పేదింటి టీడీపీ కార్యకర్త వివాహ కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసిన జిల్లా టిడిపి సీనియర్ నాయకులు రామలింగారెడ్డి..
పేదింటి టీడీపీ కార్యకర్త వివాహ కార్యక్రమంకు ₹10000/- రూ.లు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్_నాయకులు మాజీ జడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు.. ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలోని టీడీపీ కార్యకర్త వడ్డే మారుతీ గారి కుమారుని వివాహకార్య క్రమంకు ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా *జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు*. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగురైతు ఉపాధ్యక్షలు మల్లికార్జున రెడ్డి గారు, వడ్డే అంజి గారు, రామాంజి గారు తదితరులు పాల్గొన్నారు. Katappagari Ramalingareddy Katappagari Ramalingareddy Ex.ZPTC
సీఎం జగనన్న ఆర్థిక చేయూత..
సీఎం జగనన్న ఆర్థిక చేయూత.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేతుల మీదుగా చెక్కును పంపిణీ చేశారు. నార్పల మండలం కేశేపల్లి గ్రామానికి చెందిన పి. వీర నల్లయ్య(52) ఆరు నెలల క్రితం అనారోగ్యంతో కారణాలతో మృతి చెందారు. భర్తను కోల్పోయిన భార్య పి. శారద ఆర్థిక సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పదించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి కింద దాదాపు రూ.3.50 లక్షలు మంజూరు చేయించి, చెక్కును వారి కుటుంబానికి అందజేశారు. సమస్య అని అడిగిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి మృతుని కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
చంద్రబాబు గారి బెయిలు .. ధర్మానికి దక్కిన తొలి విజయం.. రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు..
చంద్రబాబు గారి బెయిలు .. ధర్మానికి దక్కిన తొలి విజయం.. రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు.. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు అయిన సందర్భంగా ఈరోజు నార్పల మండలo కేంద్రం లో *రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు, గారి* ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ గా గాంధీ విగ్రహం వరకు అక్కడికి వెళ్లి నడి రోడ్డు లో బాణా సంచా కాల్చి సంబరాలు జరిగాయి.ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* పాల్గొన్నారు ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ తప్పుడు కేసులో 53 రోజులు జైలు లో గడుపుతున్న నారా చంద్రబాబు గారు కోర్టు ఆదేశాలతో ఉపశమనం పొందడం అనందదాయకమని చంద్రబాబు గారు నేరం చేయకపోయినా సైకో జగన్ కేవలం రాజకీయ కక్షతోనే జైలు పాలు చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు గారికి ప్రజల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేకనే జగన్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. న్యాయస్థానం నాలుగు వారాల పాటు చంద్రబాబు గారికి బెయిల్ మంజూరు చేయడాన్ని ధర్మానికి దక్కిన తొలి విజయంగా అభివర్ణించారు. కోట్లాది మంది ప్రజల దీవెనలు చంద్రబాబు గారికి తోడుగా ఉన్నాయన్నారు. త్వరలోనే సర్వోన్నత న్యాయస్థానంలో చంద్రబాబు గారికి సానుకూలంగా తీర్పు వెలువడి, కడిగిన ఆణిముత్యంలా మనమధ్య మెరుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఎటువంటి అవినీతి జరగలేదని, కేసులో పస లేదని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారన్నారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు,సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీ లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
సంక్షేమ పాలనకు ప్రజల ప్రశంసలు.. గడపగడపకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
సంక్షేమ పాలనకు ప్రజల ప్రశంసలు.. గడపగడపకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆనందంగా జీవిస్తూ, సంక్షేమ పథకాల సాయంతో సగౌరవంగా పని చేసుకుంటున్నామని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. నార్పల మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం-2 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు. స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఆప్యాయంగా అందరిని పలకరిస్తూ, ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి చేకూరిన లబ్దిని వివరించారు. సంక్షేమ బుక్లెట్ అందించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబంలో చోటుచేసుకున్న పురోగతిని గుర్తించాలన్నారు. టీడీపీ చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వారి మాటల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. నార్పల మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంస్మరణ వారోత్సవ కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. అమరవీరులు చేసిన త్యాగాలని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా పరిహారం పంపిణీ..!
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా పరిహారం పంపిణీ..! రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన రైతు కత్తె బాబు అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఏడు లక్షల రూపాయలు పరిహారం మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా బాధిత రైతు భార్య కత్తె లక్ష్మీదేవికి అందజేశారు.
చంద్రబాబు చిత్రపటానికి పొట్టేలు రక్తంతో అభిషేకం...
అనంతపురం జిల్లా నడిబొడ్డున టిడిపి శ్రేణులు చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జిల్లా టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు చిత్రపటానికి పొట్టేలును బలిస్తూ వాటి రక్తంతోనే అభిషేకం చేయడం జరిగింది
ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోండి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన... శింగనమల నియోజకవర్గం ద్వి సభ్య కమిటీ సభ్యులు
ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోండి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన... శింగనమల నియోజకవర్గం ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు ముంటి మడుగు కేశవరెడ్డి* ఎంపీ గోరంట్ల మాధవ్ వైసీపీ సామాజిక బస్సు యాత్రలో చంద్రబాబు చస్తాడు అంటూ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్లో సిఐ గారికి పిర్యాదు చేసిన *శింగగనమల నియోజకవర్గం ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు,ముంటిమడుగు కేశవరెడ్డి గారు,జిల్లా నాయకులు పర్వతనేని శ్రీధర్ బాబు గారు,రామలింగారెడ్డి గారు, డేగల కృష్ణమూర్తి గారు,మండల పార్టీ కన్వీనర్ అశోక్* తదితరులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 26వ తారీఖున వైసిపి సామజిక బస్సు యాత్ర పేరుతో బుక్కరాయసముద్రంలో గోరంట్ల మాధవ్ 2024లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు నాయుడు చనిపోతాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాకు తీవ్ర భయాందోళనలకు గురయ్యామని మా నాయకుడు మరణం గురించి మంత్రుల సమక్షంలో ఒక ఎంపీ చంద్రబాబు నాయుడు చనిపోతాడని అనడం వీటిలో కుట్ర దాగి ఉందని మాకు అనుమానంగా ఉందని వీటిపై సమగ్ర దర్యాప్తు చేసి ఎంపీ గోరంట్ల మాధవ్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు లక్ష్మీనారాయణ, నారాయణస్వామి, కేశన్న ,మాజీ ఎంపీటీసీ చెరుకూరి నారాయణస్వామి,నరేంద్ర యాదవ్,చిదంబరి,బాబయ్య,కొయ్యగూర పెద్దన్న,హరి,నరసింహులు,అరిగెల రాజు తదితరులు పాల్గొన్నారు.
బెటాలియన్ హెడ్ క్వార్టర్ నందు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమము..పోలీస్ త్యాగలపై ప్రముఖ వ్యక్తులచే ఉపన్యాసములు

14 వ పటాలము, అనంతపురము. చీఫ్ ఆఫీసు ఆదేశల మేరకు ఈ రోజు అనగ 30.10.2023 తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమమును బెటాలియన్ హెడ్ క్వార్టర్ నందు నిర్వహించడము జరిగింది.    ఈ కార్యక్రమములో భాగంగా పోలీస్ త్యాగలపై ప్రముఖ వ్యక్తులచే ఉపన్యాసములు నిర్వహించడము అనే అంశము పై కమాండెంట్ ఆర్. గంగాధర రావు, ఐపిఎస్ గారిచే ఉపన్యాసము ఇప్పించడము జరిగింది. ఉపన్యాసము లో భాగంగా భారత్-చైనా సరిహద్దుల్లో ఆక్సయి చిన్ ప్రాంతములో మంచు పర్వతాల మధ్యన ఉన్న వేదినీటి బుగ్గ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మద్య నిలిచింది అని, దేశవ్యాప్తంగా విధి నిర్వహణము లో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులు యెక్క త్యాగలను సంస్మరించుకొంటూ అక్టోబర్ 21 న పోలీస్ అమరవీరాల సంస్మరణ దినోత్సవమును జరుపుకుంటారు అని గుర్తుచేశారు, బారత జవానుల రక్తముతో తడిచిన హాట్ స్ప్రింగ్ కాస్త నెత్తుటి బుగ్గ గా మారింది అని చెప్పారు, వారి యెక్క త్యాగలను కొనియాడారు.  

పై అంశము గురుంచి చాలా చక్కగా సరాళముగా ఉపన్యాసము ఇచ్చారు, అలాగే వారి త్యాగాలకు సంస్మరించుకొంటూ సిబ్బందితోపాటు రెండు నిముషములు శ్రద్దాంజలిని పాటించారు. ఇలాగే ప్రతి సంవత్సరము అమరవీరులు సంస్మరణ కార్యక్రమలును నిర్వహిస్తు వారి త్యాగాలకు సంస్మరించుకోవాలని చెప్పారు. 

ఈ కార్యకమములో అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, ట్రైనీ డిఎస్పి లు , ఆర్ఐ లు లొకేశ్వర నాయుడు, సీతారామ రావు గార్లు, ఆర్.యస్.ఐ. లు మరియు బెటాలియన్ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.

చనిపోయిన టిడిపి కార్యకర్తకు రెండు లక్షల బీమా.. వర్తింపజేసిన రాష్ట్ర టిడిపి అధిష్టానం.. హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు

చనిపోయిన టిడిపి కార్యకర్తకు రెండు లక్షల బీమా.. వర్తింపజేసిన రాష్ట్ర టిడిపి అధిష్టానం.. హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు

వివరాల్లోకి వెళితే..

అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం వడియం పేట గ్రామం నందు జీవనం చేస్తున్న టిడిపి కార్యకర్త తలారి లక్ష్మీనారాయణ గత కొద్దిరోజుల క్రితం ప్రమాదవశాస్తూ చనిపోవడం జరిగింది. జిల్లా టిడిపి సీనియర్ నాయకులు బుక్కరాయసముద్రం మండల మాజీ జడ్పిటిసి కె రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో నాలుగు వేల మందికి భీమ చేయడం జరిగినది. అందులో భాగంగా వడియంపేట గ్రామం నందు తలారి లక్ష్మీనారాయణ కూడా బీమా చేయడంతో మరణాంతరం వడియం పేట సర్పంచ్ నాగార్జున తక్షణమే స్పందించి తమ నాయకుడు రామలింగారెడ్డి గారికి సమాచారం అందించి రెండుసార్లు విజయవాడ కెళ్ళి దగ్గరుండి తలారి లక్ష్మీనారాయణ గారి బీమా సమస్యను అధిష్టానంతో కలిసి ఆ కుటుంబానికి బీమా మొత్తం అందేలా చేశాడు ఇలా ముందస్తుగా టిడిపి అధిష్టానం మేరకు కే రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో బీమా చేయడం వల్ల ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ. ఇలాంటి సౌకర్యం దేశంలో ఏ పార్టీకి లేదంటూ తలారి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీకి జిల్లా సీనియర్ నాయకులు రామలింగారెడ్డి గారికి మరియు సర్పంచి నాగార్జున గారికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు