నిజంనిప్పులాంటిది

Nov 01 2023, 09:37

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు పోలీస్ భద్రత

తాజాగా దుబ్బాక లో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడి నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది.

ఈ మేరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంచుతూ ఇంటెలిజెన్స్‌ ఏడీజీ అనిల్‌కుమార్‌ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం 2+2 భద్రతను 4+4గా పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు భద్రతను తక్షణమే పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు...

నిజంనిప్పులాంటిది

Nov 01 2023, 09:35

నేడు తెలంగాణకు ఈసీ బృందం

ఎన్నికలు గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఇందుకు ఈసీ బృందం నేడు తెలంగాణకు రానుంది..

సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం మూడు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనుంది.

ఈసీ బృందం…రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఇతర అధికారులతో కూడా సమావేశం కానున్నారు.

అనంతరం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులతో సమావేశం కానుంది. తనిఖీలు, స్వాధీనాలపై సమీక్ష నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల సీఎస్. డీజీపీల, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.

ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరిహద్దుల్లో చెక్ పోస్టులు, తనిఖీలు తదితర అంశాలపైచర్చిస్తారు...

నిజంనిప్పులాంటిది

Oct 31 2023, 09:43

నేడు కాంగ్రెస్ తుది జాబితా రిలీజ్? వామపక్షాలకు ఎన్ని సీట్లు?

ఇవాళ ఫైనల్ జాబితా రిలీజ్ అవ్వొచ్చనే అంచనా ఉన్నా.. ఇవాళ తెలంగాణకు ప్రియాంక గాంధీ వస్తుండటం వల్ల.. నేతలు ఆమె పర్యటన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అందువల్ల ఇవాళ లిస్ట్ రిలీజ్ చేస్తారా చెయ్యరా అన్నది సస్పెన్స్‌గా మారింది. పైగా సీపీఎం, సీపీఐలకు ఎన్ని స్థానాలు ఇవ్వాలనేది కూడా తేల్చాల్సి ఉంది. ఈ పార్టీలు చెరో రెండు స్థానాలు కోరుతున్నాయి. కాంగ్రెస్ చెరో స్థానం ఇవ్వాలనుకుంటోంది. ఖమ్మం జిల్లాలో భద్రాచలం లేదా.. వారా లేదా ఇల్లెందు స్థానం ఇవ్వాల్సిందేనని సీపీఎం కోరుతోంది. ఈ స్థానాల్లో దేనినీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఈ విషయాన్ని తేల్చే బాధ్యత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై పడింది..

మరో సీటుగా మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎం కోరుతోంది. దాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ ఆసక్తిగానే ఉంది. మిర్యాలగూడతోపాటూ.. మరో స్థానాన్ని ఖమ్మంలో ఇవ్వాలని కోరుతుండటం కాంగ్రెస్‌కి సమస్యగా మారింది..

సీపీఐకి ఖమ్మంలోని కొత్తగూడెం ఇస్తారని తెలుస్తోంది. ఐతే.. ఈ పార్టీ చెన్నూరును కూడా అడుగుతోంది. దీన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఇవాళ ఏదో ఒకటి తేలిపోతే, తమవైపు నుంచి లిస్ట్ రిలీజ్ చెయ్యాలని కాంగ్రెస్ భావిస్తోంది. మంగళవారం లేదా బుధవారం లిస్ట్ రిలీజ్ చెయ్యాలనుకుంటోంది. ఐతే.. వామపక్షాలతో సానుకూలంగానే వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. పొత్తు చెడిపోయే పరిస్థితి రాదని అంటున్నారు. అందువల్ల కాంగ్రెస్ రాజీ పడి 4 స్థానాలను వారికి ఇస్తుందా లేక.. రెండే ఇచ్చి.. పంతం నెగ్గించుకుంటుందా అన్నది ఇవాళో, రేపో తెలుస్తుంది..

నిజంనిప్పులాంటిది

Oct 31 2023, 09:42

CM KCR : ఇవాళ మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్..

CM KCR will participate in three public meetings today

ఉమ్మడి నల్గొండ జిల్లాలలో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ముందుగా హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ సభలకు హాజరుకానున్నారు. ఈ తరుణంలో మూడు నియోజకవర్గాలలో సభా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి..

ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రమావత్ రవీంద్ర కుమార్, దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్ని సభలలో 70 నుంచి లక్ష మంది వరకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు నాయకులు..

నిజంనిప్పులాంటిది

Oct 31 2023, 09:41

దేశంలో కేజీ ఉల్లి సగటు ధర రూ.50

దిల్లీ: దేశంలో ఉల్లిపాయల అధిక ధరలు కొనసాగుతున్నాయి. రాజధాని దిల్లీలో కేజీ ఉల్లి చిల్లర ధర రూ.78 పలుకుతుండగా, దేశవ్యాప్తంగా సగటు కనిష్ఠ ధర రూ.50.35గా ఉంది..

గరిష్ఠంగా రూ.83 ఉంది. ఈ క్రమంలో విదేశాలకు ఎగుమతి చేసే ఉల్లిపై టన్నుకు కనీస ఎగుమతి ధర 800 డాలర్లను విధించాలని కేంద్రం నిర్ణయించింది. డిసెంబరు 31వరకు ఈ విధానాన్ని అమలు చేయనుంది..

ఎగుమతులను నిరుత్సాహపరిచి దేశీయ మార్కెట్‌లో తగినంత సరుకును అందుబాటులో ఉంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆహారం, వినియోగదారుల వ్యవహారాలశాఖ ఒక ప్రకటనలో తెలిపింది..

నిజంనిప్పులాంటిది

Oct 31 2023, 09:40

ఏపీ స్కిల్ కేసులో నేడు కీలకం.. చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ వస్తుందా?

అమరావతి: 50 రోజులుగా ఆయన జైలులోనే గడుపుతున్నారు..

ఆయన తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేశారు..

దానిపై ఆల్రెడీ వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది..

ఇవాళ ఈ తీర్పును వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు..

అందువల్ల ఇవాళ మధ్యంతర బెయిల్ వస్తుందా రాదా అనేది చర్చగా మారింది..

నిజంనిప్పులాంటిది

Oct 31 2023, 09:39

విశాఖ రాజధానిపై నేడు సీఎం జగన్‌ సమీక్ష

గుంటూరు: విశాఖపట్నం రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ సమీక్ష జరగనుంది..

ఏపీకి అతిత్వరలో పాలనా రాజధాని కానుంది వైజాగ్‌. ఇప్పటికే సీఎం క్యాంప్‌ కార్యాలయానికి సంబంధించిన పనులు పూర్తి కావొచ్చాయి. అలాగే.. అక్కడ ఉన్నతాధికారులకు తాత్కాలిక వసతి కేటాయింపులపై అధికారులతో సీఎం జగన్‌ ఇవాళ్టి సమీక్షలో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్రీమెన్‌ కమిటీ, ఆయనకు సమర్పించనుంది..

నిజంనిప్పులాంటిది

Oct 31 2023, 09:39

నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాక?

తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. విస్తృత పర్యటన చేస్తూ రోజుకు రెండు మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ కూడా బహిరంగ సభలు, రాహుల్, ఖర్గేలతో కార్నర్ మీటింగ్‌లో సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ ప్రియాంకగాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

ఇక బీజేపీ కూడా ఇటీవల కేంద్ర అమిత్ షాతో సూర్యాపేటలో సభ నిర్విహించింది. పూర్తి స్థాయి అభ్యర్థుల ప్రకటన తర్వాత అగ్రనేతలు, కేంద్ర మంత్రులతో సభలకు ప్లాన్ చేస్తుంది.

ఇక ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని చూస్తుంది. అందులో భాగంగా ఆయనకు పార్టీ తరపున హెలికాప్టర్‌ను కేటాయించినట్లు తెలిసింది

బీజేపీ తెలంగాణ స్టార్ క్యాంపెయినర్‌ హోదాలో ఆయనకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్‌కి ఉన్న ఫాలోయింగ్‌ను పార్టీకి ఉపయోగపడేలా అధిష్టానం ప్రణాళిక రచించినట్లు అర్థమవుతోంది.

రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో జీహెచ్‌ఎంసీతో పాటు దుబ్బాక, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో విజయాలు సాధించిన క్రెడిట్ సంజయ్‌కి ఉంది. కార్యకర్తల్లోనూ ఆయన మాస్ ఇమేజ్ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పలు బహిరంగ సభల్లో బండి సంజయ్ పాల్గొనేందుకు త్వరగా సభలకు చేరుకునేందుకు ఆయనకు హెలికాప్టర్ కేటాయించింది.

సంజయ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తో పాటు మరొకరికి కూడా హెలికాప్టర్లు కేటాయించినట్లు సమాచారం.

నిజంనిప్పులాంటిది

Oct 31 2023, 09:37

తిరుపతిలో సర్వసాధారణంగా భక్తుల రద్దీ

తిరుమల లో నేడు భక్తుల రద్దీ సర్వ సాదారణంగా ఉంది. మంగళవారం శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్వనానికి 3 గంటల సమయం పడుతోందని తెలిపారు.

కాగా, సోమవారం 69,654 శ్రీవారిని మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 23,978 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.34కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు....

నిజంనిప్పులాంటిది

Oct 23 2023, 10:12

Indrakeeladri: నేడు రెండు రూపాల్లో దుర్గమ్మ దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై సోమవారంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.

ఆదివారం దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చిన భక్తులు దర్శించుకున్నారు..

ఉత్సవాల చివరి రోజైన సోమవారం దుర్గమ్మ రెండు రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఉదయం మహిషాసురమర్దనిగా.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు.

చివరి రోజు కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

దసరా ఉత్సవాలు ముగుస్తుండడంతో ఇంద్రకీలాద్రికి భవానీ భక్తుల రాక పెరిగింది. దసరా ముగిసిన తర్వాత కూడా రెండు రోజుల పాటు భవానీలు తరలిరానున్నారు..