బెటాలియన్ హెడ్ క్వార్టర్ నందు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమము..పోలీస్ త్యాగలపై ప్రముఖ వ్యక్తులచే ఉపన్యాసములు
14 వ పటాలము, అనంతపురము. చీఫ్ ఆఫీసు ఆదేశల మేరకు ఈ రోజు అనగ 30.10.2023 తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమమును బెటాలియన్ హెడ్ క్వార్టర్ నందు నిర్వహించడము జరిగింది. ఈ కార్యక్రమములో భాగంగా పోలీస్ త్యాగలపై ప్రముఖ వ్యక్తులచే ఉపన్యాసములు నిర్వహించడము అనే అంశము పై కమాండెంట్ ఆర్. గంగాధర రావు, ఐపిఎస్ గారిచే ఉపన్యాసము ఇప్పించడము జరిగింది. ఉపన్యాసము లో భాగంగా భారత్-చైనా సరిహద్దుల్లో ఆక్సయి చిన్ ప్రాంతములో మంచు పర్వతాల మధ్యన ఉన్న వేదినీటి బుగ్గ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మద్య నిలిచింది అని, దేశవ్యాప్తంగా విధి నిర్వహణము లో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులు యెక్క త్యాగలను సంస్మరించుకొంటూ అక్టోబర్ 21 న పోలీస్ అమరవీరాల సంస్మరణ దినోత్సవమును జరుపుకుంటారు అని గుర్తుచేశారు, బారత జవానుల రక్తముతో తడిచిన హాట్ స్ప్రింగ్ కాస్త నెత్తుటి బుగ్గ గా మారింది అని చెప్పారు, వారి యెక్క త్యాగలను కొనియాడారు.
పై అంశము గురుంచి చాలా చక్కగా సరాళముగా ఉపన్యాసము ఇచ్చారు, అలాగే వారి త్యాగాలకు సంస్మరించుకొంటూ సిబ్బందితోపాటు రెండు నిముషములు శ్రద్దాంజలిని పాటించారు. ఇలాగే ప్రతి సంవత్సరము అమరవీరులు సంస్మరణ కార్యక్రమలును నిర్వహిస్తు వారి త్యాగాలకు సంస్మరించుకోవాలని చెప్పారు.
ఈ కార్యకమములో అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, ట్రైనీ డిఎస్పి లు , ఆర్ఐ లు లొకేశ్వర నాయుడు, సీతారామ రావు గార్లు, ఆర్.యస్.ఐ. లు మరియు బెటాలియన్ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.
Nov 01 2023, 17:24