‌ వేగంగా అడుగులు వేస్తుంది. విశాఖలో పరిపాలన భవనాల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ భవనాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసు కోసం గుర్తించిన వివిధ భవనాల వివరాలను అధికారుల కమిటీ సీఎం వైఎస్‌ జగన్‌కి వివరించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం పర్యవేక్షణ, సమీక్ష సమావేశాల నిర్వహణకు విశాఖలో క్యాంపు కార్యాలయం చూస్తున్న సంగతి తెలిసిందే.

విశాఖలో గుర్తించిన భవనాల వివరాలను సీఎం వైఎస్‌ జగన్‌కు కమిటీ వివరించింది. రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారులు సహా, ఇతర అధికారులు తమ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన భవనాలను కూడా గుర్తించినట్లు పేర్కొంది.. విశాఖలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాలు, వాటి కార్యాలయాలు 2,27,287 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని కమిటీ సీఎంకు వివరించింది..

నేడు భైంసా, ఆర్మూర్, కోరుట్లలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకెళ్తోంది. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు రోడ్ షోలు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

ఇలా ముగ్గురు గులాబీ ముఖ్య నేతలు ప్రచారంలో తమ జోష్ చూపిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కూడా మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలతో ప్రజాఆశీర్వాద సభలకు హాజరవనున్నారు.

మొదటగా నిర్మల్ జిల్లాలోని భైంసాలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అనంతరం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరై ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.

ఈ మూడు సభల అనంతరం కేసీఆర్ తిరిగి హైదరాబాద్కు పయనమవుతారు. ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యంగా కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల బతుకులు

ఆగమవుతాయని నొక్కివక్కానించి చెబుతున్నారు..

నిజంనిప్పులాంటిది
తెలంగాణలో కాంగ్రెస్‌ వస్తే మహిళలకు నెలకు 4000 రూపాయల ప్యాకేజీ : రాహుల్‌ గాంధీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారు.

ఈరోజు ఆయన రాష్ట్రంలో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ మహిళలకు నెలవారీ రూ.4000 ప్యాకేజీని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, ఆయన కుటుంబం దోచుకున్న ప్రతి పైసా తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ సమీపంలోని అంబటిపల్లి గ్రామంలో జరిగిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) దోచుకున్నారని ఆరోపించిన మొత్తం డబ్బును మహిళలకు ‘తిరిగి’ ఇవ్వాలని నిర్ణయించారు. 'ముఖ్యమంత్రి దోపిడీతో తెలంగాణ మహిళలు ఎక్కువగా నష్టపోయారు. ముఖ్యమంత్రి దోచుకున్న సొమ్మును మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

సామాజిక పింఛను, ఎల్‌పిజి సిలిండర్లపై పొదుపు, ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు రూ.4000 వరకు ప్రయోజనాలు లభిస్తాయని కాంగ్రెస్ నాయకురాలు అన్నారు. తొలివిడతగా మహిళలకు ప్రతినెలా రూ.2500 సామాజిక పింఛను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. ఇది కాకుండా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఎల్‌పిజి సిలిండర్‌ను సరఫరా చేస్తుంది, ఇప్పుడు దాని ధర రూ. 1,000, ఇది తరువాత రూ.500కి అందుబాటులో ఉంటుంది. అంతే కాదు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా వెయ్యి రూపాయలు సరఫరా చేయనున్నారు.

తెలంగాణలో రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించిన రాహుల్.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పోటీ చేస్తున్నాయని, అయితే పోటీ కాంగ్రెస్, కేసీఆర్ నేతృత్వంలోని పార్టీ మధ్యేనని అన్నారు. ఎంఐఎం, బీజేపీ బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నాయన్నారు. కావున దొరల ప్రభుత్వాన్ని తొలగించి పరజాల ప్రభుత్వాన్ని తీసుకురావాలంటే మీరు పూర్తిగా కాంగ్రెస్‌కు మద్దతివ్వాలి.

Rains: నేడు.. రేపు ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి

ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది..

తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపునకు గాలులు వీస్తున్నట్లు వివరించింది.

రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి..

కెసిఆర్ తో పోటీకి ఎవ్వరొచ్చినా గంప కింద పెట్టుడే: మంత్రి కేటీఆర్

కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు వచ్చిన మెజార్టీ చూసి ప్రతిపక్షాలు దిమ్మతిరిగి పోవాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు.

బుధవారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో అధికార పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతి పార్టీ కార్యకర్త అంకితభావంతో పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కామారెడ్డి ప్రాంతం ఉద్యమాలకు గడ్డగా మారిందని తెలిపారు.

ఈ ఉద్యమ గడ్డపై సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు. కామారెడ్డిలో పోటికి ఎవరొచ్చినా గంప కింద కమ్ముడేనని మంత్రి కేటీఆర్ అన్నారు.ఆయనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు.

ఈ ప్రాంతం నుండి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీ తప్పుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక్కడ ఏమో ఉద్ధరిద్దామని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. అలాంటి వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పి దూరంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. పలు రాష్ట్రాలకు ప్రధాన కేంద్రంగా కామారెడ్డి ప్రాంతం ఉందన్నారు. రానున్న రోజుల్లో కామారెడ్డి జిల్లా వ్యాపార పరంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.

క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న భారత రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. కామారెడ్డి ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు.

ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తరలించి రైతుల కాళ్లు కడుగుతామని చెప్పారు. 200 పింఛన్ ఇవ్వనోడు రూ.4000 పింఛన్ ఎలా ఇస్తాడని కాంగ్రెస్ నాయకులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం మొదటిసారిగా ఈ ప్రాంతం నుండి ప్రారంభం అయిందని ఆయన తెలిపారు...

జాజిరెడ్డిగూడెం వాసి గొల్లబోయిన అంబేద్కర్ కు ఓయూ డాక్టరేట్

జాజిరెడ్డిగూడెం మండల గ్రామానికి చెందిన గొల్లబోయిన అంబేద్కర్ కు ఉస్మానియా యూనివర్సిటీ జియోగ్రఫీ విభాగములో పీహెచ్ డీ డాక్టరేట్ ప్రకటించారు.

సూర్యపేట్ రెవిన్యూ డివిజన్ ,నల్గొండ జిల్లా, తెలంగాణలో షెడ్యూల్డ్ కులాలు సామాజిక ఆర్ధిక అభివృద్ధి యొక్క ప్రాదేశిక విశ్లేషణ అనే అంశాలపై ఓయూ ప్రొఫెసర్ శ్రీనాగేష్ ఆడిట్ సెల్ డైరెక్టర్ గారి పర్యవేక్షణ లో పరిశోధనకు గాను ఓయూ పరీక్షల విభాగం అంబెడ్కర్ కు డాక్టరేట్ ప్రకటించింది.

ఈ డాక్టరేట్ పట్టాను ఉస్మానియా యూనివర్సిటీ 83వ,స్నాతకోత్సవా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గవర్నెర్ తమిళసై సౌందరరాజన్,ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రో పేసర్ రవీందర్,ఆడోబ్ సీఈఓ శాంతాను నారాయణ్ చేతుల మీదుగా పీహెచ్డీ డాక్టరేట్ అంబెడ్కర్ అందుకున్నారు.

జాజిరెడ్డిగూడెం లోని దళిత కుటుంబానికి చెందిన అంబెడ్కర్ తల్లితండ్రులు పుష్పాలత,అక్కులు గారులు చదువు ఒక్కటే సమస్యలన్నీ టికీ పరిష్కారం ఉన్నత చదువుల దిశగా పాయనించాలానే తపనతో డా.బీ.ఆర్.అంబేద్కర్ గారి స్పూర్తితో తన ప్రాథమిక విద్యాబ్యాసం జాజిరెడ్డిగూడెం లో ఉన్నత స్కూల్ విద్యా మోత్కూర్ లోని ప్రభుత్వ పాఠశాల్లో ఇంటర్ ప్రభుత్వ కాలేజ్ లో ముగించి డిగ్రీ ,పీజీ ,పీహెచ్డీ జియోగ్రఫీ విభాగములో చేసినా పరిశోధనకు గాను యూనివర్సిటీ లో పరీక్ష విభాగం వారు అంబేద్కర్ కి డాక్టరేట్ ప్రధానం చేశారు.

తన పరిశోధన సమయములో జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించారు.అంబేద్కర్ కు డాక్టరేట్ రావడం పట్ల అధ్యపకులు,మిత్రులు,గ్రామస్తులు,శ్రేహిభిలాషుకు హర్షం వ్యక్తం చేశారు.తన పరిశోధన సమయములో తనకు సహకరించిన మిత్త్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలంగాణలో గెలిచేది బీఆర్‌ఎస్‌ పార్టీయే: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ఎన్నికలలో గెలువబోయేది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలువకుండా ఎవడు ఆపలేడన్నారు. బీఆర్‌ఎస్‌ గెలుపుని ఆపడం ఎవని తాత, జేజమ్మ వల్ల కాదని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీకి చురుకులు అంటిస్తూ సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.

ఖమ్మం జిల్లాలో ఒకరిద్దరు దద్దమ్మలున్నారు.బీఆర్‌ఎస్‌ తరఫున నిలబడ్డ ఎవన్ని కూడా నేను అసెంబ్లీ వాకిలి తొక్కనియ్యనని ఒకడంటడు. అది అయ్యేపనేనా..? మీరంతా తలుచుకుంటే సత్తుపల్లి నియోజకవర్గంలో దుమ్మురేగదా..?

సండ్ర వెంకట వీరయ్య ఒక్కసారి కాదు, నాలుగోసారి సత్తుపల్లి పహిల్మాన్ లాగా శాసనసభలో అడుగు పెడతాడు.ఒక్కొక్కనికి ఎంత అహంకారం. నాలుగు పైసలు జేబులో పడితే ఇంత అహంకారం పెరుగుతదా..? పదేళ్లు సీఎంగా పని చేసిన నేను కూడా అంత అహంకారంతోటి మాట్లాడలేదు’ అని అన్నారు.

ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు. పార్టీల మధ్య పోరాటం. గత దశాబ్దాలుగా ఏ పార్టీ ఏం చేసిందో ప్రజలకు తెలుసు. పదేళ్లకు ముందు దాకా ఈ రాష్ట్రంలో ఎక్కువ ఏండ్లు పాలించిందే కాంగ్రెస్‌ పార్టీ. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందో మీకు తెలుసన్నారు.

ఇప్పుడు పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఏం చేసిందో మీకు తెలియదా..? అందుకే ఓటేసే ముందు ఆలోచించి ఓటేయండి. కూరగాయలను కొనేటప్పుడు కూడా పుచ్చులు ఏరిపారేసి మంచివి తీసుకుంటం. అలాంటిది మన నాయకున్ని ఎంచుకునేటప్పుడు అటువంటి విచక్షణ చేయగూడదా..? కాబట్టి బాగా ఆలోచించి ఓటేయండి. మంచి నాయకుడిని ఎన్నుకోండి’ అని సీఎం సూచించారు....

కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆకస్మిక తనిఖీలు ఉధృతం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా విలువ చేసే నగదు, లిక్కర్, ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో వాహన తనఖీల్లో పోలీసులు, ఎన్నికల అధికారులు ఎవరినీ విడిచిపెట్టడం లేదు. తాజాగా ఈరోజు మంత్రి కేటీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.

పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న కేటీఆర్ వాహనాన్ని పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆపారు. వాహనన్ని తనిఖీ చేశారు.

తన వాహనాన్ని తనిఖీకి చేస్తుండగా కేటీఆర్ పోలీసులకు పూర్తిగా సహకరించారు.తనిఖీ అనంతరం కేటీఆర్ కామారెడ్డి బయలుదేరారు....

నేడు హైదరాబాదుకు రానున్న చంద్రబాబు

స్కిల్ డెవలప్మెంట్ కేసును నిన్న మధ్యంతర బెయిల్ పై విడుదలైన చంద్రబాబు ఈరోజు సాయంత్రం హైదరాబాదు కు రానున్నారు.

షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం తిరుమల వెళ్లాలని.. గురువారం శ్రీవారి దర్శనం అనంతరం హైదరాబాద్‌ చేరుకోవాలని తొలుత భావించారు.

అయితే కొన్ని అనారోగ్య సమస్యలకు తక్షణమే వైద్య చికిత్సలు చేయాల్సి ఉందని.. తిరుమల వెళ్లకపోవడం మంచిదని వైద్యులు సూచించారు.

దాంతో ఆయన అటు ప్రయాణం మానుకున్నారు. బుధవారం మధ్యాహ్నం రోడ్డుమార్గంలో హైదరాబాద్‌ వెళ్లనున్నారు.

ఈరోజు హైదరాబాద్ వెళ్లి వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. హైదరాబాద్ నుంచి వ్యక్తిగత వైద్యులు కూడా చంద్రబాబును వెంటనే హైదరాబద్‌కు తీసుకురావాలని కుటుంబ సభ్యులకు సూచించారు.......