మెరుగైన పరిష్కారం చూపాలి.. జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు
పుట్టపర్తి కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య , పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, డి ఎల్ డి వో శివారెడ్డి, డిఆర్డిఏ పిడి నర్సయ్య, డిపిఓ విజయ్ కుమార్ పాల్గొని వినతులను స్వీకరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశిత సమయంలోగా నాణ్యతగా జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీలకు పరిష్కారం చూపించాలని, స్పందన గ్రీవెన్స్ ల పరిష్కారంపై వ్యక్తిగతంగా దృష్టి పెట్టి పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, గ్రీవెన్స్ ల పరిష్కారంలో అర్జీదారుడితో మాట్లాడి నాణ్యతగా పరిష్కారం చూపించాలని, రీఓపెన్ పిటిషన్ ఏది వచ్చినా సీనియర్ అధికారితో విచారణ చేసి పరిష్కరించాలన్నారు. రీఓపెన్ చేసిన పిటిషన్ ను వ్యక్తిగతంగా పరిశీలన చేసి రిపోర్ట్ ఇవ్వాలన్నారు. అంతేకాక స్పందన గ్రీవెన్స్ కు సంబంధించి బియాండ్ ఎస్ఎల్ఎలు రాకూడదని, గడువు దాటకుండా గ్రీవెన్స్ కు పరిష్కారం చూపించాలన్నారు. ఇప్పటివరకు పెండింగ్ ఉన్న బియాండ్ ఎస్ఎల్ఎలను వెంటనే సున్నా చేయాలన్నారు. మండల స్థాయిలో కూడా స్పందన గ్రీవెన్స్ ఎక్కువగా పెండింగ్ ఉంటున్నాయని, వెంటనే పరిష్కరించాలని సూచించారు.
ప్రభుత్వప్రాధాన్యతా భవనాలు అక్టోబర్ 30 కల్లా పూర్తి చేయాలి.
సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలైన గ్రామా వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై. యస్. ఆర్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణ పనుల అక్టోబర్ 30 కల్లా పూర్తి చేసి సంబందితా శాఖలకు అందజేయాలని యం పిడిఓ ల ను,పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్లు ను ఆదేశించారు.
ప్రతి మండలానికి వారానికి నిర్దేశించిన లక్ష్యాలను ఆ వారం లోగా నే పూర్తి చేయాలని ఎంపిడిఓ లను,ఇంజనీర్లు ఆదేశించారు. పూర్తి చేసిన భవనాలను అక్టోబర్ 30 నాటికి సంబందితా శాఖలకు అందజేయాలని సంబందితా శాఖల అధికారుల ను ఆదేశించారు.
ఇప్పటి వరకు నిర్మించిన భవనాల నిర్మాణాలకు సంబంధించి నిధులు పెండింగ్ లేకుండా చూడాలని, 5 రోజులలో బిల్స్ ఆన్ లైన్లో అప్డేట్ చేసి క్లియర్ చేయాలన్నారు. 833 భవనాలలో ఇప్పటికే 466భవనాలు వివిధ దశలలో నిర్మాణం పనులు జరుగుతున్నాయని తెలిపారు. 367 భవనాలు పూర్తిచేసి సంబంధించిన శాఖ అధికారులకు అప్పగించడం జరిగిందని తెలిపారుప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యత కార్యక్రమాల ప్రగతిలో పర్యవేక్షణ లోపం లేకుండా ఎంపీడీవోలు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే హౌసింగ్ లో కేటాయించిన లక్ష్యం గడపగడపకు మన ప్రభుత్వం కింద చేపడుతున్న పనులు పూర్తయిన పనులకు సంబంధించిన అన్ని వివరాలను అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
రేపటి రోజున పైలట్ ప్రాజెక్టు కింద పుట్టపర్తి మండలం జగరాజు పల్లి లో జరగనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని దీనికై అన్ని శాఖ అధికారులు సమన్వయ సహకారాలతో పని చేయాలని
జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈనెల 27వ తేదీన బుక్కపట్నం మండలంలో ప్రధాన కేంద్రంలో రైతు భరోసా కేంద్రం కార్యాలయ ఆవరణలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని మండల ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు తెలిపారు
27.9.23 తేదీన ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్‌తోపాటు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని, మండల, డివిజన్ స్థాయి అధికారులు హాజరు కానున్నారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్వచ్ఛతాహి సేవ 2023 ను కార్యక్రమంను జిల్లావ్యాప్తంగా జయప్రదం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మిషన్ దిశగా కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 1న " శ్రమదాన్ " చేపట్టి సంపూర్ణ స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను విస్తృత ప్రచారంలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో అధికారులందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని విధి విధానాలను జిల్లా పంచాయతీ అధికారి ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు.
ఈరోజు స్పందన గ్రీవెన్స్ లో 280 అర్జీలు వచ్చాయి.కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
వినతుల వివరాలు కొన్ని ఇలా ఉన్నాయి
బత్తలపల్లి మండలం పోట్ల మరి గ్రామ నివాసి బ త్తల రాములమ్మ కు చెందిన సర్వే నెం.353 ఇంటి ప్లాట్ నెం.2 లో ప్రభుత్వం రెండు సెంట్ల పట్టాను మంజూరు చేసిందని,ఆర్డిటి సంస్థ వారు ఇంటిని నిర్మించారని ప్రస్తుతం తన ఇంటికి ప్రహరీ గోడతోపాటు మరుగుదొడ్ల నిర్మాణం చేయించుకొనుటకు సరిహద్దు కొలతను సర్వేయర్ ద్వారా చేయించుటకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ వినతిని సమర్పించింది.
పెనుగొండ మండలం నాగలూరు బి సి కాలనీకు చెందిన బసిరెడ్డి మరియు సంతోష్ బాబులకు క్రాప్ బుకింగ్ కు సంబంధించి కంది పంటకు గాను నగదు అందలేదని పేర్కొంటూ అర్జీని సమర్పించారు.
కొత్తచెరువు మండలం కేశా పురం గ్రామంలో గత నాలుగు రోజులు నుండి విద్యుత్ సరఫరా లేకపోవడంతో రెండు వేల మంది గ్రామ ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈ విషయంలో వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా గ్రామస్తులు శ్రీనాథ్ రెడ్డి, నాగేంద్ర, బాలప్ప రజితమ్మ తదితరులు అర్జెంట్ సమర్పించారు.
ఆమడగూరుకు చెందిన అక్కమ్మకు గతంలో అగ్ని ప్రమాదంలో కాలిపోయిన పూరి గుడిసె స్థానంలో ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలాన్ని మంజూరు చేసిందని ప్రస్తుతం కొందరు ఈ స్థలాన్ని ఆక్రమించాలని దౌర్జన్యం చేస్తున్నారని ఈ విషయంలో తనకు న్యా చేయవలసిందిగా బాధితురాలు కలెక్టర్ ని కలిసి అర్జీ సమర్పించింది..
కార్యక్రమంలో సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, డిసిఓ కృష్ణ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి చాంద్ భాష, చేనేత జౌళి శాఖ ఏడి రమేష్, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, ఏపిఎంఐపి పిడి సుదర్శన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివ రంగ ప్రసాద్ వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
డిఐపిఆర్ఓ, సమాచార పౌర సంబంధాల శాఖ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి వారిచే జారి
Sep 26 2023, 15:23