హమాస్ దాడులు ఉగ్ర చర్యే: పాలస్తీనా స్వతంత్రపై భారత్ కీలక ప్రకటన

హమాస్ దాడులు ఉగ్ర చర్యే: పాలస్తీనా స్వతంత్రపై భారత్ కీలక ప్రకటన


న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తల నేపథ్యంలో భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. పాలస్తీనా(Palestine) స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందడాన్ని భారత్ సమర్థిస్తుందని తెలిపింది. అయితే, ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఉగ్రచర్యగా భావిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి భారత్ విధానాన్ని తెలియజేశారు.


'ఇజ్రాయెల్-పాలస్తీనా విషయంలో భారత్ వైఖరి చాలా కాలంగా స్థిరంగా ఉంది. ఇజ్రాయెల్‌తో శాంతియుత చర్చలు జరిపి.. గుర్తింపు పొందిన సరిహద్దుల్లో నివసిస్తూ.. సార్వభౌమాధికారం, పూర్తి స్వతంత్రతో వ్యవహరించే పాలస్తీనా ఏర్పాటును భారత్ ఎప్పుడూ సమర్థిస్తుంది. ఇందుకోసం పాలస్తీనా, ఇజ్రాయెల్‌లు నేరుగా సంప్రదింపులు జరపాలని భారత్ ఆశిస్తోంది' అని బాగ్చి పేర్కొన్నారు.


భారతదేశం-ఇజ్రాయెల్ సంబంధం గత దశాబ్దంలో లేదా బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం చట్రంలో వికసించింది. ప్రధాని మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక, భారతదేశం అత్యంత విశ్వసనీయమైన రక్షణ, భద్రతా భాగస్వాములలో ఇజ్రాయెల్ ఒకటి.ఇజ్రాయెల్ (Israel), గాజా (Gaza)లో ఇరువర్గాలు అంతర్జాతీయ మానవతా చట్టాలను పాటించాలన్నారు. ఇదే సమయంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌కు భారత్.. ఆయుధపరంగా సాయం అందిస్తోందా? అని మీడియా ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. కాగా, ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్‌ను ప్రకటించింది.



కాగా, ఇజ్రాయెల్‌పై గత కొద్ది రోజుల క్రితం ఒక్కసారిగా దాడి చేసి అనేక మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ ఉగ్రవాదులు బలి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్ ఇప్పుడు హమాస్ ఉగ్రవాదుల వేట కొనసాగిస్తోంది. హమాస్ పై భీకర దాడులకు దిగుతోంది. హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడులతో ఇరువైపులా వేలాది మంది మరణించారు. అనేక మంది గాయాలపాలయ్యారు.

ఇజ్రాయిల్ మీద హమాస్ దాడి కి సంవత్సరం క్రితమే పథక రచన జరిగింది!

ఇజ్రాయిల్ మీద హమాస్ దాడి కి సంవత్సరం క్రితమే పథక రచన జరిగింది!

సూత్రధారులు రష్యా, ఇరాన్, టర్కీ!

రష్యా, ఇరాన్,టర్కీ దేశాలలో హమాస్ తీవ్రవాదులకు కమెండో ఆపరేషన్ లో శిక్షణ ఇచ్చాయి మూడు దేశాలు!

మొత్తం 1000 మంది హమాస్ ఉగ్రవాదులు కమాండో ట్రైనింగ్ తీసుకున్నారు!

కమాండో ట్రైనింగ్ కోసం 20 నుండి 25 ఏళ్ల యువకులని ఎంపిక చేశారు!

రష్యా : SPETSNAZ ఇది రష్యన్ స్పెషల్ ఫోర్స్ పేరు.

కౌంటర్ ఇన్సర్జన్సీ, పవర్ ప్రొజెక్షన్ మిషన్స్ ని నిర్వహిస్తుంది! రష్యన్ లైట్ ఇంఫాన్ట్రీ ఫోర్సెస్( Light Infantry Forces) డివిజన్ లో భాగంగా ఉంటుంది ఈ Spetsnaz. యుద్ధం జరుగుతున్నప్పుడు లైట్ ఇన్ ఫాన్ట్రీ ముందు వెళుతుంటే దాని వెనుకగా Spetsnaz కమండోలు ఉంటారు. ఒక వేళ శత్రు సైన్యపు బంకర్లు నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నపుడు Spetsnaz కమాండో లకి మిషన్ అప్పచెప్తారు. Spetsnaz కమాండోలు ముందుకి వెళ్లి ఒక్కసారిగా బంకర్లు మీద దాడి చేసి అందులో ఉన్న వాళ్ళని చంపేస్తారు! 

మెరుపు వేగంగా కదులుతూ శత్రువు బంకర్ల మీద దాడి చేస్తారు. వీళ్ళు ఫెన్సింగ్ కట్టర్ల తో పాటు హాండ్ గ్రనేడ్స్, రివాల్వర్,మిలటరీ గ్రేడ్ డాగర్ ని వాడతారు. పని పూర్తవగానే తిరిగి వెనక్కి వచ్చేస్తారు. ముఖ్యంగా పక్క బంకర్ల లో ఉండేవాళ్ళకి తెలియకుండా పని కానిచ్చేస్తారు.

Spetsnaz చేత 200 మంది హమాస్ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చింది రష్యా!

సంవత్సరం నుండి మూడు బాచ్ లుగా విడదీసి ట్రైనింగ్ ఇచ్చింది రష్యా! అయితే ఇరాన్ లో ఇదంతా జరిగింది!

Spetsnaz దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్లే దక్షిణ ఇజ్రాయెల్ లో ఉన్న IDF చెక్ పోస్ట్ ల మీద దాడి చేసి సరిహద్దు పట్టణాలలోకి ప్రవేశించారు.

ఇరాన్: సముద్రంపై,సముద్రం నీటి అడుగున ఎలా వేగంగా, నిశ్శబ్దంగా ప్రయాణించాలో శిక్షణ ఇచ్చింది.

చిన్న చిన్న స్పీడ్ బొట్లతో శత్రువు మీద దాడి చేసే సామర్ధ్యం ఇరాన్ కి ఉంది.

గత దశాబ్ద కాలంగా అమెరికా విమాన వాహక నౌకలని చిన్న స్పీడ్ బొట్లలో RDX ని నింపి ఎలా ధ్వంసం చేయవచ్చో అనే ప్రయోగాల కోసం నమూనా విమాన వాహక నౌకల మీద దాడి చేసి వాటి ఫలితాలని విశ్లేషిస్తూ వస్తున్నది.

అలాగే స్కూబా డైవింగ్ సూట్లని ధరించి సముద్రం లోపల 3 నాటికల్ మైళ్ళు ఎలా ఈదాలో హమాస్ కి శిక్షణ ఇచ్చింది!

100 మంది హమాస్ ఉగ్రవాదులకి AK47 లని మోసుకుంటూ ఈద గలిగేలా శిక్షణ ఇచ్చింది!

చిన్న చిన్న బొట్లలో మధ్యధరా సముద్రంలోకి వచ్చి ఇజ్రాయెల్ తీరానికి 3 నాటికల్ మైళ్ళ దూరంలోనే సముద్రంలో ఈదుకుంటూ తీర ప్రాంతానికి చేరుకొని దాడి చేశారు!

టర్కీ: పారా గ్లైడింగ్ కి టర్కీ ప్రసిద్ధి!

100 మంది హమాస్ ఉగ్రవాదులు టూరిస్ట్ వీసా తో టర్కీ కి వచ్చి పారా గ్లైడింగ్ లో శిక్షణ పొందారు.

అఫ్కోర్స్ ప్రెసిషన్ & కంట్రోల్డ్ గ్లైడింగ్ లో శిక్షణ ఇచ్చింది టర్కీ!

ఈ శిక్షణ తక్కువ దూరంలో గాలిలోకి ఎగిరి కంట్రోల్ గా దిగవలసిన చోట 100 మీటర్లు అటూ ఇటుగా ఎలా గ్లైడ్ చేయాలో శిక్షణ ఇచ్చింది. టర్కీ సైన్యంలో ప్రత్యేక విభాగం ఉంది గ్లైడింగ్ కోసం!

ఇక గ్లైడర్స్ విషయానికి వస్తే కేవలం గాలి ఆధారంగా కాకుండా వెనక ప్రొపెల్లర్ తో ముందుకు నెట్టే గ్లైడర్స్ ని వాడారు హమాస్ తీవ్రవాదులు. అలాగే గాల్లో ఉండగానే కింద ఎవరన్నా IDF సైనికులు ఉంటే కింద ఉన్న టార్గెట్ ని షూట్ చేయడం కూడా ప్రాక్టీస్ చేశారు.

ట్రైనింగ్ పూర్తయ్యాక దాడి కోసం మాక్ డ్రిల్ నిర్వహించారు…అదెలాగా అంటే…

1. సముద్ర మార్గం ద్వారా ఇజ్రాయెల్ లోకి రావాలంటే ముందు ఎక్కడ దాకా బోట్లలో వచ్చి ఈదుకుంటూ వస్తే ఎంత సమయం పడుతుంది? దానికోసం ఎంత ముందుగా సిద్ధం అవ్వాలి? ఇలాంటి లెక్కలు కేవలం మిలటరీ మాత్రమే ఇవ్వగలదు.

2. లేబనాన్ నుండి గ్లైడర్స్ ద్వారా ఇజ్రెయేల్ లోకి ప్రవేశించడానికి ఎంత సమయం పడుతుంది? ఎప్పుడు బయలు దేరితే ఎప్పుడు లాండ్ అవుతారు?

3. ఇక గాజా నుండి సొరంగం ద్వారా బయటికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ భూభాగంలో ఎవరు ఎక్కడ రక్షణగా ఉండాలి ?

4. గాజా నుండి ఇజ్రాయెల్ చెక్ పోస్టుల దగ్గర ఎంతమంది IDF సైనికులు కాపలాగా ఉంటున్నారు? 

5. రాకెట్ దాడి జరిగినప్పుడు IDF తోపాటు పౌరులు ఎలా స్పందిస్తున్నారు? ఈ డేటా ని జాగ్రత్తగా సమకూర్చుకున్నారు!

6. IDF బేస్ ల దగ్గర ఉన్న సైనికులు సైరన్ మోగగానే అందరూ అండర్ గ్రౌండ్ బంకర్ లోకి వెళ్లిపోతున్నారా? లేక బేస్ పైన ఎవరన్నా కాపలాగా ఉంటున్నారా? ఈ డేటా ని కూడా సేకరించారు!

పైన పేర్కొన్న అంశాలని సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడానికి కమాండ్ సెంటర్ ఎక్కడ ఉండాలి?

కమాండ్ & కంట్రోల్ సెంటర్ ని పక్కనే ఉన్న జోర్డాన్ లో ఏర్పాటు చేశారు. జోర్డాన్ నుండి హమాస్ ముఖ్య నాయకులు శాటిలైట్ ఫోన్ ద్వారా సమన్వయం చేశారు.

దాడికి ముందు అంటే ఉదయం 6 గంటలకి ఇజ్రాయెల్ సరిహద్దు కంచె మీద ఏర్పాటు చేసిన నిఘా కెమెరా వ్యవస్థని రష్యా, ఇరాన్ కి చెందిన హ్యాకర్లు నెట్వర్క్ ని తమ ఆధీనంలోకి తీసుకొని ఆ నెట్వర్క్ లో డూప్ వీడియో ని ప్రవేశ పెట్టారు. అంటే ప్రతి కెమెరా నుండి వెళ్లే వీడియో ఒకే రకంగా అంతా బాగున్నట్లే చూపిస్తాయి.

ఇటీవలే హ్యాకింగ్ చేయడానికి వీలు లేని విధంగా సెక్యూరిటీ నెట్వర్క్ ని AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో అప్గ్రేడ్ చేసింది ఇజ్రాయెల్. ఎవరన్నా హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే కమాండ్ సెంటర్ లో సైరన్ మొగుతుంది కానీ అలా జరగలేదు అంటే ఎంత పకడ్బందీగా హ్యాక్ చేశారో రష్యన్, ఇరాన్ హ్యాకర్లు!

ఎప్పుడయితే సరిహద్దు కంచె మీద ఉన్న నిఘా వ్యవస్థని హ్యాక్ చేశారో ఆ విషయం జోర్డాన్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కి తెలపగానే దాడి మొదలు పెట్టమని జోర్డాన్ నుండి ఆదేశాలు వెళ్లాయి మూడు చోట్లకి.

సముద్రం ద్వారా దాడి చేయడానికి నియమించిన వాళ్ళని ముందు రోజు రాత్రి మధ్యధరా సముద్రంలోని అంతర్జాతీయ జలాలలో చేపలు పట్టే ట్రాలర్స్ లో వేచి ఉన్నారు.

మొదట 6.30 కి రాకెట్ దాడి మొదలుపెట్టగానే గాజా నుండి వివిధ ప్రాంతాలలో సిద్ధంగా ఉన్నవాళ్లు 10 నిముషాలలో ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం గ్రూపులుగా విడిపోయి ఫెన్సింగ్ చెక్ పాయింట్ ల మీద దాడిచేశారు. తమతో పాటు ప్రతి చెక్ పాయింట్ కి దగ్గరలో ఒకటికి రెండు బుల్డోజర్లని సిద్ధంగా ఉంచారు.

ఫార్వార్డ్ దళాలు చెక్ పాయింట్ మీద మెరుపు దాడి చేసి అక్కడ ఉన్న IDF కి చెందిన ఇద్దరు సైనికులని చంపి విజిల్ వేయగానే దూరంగా ఉన్న బుల్డోజర్ ని తీసుకొచ్చి కంచెని తొలిగించడం వెంటనే ఉగ్రవాదులు ఇజ్రాయెల్ లోకి చొరపడడం అన్ని చోట్లా ఒకేసారి చేశారు.

ఇజ్రాయెల్ భూభాగంలో ప్రవేశించిన వాళ్లలో కొంతమంది ముందే మార్కింగ్ చేసిన చోటికి వెళ్లి సొరంగ మార్గం ఔట్ పాయింట్ దగ్గర కాపలా కాయడం సొరంగమ్ నుండి పైకి వచ్చిన వాళ్ళకి సేఫ్ పాసేజ్ ఇచ్చారు.

TIME & DISTANCE !

దాడి మొత్తం మిలటరీ వ్యూహంతో చాల యాక్యురేట్ గా, ప్రెసిషన్ గా జరిగింది అంటే అది రష్యా, ఇరాన్,టర్కీ మిలటరీ వ్యూహకర్తలు కలిసి డిజైన్ చేశారు కాబట్టి విజయవంతం అయ్యింది!

ఆపరేషన్ అల్-ఆక్స ఫ్లడ్ అని పేరు పెట్టడం అనేది ఇరాన్ పని! ఇలాంటి పేర్లు కేవలం మిలటరీ మాత్రమే పెడుతుంది!

ఇక దాడి చేస్తున్న హమాస్ కి సలహాలు, సూచనలు జోర్డాన్ నుండి హమాస్ ముఖ్య నాయకులు చేయగా ఇరాన్,టర్కీ కి చెందిన మిలటరీ వ్యూహకర్తలు పక్కనే ఉండి సమీక్షించారు.

దాడి సక్సెస్ అవుతున్న వేళ మధ్యాహ్న సమయానికి ఇరాన్,టర్కీ మిలటరీ అధికారులు ప్రయివేట్ బిజినెస్ జెట్ లో అంకారా వెళ్లిపోయారు!

లేబనాన్ నుండి హాంగ్ గ్లైడేర్స్ ద్వారా ఇజ్రాయిల్ లోకి హమాస్ చొరబడింది అంటే లేబనాన్ కూడా ఇందులో పాల్గొంది!

దాడి చేసే రోజుని సెలెక్ట్ చేయడo లో కూడా వ్యూహం ఉంది!

యెమ్ కిప్పుర్(Yom Kippur) యుద్ధం (1973 అక్టోబర్6 నుండి 25) జరిగి అందులో అరబ్ లీగ్ ని ఓడించి విజయసాధించి 50 ఏళ్ళు అయిన సందర్భంగా,

మరియు ఈజిప్టు నుండి యూదులు ఇజ్రాయెల్ కి తిరిగి వచ్చిన సందర్భంగా, మన సంక్రాంతి లాగా వ్యవసాయ పండుగ సందర్భంగా మొత్తం7 రోజులు సెలవలు ప్రకటించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం.

ప్రజలు,ఉద్యోగులు7 రోజుల సెలవుల మత్తులో ఉన్నారు.

ఇది ప్రతి సంవత్సరం జరిగేదే కానీ ఈసారి సెలవులు ఎక్కువ వచ్చాయి!

టార్గెట్ డేట్ ని సమర్ధ వంతంగా వాడుకున్నారు .

మ్యానిఫెస్టో సకల జన సంక్షేమం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 100 సభల్లో పాల్గొంటారు

మ్యానిఫెస్టో సకల జన సంక్షేమం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 100 సభల్లో పాల్గొంటారు

రైతులు, వ్యవసాయాన్ని బలోపేతం చేసేలా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. మ్యానిఫెస్టోలో రైతులకే పెద్ద పీట వేస్తామని, మహిళల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.

వ్యవసాయానికే అత్యంత ప్రాధాన్యం

మహిళా సాధికారతకు ప్రత్యేక కార్యాచరణ

ఈ నెల 15న ప్రజల ముందుకు మ్యానిఫెస్టో

55 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు కన్నీళ్లే

హామీలను ఆ పార్టీ ఎప్పుడూ నిలబెట్టుకోలే

డబ్బులుంటే హస్తం పార్టీలో టికెట్‌ పక్కా

డబ్బు వెదజల్లి ప్రజల్ని కొనాలని చూస్తున్నది

ఇప్పటికే కర్ణాటక నుంచి కొడంగల్‌కు 8 కోట్లు

40 చోట్ల అభ్యర్థుల్లేని పార్టీ 70 చోట్ల గెలుస్తదా?

ఇది తెలంగాణ గల్లీకి, ఢిల్లీ అహంకారానికి, గుజరాతీ దౌర్జన్యానికి మధ్య జరిగే పోరాటం

ప్రతి ఓటరు ఆడపిల్ల తండ్రిలా ఆలోచించాలి

పొన్నాల పార్టీలోకివస్తానంటే నేనే వెళ్లి ఆహ్వానిస్తా

మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి కేటీఆర్‌

ఇప్పటికే పెన్షన్‌దారుల మనసుల్లో సీఎం కేసీఆర్‌ చెరగని ముద్ర వేశారు. ఇదే సంక్షేమాన్ని కొనసాగిస్తాం. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. మ్యానిఫెస్టోకు తుదిరూపును ఇచ్చేందుకు శని, ఆదివారాల్లో సమావేశాలున్నాయి. ఈ నెల 15న మ్యానిఫెస్టోను ప్రజల ముందు ఉంచుతాం.

– మంత్రి కేటీఆర్‌

రైతులు, వ్యవసాయాన్ని బలోపేతం చేసేలా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. మ్యానిఫెస్టోలో రైతులకే పెద్ద పీట వేస్తామని, మహిళల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో మీడియా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు ప్రస్తావించిన అంశాలపై మాట్లాడుతూ.. బలహీన వర్గాలు, మైనార్టీలపై దృష్టిపెడతామని, ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులు, డయాలసిస్‌ రోగులు, ఒంటరి మహిళలకు లబ్ధి చేకూర్చే పథకాలు ఉంటాయని వివరించారు. ఇతర పార్టీల హామీలపైనా కేటీఆర్‌ స్పందించారు. నెత్తి వాడిది కాదు.. కత్తి వాడిది కాదు అన్నట్టు ఎటుపడితే అటు గోకుతున్నారని, ఎటుపడితే అటు గీకుతున్నారని ఎద్దేవా చేశారు.

సంక్షోభం వచ్చినా సంక్షేమం ఆగలేదు

'మ్యానిఫెస్టో రూపకల్పనలో ఆదాయం, బడ్జెట్‌ వంటి అన్ని రకాల లెక్కలేసుకుంటున్నాం. ఇచ్చిన మాటను, హామీలను నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంతకాలం సంక్షోభం వచ్చినా సంక్షేమం ఆగకుండా జాగ్రత్తపడ్డాం' అని కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదని అన్నారు. 2004, 2009లో ఆ పార్టీ మ్యానిఫెస్టోలు తీసుకొంటే వైఎస్సార్‌ ప్రభుత్వం రెండే రెండు హామీలిచ్చింది. 9 గంటల ఉచిత విద్యుత్తు సహా మరో హామీ. ఈ రెండింటినీ కాంగ్రెస్‌ నిలబెట్టుకోలేదని తెలిపారు. ఇచ్చిన హామీలను విస్మరించటమే కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డు అని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో 95% హామీలను నెరవేర్చామని చెప్పారు.

బీజేపీ సింగిల్‌ డిజిట్‌ దాటకపోవచ్చు

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్‌ డిజిట్‌ దాటకపోవచ్చని మంత్రి కేటీఆర్‌ జోస్యం చెప్పారు. ఆ పార్టీ 110 స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోతుందని అన్నారు.

రాష్ర్టానికి బీఎల్‌ సంతోష్‌, అమిత్‌షా, ప్రధాని మోదీ ఎవరొచ్చినా చెప్పడానికి వారికేం లేదు. ఈ రాష్ర్టానికి, ఈ దేశానికి ఒక్క మంచి పని చేసిందేమీ లేదు. ఊరికే అరుపులు బొబ్బలు. మాట్లాడితే కేసులు, కేసీఆర్‌ ఫ్యామిలీ కరెప్టు ఇవి తప్ప వారు చెప్పేదాంట్లో కొత్తేముంది? తొమ్మిదిన్నరేండ్ల నుంచి పాత చింతకాయ పచ్చడి.

– మంత్రి కేటీఆర్‌

119 సీట్లపైనా ఫోకస్‌

రాష్ట్రంలోని 119 సీట్లపై తాము ఫోకస్‌ పెడతామని, ఏ సీటునూ వదలబోమని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. జీహెచ్‌ఎంసీతోపాటు సిరిసిల్ల, కామారెడ్డి ప్రచార బాధ్యతలను తాను నెత్తికెత్తుకున్నానని వెల్లడించారు. 'జీహెచ్‌ఎంసీలో రోడ్డుషోలు, కార్నర్‌సభలు, డివిజన్‌ మీటింగ్స్‌ ఉంటాయి. సీఎం కేసీఆర్‌వి ఒకటో రెండో సభలు హైదరాబాద్‌లో ఉండొచ్చు' అని తెలిపారు. ఎన్నికలు రాజకీయ పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయని, స్థిరమైన చిత్తంతో మంచి చేయాలనుకునేవారు ప్రజాజీవితంలో అన్నింటికీ సిద్ధంగా ఉండాలని అన్నారు. వ్యక్తిగతంగా తాను మద్యం, డబ్బు పంచకుండా గెలవాలని లక్ష్యం పెట్టుకున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ 114 మంది అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారని, మిగిలిన 5 మంది అభ్యర్థులను 3, 4 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు.

కాంగ్రెస్‌ మిగిల్చింది కన్నీళ్లే

ప్రజలకు కాంగ్రెస్‌ మిగిల్చింది కన్నీళ్లేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆ పార్టీ 60 ఏండ్లు మనల్ని ఆగం చేసిందని చెప్పారు. ఓ ఆడపిల్ల తండ్రి తన బిడ్డ పెండ్లి కోసం ఎంతలా ఆలోచిస్తాడో, తెలంగాణలోని ప్రతి ఓటరు కూడా కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఎవరి చేతిలో పెడితే బాగుంటుందో ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఎవరి చేతిలో పెట్టాలి? ఆ అభ్యర్థి గుణగణాలేమిటి? ఆ పార్టీ గుణగణాలేమిటి? ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి? ఎవరు సారథ్యం వహిస్తే రాష్ట్రం బాగుంటది? అన్నది ఆలోచించాలి' అని కోరారు. సీఎం కేసీఆర్‌ పనితీరును ఆశీర్వదిద్దామా? ప్రతిపక్షాల మొసలి కన్నీళ్లకు మోసపోదామా? అని అడిగారు. 'కాంగ్రెస్‌కు 40 చోట్ల అభ్యర్థులు లేరు. అలాంటి పార్టీ 70-80 చోట్ల గెలుస్తామని చెప్పటం హాస్యాస్పదంగా ఉన్నది. ఇది విని వాళ్ల పార్టీ కార్యకర్తలు కూడా నవ్వుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో గమనిస్తే కాంగ్రెస్‌కు 29 సీట్లకుగానూ 22-25 స్థానాల్లో అభ్యర్థులు లేరు' అని తెలిపారు.

దేశంలో కేసీఆర్‌ అంత పరుషంగా, పదునుగా మోదీని తూర్పారబట్టిన నేత మరొకరు లేరు. నిజంగా మేం బీజేపీకి సబ్‌ సర్వెంట్‌ అయితే 206 మైనార్టీ స్కూళ్లు పెట్టగలిగేవాళ్లమా? బీజేపీ మా ఫ్రెండ్‌ అయితే మైనార్టీల కోసం గొప్ప పనులు చేయగలిగేవాళ్లమా?

– మంత్రి కేటీఆర్‌

తెలంగాణ అభివృద్ధిని ఒక్క రాష్ట్రంలోనైనా చూపిస్తారా?

తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని కేటీఆర్‌ తెలిపారు. ప్రతి సూచీలో, నీతిఆయోగ్‌ వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు విడుదల చేసే ర్యాంకుల్లో తెలంగాణ అగ్రశ్రేణి రాష్ట్రంగా, ప్రగతిశీల రాష్ట్రంగా ప్రత్యేకతను చాటుకుంటున్నదని వెల్లడించారు. 'వైద్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, పట్టణ, గ్రామీణ అభివృద్ధి.. ఇలా ఏ రంగాన్ని చూసినా అభివృద్ధే కనిపిస్తున్నది. తలసరి ఆదాయంలో తెలంగాణ నం.1 అని ఆర్బీఐ చెప్పింది. తెలంగాణ కాకుండా 27 రాష్ర్టాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్‌, బీజేపీ అధికారంలో ఉన్నాయి. ఒక్క చోటైనా బాగుచేశారా? దేశంలో రైతులకు మేలు చేసే రాష్ట్రం ఏదన్నా ఉన్నదంటే అది తెలంగాణ మాత్రమే. కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం ఇది' అని వివరించారు.

అబద్ధాల అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అంతదారుణంగా అబద్ధాలు ఎలా చెప్తారో అర్థం కావడం లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గింది తెలంగాణలోనేనని కేంద్రమే చెప్తుంటే, అమిత్‌షా మాత్రం అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. మేఘాలయ సీఎంను మోస్ట్‌ కరప్ట్‌ అంటూ తిట్టిన ప్రధాని మోదీ.. నాలుగు రోజుల తర్వాత మళ్లీ మేఘాలయకు ఆ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లి, ఆ పార్టీతో పొత్తు కలుపుకొన్నారని విమర్శించారు. ప్రధాని కూడా పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

రాహుల్‌గాంధీ రీడర్‌

రజాకార్‌ సినిమా తెలంగాణ బీజేపీ ఎజెండా అని కేటీఆర్‌ తెలిపారు. 'ఓ గుజరాతీ తెలంగాణకు స్వా తంత్య్రం కల్పించారు. ఇప్పుడు మరో గుజరాతీ వచ్చి మిమ్మల్ని మళ్లీ స్వతంత్రులను చేస్తాడు' అన్న మోదీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'తెలంగాణ దాస్య శృంఖలాలను తెంచిది సీఎం కేసీఆర్‌ కాదా? తెలంగాణకు స్వేచ్ఛావాయువులను అందిం చి స్వయం పాలనలో సుపరిపాలన అందిస్తున్నది కేసీఆర్‌ కాదా?' అని అడిగారు. రాహుల్‌గాంధీ లీడర్‌ కాదు ఓ రీడర్‌ అని ఎద్దేవా చేశారు. ఇక్కడికి వచ్చి ఎవరో రాసిచ్చింది చదివి పోతారని విమర్శించారు.

ఈ నెల 28 వరకు సీఎం కేసీఆర్‌ పర్యటనలు ఖరారయ్యాయి. ఈ విడతలో సీఎం కేసీఆర్‌ 41 సభల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కూడా కేసీఆర్‌ సభలుంటాయి. మొత్తం కలుపుకుంటే కేసీఆర్‌ హాజరయ్యేవి దాదాపు వంద సభలుంటాయి. అవసరాన్ని బట్టి నేను. మంత్రి హరీశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తాం. స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా సిద్ధం అవుతున్నది. మంత్రులు, సీనియర్‌ లీడర్లు ప్రచారంలో పాల్గొంటారు.

– మంత్రి కేటీఆర్‌

పొన్నాల వస్తానంటే నేనే ఆహ్వానిస్తా

కాంగ్రెస్‌ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై కేటీఆర్‌ స్పందిస్తూ 'పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌. ఆయన్ను మేం గౌరవిస్తాం. ఆయన బీఆర్‌ఎస్‌లో చేరతానంటే రేపే నేను ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తా' అని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు వస్తాయన్న సర్వేలపై స్పందిస్తూ 'ఇవే సర్వేలు 2018లో మేం ఓడిపోతాయని చెప్పాయి. అప్పుడు, ఇప్పుడు.. ఇవే సర్వేలు, ఇవే ఏజెన్సీలు. వాళ్లే మళ్లీ మేం ఓడిపోతున్నామని చెప్పాయంటే మాకు శుభసూచకం. మళ్లీ మేమే గెలుస్తాం. వాళ్లే మళ్లీ పప్పులో కాలేశారు. రెండోసారి పప్పులో కాలేసిందునకు వారికి అభినందనలు' అని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.

హైదరాబాదులో మరణించిన నల్లగొండ వాసి హాస్పిటల్ బిల్లును చెల్లించి గొప్ప మనసును చాటుకున్న కంచర్ల భూపాల్ రెడ్డి

8వ వార్డులోని మోడుసు యాదగిరి ఈరోజు ఉదయం చనిపోవడం జరిగింది హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో 50 వేల రూపాయలు బిల్లు ఉండగా

నల్గొండ అభివృద్ధి ప్రదాత గౌరవ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు తక్షణమే మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది

ఈ సందర్భంగా నల్గొండ బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన అంజిబాబు యాదవ్ గారు 9వ వార్డు అధ్యక్షులు కమ్మలపెల్లి ఉపేందర్ యాదవ్ గారు 8వ వార్డు సుంకిశాల ప్రవీణ్ గారు వారికి నివాళులర్పించడం జరిగింది

ఐఏఎస్ లకు పోస్టింగులు

నిజామాబా ద్ సీపీ గా కమలేశ్వర్....

వరంగల్ సీపీ గా అంబరీ కిషోర్ జా..

సంగా రెడ్డి జిల్లా ఎస్పీ  గా రూపేష్ 

నాగర్ కర్నూల్ ఎస్పీ  గా వైభవ్ గైక్వాడ్

జగిత్యాల సన్ ప్రీత్ సింగ్

మహబూబాబాద్ - పాటిల్ సంగ్రామ్

భూపాలపల్లి ఎస్పీ గా - కారే కిరణ్ ప్రభాకర్

ఐఏఎస్ లకు పోస్టింగులు

ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, ఎండోమెంట్స్ స్పెషల్ సీఎస్ గా సునీల్ శర్మ.

ప్రోహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ గా జ్యోతిబుద్ధ ప్రకాష్

రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా వాణీప్రసాద్

వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా క్రిస్టినా చొంగ్తు.

రంగారెడ్డి కలెక్టర్ గా భారతి హోలికేరీ.

మేడ్చల్ మల్కాజ్ గిరీ కలెక్టర్ గా గౌతమ్ పొట్రు.

యాదద్రి భువనగిరి కలెక్టర్ గా హన్మంతు కొండిబా

నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వన్

పాల్వాయి రజినికుమారి కుటుంబానికి మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ*

పాల్వాయి రజినికుమారి కుటుంబానికి మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ 

అనారోగ్యంతో స్వర్గస్తులైన రజిని కుమారి కూతురు ఐశ్వర్య

సూర్యాపేటలోని ఆమె స్వగృహంలో పరామర్శించిన మంత్రి

 సూర్యాపేట

భాజపా నాయకురాలు పాల్వాయి రజిని కుమారి కుమారి తో పాటు ఆమె కుటుంబ సభ్యులను సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరామర్శించారు.

ఇటీవల అనారోగ్యంతో రజనీకుమారి ఏకైక కుమార్తె ఐశ్వర్య స్వర్గస్తురాలయింది. ఏకైక కుమార్తెను కోల్పోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న రజనీకుమారి తో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దురదృష్ట సంఘటనకు సంబంధించిన వివరాలను రజనీకుమారిని అడిగి తెలుసుకున్నారు.

మంత్రి వెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, బండారు రాజా, మతకాల చలపతిరావు, అయూబ్ ఖాన్, చింతలపాటి చిన్న శ్రీరాములు, మద్ధి శ్రీనివాస్ యాదవ్, బైరు వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని భారీ ర్యాలీ

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని భారీ ర్యాలీ

- న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం 

చర్ల

గిరిజనులు ఎంతో కాలంగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆదివాసీలపై అటవీశాఖ అధికారులు వేధింపులు ఆపాలని చర్ల దుమ్ముగూడెం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ డిమాండ్‌ చేశారు. చర్ల మండలం కలివేరు గ్రామపంచాయతీ లింగాల కాలనీలో పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలివేరు గ్రామం నుండి నుండి చర్ల తహశీల్దార్‌ కార్యాలయం వరకు ఐదు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు.

కు

అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.  అనంతరం సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ గతంలో ఎంతో మంది అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని ఆయన పట్టించుకునే నాధుడు లేరన్నారు. ఇప్పటికైనా గ్రామసభ నిర్వహించి అర్హులైన వారందరికీ పోడు పట్టాలు అందజేయాని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ నాయకులు నరేష్ సమ్మక్క, రాజు,నాగలక్ష్మి రామలక్ష్మి కనక వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు

అక్టోబర్ 14 రాస్తారోకో కు అఖిలపక్ష పార్టీల పిలుపు

అక్టోబర్ 14 రాస్తారోకో కు అఖిలపక్ష పార్టీల పిలుపు..

రేపటి సడక్ బంద్ ను విజయవంతం చేయండి.. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి..

సడక్ బంద్ లో కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలి..

ఈ అంశాలపై గతంలో ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిల పక్షం సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ మేరకు పులుపు నిచ్చారు. 

TSPSC వైఫల్యం వల్ల,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

ఈ నేపథ్యంలో విద్యార్థుల, నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ,ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి అక్టోబర్ 14 న రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు , ప్రజా సంఘాల ఉమ్మడి వేదికలు పిలుపు ఇచ్చాయి.

ఇటీవల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ , తెలంగాణ జన సమితి, BSP, CPI, CPM, న్యూ డెమోక్రసీ, న్యూ డెమోక్రసీ, ప్రజా పంథా పార్టీలు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, PDSU,SFI విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి.

అక్టోబర్ 14 న ఉదయం 10.30 గంటల నుండీ 12.30 వరకూ జరిగే ఈ రాస్తారోకో కార్యక్రమంలో ప్రజలందరూ విద్యార్థులకు, యువతకు మద్దతుగా పాల్గొనాలని కోరుతున్నాము.

.

అక్టోబర్ 14 రాస్తారోకో పాయింట్స్.

1. మహబూబ్ నగర్ నుండీ హైదరాబాద్ రహదారిలో మహబూబ్ నగర్,జడ్చర్ల, షాద్ నగర్,శంషాబాద్ ..

2.వరంగల్ నుండీ హైదరాబాద్ రహదారి పై వరంగల్, స్టేషన్ ఘనపూర్, జనగాం, ఆలేరు, భువనగిరి, ఘటకేశ్వర్, 

3.రామగుండం నుండీ హైదరాబాద్ రహదారిపై రామగుండం పెద్దపల్లి,కరీం నగర్, సిద్దిపేట, గజ్వేల్, శామీరు పేట, తూం కుంట 

4. ఖమ్మం నుండీ హైదరాబాద్ రహదారిలో ఖమ్మం, కూసుమంచి, సూర్యాపేట, నక్రేకల్, నార్కట్ పల్లి, చిట్యాల, చౌటుప్పల్, హయత్ నగర్..

అక్టోబర్ 14. రాస్తారోకో డిమాండ్లు.

1.ప్రస్తుత బోర్డు చైర్మన్ తో సహా TSPSC సభ్యులను తొలగించి ,TSPSC చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులని నియమించాలి. 

2. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి.

3.DSC పోస్టుల సంఖ్యను ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా 13500 కు పెంచాలి.(బ్యాక్ లాగ్ పోస్టులు కాకుండా అదనంగా )

4.పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు మూడు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి.

*తెలంగాణలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా?*

తెలంగాణలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా?  

హైదరాబాద్:అక్టోబర్ 13

 తెలంగాణ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది.

ఇప్పటికే భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఇబ్బందులపై అలెర్ట్ అయింది.

ఎన్నికల కోడ్ అమలవుతున్న అక్టోబర్9వ తేదీ నుంచి ఈరోజు ఉదయం వరకు భారీగా నగదు పట్టుకున్నారు. దాదాపు 20,నుండి 25కోట్లకు పైగా సీజ్ చేశారు.

షెడ్యూల్ విడుదల అయిన నాలుగు రోజుల్లోనే కోట్లాది రూపాయలు పట్టుబడటంతో ప్రత్యేక నిఘా పెట్టింది.

ఎన్నికల నాటికీ డబ్బు పంపిణీ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉండటంతో వంద బలగాలను తెలంగాణ రాష్ట్రానికి సీఈసీ పంపించింది...

*పోచంపల్లి బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి*

పోచంపల్లి బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఖాతాదారులకు అత్యుత్తమ సేవలందిస్తున్న పోచంపల్లి బ్యాంకు ఖాతాదారులందరికీ ఒక్క లక్ష రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం ఎంతో ఉపయోగకరమని పెన్ పహాడ్ మండల అభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ తెలిపారు.

అనంతారం గ్రామానికి చెందిన మెండు సైదిరెడ్డి విద్యుత్ తీగల తగిలి మృతి చెందగా వారి తల్లి మెండు జయమ్మకు శుక్రవారం లక్ష రూపాయల ప్రమాద బీమా చెక్కును పోచంపల్లి బ్యాంకు ద్వారా అందించారు. ఈ సందర్భంగా బ్యాంకు శాఖ మేనేజర్ ఎం.శ్రీ కిషన్ మాట్లాడుతూ కస్టమర్లకు పోచంపల్లి బ్యాంక్ అందిస్తున్న సేవలకు గాను జాతీయస్థాయిలో ఉత్తమ బ్యాంకుగా అవార్డును పొందడం జరిగిందని తెలిపారు. తమ బ్యాంకు డిపాజిట్ దార్లకు అత్యధిక వడ్డీని చెల్లిస్తున్నట్లు, వ్యవసాయదారులకు, చేతివృత్తుల వారికి,వ్యాపారస్తులకు అతి తక్కువ వడ్డీకే వారి అవసరాల మేర రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది టీ క్రాంతి కే మల్లికార్జున్ బి. కవిత వి. శృతి 

జి. సైదులు, జి నీరజ్ కుమార్

 పి హిందూ కుమార్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.