ముగిసిన ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. ఎన్టీఆర్‌ మార్గ్ క్రేన్ నెంబర్ - 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది. జై భోళో గణేష్ మహారాజ్‌కి జై అంటూ భక్తుల నినాదాల మధ్య గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నారు.

క్రేన్ నెంబర్- 4 వద్ద చివరి పూజలు అందుకున్న తర్వాత సరిగ్గా మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో బడా గణేష్‌ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యారు.

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో క్రేన్ నెంబర్-4 వద్దకు మహాగణపతి రాగానే గంటపాటు వెల్డింగ్‌ పనుల అనంతరం గణనాథుడిని నిమజ్జనం చేశారు.

మహాగణపతి నిమజ్జనోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా జనం క్రేన్‌నెంబర్-4 వద్దకు చేరుకున్నారు. బై బై గణేషా అంటూ ఘనంగా బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికారు.

గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు భక్తజనసంద్రంగా మారిపోయాయి. మహాగణపతి నిమజ్జనానికి రెండు భారీ క్రేన్లను ఉపయోగించారు.

ఇదిలా ఉండగా.. షెడ్యూల్‌ కంటే ముందుగానే ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర ఏడు గంటలపాటు నిర్విర్వామంగా కొనసాగింది.

దారి పొడువుగా గణపయ్యకు భక్తులు నీరాజనాలు పలికారు. మహాగణపతి ముందు యువత తీన్మార్ డ్యాన్సులతో హోరెత్తించారు.

గణేష్ నామస్మరణతో ట్యాంక్‌బండ్ మారుమోగింది. మహాగణపతి నిమజ్జనం పూర్తి అవడంతో మిగిలిన వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం మొదలైంది..

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్ కన్నుమూత!

చెన్నై: భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు.

98 ఏళ్ల వయసున్న స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో ఈ రోజు తుది శ్వాస విడిచారు..

1925 ఆగష్టు 7న మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణం ప్రాంతంలో స్వామినాథన్ జన్మించారు. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు విశేష కృషి చేశారు.

అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు. ఇది భారతదేశంలోని తక్కువ ఆదాయ గల రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి సహాయపడింది.

స్వామినాథన్ 1987లో చెన్నైలో ఎం ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. దాని ద్వారా ఆయన మొదటి ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారు.

స్వామినాథన్ అనేక అవార్డులను అందుకున్నారు. 1971లో రామన్ మెగసెసే అవార్డు, 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు అందుకున్నారు..

Streetbuzz News

బాలాపూర్ గణపతి లడ్డు రికార్డు బ్రేక్

తెలంగాణలో ఎంతో ఎంతో ప్రత్యేకత కలిగిన బాలాపూర్‌ గణేశుడి లడ్డూ ఈ ఏడాది కూడా భారీ ధర పలికింది.

హైదరాబాద్ శివారు తుర్కయాంజాల్‌కు చెందిన దాసరి దయానంద్ అనే వ్యక్తి రూ. 27 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.

ఈసారి లడ్డూ వేలంలో మెుత్తం 36 మంది పాల్గొన్నారు. లడ్డూ వేలానికి ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తవుతుండగా.. గతేడాది కంటే ఈసారి 2.40 లక్షల ఎక్కువగా లడ్డూకు ధర పలకడం విశేషం.

వేలం అనంతరం దాసరి దయానంద్ గౌడ్ రూ. 27 లక్షలను బాలాపూర్ గణేేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు.

గతేడాది బాలాపూర్‌కు చెందిన వంగేటి లక్ష్మారెడ్డి 24,60,000 లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు.

ఈ ఏడాదితో వేలానికి 30 ఏళ్లు పూర్తవుతుండగా.. 2020లో కరోనా కారణంగా వేలం నిర్వహించలేదు. ఆ ఏడాది లడ్డూనూ సీఎం కేసీఆర్‌కు అందజేశారు........

Streetbuzz News

Kishan Reddy : హాట్‌హాట్‌గా బీజేపీ పదాధికారుల సమావేశం.. కిషన్‌రెడ్డిపై నేతల ఫైర్

హైదరాబాద్ : బీజేపీ పదాధికారుల సమావేశం గత రాత్రి జరిగింది. ఈ సమావేశం హాట్‌హాట్‌గా జరిగినట్టు సమాచారం.

పదాధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ అయిన కిషన్ రెడ్డిపై పలువురు నేతలు ఫైర్ అయ్యారు..

పార్టీ ఏం చేస్తుందో.. ఎన్నికలను ఎలా ఎదుర్కొంటోందో తమకు అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

పార్టీని నమ్ముకుని నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నామని.. మనం మాత్రం ఆఫీసుల్లో కూర్చుని మీటింగులు పెట్టుకుంటున్నామన్నారు.

అయితే పార్టీ మీటింగ్‌లో నెగిటివ్ గా మాట్లాడడం సరి కాదని కిషన్ రెడ్డి వారించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరి పదేళ్ళు అవుతుందని.. ఎలా మాట్లాడాలో తనకు తెలియదా? అంటూ పార్టీ కీలక నేత సంకినేని వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు.

వరంగల్ నరేంద్ర మోదీ సభకు, ఖమ్మం అమిత్ షా సభకు పెద్దగా జనం రాలేదని నేతలు పేర్కొన్నట్టు సమాచారం. అక్టోబర్ 1, 3న జరగనున్న ప్రధాని మోదీ సభలకైనా.. భారీగా జనాల్ని తరలించాలని కిషన్ రెడ్డిని కోరారు.

రాష్ట్ర కార్యాలయంలో తమను ప్రెస్ మీట్‌లు పెట్టనీయడం లేదని అధికార ప్రతినిధులు తెలిపారు. అధికార ప్రతినిధులుగా తమ రోల్ ఏంటో తెలుపాలని బీజేపీ నేతలు కోరారు..

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండను ఢీ కొట్టిన బస్సు

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ఈరోజు ఉదయం పెను ప్రమాదం తప్పింది. 4 వ కిలో మీటరు రాయి వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కొండను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.

డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. తిరుపతి నుంచి తిరుమలకు వస్తుండగా తిరుమలకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

దీంతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందిన వెంటనే ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు క్రమబద్ధీకరించారు. గాయపడిన వారిని 108 వాహనంలో తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారు.......

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

మొన్న చంద్రుడు.. నిన్న సూర్యుడు.. ఇవాళ శుక్రగ్రహంపై ప్రయోగాలకు ఇస్రో రెడీ..

మొన్నటి చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ ప్రఖ్యాతి గాంచింది. నిన్న సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు ఆదిత్య మిషన్ ఎల్1 ను నింగిలోకి పంపింది..

ఇక ఇప్పుడు శుక్ర గ్రహంపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) రంగం సిద్ధం చేస్తోంది.. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతమైన నేపథ్యంలో త్వరలోనే వీనస్ మిషన్‌ను చేపట్టనుంది.

సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం అయిన శుక్రుడిపై భారత్ ప్రయోగాలు చేపట్టనుంది. ఇప్పటికే వీనస్ మిషన్కు సంబంధించి రెండు పేలోడ్లు అభివృద్ధి చేసినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు.

శుక్రుడిపై అధ్యయనం చేయడం వల్ల అంతరిక్ష శాస్త్ర రంగంలోని అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని చెప్పారు. శుక్రగ్రహం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని.. అక్కడి వాతావరణం చాలా మందంగా ఉంటుందని వెల్లడించారు.

భూమి కూడా ఏదో ఒకరోజు శుక్రుడు కావచ్చని .. 10,000 సంవత్సరాల తర్వాత భూమి లక్షణాలు మారిపోవచ్చని సోమనాథ్ పేర్కొన్నారు..

Streetbuzz News

STREETBUZZ NEWS

తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధాని మోడీ మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబరు 1న హైదరాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ప్రధాని మోడీ పర్యటించాల్సి ఉంది.

ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌లో ఆయన పలు అభివృద్ధి పనులకు బేగంపేట ఎయిర్‌పోర్టులోనే శంకుస్తాపన చేయాల్సి ఉంది.

అయితే మారిన షెడ్యూల్‌ మేరకు ప్రధాని బేగంపేట ఎయిర్‌పోర్టుకు కాకుండా ప్రత్యేకంగా విమానంలో నేరుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు.

అక్టోబరు 1న మధ్యాహ్నం 1.30 కు ప్రధాని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 1.35 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు బయల్దేరి వెళతారు.

2.10గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరకుని 2.50 గంటల వరకు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.

అనంతరం 3 గంటల నుండి 4 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం 4.10 నిమిషాలకు మహబూబ్‌నగర్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తారు. సాయంత్రం 4.50గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ కి తిరిగి వెళ్లనున్నారు...

Streetbuzz News

ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో లోకేష్ అరెస్ట్ అవుతాడా ❓️

నారా లోకేష్ జైలు భ‌యంతో ఏపీకి రావ‌డం లేద‌ని, అందుకే ఆయ‌న ఢిల్లీలో కూర్చున్నాడ‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.

అరేయ్.. తురేయ్.. అంటూ మొన్న‌టి వ‌ర‌కూ వీధుల్లో త‌న వ‌ద‌ర‌బోతుత‌నాన్ని చాటుకున్న లోకేష్..తీరా అస‌లు క‌థ మొద‌ల‌య్యే స‌రికి ఢిల్లీలో కూర్చోవ‌డంతో లోకేషుడి హీరోయిజం రేంజ్ ఏమిటో బ‌య‌ట‌ప‌డింది!

ఎఫ్ఐఆర్ లో ఇప్పుడు ఎవ‌రెవ‌రి పేర్లు రాస్తున్నారో కానీ, లోకేష్ ఇన్న‌ర్ రింగ్ రోడ్ స్కామ్ లో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ ను వేసుకున్నారు. ఈ కేసులో లోకేష్ పేరు ఏ14 గా ఉండ‌గా.. త‌న‌కు ముంద‌స్తు బెయిల్ కేటాయించాలంటూ లోకేష్ పిటిస‌న్ వేసుకున్నారు.

ఇలా లోకేష్ అరెస్టు భ‌యం బ‌ట్ట‌బ‌య‌లైంది. ఏపీకి వ‌స్తే త‌న‌ను అరెస్టు చేస్తార‌నే భ‌యంతో లోకేష్ ఢిల్లీలో ఉన్నార‌నే ప్ర‌చారానికి ఈ పిటిష‌న్ మ‌రింత ఊతం ఇస్తోంది. త‌ను త‌ప్పు చేయ‌క‌పోతే లోకేష్ ఎందుకు అరెస్టుకు భ‌య‌ప‌డుతున్నాడో మ‌రి!

అందునా త‌న తండ్రి జైలు పాలైన నేప‌థ్యంలో... లోకేష్ ఈ ప‌రిణామాల‌ను ధైర్యంగా ముందుకు వ‌చ్చి ఎదుర్కొని ఉంటే.. సరిపోయేది.

అయితే పాద‌యాత్ర‌లో బీరాలు ప‌లికిన లోకేష్ అరెస్టుకు భ‌య‌ప‌డి ఢిల్లీ పారిపోయాడ‌నే ముద్ర శాశ్వ‌తంగా ఉండిపోతుంది. దీన్ని క‌వ‌ర్ చేయ‌డానికి ప‌చ్చ‌మీడియా ఎంత ప్ర‌య‌త్నించినా ప్ర‌యోజ‌నం కూడా ఉండ‌దు!

అయినా.. చంద్ర‌బాబు జైలు కెళ్లే త‌మ‌కు బోలెడంత సానుభూతి వ‌చ్చేసింద‌ని, మొన్న‌టి వ‌ర‌కూ త‌మ విజ‌యంపై ఏవైనా అనుమానాలు ఉంటే అవి చంద్ర‌బాబు అరెస్టుతో ప‌టాపంచ‌లు అయ్యాయ‌ని ప‌చ్చ‌వ‌ర్గాలు ప్ర‌చారం చేసుకుంటూ ఉన్నాయి. మ‌రి అలాంట‌ప్పుడు.. లోకేష్ కూడా అరెస్ట్ అయితే ఇంకా ఎక్కువ సానుభూతి వ‌స్తుంది క‌దా!

చంద్ర‌బాబు జైల్లో ఉంటే సానుభూతి వ‌చ్చేట్టుగా అయితే.. లోకేష్ కూడా అరెస్టై జైలుకు వెళితే తండ్రీకొడుకుల అరెస్టుతో మ‌రింత సానుభూతి పెల్లుబుకుతుంది క‌దా! మ‌రి లోకేష్ ఎందుకు ఇంకా జైలుకు వెళ్ల‌కుండానే బెయిల్ పిటిష‌న్ వేసుకున్న‌ట్టు?

ప్రారంభమైన ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర

మహా నగరం లో గణేష్‌ మహా శోభాయాత్ర ప్రారంభమైంది. నిమజ్జనానికి రాత్రి నుంచే గణనాథులు తరలివస్తున్నారు.

దీంతో ట్యాంక్‌ బండ్‌పై సందడి మొదలైపోయింది. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

63 అడుగుల ఎత్తులో శ్రీ దశమహా విద్యాగణపతిగా కొలువైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయత్ర కోసం పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు.

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన వేడుకకు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 7 గంటలకు మహా గణపతి శోభాయాత్ర ప్రారంభమై.. టెలిఫోన్‌ భవన్‌, సచివాలయం మీదుగా శోభాయాత్ర కొనసాగనుంది.

ఉదయం 9:30కు ఎన్టీఆర్‌ మార్గ్‌కు, ఉదయం 10:30కు క్రేన్‌ నెంబర్‌ 4 దగ్గర పూజా కార్యక్రమం జరగనుంది. ఉదయం 11:30 గంటలకు ఖైరతాబాద్‌ గణేషుడి నిమజ్జనం జరగనుంది.

మ.12 గంటల్లోపు మహా గణపతి నిమజ్జన కార్యక్రమం పూర్తి కానుంది. ఖైరతాబాద్‌ గణేషుడి నిమజ్జనం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు...

Streetbuzz News

Streetbuzz News

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక

సింగరేణి కార్మికుల కు యాజమాన్యం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి సంస్థలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన లాభాల వాటాల్లో 32 శాతం ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు, గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంలో తెలంగాణ నిలిచింది.

తాజాగా 32 శాతం బోనస్ అందివ్వాలన్న నిర్ణయంపై ఎమ్మెల్సీ కవిత సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

కాగా ఇటీవలే 11వ వెజ్ బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను సింగరేణి యాజమాన్యం కార్మికుల ఖాతాల్లో జమ చేసింది...

SB NEWS

SB NEWS

Streetbuzz News