Rains: నేడు.. రేపు ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి

ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది..

తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపునకు గాలులు వీస్తున్నట్లు వివరించింది.

రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి..

కెసిఆర్ తో పోటీకి ఎవ్వరొచ్చినా గంప కింద పెట్టుడే: మంత్రి కేటీఆర్

కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు వచ్చిన మెజార్టీ చూసి ప్రతిపక్షాలు దిమ్మతిరిగి పోవాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు.

బుధవారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో అధికార పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతి పార్టీ కార్యకర్త అంకితభావంతో పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కామారెడ్డి ప్రాంతం ఉద్యమాలకు గడ్డగా మారిందని తెలిపారు.

ఈ ఉద్యమ గడ్డపై సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు. కామారెడ్డిలో పోటికి ఎవరొచ్చినా గంప కింద కమ్ముడేనని మంత్రి కేటీఆర్ అన్నారు.ఆయనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు.

ఈ ప్రాంతం నుండి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీ తప్పుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక్కడ ఏమో ఉద్ధరిద్దామని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. అలాంటి వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పి దూరంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. పలు రాష్ట్రాలకు ప్రధాన కేంద్రంగా కామారెడ్డి ప్రాంతం ఉందన్నారు. రానున్న రోజుల్లో కామారెడ్డి జిల్లా వ్యాపార పరంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.

క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న భారత రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. కామారెడ్డి ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు.

ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తరలించి రైతుల కాళ్లు కడుగుతామని చెప్పారు. 200 పింఛన్ ఇవ్వనోడు రూ.4000 పింఛన్ ఎలా ఇస్తాడని కాంగ్రెస్ నాయకులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం మొదటిసారిగా ఈ ప్రాంతం నుండి ప్రారంభం అయిందని ఆయన తెలిపారు...

జాజిరెడ్డిగూడెం వాసి గొల్లబోయిన అంబేద్కర్ కు ఓయూ డాక్టరేట్

జాజిరెడ్డిగూడెం మండల గ్రామానికి చెందిన గొల్లబోయిన అంబేద్కర్ కు ఉస్మానియా యూనివర్సిటీ జియోగ్రఫీ విభాగములో పీహెచ్ డీ డాక్టరేట్ ప్రకటించారు.

సూర్యపేట్ రెవిన్యూ డివిజన్ ,నల్గొండ జిల్లా, తెలంగాణలో షెడ్యూల్డ్ కులాలు సామాజిక ఆర్ధిక అభివృద్ధి యొక్క ప్రాదేశిక విశ్లేషణ అనే అంశాలపై ఓయూ ప్రొఫెసర్ శ్రీనాగేష్ ఆడిట్ సెల్ డైరెక్టర్ గారి పర్యవేక్షణ లో పరిశోధనకు గాను ఓయూ పరీక్షల విభాగం అంబెడ్కర్ కు డాక్టరేట్ ప్రకటించింది.

ఈ డాక్టరేట్ పట్టాను ఉస్మానియా యూనివర్సిటీ 83వ,స్నాతకోత్సవా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గవర్నెర్ తమిళసై సౌందరరాజన్,ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రో పేసర్ రవీందర్,ఆడోబ్ సీఈఓ శాంతాను నారాయణ్ చేతుల మీదుగా పీహెచ్డీ డాక్టరేట్ అంబెడ్కర్ అందుకున్నారు.

జాజిరెడ్డిగూడెం లోని దళిత కుటుంబానికి చెందిన అంబెడ్కర్ తల్లితండ్రులు పుష్పాలత,అక్కులు గారులు చదువు ఒక్కటే సమస్యలన్నీ టికీ పరిష్కారం ఉన్నత చదువుల దిశగా పాయనించాలానే తపనతో డా.బీ.ఆర్.అంబేద్కర్ గారి స్పూర్తితో తన ప్రాథమిక విద్యాబ్యాసం జాజిరెడ్డిగూడెం లో ఉన్నత స్కూల్ విద్యా మోత్కూర్ లోని ప్రభుత్వ పాఠశాల్లో ఇంటర్ ప్రభుత్వ కాలేజ్ లో ముగించి డిగ్రీ ,పీజీ ,పీహెచ్డీ జియోగ్రఫీ విభాగములో చేసినా పరిశోధనకు గాను యూనివర్సిటీ లో పరీక్ష విభాగం వారు అంబేద్కర్ కి డాక్టరేట్ ప్రధానం చేశారు.

తన పరిశోధన సమయములో జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించారు.అంబేద్కర్ కు డాక్టరేట్ రావడం పట్ల అధ్యపకులు,మిత్రులు,గ్రామస్తులు,శ్రేహిభిలాషుకు హర్షం వ్యక్తం చేశారు.తన పరిశోధన సమయములో తనకు సహకరించిన మిత్త్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలంగాణలో గెలిచేది బీఆర్‌ఎస్‌ పార్టీయే: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ఎన్నికలలో గెలువబోయేది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలువకుండా ఎవడు ఆపలేడన్నారు. బీఆర్‌ఎస్‌ గెలుపుని ఆపడం ఎవని తాత, జేజమ్మ వల్ల కాదని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీకి చురుకులు అంటిస్తూ సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.

ఖమ్మం జిల్లాలో ఒకరిద్దరు దద్దమ్మలున్నారు.బీఆర్‌ఎస్‌ తరఫున నిలబడ్డ ఎవన్ని కూడా నేను అసెంబ్లీ వాకిలి తొక్కనియ్యనని ఒకడంటడు. అది అయ్యేపనేనా..? మీరంతా తలుచుకుంటే సత్తుపల్లి నియోజకవర్గంలో దుమ్మురేగదా..?

సండ్ర వెంకట వీరయ్య ఒక్కసారి కాదు, నాలుగోసారి సత్తుపల్లి పహిల్మాన్ లాగా శాసనసభలో అడుగు పెడతాడు.ఒక్కొక్కనికి ఎంత అహంకారం. నాలుగు పైసలు జేబులో పడితే ఇంత అహంకారం పెరుగుతదా..? పదేళ్లు సీఎంగా పని చేసిన నేను కూడా అంత అహంకారంతోటి మాట్లాడలేదు’ అని అన్నారు.

ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు. పార్టీల మధ్య పోరాటం. గత దశాబ్దాలుగా ఏ పార్టీ ఏం చేసిందో ప్రజలకు తెలుసు. పదేళ్లకు ముందు దాకా ఈ రాష్ట్రంలో ఎక్కువ ఏండ్లు పాలించిందే కాంగ్రెస్‌ పార్టీ. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందో మీకు తెలుసన్నారు.

ఇప్పుడు పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఏం చేసిందో మీకు తెలియదా..? అందుకే ఓటేసే ముందు ఆలోచించి ఓటేయండి. కూరగాయలను కొనేటప్పుడు కూడా పుచ్చులు ఏరిపారేసి మంచివి తీసుకుంటం. అలాంటిది మన నాయకున్ని ఎంచుకునేటప్పుడు అటువంటి విచక్షణ చేయగూడదా..? కాబట్టి బాగా ఆలోచించి ఓటేయండి. మంచి నాయకుడిని ఎన్నుకోండి’ అని సీఎం సూచించారు....

కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆకస్మిక తనిఖీలు ఉధృతం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా విలువ చేసే నగదు, లిక్కర్, ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో వాహన తనఖీల్లో పోలీసులు, ఎన్నికల అధికారులు ఎవరినీ విడిచిపెట్టడం లేదు. తాజాగా ఈరోజు మంత్రి కేటీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.

పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న కేటీఆర్ వాహనాన్ని పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆపారు. వాహనన్ని తనిఖీ చేశారు.

తన వాహనాన్ని తనిఖీకి చేస్తుండగా కేటీఆర్ పోలీసులకు పూర్తిగా సహకరించారు.తనిఖీ అనంతరం కేటీఆర్ కామారెడ్డి బయలుదేరారు....

నేడు హైదరాబాదుకు రానున్న చంద్రబాబు

స్కిల్ డెవలప్మెంట్ కేసును నిన్న మధ్యంతర బెయిల్ పై విడుదలైన చంద్రబాబు ఈరోజు సాయంత్రం హైదరాబాదు కు రానున్నారు.

షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం తిరుమల వెళ్లాలని.. గురువారం శ్రీవారి దర్శనం అనంతరం హైదరాబాద్‌ చేరుకోవాలని తొలుత భావించారు.

అయితే కొన్ని అనారోగ్య సమస్యలకు తక్షణమే వైద్య చికిత్సలు చేయాల్సి ఉందని.. తిరుమల వెళ్లకపోవడం మంచిదని వైద్యులు సూచించారు.

దాంతో ఆయన అటు ప్రయాణం మానుకున్నారు. బుధవారం మధ్యాహ్నం రోడ్డుమార్గంలో హైదరాబాద్‌ వెళ్లనున్నారు.

ఈరోజు హైదరాబాద్ వెళ్లి వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. హైదరాబాద్ నుంచి వ్యక్తిగత వైద్యులు కూడా చంద్రబాబును వెంటనే హైదరాబద్‌కు తీసుకురావాలని కుటుంబ సభ్యులకు సూచించారు.......

నేడు బిజెపి పార్టీ అభ్యర్థుల తుది జాబితా?

భారతీయ జనతా పార్టీ బీజేపీ జనసేన మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాటు వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. పొత్తుల్లో భాగంగా జనసేనకు 9 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించినట్టు తెలిపారు.

అయితే జనసేన మరిన్ని సీట్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరో రెండు సీట్లు పెంచి గరిష్టంగా 11 సీట్ల వరకు ఇవ్వడానికి కూడా కమలదళం సిద్ధపడినట్టు సమాచారం.

బీజేపీతో పొత్తుల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్ర ప్రాంత ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ వంటి స్థానాలను తమకు కేటాయించాలని జనసేన కోరుతుండగా.. కూకట్‌పల్లిని జనసేనకు కేటాయించేందుకు బీజేపీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దులు పంచుకున్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిగతా స్థానాలను కేటాయించే అవకాశం ఉంది.

బీజేపీ జాబితా ఎప్పుడు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మిగిలింది 29రోజులే!. అందుకే, ప్రధాన పార్టీలన్నీ స్పీడ్‌ పెంచాయి!.. ఒకవైపు ప్రజా ఆశీర్వాద సభలతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దూసుకుపోతుంటే, మరోవైపు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వరుస పర్యటనలతో తెలంగాణపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు.

ఇక, బీజేపీ కూడా దూకుడు పెంచింది. పెండింగ్‌ సీట్లకు అభ్యర్ధుల్ని ప్రకటించి ప్రచారంలో స్పీడ్‌ పెంచేందుకు రెడీ అవు తోంది.ఈ రాత్రికి తుది జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.

బీజేపీ. ఈ సాయంత్రం ఢిల్లీలో సమావేశం కాబోతున్న బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ… ఫైనల్‌ లిస్ట్‌ను ఖరారు చేయ బోతోంది. అలాగే, జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపైనా నిర్ణయం తీసుకోనుంది బీజేపీఅధిష్టానం...

కెసిఆర్ ను గద్దె దించాలన్నదే నా లక్ష్యం : వివేక్ వెంకటస్వామి

బీజేపీ పార్టీ భారీ షాక్ తగిలింది. బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కుమారుడు వంశీకి చెన్నూర్ అసెంబ్లీ టికెట్ ను కేటాయించాలన్న హామీ పై హస్తం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… సోనియా, మల్లిఖార్జున్ నాయకత్వం బలోపేతం కోసం వివేక్ పార్టీలో చేరారని చెప్పారు. కీలక సమయంలో వివేక్ పార్టీలో చేరారన్నారు. వారి చేరికతో వెయ్యి ఏనుగుల బలం చేకూర్చిందని వ్యాఖ్యానించారు.

రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వివేక్ చేరిక తెలంగాణకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను గద్దె దించాలనే లక్ష్యంతోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా వివేక్ వెంకటస్వామి ప్రకటించారు.

తెలంగాణ సాధన కోసం ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు పోరాటం చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.కేసీఆర్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అందరం కలిసికట్టుగా కేసీఆర్ ను గద్దె దింపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తామంతా కలిసికట్టుగా ఈ పోరాటంలో పాల్గొంటామని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు...

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు పోలీస్ భద్రత

తాజాగా దుబ్బాక లో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడి నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది.

ఈ మేరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంచుతూ ఇంటెలిజెన్స్‌ ఏడీజీ అనిల్‌కుమార్‌ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం 2+2 భద్రతను 4+4గా పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు భద్రతను తక్షణమే పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు...

నేడు తెలంగాణకు ఈసీ బృందం

ఎన్నికలు గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఇందుకు ఈసీ బృందం నేడు తెలంగాణకు రానుంది..

సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం మూడు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనుంది.

ఈసీ బృందం…రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఇతర అధికారులతో కూడా సమావేశం కానున్నారు.

అనంతరం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులతో సమావేశం కానుంది. తనిఖీలు, స్వాధీనాలపై సమీక్ష నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల సీఎస్. డీజీపీల, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.

ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరిహద్దుల్లో చెక్ పోస్టులు, తనిఖీలు తదితర అంశాలపైచర్చిస్తారు...