పండుటాకులతో పద్మావతి... నార్పల మండల కేంద్రంలో సచివాలయం 1 నందు గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
సంక్షేమ పాలనకు అండగా నిలవాలి : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనకు ప్రజలంతా అండగా నిలవాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. నార్పల మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం-1 పరిధిలో అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి సీఎం జగనన్న పాలనలో ఆయా కుటుంబాలకు జరిగిన మేలును సంబంధించిన సంక్షేమ పథకాల కర పత్రాల ద్వారా తెలియజేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులకు తెలిపి పరిష్కరించాలని సూచించారు. పేదల కుటుంబాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గత నాలుగున్నరేళ్లల్లో దాదాపు రూ.5,89,088 లక్షల మేర లబ్ధి చేకూరిందని లబ్ధిదారుడు వందన సూర్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
వైయస్‌ఆర్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమము..
విజయవాడలో జరిగిన వైయస్‌ఆర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు,‌ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవ‌లు అందించిన వారికి గత మూడేళ్లుగా వైయస్‌ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రభుత్వం అందజేస్తోంది. ఈ ఏడాది 27 మంది ప్రముఖులకు అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి గారు.*
ప్రతి సమస్య నాతో డైరెక్ట్ గా షేర్ చేసుకోండి అంటూ పోలీస్ సిబ్బందికి భరోసా ఇచ్చిన 14 వ బెటాలియన్ నందు కమాండెంట్ ఆర్. గంగాధర రావు ఐ.పి.యస్

అనంతపురం 14 వ బెటాలియన్ నందు కమాండెంట్ ఆర్. గంగాధర రావు ఐ.పి.యస్ , పోలీసు ఆఫీసర్స్ మరియు సిబ్బంది యొక్క డ్యూటీలో ఉన్న సమస్యలు, వారికి రావాల్సిన బెనిఫిట్స్ , చనిపోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు రావాల్సిన బెనిఫిట్స్ మరియు పోలీసు సిబ్బంది కుటుంబాలు యోగా క్షేమాలు పై క్రింది ఆఫీసర్స్ తో సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది . పోలీసు సిబ్బంది ఉద్యోగం చేస్తూ వారికి వచ్చిన సమస్యలను పై ఆఫీసర్ కు చెప్పలేక మానసిక ఒత్తిడి అవుతూ అనారోగ్యానికి గురి అవుతుంటారు కావున మన వంతుగా వారి సమస్యలు తెలుసుకోని పరిష్కారం చేస్తూ వారితో ఉద్యోగం చేపించాల్సి బాధ్యత మన మీద ఉంది కావున వారికి ఎటువంటి సమస్య వచ్చినా మనతో చెప్పుకొనే విధంగా వారికి వసతి కల్పించాలి అని చెప్పుతూ సిబ్బంది ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ గా నాతో మాట్లాడొచ్చని చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో లో అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, అసిస్టెంట్ కమాండెంట్ రమణ మూర్తి, AO నాగభూషణమ్మ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రాము, నాగేంద్ర,లోకేశ్వరనాయుడు రామారావు , కృష్ణ నాయక్, ఆర్.యస్.ఐ లు, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య పాల్గొన్నారు

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో గౌరయ్య కాలనీ నందు బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారంటీ "రచ్చబండ" కార్యక్రమం..

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు ఆలం నరసనయుడు గారు మరియు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ రామలింగారెడ్డి గారు జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో గౌరయ్య కాలనీ లో "బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారంటీ"రచ్చబండ" కార్యక్రమం నిర్వహించారు జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే వారికి ఏడాది 15000 రూపాయలు,ఆడబిడ్డనిధి క్రింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1500 రూపాయలు, దీపం పేరుతొ ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ లు ,మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 3000 నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ఏడాదికి 20000 ఆర్థిక సాయం తదితర పథకాలతో ప్రతి ఇంటికి ఏడాదికి 1,22,000 రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్,నారాయణ స్వామి యాదవ్,లక్ష్మి నారాయణ, S.నారాయణస్యామి, కేశన్న, ఎర్రినాగప్ప, మల్లికార్జున రెడ్డి మాండ్లి అదిశేషుయ్య, నరేంద్ర యాదవ్,చితంబరి,గోపాల్ నాయుడు, కేశవరెడ్డి, బాబయ్య చెరికూరి నారాయణ స్వామి,భూషి శే,షు బాబావలి,రంగమ్మ విజయలక్ష్మి,గుర్రప్ప,వడ్డే రామకృష్ణ మరియు టీడీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

స్వామి వారి సేవలో ఆలూరు ఎర్రిస్వామి రెడ్డి
స్వామి వారి సేవలో ఆలూరు ఎర్రిస్వామి రెడ్డి యల్లనూరు మండలం గడ్డంవారిపల్లి గ్రామంలో దాదాపు రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా రామాలయం నిర్మించారు. సీతారాముల విగ్రహాప్రతిష్ఠ, ధ్వజస్తంభం ప్రతిష్ట, వేద మంత్రాల నడుమ అర్చనలు, అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజ కార్యక్రమాలలో వైస్సార్సీపీ నియోజకవర్గ యువ నాయకుడు ఆలూరు ఎర్రిస్వామి రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు రామంజనేయ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
పేదింటి టీడీపీ కార్యకర్త వివాహ కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసిన జిల్లా టిడిపి సీనియర్ నాయకులు రామలింగారెడ్డి..
పేదింటి టీడీపీ కార్యకర్త వివాహ కార్యక్రమంకు ₹10000/- రూ.లు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్_నాయకులు మాజీ జడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు.. ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలోని టీడీపీ కార్యకర్త వడ్డే మారుతీ గారి కుమారుని వివాహకార్య క్రమంకు ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా *జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు*. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగురైతు ఉపాధ్యక్షలు మల్లికార్జున రెడ్డి గారు, వడ్డే అంజి గారు, రామాంజి గారు తదితరులు పాల్గొన్నారు. Katappagari Ramalingareddy Katappagari Ramalingareddy Ex.ZPTC
సీఎం జగనన్న ఆర్థిక చేయూత..
సీఎం జగనన్న ఆర్థిక చేయూత.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేతుల మీదుగా చెక్కును పంపిణీ చేశారు. నార్పల మండలం కేశేపల్లి గ్రామానికి చెందిన పి. వీర నల్లయ్య(52) ఆరు నెలల క్రితం అనారోగ్యంతో కారణాలతో మృతి చెందారు. భర్తను కోల్పోయిన భార్య పి. శారద ఆర్థిక సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పదించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి కింద దాదాపు రూ.3.50 లక్షలు మంజూరు చేయించి, చెక్కును వారి కుటుంబానికి అందజేశారు. సమస్య అని అడిగిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి మృతుని కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
చంద్రబాబు గారి బెయిలు .. ధర్మానికి దక్కిన తొలి విజయం.. రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు..
చంద్రబాబు గారి బెయిలు .. ధర్మానికి దక్కిన తొలి విజయం.. రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు.. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు అయిన సందర్భంగా ఈరోజు నార్పల మండలo కేంద్రం లో *రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు, గారి* ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ గా గాంధీ విగ్రహం వరకు అక్కడికి వెళ్లి నడి రోడ్డు లో బాణా సంచా కాల్చి సంబరాలు జరిగాయి.ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* పాల్గొన్నారు ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ తప్పుడు కేసులో 53 రోజులు జైలు లో గడుపుతున్న నారా చంద్రబాబు గారు కోర్టు ఆదేశాలతో ఉపశమనం పొందడం అనందదాయకమని చంద్రబాబు గారు నేరం చేయకపోయినా సైకో జగన్ కేవలం రాజకీయ కక్షతోనే జైలు పాలు చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు గారికి ప్రజల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేకనే జగన్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. న్యాయస్థానం నాలుగు వారాల పాటు చంద్రబాబు గారికి బెయిల్ మంజూరు చేయడాన్ని ధర్మానికి దక్కిన తొలి విజయంగా అభివర్ణించారు. కోట్లాది మంది ప్రజల దీవెనలు చంద్రబాబు గారికి తోడుగా ఉన్నాయన్నారు. త్వరలోనే సర్వోన్నత న్యాయస్థానంలో చంద్రబాబు గారికి సానుకూలంగా తీర్పు వెలువడి, కడిగిన ఆణిముత్యంలా మనమధ్య మెరుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఎటువంటి అవినీతి జరగలేదని, కేసులో పస లేదని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారన్నారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు,సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీ లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
సంక్షేమ పాలనకు ప్రజల ప్రశంసలు.. గడపగడపకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
సంక్షేమ పాలనకు ప్రజల ప్రశంసలు.. గడపగడపకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆనందంగా జీవిస్తూ, సంక్షేమ పథకాల సాయంతో సగౌరవంగా పని చేసుకుంటున్నామని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. నార్పల మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం-2 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు. స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఆప్యాయంగా అందరిని పలకరిస్తూ, ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి చేకూరిన లబ్దిని వివరించారు. సంక్షేమ బుక్లెట్ అందించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబంలో చోటుచేసుకున్న పురోగతిని గుర్తించాలన్నారు. టీడీపీ చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వారి మాటల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. నార్పల మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంస్మరణ వారోత్సవ కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. అమరవీరులు చేసిన త్యాగాలని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.