NLG: మర్రిగూడ మండల కేంద్రంలో ఆశాల మానవహారం
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెలో భాగంగా శనివారం మండల కేంద్రంలో  మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆశా వర్కర్ లు తమకు, ఫిక్స్డ్ వేతనం రూ.18000 నిర్ణయించాలని, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆశలు సమ్మెలోకి దిగడం జరిగిందని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ ల సమస్యలు పరిష్కరించి వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: మర్రిగూడ మండల కేంద్రంలో ఆశాల మానవహారం

నల్లగొండ జిల్లా, మర్రిగూడ: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెలో భాగంగా శనివారం మండల కేంద్రంలో  మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆశా వర్కర్ లు తమకు, ఫిక్స్డ్ వేతనం రూ.18000 నిర్ణయించాలని, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆశలు సమ్మెలోకి దిగడం జరిగిందని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ ల సమస్యలు పరిష్కరించి వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
NLG: మర్రిగూడ మండల తహశీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు
మర్రిగూడ మండల తహశీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి వున్నాడని ఆరోపణల నేపథ్యంలో, నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండల తహశీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కట్టల కొద్ది నోట్ల కట్టలు లభ్యం. ఒక్క ట్రంక్ పెట్టే లోనే రెండు కోట్లు కు పైగా నగదు లభ్యం. మహేందర్ రెడ్డి ఇంటి లో కిలోల కొద్ది బంగారం ఏసీబీ అధికారులు గుర్తించారు. మహేందర్ రెడ్డి కి సంబంధించిన ఆస్తులపై ఏకధాటిగా 15చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది... SB NEWS SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
నేటితో 2000 ల రూపాయల నోటు కనుమరుగు
నేటితో 2000 ల రూపాయల నోటు చెల్లుబాటు ముగియనుంది. ఆర్బీఐ రెండు వేల రూపాయల నోటును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 30వ తేదీ వరకూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయల నోటు మార్పిడి చేసుకునేందుకు అనుమతిచ్చింది. ప్రజల వద్ద ఉన్న 2000 రూపాయల నోటును బ్యాంకుల్లో జమ చేయడానికి నేటి వరకూ మాత్రమే సమయం ఇచ్చింది. ఇప్పటికే కోట్ల కొద్దీ డబ్బులు బ్యాంకుల్లో అనేక మంది జమ చేశారు. 2016 లో నవంబరు 8న వెయ్యి రూపాయల నోటును రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, దాని స్థానంలో రెండు వేల రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకే ఈ రెండు వేల రూపాయలను ప్రవేశపెట్టినట్లు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే వెయ్యి రూపాయల నోటును రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అంతకంటే ఎక్కువ విలువైన రెండు వేల రూపాయల నోటును ప్రవేశపెట్టింది. దాదాపు రెండువేల రూపాయల నోటు ఏడేళ్లు చలామణిలో ఉన్నట్లయింది అయితే ఈ రెండు వేల రూపాయల నోటు వల్ల చిల్లర సమస్య ఎక్కువగా వేధిస్తుండేది. అంతేకాదు గత రెండేళ్ల నుంచి బ్యాంకుల్లోనూ రెండు వేల రూపాయల నోటు కన్పించడం మానేసింది. ఏటీఎంల లోనూ రెండు వేల రూపాయలు రావడం లేదు. దీంతో ప్రజలలో కూడా రెండు వేల నోటు రద్దవుతుందన్న అనుమానం మొదలయింది. అనుకున్న మేరకే రెండు వేల రూపాయల నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. అయితే నేటి వరకు బ్యాంకుల్లో మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. దీంతో రెండు వేల రూపాయల నోటుకు నేటితో కాలం చెల్లినట్లవుతుంది.

SB NEWS

STREETBUZZ NEWS APP

SB NEWS
అభివృద్ధి చేసి..మునుగోడు రుణం తీర్చుకుంటా: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి.. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించిన, ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో రూ. 30కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే కూసుకుంట్ల శంకుస్థాపన చేశారు. మండలంలోని అల్లాపురం గ్రామానికి ఉదయమే చేరుకున్న ఎమ్మెల్యే.. సరళ మైసమ్మ దేవాలయానికి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పీపల్ పహాడ్, డి.నాగారం, కొయ్యలగూడెం, ఎల్లంబావి, పంతంగి, ఎస్ లింగోటం, నేలపట్ల, కుంట్లగూడెం, మందోళ్ళగూడెం, పెద్ద కొండూరు, చిన్న కొండూరు గ్రామాలలో వరుసగా పర్యటించారు. పంచాయతీరాజ్ నిధులు    సుమారుగా రూ.15కోట్లు, హెచ్ఎండిఏ నిధులు రూ.15 కోట్లతో ఆయా గ్రామాలలో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎల్లంబావి గ్రామంలో సర్పంచ్ గుర్రం కొండల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. సర్పంచ్ కొండల్, ఎల్లంబావి గ్రామ శివారు నుండి డప్పు వాయిద్యాల నడుమ ఎమ్మెల్యేకు  ఘనంగా స్వాగతం పలికారు. అభివృద్ధి పనుల పట్ల ఆయా గ్రామాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 నుండి 2018వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకు పోయిందని గుర్తు చేశారు. 2018 లో ప్రజలను మోసపూరిత మాటలతో నమ్మించి మోసం చేసి వచ్చిన ఎమ్మెల్యే మునుగోడు నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. రూపాయి అభివృద్ధి కూడా చేయలేదని ధ్వజమెత్తారు. కెసిఆర్ దీవెనలతో మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో 2022 ఉప ఎన్నికల్లో గెలిచానని, గెలిచిన నాటి నుంచి మునుగోడు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా తనను గెలిపించిన ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చు కోవడమే లక్ష్యంగా ముందు కెళ్తున్నానన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ప్రజల ఆశీర్వాదం తనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, సర్పంచులు కొలను శ్రీనివాస్ రెడ్డి, గుర్రం కొండల్, రెక్కల ఇందిరా సత్తిరెడ్డి, ఆకుల సునీత శ్రీకాంత్, బక్క స్వప్న శ్రీనాథ్, కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి, బాతరాజు సత్యం, చౌట వేణుగోపాల్, కాయితి రమేష్ గౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గిర్కాటి నిరంజన్ గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్, ఉప సర్పంచ్ లు బోరెం ప్రకాష్ రెడ్డి, సాయి రెడ్డి బుచ్చిరెడ్డి, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు ఢిల్లీ మాధవరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కొత్త పర్వతాలు, జిల్లా డైరెక్టర్ ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తూర్పింటి యాదయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు సుర్కంటి శ్రీధర్ రెడ్డి, చెక్క శ్రీనివాస్, బొడ్డు గాలయ్య, మాచర్ల కృష్ణ, పిట్టల శంకరయ్య, మాజీ సర్పంచ్ లు బక్క శంకర్, యాట యోగానందం, నాయకులు మెట్టు మహేశ్వర్ రెడ్డి, గంగాపురం నగేష్ గౌడ్, రాసాల నాగరాజు యాదవ్, బొడ్డు పరమేష్, రిక్కల బాలకృష్ణారెడ్డి, జువ్వి శివకుమార్, పోలేపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
NLG: అంగన్వాడి ఉద్యోగులు సిఐటియు, ఏఐటియుసి నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం: సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య
నల్లగొండ జిల్లా మర్రిగూడెం: శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,  నేడు నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా అంగన్వాడి ఉద్యోగులు సిఐటియు, ఏఐటియుసి నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం అని, రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న వారిని అరెస్టు చేయడం సరైనది కాదని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని, కార్మికులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్ర ఉందనేది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పక తప్పదని ఆయన అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని తెలిపారు. అంగన్వాడి ఉద్యోగులు కనీస వేతనం రూ. 26,000/- ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని ఈ న్యాయమైన డిమాండ్ల పోరాటంలో, పోలీసులు వారిని అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ఈ అంగన్వాడీల సమ్మెకు రిటైర్డ్ విఆర్ఓ విజయలక్ష్మి మద్దతు తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగుల సంఘం యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్. శోభ, కాకులవరం రజిత, బొబ్బల శోభారాణి, చిట్యాల సువర్ణ, రాపోలు విజయశ్రీ, సిల్వేరు లక్ష్మి, సులోచన, అరుణ రమాదేవి, మంగమ్మ, సరళ, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. SB NEWS

SB NEWS NALGONDA DIST
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఆశావర్కర్స్ యూనియన్
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలో ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, నేడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఐదవ రోజు సమ్మె లో భాగంగా, స్థానిక తహసిల్దార్ మహేందర్ రెడ్డి కి  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ..  న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ఆశల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. వారి న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆశలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఫిక్స్డ్ వేతనం రూ. 18000 ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం ప్రమాద బీమా 5 లక్షలు ఇవ్వాలని, అట్లాగే ఆశా లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, ఆశాల పనిభారం తగ్గించాలని జాబ్ చార్ట్  విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, ఏర్పుల పద్మ, కాలం సుజాత, భీమనపల్లి అరుణ, జాజాల అనిత, పందుల పద్మ, పొనుగోటి సునీత, బుసిరెడ్డి ధనమ్మ, పల్లె కంసల్య, తదితరులు పాల్గొన్నారు SB NEWS SB NEWS NALGONDA

SB NEWS TELANGANA
NLG: గిరిజన బిడ్డకు 89 లక్షల ఉద్యోగం
నల్లగొండ జిల్లా, గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామం దేవుల తండాకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పాండు, కుమారుడు జటావత్ గణేష్.. సంవత్సరానికి 89 లక్షల ఉద్యోగానికి ఎంపికయ్యాడు. హోండా కంపెనీ, జపాన్ ఆర్ అండ్ డి విభాగంలో సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఎన్నికయ్యాడు. ఐఐటి మద్రాసులో ఎంటెక్ పూర్తి చేసి, క్యాంపస్ ప్లేస్మెంట్లో 89 లక్షల ఉద్యోగం సంపాదించాడు. ఈ సందర్భంగా ప్రతిభ ఉన్నోడికి తిరుగులేదని గ్రామస్తులు అనుకుంటూ గిరిజన బిడ్డ గణేష్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA
NLG: క్రీడాకారులకు భోజన సదుపాయం అందించిన గాంధీ గ్లోబల్ మరియు జిల్లా ట్రస్మా శాఖలు
నల్గొండ: మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో నల్గొండ డివిజన్ స్థాయి కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ ఆటల పోటీలు.. అండర్ 14, 17 బాలికలకు నిర్వహించారు. ఈ పోటీలలో నల్గొండ డివిజన్లోని 11 మండలాల నుండి దాదాపు 550 మంది క్రీడాకారిణిలు పాల్గొన్నారు. వారందరికీ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ మరియు నల్లగొండ జిల్లా ట్రస్మా శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన వసతిని 2 రోజులు నేడు, రేపు కల్పిస్తున్నామని డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA SB NEWS NATIONAL NEWS APP

STREETBUZZ NEWS APP
NLG: ఆర్మీ అగ్నివీర్లుగా ఎన్జీ కళాశాల విద్యార్థులు
నల్లగొండ: ఇటీవల విడుదల చేసిన ఆర్మీ అగ్నివీర్ ఫలితాలలో స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల నుండి 12 మంది విద్యార్థులు అగ్నివీర్లు గా ఎంపిక కావడం జరిగింది, వారిని ఈరోజు కళాశాల ప్రిన్సిపాల్ డా.ఘన్ శ్యామ్ అభినందించారు. ఆర్మీ అగ్నివీర్ లుగా ఎంపికైన వారిలో ఎన్జీ కళాశాల విద్యార్థులు  సాల్లోజు ఉమేష్ కుమార్, వీరబోయిన మధు, రేకులరపు రమేష్, బయ్య మహేష్, కోరే శివ, మల్లికంటి కార్తిక్, దాసరి పవన్, పొలాగోని కార్తిక్, కంగుల కళ్యాణ్, గానుగుంట్ల లాజర్, షైక్ షరీఫ్, సిద్దు ఉన్నారు.

కళాశాల అధ్యాపకులు వీరిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.ఘన్ శ్యామ్, ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్ , వెంకటరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు