HYD: నగరంలో 144 సెక్షన్ అమలు: సిపి సందీప్ శాండిల్య

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లి ఎన్నికల దృష్ట్యా జంట నగరాల్లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు నగరంలోని 15 నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్‌ కార్యాలయాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు నగర సిపి సందీప్‌ శాండిల్య ప్రకటించారు.

ఈ నిబంధనలు నవంబర్‌ 3 నుంచి 15వ తేదీ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అమలులో ఉంటాయని తెలిపారు. అప్పటి వరకు ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండటాన్ని నిషేధించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

నల్గొండ లో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్లు, వ్యాయామ విద్యా విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని "జాతీయ ఐక్యత దినోత్సవం" నిర్వహించారు. 

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్ ఉపేందర్ ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జాతీయ ఐక్యత భావంతో కలిసిమెలిసి ఉండాలని, ఈర్ష్య, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ప్రక్కకు పెట్టి సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

పటేల్ యొక్క దేశ సేవలను గుర్తు చేసుకొని, నేటి యువతరం వారిని ఆదర్శంగా తీసుకొని దృఢమైన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని అన్నారు. విద్యార్థులు ఐకమత్యంగా ఉండి, దేశ సమగ్రతను, భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితం కావాలని, భారత దేశ అంతర్గత భద్రతను పటిష్ట పరచడానికి స్వయంగా కదిలి సత్యనిష్టతో ముందుకెళ్లాలన్నారు. అదే విధంగా విద్యార్థుల చేత "ఐక్యత ప్రతిజ్ఞ" చేయించారు. తదనంతరం "రన్ ఫర్ యూనిటీ" అనే పరుగును నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారులు ఇ.యాదగిరి రెడ్డి, ఎమ్. వెంకట్ రెడ్డి,కే.శివరాని,ఫిజికల్ డైరెక్టర్ కే.మల్లేశ్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

నవంబర్ 1 నుండి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభలను జరపండి: CPI (M-L) న్యూడెమోక్రసీ

నల్లగొండ: భూమి, భుక్తి, విముక్తి కొరకు ప్రాణాలర్పించిన సిపిఐ (ఎం-ఎల్) అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పించాలని, నవంబర్ 1 నుంచి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించాలని.. సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నల్లగొండ జిల్లా కమిటీ.. విప్లవ శ్రేణులకు, సానుభూతి పరులకు, ప్రజలకు పిలునిస్తుందని CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అన్నారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

AP: మధ్యంతర బెయిల్ తో విడుదల కానున్న చంద్రబాబు

AP: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్య కారణాలను చూపుతూ ఆయన దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ కు కోర్టు ఆమోదం తెలిపింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్ట్ అయిన చంద్రబాబు.. సెప్టెంబర్ 10 నుండి 52 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్లను పలుమార్లు కొట్టేసిన కోర్టు.. ఆయన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం.

విచారణను హైకోర్టు 4 వారాల పాటు వాయిదా వేసింది. మెడికల్ గ్రౌండ్స్ పై చంద్రబాబుకు వచ్చే నెల 24 వరకు బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయవాదులు చెబుతున్నారు. బెయిల్ కు సంబంధించి కోర్టు ఎలాంటి షరతులు విధించిందనే వివరాలు తెలియాల్సి ఉంది. బెయిల్ కు సంబంధించిన తీర్పు కాపీ వచ్చాకే పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించారు. కాగా, ప్రధాన బెయిల్ పిటిషన్ వచ్చే నెల 10న విచారణకు రానుంది. అయితే ఈరోజు సాయంత్రం వరకు ఆయన బెయిల్ పై విడుదల కానున్నట్లు సమాచారం.

Breaking news: చంద్రబాబు కు మధ్యంతర బెయిల్ మంజూరు

AP: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.

గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకోనున్న నల్లగొండ ఉమెన్స్ కాలేజ్ అధ్యాపకులు

TS: హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 83వ కాన్వకేషన్ సందర్భంగా, యూనివర్సిటీ ఛాన్స్లర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరియు ఎడబో(Adobe ) సిఈఓ శాంతన్నారాయణ , యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రవీందర్ చేతుల మీదుగా.. నేడు నల్లగొండలోని ప్రభుత్వ మహిళ కళాశాల అధ్యాపకులు డాక్టరేట్ అధ్యాపకులు  తీసుకోనున్నారు.

గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకోనున్న అధ్యాపకులు:

డాక్టర్ ఎస్.రాజారాం-లైబ్రరీ సైన్స్

డాక్టర్ బి.జ్యోతి-కెమిస్ట్రీ

డాక్టర్ ఆర్.నరేష్-జువాలజీ

డాక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు-ఫిజిక్స్

డాక్టర్ ఎం.రవి-కెమిస్ట్రీ

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు సహచర అధ్యాపకులు, విద్యార్థులు వారికి అభినందనలు తెలుపుతున్నారు.

TS: 43 మంది అభ్యర్థులతో బీఎస్పీ రెండో జాబితా విడుదల

HYD: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. బహుజన సమాజ్ పార్టీ సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రెండో జాబితా విడుదల చేసింది. ఈ నెల 3న 20 మందితో తొలి జాబితా విడుదల చేసిన బిఎస్పీ,, సోమవారం 43 మందితో రెండో జాబితా ప్రకటించింది.

ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే పార్టీలకు ఓట్లు వేయవద్దన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచే, ప్రలోభాలకు గురిచేసే పార్టీలకు ఓట్లను అమ్ముకోవద్దన్నారు. జనాభాలో 99 శాతం పేదలకు అధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమన్నారు.

43 అభ్యర్థులతో బీఎస్పీ రెండో జాబితాలో విడుదల చేశారు. ఇప్పటి వరకు ప్రకటించిన మొత్తం 63 అసెంబ్లీ స్థానాలకు తొలి, రెండో విడత జాబితా కలిపి బీసీ-26, ఎస్సీ -21, ఎస్టీ-11, ఓసీ-03, మైనార్టీలు-02 లకు సీట్లు కేటాయించారు.

బహుజన్ సమాజ్ పార్టీ రెండో విడత అభ్యర్థుల జాబితా:

1.బెల్లంపల్లి(ఎస్సీ) –జాడీ నర్సయ్య

2.మంచార్యాల–తోట శ్రీనివాస్

3.ఆసిఫాబాద్ (ఎస్టీ) –కనక ప్రభాకర్

4.బోథ్(ఎస్టీ)–మెస్రాం జంగుబాపు

5.కామారెడ్డి –ఉడతావర్ సురేష్ గౌడ్

6.కోరుట్ల– నిశాంత్ కార్తీకేయ గౌడ్

7.జగిత్యాల–బల్కం మల్లేష్ యాదవ్

8.రామగుండం–అంబటి నరేష్ యాదవ్

9.సిరిసిల్ల–పిట్టల భూమేష్ ముదిరాజ్

10.హుజూరాబాద్ –పల్లె ప్రశాంత్ గౌడ్

11.దుబ్బాక–సల్కం మల్లేష్ యాదవ్

12.ఉప్పల్– సుంకర నరేష్

13.రాజెందర్ నగర్–ప్రొ. అన్వర్ ఖాన్

14.చేవేళ్ల(ఎస్సీ)–తొండుపల్లి రాజా అలియాస్ రాజమహేంద్రవర్మ

15.పరిగి–యంకెపల్లి ఆనంద్

16.మలక్ పేట్–అల్లగోల రమేష్

17.నాంపల్లి–మౌలానా షఫీ మసూదీ

18.చంద్రాయణగుట్ట- మూల రామ్ చరణ్ దాస్

19.కొడంగల్–కురువ నర్మద కిష్టప్ప

20.మహుబూబ్ నగర్–బోయ స్వప్న శ్రీనివాసులు

21.దేవరకద్ర–బసిరెడ్డి సంతోష్ రెడ్డి

22.మక్తల్–వర్కటన్ జగన్నాధ్ రెడ్డి

23.అచ్చంపేట్(ఎస్సీ) – మెత్కూరి నాగార్జున

24.కల్వకుర్తి–కొమ్ము శ్రీనివాస్ యాదవ్

25.షాద్నగర్–పసుపుల ప్రశాంత్ ముదిరాజ్

26.కొల్లాపూర్–గగనం శేఖరయ్య

27.హుజూర్ నగర్– రాపోలు నవీన్

28.మునుగోడు–అందోజు శంకరాచారి

29.ఘన్పూర్ –స్టేషన్ (ఎస్సీ)– తాళ్లపల్లి వెంకటస్వామి

30.పాలకుర్తి – సింగారం రవీంద్రగుప్త

31.డోర్నకల్(ఎస్టీ) –గుగూలోత్ పార్వతీనాయక్

32.నర్సంపేట్– డా.గుండాల మధన్ కుమార్

33.వరంగల్ ఈస్ట్–చిత్రపు పుష్పిత లయ

34.వర్థన్పేట్(ఎస్సీ)–డా.వడ్డేపల్లి విజయ్ కుమార్

35.ములుగు(ఎస్టీ)–భూక్యా జంపన్న నాయక్

36.పినపాక(ఎస్టీ)–వజ్జ శ్యామ్

37.మధిర(ఎస్సీ)–చెరుకుపల్లి శారద

38.ఆశ్వారావుపేట్(ఎస్టీ)–మడకం ప్రసాద్

39.భద్రాచలం(ఎస్టీ)–ఇర్పా రవి

40.ఇబ్రాహీం పట్నం - గొరిగే మల్లేష్ యాదవ్

41.మహబూబాబాద్ - గుగులోత్ శేఖర్ నాయక్

42.శేరిలింగంపల్లి - ఒంగూరి శ్రీనివాస్ యాదవ్

43.వేములవాడ - గోలి మోహన్

కరీంనగర్ జిల్లాకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నియామకం

TS: కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా 2015 బ్యాచ్ కు చెందిన పమేలా సత్పతి ని నియమిస్తూ,, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు

ప్రస్తుతం పమేలా సత్పతి,, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా పనిచేశారు.

కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గా అభిషేక్ మహంతి ని నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

2011 బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారి మహంతి.. ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేసి గత కొన్ని నెలల క్రితం తెలంగాణకు నియమించబడ్డారు. కడప జిల్లా ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం ఆయన రాచకొండ ట్రాఫిక్ డిసిపి గా విధులు నిర్వహిస్తున్నారు.

TS: ఆ 13 నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఈ మేరకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.

సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకే పోలింగ్ జరగనుంది. మిగతా 106 స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

ప్రజా వ్యతిరేక బీజేపీ, బిఆర్ఎస్ లను ఓడించండి: ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి

నల్లగొండ: జాగో (మేలుకో) తెలంగాణ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (TELANGANA STATE DEMOCRATIC FORUM (TSDF) సంయుక్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేయడం కొరకు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో "ఓటర్ల చైతన్య యాత్ర" బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఉదయం ఎన్జీ కళాశాల, అంబేద్కర్ విగ్రహం (డిఇఓ ఆఫీస్), పెద్ద గడియారం సెంటర్, జిల్లా గ్రంధాలయం లో నిరుద్యోగులతో సభలు నిర్వహించారు.

ఈ బస్సు యాత్ర కార్యక్రమంలో ఆకునూరి మురళి మాజీ కలెక్టర్, జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ పాల్గొని మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో అవినీతి, నియంతృత్వం తో, దోపిడీ చేస్తున్న బీజేపీ, బి.ఆర్.ఎస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. మద్యానికి, నోటుకు, కులానికి, మతానికి లోబడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. 

తెలంగాణ ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన తెలంగాణ సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు. 

సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జె.వి చలపతిరావు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీజేపీ, బి.ఆర్.ఎస్ పార్టీలు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో అభ్యర్థులను నిలదీయాలని అన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడని, రైతు రుణమాఫీ, దళిత బంద్, కౌలు రైతులకు హార్దిక సహాయం, పంటల బీమా, ముస్లిం మైనారిటీలకు 12% రిజర్వేషన్ లు,15 లక్షల నల్లధనం, అంశాలపై పాలకులను నిలదీయాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 36 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని లక్ష ఎకరాలకైనా అందించారా అని ప్రశ్నించారు. బడా కార్పోరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని తెలిపారు. 

దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరుగుతుంది తప్ప పరిష్కారం చూపలేదని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక సలహాదారు ప్రొ. వినాయక్ రెడ్డి Rtd (తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక రాష్ట్ర కన్వీనర్), టి.జె.ఎస్ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి, ఎం. హన్మేశ్ (TSDF కో కన్వీనర్) , నైనాల గోవర్ధన్ (తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యక వేదిక సమన్వయకర్త), ప్రదీప్ PYL రాష్ట్ర నాయకులు, రాజ్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ OU విద్యార్థి సంఘం నాయకులు, ఇందూరు సాగర్ (ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు), PDSU జిల్లా కార్యదర్శి పోలె పవన్, బొంగరాల నర్సింహా, AIKMS జిల్లా నాయకులు బీరెడ్డి సత్తిరెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రావుల సైదులు, కళాకారులు బాల నరసయ్య, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.