చంద్రబాబు చిత్రపటానికి పొట్టేలు రక్తంతో అభిషేకం...
అనంతపురం జిల్లా నడిబొడ్డున టిడిపి శ్రేణులు చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జిల్లా టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు చిత్రపటానికి పొట్టేలును బలిస్తూ వాటి రక్తంతోనే అభిషేకం చేయడం జరిగింది![]()
ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోండి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన... శింగనమల నియోజకవర్గం ద్వి సభ్య కమిటీ సభ్యులు
ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోండి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన... శింగనమల నియోజకవర్గం ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు ముంటి మడుగు కేశవరెడ్డి*ఎంపీ గోరంట్ల మాధవ్ వైసీపీ సామాజిక బస్సు యాత్రలో చంద్రబాబు చస్తాడు అంటూ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్లో సిఐ గారికి పిర్యాదు చేసిన *శింగగనమల నియోజకవర్గం ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు,ముంటిమడుగు కేశవరెడ్డి గారు,జిల్లా నాయకులు పర్వతనేని శ్రీధర్ బాబు గారు,రామలింగారెడ్డి గారు, డేగల కృష్ణమూర్తి గారు,మండల పార్టీ కన్వీనర్ అశోక్* తదితరులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 26వ తారీఖున వైసిపి సామజిక బస్సు యాత్ర పేరుతో బుక్కరాయసముద్రంలో గోరంట్ల మాధవ్ 2024లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు నాయుడు చనిపోతాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాకు తీవ్ర భయాందోళనలకు గురయ్యామని మా నాయకుడు మరణం గురించి మంత్రుల సమక్షంలో ఒక ఎంపీ చంద్రబాబు నాయుడు చనిపోతాడని అనడం వీటిలో కుట్ర దాగి ఉందని మాకు అనుమానంగా ఉందని వీటిపై సమగ్ర దర్యాప్తు చేసి ఎంపీ గోరంట్ల మాధవ్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు లక్ష్మీనారాయణ, నారాయణస్వామి, కేశన్న ,మాజీ ఎంపీటీసీ చెరుకూరి నారాయణస్వామి,నరేంద్ర యాదవ్,చిదంబరి,బాబయ్య,కొయ్యగూర పెద్దన్న,హరి,నరసింహులు,అరిగెల రాజు తదితరులు పాల్గొన్నారు.
బెటాలియన్ హెడ్ క్వార్టర్ నందు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమము..పోలీస్ త్యాగలపై ప్రముఖ వ్యక్తులచే ఉపన్యాసములు
14 వ పటాలము, అనంతపురము. చీఫ్ ఆఫీసు ఆదేశల మేరకు ఈ రోజు అనగ 30.10.2023 తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమమును బెటాలియన్ హెడ్ క్వార్టర్ నందు నిర్వహించడము జరిగింది. ఈ కార్యక్రమములో భాగంగా పోలీస్ త్యాగలపై ప్రముఖ వ్యక్తులచే ఉపన్యాసములు నిర్వహించడము అనే అంశము పై కమాండెంట్ ఆర్. గంగాధర రావు, ఐపిఎస్ గారిచే ఉపన్యాసము ఇప్పించడము జరిగింది. ఉపన్యాసము లో భాగంగా భారత్-చైనా సరిహద్దుల్లో ఆక్సయి చిన్ ప్రాంతములో మంచు పర్వతాల మధ్యన ఉన్న వేదినీటి బుగ్గ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మద్య నిలిచింది అని, దేశవ్యాప్తంగా విధి నిర్వహణము లో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులు యెక్క త్యాగలను సంస్మరించుకొంటూ అక్టోబర్ 21 న పోలీస్ అమరవీరాల సంస్మరణ దినోత్సవమును జరుపుకుంటారు అని గుర్తుచేశారు, బారత జవానుల రక్తముతో తడిచిన హాట్ స్ప్రింగ్ కాస్త నెత్తుటి బుగ్గ గా మారింది అని చెప్పారు, వారి యెక్క త్యాగలను కొనియాడారు.
పై అంశము గురుంచి చాలా చక్కగా సరాళముగా ఉపన్యాసము ఇచ్చారు, అలాగే వారి త్యాగాలకు సంస్మరించుకొంటూ సిబ్బందితోపాటు రెండు నిముషములు శ్రద్దాంజలిని పాటించారు. ఇలాగే ప్రతి సంవత్సరము అమరవీరులు సంస్మరణ కార్యక్రమలును నిర్వహిస్తు వారి త్యాగాలకు సంస్మరించుకోవాలని చెప్పారు.
ఈ కార్యకమములో అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, ట్రైనీ డిఎస్పి లు , ఆర్ఐ లు లొకేశ్వర నాయుడు, సీతారామ రావు గార్లు, ఆర్.యస్.ఐ. లు మరియు బెటాలియన్ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.
చనిపోయిన టిడిపి కార్యకర్తకు రెండు లక్షల బీమా.. వర్తింపజేసిన రాష్ట్ర టిడిపి అధిష్టానం.. హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు
చనిపోయిన టిడిపి కార్యకర్తకు రెండు లక్షల బీమా.. వర్తింపజేసిన రాష్ట్ర టిడిపి అధిష్టానం.. హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు
వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం వడియం పేట గ్రామం నందు జీవనం చేస్తున్న టిడిపి కార్యకర్త తలారి లక్ష్మీనారాయణ గత కొద్దిరోజుల క్రితం ప్రమాదవశాస్తూ చనిపోవడం జరిగింది. జిల్లా టిడిపి సీనియర్ నాయకులు బుక్కరాయసముద్రం మండల మాజీ జడ్పిటిసి కె రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో నాలుగు వేల మందికి భీమ చేయడం జరిగినది. అందులో భాగంగా వడియంపేట గ్రామం నందు తలారి లక్ష్మీనారాయణ కూడా బీమా చేయడంతో మరణాంతరం వడియం పేట సర్పంచ్ నాగార్జున తక్షణమే స్పందించి తమ నాయకుడు రామలింగారెడ్డి గారికి సమాచారం అందించి రెండుసార్లు విజయవాడ కెళ్ళి దగ్గరుండి తలారి లక్ష్మీనారాయణ గారి బీమా సమస్యను అధిష్టానంతో కలిసి ఆ కుటుంబానికి బీమా మొత్తం అందేలా చేశాడు ఇలా ముందస్తుగా టిడిపి అధిష్టానం మేరకు కే రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో బీమా చేయడం వల్ల ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ. ఇలాంటి సౌకర్యం దేశంలో ఏ పార్టీకి లేదంటూ తలారి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీకి జిల్లా సీనియర్ నాయకులు రామలింగారెడ్డి గారికి మరియు సర్పంచి నాగార్జున గారికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు
రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం వడ్డుపల్లి గ్రామంలో కళ్లకు_గంతలు కట్టుకొని నిరసన.. గడుపూటి నారాయణస్వామి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు నిరసనగా
తెలుగుదేశం పార్టీ రాప్తాడు నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల సునీతమ్మ గారి ఆదేశాల మేరకు రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం వడ్డుపల్లి గ్రామంలో
కళ్లకు_గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మరియు (జోనల్-5) తెలుగు యువత ఇంచార్జి గడుపూటి నారాయణస్వామి గారు
మరియు వడ్డుపల్లి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పోతుల కృష్ణ గోపాల్* మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తిమ్మప్ప, ఓబులేసు,లక్ష్మన్న,సుబ్బారాయుడు, వెంకట రాముడు, నాగన్న, గంగాధర, నారాయణస్వామి, అశోక్, శివ, నాగేశ్వరరావు, మహేష్ ,రాంబాబు నాగరాజు,శీనా సోము,ధనుంజయ, రామాంజి, చిన్న స్వామి, నవీన్,తేజ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకుల సమావేశం..
అనంతపురం నగరంలోని బల్లా కన్వెన్షన్ హాల్ నందు ఈరోజు జరిగిన ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకుల సమావేశానికి హాజరైన ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు మరియు ఉమ్మడి జిల్లా తెలుగుదేశo పార్టీ నాయకులు , జనసేన నాయకులు పాల్గొన్నారు
గుడ్డి వైసీపీ ప్రభుత్వానికి కళ్లు తెరిపిద్దాo...
చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టు నిరసిస్తూ కళ్లకు నల్ల గంతలు కట్టుకుని నిరసన తెలియజేస్తున్న రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, రాయలసీమ మీడియా కో ఆర్డినేటర్ బీవీ వెంకటరాముడు గారు పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన అంతా అంధకారంలో మగ్గుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకో జగన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ఈ నాలుగున్నర ఏళ్లలో వైసీపీ పాలన అంతా శూన్యంగా మారిందన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో """కళ్ళు తెరిపిద్దాం """ కార్యక్రమం...
జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో """కళ్ళు తెరిపిద్దాం """ కార్యక్రమం...
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మరియు ద్విసభ్య కమిటీ సూచన మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయనకు మద్దతు పలుకుతూ బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఇవాళ రాత్రి 7.00 గంటల నుండి రాత్రి 7.05 నిమిషాల వరకు """కళ్ళు తెరిపిద్దాం"""కార్యక్రమం ద్వారా కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలపడం జరిగింది ...
ఈ కార్యక్రమం నరసింహరెడ్డి అనందరెడ్డి వేణుగోపాల్ రాము చౌడయ్య రమేష్ సూర్యనారాయణ నరేంద్ర యాదవ్ సురేష్ చౌదరి శంకర రెడ్డిపల్లి నాయుడు ఆది వడ్డేరామకృష్ణ తిరుపతయ్య వడ్డేవీరయ్య అరిగెల రాజు నాగరాజు రాజేష్ తదితరులు పాల్గొన్నారు...
గ్రామంలో ఘనంగా గౌరమ్మ, గొంతెమ్మ వేడుకలు..
గ్రామంలో ఘనంగా గౌరమ్మ, గొంతెమ్మ వేడుకలు..రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా శనివారం గౌరమ్మ ఆదివారం గొంతెమ్మ పండుగను మహిళలు, యువతులు, చిన్నారులు, అంతే వైభవంగా గౌరమ్మ, గొంతెమ్మ పండుగను, గ్రామస్తులు ఘనంగా నిర్వహించి అమ్మవారి విగ్రహాలకు పట్టుచీర, గాజులు, పూలతో అలంకరించి, అమ్మవారికి మహిళలు, యువతులు, ప్రత్యేక పూజలు నిర్వహించి. ఆదివారం ఉదయం అమ్మవారికి పొట్టేలను బలిచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది అదేవిధంగా సాయంత్రం డప్పు చప్పులతో అమ్మవారిని ఆలయం నుంచి ఎత్తుకొని మహిళలు, యువతులు చిన్నారులు ఘనంగా ఊరేగింపు నిర్వహించి. అనంతరం అక్కడి నుంచి గ్రామ చెరువు వద్దకు తీసువెళ్లి నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Nov 01 2023, 06:28