రైతులను కరువు కోరలు నుండి కాపాడి తక్షణమే కరువు సహయకచర్యలు చేపట్టాలి ఏపిరైతుసంఘము జిల్లాప్రధానకార్యదర్శి డి.చిన్నప్పయాదవ్..
అనంతపురముజిల్లా రైతులనుకరువు కోరలునుండికాపాడితక్షణమే కరువు సహయకచర్యలుచేపట్టాలి,
జిల్లా వ్యాప్తంగాఅన్నిమండలాలను కరువుమండలాలుగా ప్రకటించి,నష్టపోయిన హప్రతిరైతుకుపంటలవారిగా నష్టపరిహరము అందించాలి. సీపీఐ ~~రైతుసంఘము అద్వర్యంలో నార్పల మండలతహశీల్దార్ కార్యాలయము దగ్గరనిరసన ఈ కార్యక్రమములో ముఖ్యఅథితులుగా సీపీఐ
నీయోజకవర్గ కార్యదర్శి,టి.నారాయణస్వామి ఏపిరైతుసంఘము జిల్లాప్రధానకార్యదర్శి డి.చిన్నప్పయాదవ్ , సీపీఐ మండల కార్యదర్శి గంగాధర పాల్గోని మాట్లాడుతూ..
జిల్లావ్యాప్తంగా నార్పల మండలముతోపాటు2023 ఖరీఫ్ యందు వేరుశనగ, పత్తి, ఆముదం, కంది ,జొన్న, సద్ద, కొర్ర .అనేకమైన వాణిజ్య ఆహార పంటలు జూన్ నెలాఖరు నుండి సాగు చేయడం జరిగినది కానీ సకాలంలో వర్షాలు లేక పంటలన్నీ పిందె పూత ఊడల దశ లోనే పంటలన్నీ ఏండిపోవడం జరిగినది అందువలన రైతులు కౌలు రైతులు పెట్టిన పంటలన్నీ నష్టపోవడం జరిగినది ఇప్పటికే పంటలవారిగా ఎకరాకి 20 నుంచి 30 వేల వరకు పంటలు పెట్టి నష్టపోవడం జరిగినది కావున ప్రతి సంవత్సరం అధిక వర్షాల వల్ల ,అకాల వర్షాల వలన, అనావృష్టి వలన నష్టపోవడం జరుగుతున్నది కానీ ప్రభుత్వం నుంచి రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు ఈ సంవత్సరం అనావృష్టి వలన దాదాపుగా లక్షల ఎకరాల్లో వేసినఅన్ని రకాల పంటలు నష్టపోవడం జరిగింది కావున వాతావరణ బీమాను రద్దుచేసి, గ్రామాల యూనిట్ ఆధారంగా పంటల బీమాపథకాన్ని వర్తింపచేయాలి, తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి నష్ట పరిహారం నివేదికలు తయారు చేసి జిల్లా యంత్రాంగానికి పంపి నష్టపరిహరము,పంటల బీమా వచ్చే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ క్రింది డిమాండ్లను తక్షణమే అమలు చేయాలి.
డిమాండ్లు!
1)జిల్లాలోని 31మండలములను కరువుమండలముగా ప్రకటించి ఏకరాకు 25000వేలునష్టపరిహరము అందించాలి.
2)నష్టపోయినప్రతిరైతుకుపంటలవారిగా పంటనష్టపరిహరము అందించాలి.
3)రైతులుతీసుకున్నఋణాలుఅన్ని రద్దుచేసి తిరిగి క్రోత్తఋణాలుఇవ్వాలి.
4)రైతులకు ఉచితంగా పశుగ్రాసము పంఫీణీ చేయాలి.
5)జాతీయవిపత్తులనిర్వణక్రిందకేటాయిస్తామన్న4000కోట్లు కేటాయించాలి.
6) మద్దతు ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్ల రూపాయలు కేటాయించాలి.
7)విత్తనాలు, ఎరువులు పురుగుమందులు 90% సబ్సిడీతో రైతులుఅందించాలి.
8) 50 సంవత్సరాల నుండి ప్రతి రైతుకు 10,000 నెలకు పెన్షన్ ఇవ్వాలి.
9 )ఏకరాకు 10వేలు రూ"సాగుసాయము క్రిందరైతులకుకౌలు రైతులకుఇవ్వాలి.
పాల్గొన్నవారు, నార్పల సీపీఐ మండలకార్యదర్శి,గంగాధర ,సుధాకర,సీపీఐ మండలసహయకార్యదర్శి రమేష్ ,
రైతు సంఘంమండల అద్యక్షులు జోసెఫ్ ,లలితమ్మ, పెద్దపెద్దయ్య, శీను, నాగరాజు, సంజీవ రాయుడు శివమ్మ, మా బి ,శ్రీదేవి, ఏర్రెప్ప, రామచంద్ర, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Sep 27 2023, 14:26