విద్యుత్ చార్జీలు తగ్గించమంటే అక్రమ అరెస్టులా.. డి.చిన్నప్పయాదవ్ ఏపిరైతుసంఘము జిల్లా ప్రధానకార్యదర్శి

వామపక్ష పార్టీలఅద్వర్యంలో

విద్యుత్ చార్జీలు తగ్గించాలని

అనంతపురము పవర్ అపీసు (విద్యుత్ కార్యాలయము) దగ్గర ధర్నా కార్యక్రమము కు

వెళ్ళకుండా,మరియి మాజీముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకునిరసనగా

ఈ రోజు జిల్లా కేంద్రములో టి డి పి అద్వర్వములో జరిగే కాగడాల ప్రధర్శనకు సంఘీభావము తెల్పే దానికి

పోవుతున్నారని శింగనమల పోలీసులు ముంధస్తు జిల్లా వ్యాప్తంగా మాతోపాటు వామపక్షనాయకులను,ప్రజాసంఘాలనాయకులను అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాము వైసిపి ప్రభుత్వము అధికారములోకి వచ్చినప్పుడునుండి 5సార్లు విద్యుత్ చార్జీలు పెంచిసామాన్యుల నడ్డి విరిచినారుఇప్పటికైనా పేదలపై భారాలు తగ్గించాలి లేకుంటే తోందరలోనే ప్రజల అగ్రహనికి గురికాకతప్పదనిపాలకపక్షానికి హెచ్చరించడముజరిగింది.

 అరెస్టుఅయిన నాయకులు,చేనేత శింగనమల మండలకార్యదర్శి నేషేమధు,సీపీఐ సీనీయర్ నాయకులు వెంకటరెడ్ది,రైతుసంఘము మండలకార్యదర్శి,కోండపల్లి

చంద్రశేఖర్, నాగరాజు తదితరులను అరెస్టు చేయడముజరిగింది.

దళితుల హక్కులు, సామాజిక న్యాయం కై ఈనెల 29న 'విజయవాడలో జరిగే “మహాధర్నా" ను జయప్రదం చేయండి. కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రములో ఈనెల 29న జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎ.నాగలింగమయ్య రైతు సంఘం జిల్లా నాయకులు ఆర్ . కుల్లాయప్ప, సంజీవరెడ్డి, సిఐటియు నాయకులు నాగేంద్ర, నెట్టికంటయ్య, ఎం ఆర్ పి ఎస్ నాయకులు వెంకటాపురం చంద్ర, మారెన్న, చెన్నప్ప, చిన్న గంగయ్య, ఎర్రన్న , తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ

76 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో నేటికీ దళితుల పై దాడులు, అత్యాచారాలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కూడా దళితులను అత్యంత కిరాతకంగా చంపివేయడం జరుగుతున్నది. యావత్ భారతావని తలదించుకునే విధంగా మణిపూర్లో మనువాదుల చేతుల్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేయడంతో దేశం నివ్వెర పోయింది. ఇంత జరిగినా మతోన్మాద ప్రధానమంత్రి మోదీ పల్లెత్తు మాట మాట్లాడకపోగా ద్రోహులకు రక్షణ కల్పించడం అత్యంత సిగ్గు చేటు. దళితులను ఆదిపత్య కులాలు, పాలక పార్టీలు ఓటు బ్యాంక్గా చూస్తున్నారు తప్ప వీరిని మనుషులుగా చూడకపోవడం దురదృష్టకరం.

బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్ ప్లాన్ చట్టాన్ని రద్దు చేసి దళిత, గిరిజనులకు తీవ్ర అన్యాయాన్ని తలపెట్టారు. దళితుల్లో చదువుకున్న నిరుద్యోగులు రోజు రోజుకి పెరుగుతున్నారు. కేంద్రంలో లక్షలాది • ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్న వాటిని భర్తీ చేయటం లేదు. జగన్ ప్రభుత్వం 9/77 చట్టాన్ని మార్చి గవర్నర్తో ఆర్డినెన్స్ ఇప్పించి 20 సం॥రాలు దాటిన తర్వాత అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు అనే చట్ట సవరణ చేశారంటే ఇది దళితుల చేతుల నుండి భూమిని లాగివేయడమే. మన రాష్ట్రంలో నేటికీ దళితులు చనిపోతే శవాన్ని పూడ్చడానికి ఆరడుగుల నేల లేదంటే రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. స్మశానాలు కొనుగోలు చేయమని ఉత్తర్వులు ఇస్తున్నారు తప్ప నిధులు మంజూరు చేయడం లేదు. మన రాష్ట్రంలో కూడా రోజురోజుకు దళితులపై దాడులు పెరుగుతున్నాయి.

సామాజిక న్యాయంకై

తరలిరండి... భాగస్వాములుకండి. ప్రధానంగా దళితుల సమస్యలు

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే 41 సిఆర్పిసి రద్దు చేయాలి. 

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.

దళిత, గిరిజనులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను 300 యూనిట్లకు పెంచాలి. జస్టిస్ పున్నయ్య కమీషన్ సిఫార్సులు అమలు చేయాలి.

కోనేరు రంగారావు భూకమిటీ సిఫార్సులను అమలు చేయాలి.

అసైన్డ్ చట్ట సవరణ ఉపసంహరించాలి. మిగులు భూములు ప్రజలకు పంచాలి.

డప్పు, చర్మ కారుల పెన్షన్ రూ. 5,000/- లకు పెంచాలి. 

స్మశానంలో పని చేస్తున్న కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి.

ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఈనెల 29 (శుక్రవారం)న విజయవాడలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సర్వ మతాల సంప్రదాయాలకు ప్రాధాన్యం గుడి, మసీదు, చర్చి, భద్రత మీ చేతుల్లోనే శాంతియుతంగా మెలగాలని హితువు.. సీఐ డి.నాగార్జున రెడ్డి

అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో స్థానిక సీఐ డి.నాగార్జున రెడ్డి పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

గ్రామ రెవెన్యూ పంచాయతీ కి చెందిన వివిధ మసీదులు, దేవాలయాలు, చర్చ్ మరియు దర్గాలకు చెందిన కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశం వివిధ మతాలకు, జాతులకు సాంప్రదాయాలకు నిలువుటద్దమని, అందరి సంప్రదాయాలను గౌరవించి, సోదర భావంతో మెలగాలని సూచించారు. మతపరంగా నిర్వహించే పూజా వేడుకలు, నమాజ్ మరియు ఇఫ్తార్లు, ర్యాలీలు,యాత్రలు, ఊరేగింపులు,సభలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాంతియుతంగా ఉండాలని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరగా...

వివిధ దేవాలయాల వద్ద తాగుబోతుల దుశ్చర్యలు, దొంగతనాలు, అభద్రత విషయాలు నిర్వాహకులు పేర్కొన్నారు.

దీనిపై సిఐ డి.నాగార్జున రెడ్డి స్పందిస్తూ కచ్చితంగా రాత్రి వేళల్లో జరుగు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని భరోసా ఇచ్చి, గుడి,మసీదు,దర్గా మరియు చర్చి భద్రత కొరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బి.కే.ఎస్ దర్గా కమిటీ చైర్మన్ మండ్ల నాగభూషణం, ఇర్ఫాన్,ఇస్లాంపూర్ కాలనీ సుల్తాన్,చాంద్ బాషా, రజాక్,కాశీ విశ్వేశ్వర దేవాలయ చైర్మన్ వెంకట చలపతి, వినాయక గుడి మేనేజర్ శాంతి మూర్తి, సాయిబాబా గుడి పూజారి బద్రీనాథ్, మస్జిదే ఫాతిమా సాని ముతవల్లి నబి రసూల్,డిజిటల్ భాష, షాషావలి, జన చైతన్య కాలనీ తూముచెర్ల బాబా ఫక్రుద్దీన్ వలి, టోపీ బాషా తదితర గాంధీ నగర్ మరియు రాఘవేంద్ర కాలనీ వాసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

ఎమ్మెల్యే కేతిరెడ్డి గారి అదేశాలు మేరకు 39వ వార్డ్ రాంనగర్ లో వార్డ్ కౌన్సిలర్ కడప రంగస్వామి గారి ఆధ్వర్యంలో వార్డ్ ఏఎన్ఎం రమణమ్మ,ఆశావర్కర్ భాగ్యలక్ష్మి ఇంటిటింటికి వెళ్లి బీపీ,షుగర్ పరీక్షలు చేయడం జరిగింది.అదే విధంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే 4వ తేదీ జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు రావాలి అని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కడప రంగస్వామి,ఏఎన్ఎం రమణమ్మ,వరలక్ష్మి,ఆశా వర్కర్ భాగ్యలక్ష్మి,వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.....

బుక్కరాయసముద్రం మండల ఎంపీడీవో గా పదవీ బాధ్యతలు చేపట్టిన తేజోష్ణ కి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపిన కాలువ వెంకటలక్ష్మి..

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల ఎంపీడీవో గా పదవి బాధ్యతలు చేపట్టిన తేజోష్ణ కి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపిన మండల ఎంపీటీసీ కాలువ వెంకటలక్ష్మి సర్పంచ్ అమ్మవారిపేట పార్వతి చేదుళ్ల సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి వైస్ ఎంపీపీ పగడాల రామ్ గోపాల్ . కార్యక్రమంలో ఎంపీటీసీ వైస్ శివారెడ్డి మండల వైసీపీ సీనియర్ నాయకులు బండి పురుషోత్తం పూల నారాయణస్వామి చికెన్ నారాయణస్వామి వార్డు మెంబర్లు రాజారెడ్డి కుల్లాయప్ప మండల స్టోర్ డీలర్ల సంఘం ఉపాధ్యక్షులు సాకే లక్ష్మీనారాయణ డీలర్ సత్తి భోగతి విజయ్ కుమార్ రెడ్డి తదితరులు

మచిలీపట్నం రాత్రి కురిసిన కుంభ వర్షానికి నగరంలో రోడ్లు జలమయమయ్యాయి

మచిలీపట్నం రాత్రి కురిసిన కుంభ వర్షానికి నగరంలో రోడ్లు జలమయమయ్యాయి

మచిలీపట్నం రాత్రి కురిసిన కుంభ వర్షానికి నగరంలో రోడ్లు జలమయమయ్యాయి. జిల్లా కోర్టు సెంటర్ నాలుగు కూడలి ప్రాంతం చెరువును తలపించాయి.జిల్లా పరిషత్ సెంటర్ నుండి కోనేరుసెంటర్ వరకు వర్షపు నీటిలో వాహన చోదకులు,మహిళలు, పాఠశాల ,కళాశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరం శివారు లోతట్టు ప్రాంతాలని నిటమునిగాయి.

టిడిపి అధినేత నారా చంద్రబాబుని అక్రమ అరెస్టు నిరసిస్తూ కదిరి నుండి సైకిల్ పై రాజమండ్రి సెంట్రల్ జైలుకు టిడిపి కార్యకర్త సతీష్ కుమార్

సత్య సాయి జిల్లా కదిరి నియోజవర్గం గాండ్లపెంట మండలానికి చెందిన టిడిపి కార్యకర్త సతీష్ కుమార్ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ కదిరి నుండి సైకిల్ పై రాజమండ్రి సెంట్రల్ జైలుకు బయలుదేరాడు. కడప జిల్లా కమలాపురానికి చేరుకున్న సతీష్ కుమార్ కు ఆ జిల్లా టిడిపి నాయకులు కార్యకర్తలు చంద్రబాబుకు తోడుగా మేము సైతం అంటూ కొద్ది దూరం సైకిల్ యాత్ర చేపట్టిన కార్యకర్త వెంట నడిచారు. ఇంత పెద్ద సహాయం చేస్తున్న టిడిపి కార్యకర్తను పలువురు అభినందిస్తున్నారు.

రైతులను కరువు కోరలు నుండి కాపాడి తక్షణమే కరువు సహయకచర్యలు చేపట్టాలి ఏపిరైతుసంఘము జిల్లాప్రధానకార్యదర్శి డి.చిన్నప్పయాదవ్..

అనంతపురముజిల్లా రైతులనుకరువు కోరలునుండికాపాడితక్షణమే కరువు సహయకచర్యలుచేపట్టాలి,

జిల్లా వ్యాప్తంగాఅన్నిమండలాలను కరువుమండలాలుగా ప్రకటించి,నష్టపోయిన హప్రతిరైతుకుపంటలవారిగా నష్టపరిహరము అందించాలి. సీపీఐ ~~రైతుసంఘము అద్వర్యంలో నార్పల మండలతహశీల్దార్ కార్యాలయము దగ్గరనిరసన ఈ కార్యక్రమములో ముఖ్యఅథితులుగా సీపీఐ 

నీయోజకవర్గ కార్యదర్శి,టి.నారాయణస్వామి ఏపిరైతుసంఘము జిల్లాప్రధానకార్యదర్శి డి.చిన్నప్పయాదవ్ , సీపీఐ మండల కార్యదర్శి గంగాధర పాల్గోని మాట్లాడుతూ..

జిల్లావ్యాప్తంగా నార్పల మండలముతోపాటు2023 ఖరీఫ్ యందు వేరుశనగ, పత్తి, ఆముదం, కంది ,జొన్న, సద్ద, కొర్ర .అనేకమైన వాణిజ్య ఆహార పంటలు జూన్ నెలాఖరు నుండి సాగు చేయడం జరిగినది కానీ సకాలంలో వర్షాలు లేక పంటలన్నీ పిందె పూత ఊడల దశ లోనే పంటలన్నీ ఏండిపోవడం జరిగినది అందువలన రైతులు కౌలు రైతులు పెట్టిన పంటలన్నీ నష్టపోవడం జరిగినది ఇప్పటికే పంటలవారిగా ఎకరాకి 20 నుంచి 30 వేల వరకు పంటలు పెట్టి నష్టపోవడం జరిగినది కావున ప్రతి సంవత్సరం అధిక వర్షాల వల్ల ,అకాల వర్షాల వలన, అనావృష్టి వలన నష్టపోవడం జరుగుతున్నది కానీ ప్రభుత్వం నుంచి రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు ఈ సంవత్సరం అనావృష్టి వలన దాదాపుగా లక్షల ఎకరాల్లో వేసినఅన్ని రకాల పంటలు నష్టపోవడం జరిగింది కావున వాతావరణ బీమాను రద్దుచేసి, గ్రామాల యూనిట్ ఆధారంగా పంటల బీమాపథకాన్ని వర్తింపచేయాలి, తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి నష్ట పరిహారం నివేదికలు తయారు చేసి జిల్లా యంత్రాంగానికి పంపి నష్టపరిహరము,పంటల బీమా వచ్చే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ క్రింది డిమాండ్లను తక్షణమే అమలు చేయాలి.

డిమాండ్లు!

   1)జిల్లాలోని 31మండలములను కరువుమండలముగా ప్రకటించి ఏకరాకు 25000వేలునష్టపరిహరము అందించాలి.

2)నష్టపోయినప్రతిరైతుకుపంటలవారిగా పంటనష్టపరిహరము అందించాలి.

3)రైతులుతీసుకున్నఋణాలుఅన్ని రద్దుచేసి తిరిగి క్రోత్తఋణాలుఇవ్వాలి.

4)రైతులకు ఉచితంగా పశుగ్రాసము పంఫీణీ చేయాలి.

5)జాతీయవిపత్తులనిర్వణక్రిందకేటాయిస్తామన్న4000కోట్లు కేటాయించాలి.

6) మద్దతు ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్ల రూపాయలు కేటాయించాలి.

7)విత్తనాలు, ఎరువులు పురుగుమందులు 90% సబ్సిడీతో రైతులుఅందించాలి.

8) 50 సంవత్సరాల నుండి ప్రతి రైతుకు 10,000 నెలకు పెన్షన్ ఇవ్వాలి.

9 )ఏకరాకు 10వేలు రూ"సాగుసాయము క్రిందరైతులకుకౌలు రైతులకుఇవ్వాలి.

  పాల్గొన్నవారు, నార్పల సీపీఐ మండలకార్యదర్శి,గంగాధర ,సుధాకర,సీపీఐ మండలసహయకార్యదర్శి రమేష్ ,

రైతు సంఘంమండల అద్యక్షులు జోసెఫ్ ,లలితమ్మ, పెద్దపెద్దయ్య, శీను, నాగరాజు, సంజీవ రాయుడు శివమ్మ, మా బి ,శ్రీదేవి, ఏర్రెప్ప, రామచంద్ర, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ గారి* ఆమరణ నిరాహారదీక్షకు సంఘీభావం తెలియచేసిన పలువురు టిడిపి శ్రేణులు

సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసన గా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 2వ రోజు కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ గారి ఆమరణ నిరాహారదీక్షకు సంఘీభావం తెలియచేసిన రాష్ట్ర కార్యదర్శి కల్లుకుంట అంజినప్ప హిందూపురం పట్టణ అధ్యక్షుడు DE రమేష్ ,డైమండ్ బాబా, మంగేష్, అమర్ ,తదితర నాయకులు .....

మాజీ మంత్రివర్యులు పరిటాల సునీత గారిని స్వగృహంలో పరామర్శించిన.. అనంతపురం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి

 మాజీ మంత్రివర్యులు రాప్తాడు నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల సునీత గారు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ సోమవారం ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిటాల సునీత గారిని అక్రమ అరెస్టు చేసి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ నుంచి ఇంటిలో ఉన్న మాజీ మంత్రివర్యులని అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసూల చంద్రమోహన్ చిక్కాల చండ్రా యుడు జిల్లా బీసీ సెల్ కార్య నిర్వాహ కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న తదితరులు పరామర్శించడం జరిగింది*