తిరుపతిలో సర్వసాధారణంగా భక్తుల రద్దీ

తిరుమల లో నేడు భక్తుల రద్దీ సర్వ సాదారణంగా ఉంది. మంగళవారం శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్వనానికి 3 గంటల సమయం పడుతోందని తెలిపారు.

కాగా, సోమవారం 69,654 శ్రీవారిని మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 23,978 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.34కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు....

Indrakeeladri: నేడు రెండు రూపాల్లో దుర్గమ్మ దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై సోమవారంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.

ఆదివారం దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చిన భక్తులు దర్శించుకున్నారు..

ఉత్సవాల చివరి రోజైన సోమవారం దుర్గమ్మ రెండు రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఉదయం మహిషాసురమర్దనిగా.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు.

చివరి రోజు కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

దసరా ఉత్సవాలు ముగుస్తుండడంతో ఇంద్రకీలాద్రికి భవానీ భక్తుల రాక పెరిగింది. దసరా ముగిసిన తర్వాత కూడా రెండు రోజుల పాటు భవానీలు తరలిరానున్నారు..

ఆటనై వస్తా పాటని వస్తా పల్లె పల్లెకు ప్రజా గద్దరై వస్తా పాట ఆవిష్కరణ

ఓయూ తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ చింతకింది కాశీం.

హైదరాబాద్, ఓయూ :

తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు వేముల గోపీనాథ్, ప్రజాయుద్ధ నౌక గద్దర్ పై రాసిన ఆటనై వస్తా.. పాటనై వస్తా... పాటను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు తెలుగు శాఖ విభాగం అధ్యక్షులు ప్రొఫెసర్ చింతకింది కాశీం

ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రొ. కాశీం మాట్లాడుతూ

పల్లె పల్లెకు ప్రజా యుద్ధమై గద్దర్ వచ్చాడని ,తెలుగు సాహిత్యాన్ని దిగంతాలకు వ్యాపింపజేసి పాటను హిమాలయ శిఖరమంత ఎత్తుకు ఎలుగెత్తి పాడాడని, తెలుగు సాహిత్యాన్ని, కవిత్వాన్ని ఈ 50 ఏళ్లలో గద్దర్ శాసించాడాన్నారు.

గద్దరన్న ఆగస్టు 6 2023న అమరుడయ్యాడు. గద్దరన్న భౌతికంగా మనకు దూరమయ్యారు కానీ గద్దరన్న పాట, "మరణించిన ఒక తార రాలిపోయి రాజు మరణించిన ఒక తార గగనం ఎక్కి రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించే ప్రజల నాలుకల యందు" అని గుర్రం జాషువా రాసినట్లు గద్దరన్న ప్రజల నాలుకల్లో జీవిస్తూ ఉన్నాడు .

ఆయన అమరుడు. ఆయనకు మరణము లేదు. ఆయన ఆటకు, పాటకు మరణం లేదు. అందుకే గద్దరన్న అమరుడైన తర్వాత ఇప్పటికీ తెలుగు సాహిత్యంలో ప్రముఖ విమర్శకులు రచయితలు రాసిన ప్రత్యేక సంచికలు వందలాది పేజీలతో ఒక అరడజన్ ప్రత్యేక సంచికలు వచ్చాయి.

అదేవిధంగా గద్దరన్న తెలుగు నేలమీద ఒక వారసత్వాన్ని కొనసాగించాడు. ఒక ఆచరణని స్థిరపరిచారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుద్దాల హన్మంతు, బండి యాదగిరి నెలకొల్పిన వారసత్వాన్ని 1970లో గద్దరన్న కొనసాగించాడు. ఆ ఆచరణ స్థిరపరచడం వలన ఇప్పుడు గోసి కట్టుకొని గొంగడేసుకుని చేతిలో ఎర్రజెండా పట్టుకొని విప్లవ గానం చేసే ఒక పద్ధతిని తెలుగు నేల మీద గద్దర్ వేదికై వస్తున్నాడు.

అంటే ఒక కళాఖండం వస్తున్నది. ప్రజలందరూ ప్రేక్షకులందరూ అనుకునేటట్లు ఒక పద్ధతిని రూపొందించారు. అల్లసాని పెద్దనని ఒక 50 నుండి 100 మంది అనుసరించారు. గద్దరన్నను వేలాదిమంది అనుసరించారు, అనుసరిస్తూ ఉన్నారు. అందుకే గద్దరన్న మరణం కావటాన్ని జీర్ణించుకోలేని కళాకారులు ఆయన లాగా పాడాలని, ఆడాలని భావించిన కళాకారులు ఈ తెలుగు నేలమీద వేలాది ఘంటాలుగా వికసిస్తున్నారు.

కనుక ఆయన మీద ఇప్పటి వరకు కొన్ని వందల పాటలు వచ్చాయి. ఇవాళ తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో తెలంగాణ విద్యార్థి వేదికలో కార్యకర్తగా, నాయకత్వం స్థాయిలో పనిచేసి విశ్వవిద్యాలయ స్థాయిలో చదువుకున్నటువంటి గోపీనాథ్ గద్దర్ మీద పాట రాయడం , ఒక విద్యార్థి నాయకుడు మాత్రమే కాదని కళాకారుడు. నల్లగొండ జిల్లాలో మాదిగ కుటుంబంలో పుట్టి పెరిగిన కళాకారుడు ఏ కళ అయితే వారికి అందించిందో ఆ కళారూపాన్ని అందుకొని గోపినాథ్ తన సోదరుడు అందీప్ ఇద్దరు కలిసి పాడిన పాట ఇది.

ఆటనై వస్తా పాటనై వస్తా పాట ఎంత ముఖ్యమో పాటకి సంగీతం అంతే ముఖ్యం కనుక అరుణోదయ కళాకారుడిగా అరుణోదయ కార్యకర్తగా నాయకుడిగా ఉన్నా వెంకట్ ఒక అద్భుతమైన మంచి శ్రావ్యమైన సంగీతాన్ని అందించాడు. దీనికంటే ఈ పాట ప్రముఖంగా గద్దరన్న ఆలోచన విధానాన్ని ప్రజల మార్పు కోసం విప్లవం కోసం ఏదైతే గద్దరన్న కోరుకున్నాడో ఈ పాటలో ఉన్నది.

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యులు కోట శ్రీనివాస్, ఎం,ఎస్ ఎఫ్ జాతీయ అధ్యక్షులు సోమశేఖర్ , టిపిసిసి మేనిఫెస్టో కమిటీ సభ్యులు డాక్టర్ లింగం యాదవ్, న్యాయవాదులు లక్ష్మీ దేవి, ఆంజనేయులు, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు పోటు నారాయణ, శ్రీమాన్ , పగిళ్ల సందీప్, రాజేంద్రప్రసాద్, పేరాల గోపి,చందు ,భాస్కర్, గ్యారా శ్రీనివాస్, సంపతి సోమయ్య, శ్రీనివాస్, వెంకటేష్,వినోద్, మహేష్ ,సూర్యుడు,పీటర్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.

Vijayawada: ఇంద్రకీలాద్రిలో బాలత్రిపురసుందరీ దేవిగా దుర్గమ్మ దర్శనం..

విజయవాడ:దుర్గగుడిలో అంబరాన్నంటే దసరా సంబరాలు (Dussehra celebrations) ఆరంభమయ్యాయి. బెజవాడ దుర్గమ్మ ఈ రోజు బాలత్రిపురసుందరీదేవి (Balatripurasundari Devi) అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు..

ఇంద్రకీలాద్రిపై (Indrakiladri) ఈ నెల 23 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి..

దుర్గమ్మ ఈ ఏడాది తొమ్మిది రోజుల్లోనే పది అవతారాల్లో దర్శనమివ్వనుంది.

మొదటి రోజు ఆదివారం శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా,

రెండో రోజు సోమవారం గాయత్రీదేవి,

మూడో రోజు అన్నపూర్ణాదేవి,

నాలుగో రోజు మహాలక్ష్మీదేవి,

ఐదో రోజు శ్రీమహాచండీదేవి,

ఆరో రోజు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు.

ఏడో రోజు లలితా త్రిపుర సుందరీదేవి,

ఎనిమిదో రోజు దుర్గాదేవి,

తొమ్మిదో రోజు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మహిషాసుర మర్దినిదేవి,

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 వరకు రాజరాజేశ్వరీదేవి రూపంలో

దుర్గమ్మ భక్తులకు అభయం ఇవ్వనున్నారు..

తెలంగాణ కాంగ్రెస్ తొలి గెలుపు గుర్రాల జాబితా

చర్చోపచర్చలు, కులసంఘాలతో భేటీలు. ఆశావహులతో సమావేశాల అనంతరం ఎట్టకేలకు కాంగ్రెస్‌ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 55 మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది.

కులసమీకరణాలు, గెలుపు అవకాశాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన కాంగ్రెస్‌ తొలిజాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు హర్షం ప్రకటిస్తున్నారు. తొలిజాబితాలో చోటు దక్కని వారు రెండో జాబితా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు సీపీఐతో పొత్తులపై క్లారిటీ ఇచ్చింది. చెన్నూరు, కొత్తగూడెం అసెంబ్లీ సీట్లు కేటాయిస్తూ ఇప్పటికే సమాచారం ఇచ్చింది.

ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..

బెల్లంపల్లి – గడ్డం వినోద్

మంచిర్యాల – ప్రేమ్ సాగర్

నిర్మల్ – శ్రీహరి రావు

ఆర్మూర్ – వినయ్ కుమార్ రెడ్డి

బోధన్ – సుదర్శన్ రెడ్డి

బాల్కొండ – సునీల్ కుమార్ ముత్యాల

జగిత్యాల – జీవన్‌రెడ్డి

ధర్మపురి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రామగుండం – రాజ్ ఠాకూర్

మంథని – శ్రీధర్ బాబు

పెద్దపల్లి – విజయ రమణారావు

వేములవాడ – ఆది శ్రీనివాస్

మానకొండూరు – కవ్వంపల్లి సత్యనారాయణ

మెదక్ – మైనంపల్లి రోహిత్

ఆందోల్ – దామోదర రాజనర్సింహ్మ

జహీరాబాద్ – ఏ చంద్రశేఖర్

సంగారెడ్డి – జగ్గారెడ్డి

మేడ్చల్ – తోటకూర వజ్రీస్ యాదవ్

మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంతరావు

గజ్వేల్ – నర్సారెడ్డి

కుత్బుల్లాపూర్ – హన్మంత్ రెడ్డి

ఉప్పల్ – పరమేశ్వర్ రెడ్డి

చేవేళ్ల – భీమ్ భరత్

పరిగి – రాంమోహన్ రెడ్డి

వికారాబాద్ – గడ్డప్రసాద్

ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్

మలక్ పేట – షేక్ అక్బర్

సనత్ నగర్ – నీలిమా

నాంపల్లి – ఫిరోజ్ ఖాన్

కార్వాన్ – మహ్మమద్ అల్ హజ్రీ

గోషామహల్ – మోగిలి సునీత

చంద్రాయణగుట్ట – బోయ నగేశ్

యాకత్ పుర – రవి రాజు

బహదూర్ పూర్ – రాజేశ్ కుమార్

సికింద్రాబాద్ – సంతోష్ కుమార్

కొడంగల్ – రేవంత్ రెడ్డి

గద్వాల్ – సురితా తిరుపతయ్య

అలంపూర్ – సంపత్ కుమార్

నాగర్ కర్నూల్ – కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి

అచ్చంపేట – వంశీకృష్ణ

కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి

షాద్ నగర్ – శంకరయ్య

కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు

నాగార్జున సాగర్ – జయవీర్ రెడ్డి

హుజుర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ – ఉత్తమ్ పద్మావతి రెడ్డి

నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నకిరేకల్ – వేముల వీరేశం

ఆలేరు – బీర్ల ఐలయ్య

ఘన్ పూర్ – సింగాపురం ఇందిరా

నర్సంపేట – దొంతి మాధవరెడ్డి

భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ

ములుగు – సీతక్క

మధిర – భట్టి విక్రమార్క

భద్రాచలం – పొదెం వీరయ్య

చెన్నూరు(సీపీఐ)

కెసిఆర్ సభకు ముస్తాబైన హుస్నాబాద్

ఎన్నికల శంఖారావం పూరించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. తనకు అచ్చొచ్చిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నుంచే సీఎం కేసీఆర్‌ వచ్చే శాసనసభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

హుస్నాబాద్‌ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉన్నది. ఇది రాష్ట్రంలో ఈశాన్య ప్రాం తంలో ఉంటుంది. ఇది కలిసి వచ్చే అంశం కావడంతో బీఆర్‌ఎస్‌ తొలి బహిరంగ సభ ఇక్కడే నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు.

2014, 2018 శాసనసభ ఎన్నికలకు సైతం ఇక్కడి నుంచే ‘ప్రజా ఆశీర్వాద సభల’తో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టా రు. ప్రతి ఎన్నికల ముందు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది.

వీటన్నింటి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్‌కు హుస్నాబాద్‌తో విడదీయరాని అనుబం ధం ఉన్నది. ఈ నియోజకవర్గంలోని సబ్బండ వర్ణాలు ఉద్యమంలో కలిసి వచ్చాయి.

ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని గత ఎన్నికల్లో భారీ మెజా ర్టీ ఇచ్చాయి. అందుకే ఎన్నికల శంఖారావాన్ని మళ్లీ ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాలని ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించబోతున్నారు...

నేడు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో నేడు ఆదివారం మొదటి విడత అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.

అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే స్క్రీనింగ్ మూడు సార్లు భేటీ అయ్యి అభ్యర్థుల పేర్లను ఓ కొలిక్కి తీసుకురాగా, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఏఐసిసి ఆమోదం తర్వాత నేడు అభ్యర్థులకు సంబంధించి ప్రకటన చేయనుంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సైతం శనివారం కీలక ప్రకటన చేశారు.

ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.58 మంది పేర్లతో మొదటి జాబితాను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.

మిగిలిన స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. వామపక్షాలతో పొత్తులు చివరి దశకు చేరుకున్నాయని పొత్తులపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ రోజు అభ్యర్థుల జాబితా విడుదల కానుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి, అధిష్టానం ఎవరికి షాక్ ఇవ్వనుందన్న దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాబితా విడుదల కానుండటంతో కాంగ్రెస్ టికెట్ ఆశావహుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.

అయితే ఈ మొదటి విడత జాబితాలో గతంలో పోటీ చేసిన వారి పేర్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి రెండో జాబితాలో ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి..

తెలంగాణ లో ఎన్నికల సమరానికి సన్నద్ధమైన బిఆర్ఎస్

ఎన్నికల సమరానికి పూర్తిగా సన్నద్ధమైన బీఆర్‌ఎస్‌ విశ్వరూప ప్రదర్శనకు సిద్ధమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్‌.. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్‌లో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ఏం చేయబోతున్నదన్న పూర్తి ప్రణాళికను వివరించనున్నారు. హామీలను చెప్పడమే కాకుండా, వాటి అమలుకు తమ వద్ద ఉన్న వనరులు, అమలు విధానాలను కూడా కేసీఆర్‌ ప్రజలకు వెల్లడించనున్నారు.

ప్రజల అవసరాలు తీర్చేలా, రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడేలా మ్యానిఫెస్టో తీర్చిదిద్దిన్నట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. మ్యానిఫెస్టో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టిస్తుందని, సకల జన సంక్షేమంగా ఉంటుందని అంటున్నాయి.

ఎన్నికల సందర్భంగా నేతలంతా మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులోని అంశాలపై విస్తృతంగా చర్చ పెట్టనున్నారు.

అభ్యర్థులకు బీ-ఫారాలు

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులందరికీ సీఎం కేసీఆర్‌ ఆదివారమే బీ-ఫారాలు అందజేయనున్నారు. ఇప్పటికే అభ్యర్థులను తెలంగాణ భవన్‌కు రావాలని పిలిచారు. మొత్తం 119 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులకు ఒకేసారి బీ-ఫారాలు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా వారికి ఎన్నికల వ్యూహాన్ని వివరిస్తారు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య మ్యానిఫెస్టో విడుదల, బీ-ఫారాల అందజేత కార్యక్రమం ఉండనున్నది. అనంతరం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌బాబు అధ్యక్షతన జరిగే పార్టీ ఎన్నికల సభకు సీఎం కేసీఆర్‌ బయల్దేరి వెళ్తారు.

ఈ సభతో మొదలయ్యే కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభలు ప్రతి రోజు 2-3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగనున్నాయి.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా మహోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఈ నెల 23వ తేదీ వరకు దసరా‌ మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.

తొలిరోజు ఆదివారం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి స్నపనాభిషేకం, అలంకరణ

ప్రత్యేక పూజల అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు.

అక్టోబర్ 16న శ్రీ గాయత్రీ దేవి

అక్టోబర్ 17న అన్నపూర్ణాదేవి

అక్టోబర్ 18న శ్రీ మహాలక్ష్మి దేవి

అక్టోబర్ 19న శ్రీ మహాచండీ దేవి

అక్టోబరు 20న మూలానక్షత్రం రోజున సరస్వతీ దేవి

అక్టోబర్ 21న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి

అక్టోబరు 22న శ్రీ దుర్గాదేవి

అక్టోబరు 23 విజయదశమి రోజున రెండు అలంకారాలలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఉదయం శ్రీ మహిషాసురమర్ధనీ దేవిగా, మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం జరగనుంది.

దసరా ఉత్సవాలకు 8 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో వినాయకుని గుడి నుంచి దుర్గమ్మ సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 5 వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా క్యూలైన్లను మానిటరింగ్ చేస్తారు.

వృద్ధులకు, వికలాంగుల కోసం బ్యాటరీ కార్లు అందుబాటులో ఉంచారు. అలాగే ఘాట్లలో పుణ్య స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

బీసీలను రాజకీయంగా అనగా తొక్కుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ

•బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అయితదోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే అగ్రవర్ణాల పార్టీగా వ్యవహరిస్తుంది.

దీనికి నిదర్శనమే బీసీలకు సీట్లు కేటాయించకపోవడం దాంట్లో భాగమే కాంగ్రెస్ పార్టీ బీసీలను రాజకీయంగా అనగా తొక్కుతున్నది అనడానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ లో ప్రతి పార్లమెంట్ పరిధిలో బీసీలకు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని తీర్మానం చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ నిబంధనని వర్తించమని చెప్పి వ్యవహారం కనబడుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అగ్రవర్ణ నాయకులు

కేవలం డబ్బు సంచులతో వచ్చిన అగ్రవర్ణ నాయకులకే టికెట్లు కేటాయించడం చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికైనా చెరువు తీసుకొని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అవకతవకల పైన విచారణ జరిపించి బీసీలకు జనాభా తమాషా ప్రకారం ప్రతి పార్లమెంట్లో పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.

ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం అనేక విధాలుగా ఇబ్బందులు పడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటే ఈరోజు కేవలం ఓకే సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లు కేటాయించడం దేనికి నిదర్శనం అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షున్ని అడుగుతున్నాం ఇప్పటికైనా మీ ప్రవర్తనని మార్చుకోకపోతే రేపు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.

బీసీలకు ఏ రాజకీయ పార్టీ ఎక్కువ సీట్లు కేటాయిస్తే ఆ పార్టీకే మేము ఓట్లు వేసి గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.

ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి పార్లమెంట్లో రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించకపోతే తీవ్రమైన పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగు నరేష్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నుబోయిన రాజు యాదవ్ విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు కొంపల్లి రామన్న గౌడ్ స్వామి యాదగిరి నాగరాజు మహేందర్ శివ హరికృష్ణ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.