మెరుగైన పరిష్కారం చూపాలి.. జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు

పుట్టపర్తి కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య , పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, డి ఎల్ డి వో శివారెడ్డి, డిఆర్డిఏ పిడి నర్సయ్య, డిపిఓ విజయ్ కుమార్ పాల్గొని వినతులను స్వీకరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశిత సమయంలోగా నాణ్యతగా జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీలకు పరిష్కారం చూపించాలని, స్పందన గ్రీవెన్స్ ల పరిష్కారంపై వ్యక్తిగతంగా దృష్టి పెట్టి పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, గ్రీవెన్స్ ల పరిష్కారంలో అర్జీదారుడితో మాట్లాడి నాణ్యతగా పరిష్కారం చూపించాలని, రీఓపెన్ పిటిషన్ ఏది వచ్చినా సీనియర్ అధికారితో విచారణ చేసి పరిష్కరించాలన్నారు. రీఓపెన్ చేసిన పిటిషన్ ను వ్యక్తిగతంగా పరిశీలన చేసి రిపోర్ట్ ఇవ్వాలన్నారు. అంతేకాక స్పందన గ్రీవెన్స్ కు సంబంధించి బియాండ్ ఎస్ఎల్ఎలు రాకూడదని, గడువు దాటకుండా గ్రీవెన్స్ కు పరిష్కారం చూపించాలన్నారు. ఇప్పటివరకు పెండింగ్ ఉన్న బియాండ్ ఎస్ఎల్ఎలను వెంటనే సున్నా చేయాలన్నారు. మండల స్థాయిలో కూడా స్పందన గ్రీవెన్స్ ఎక్కువగా పెండింగ్ ఉంటున్నాయని, వెంటనే పరిష్కరించాలని సూచించారు. 

ప్రభుత్వప్రాధాన్యతా భవనాలు అక్టోబర్ 30 కల్లా పూర్తి చేయాలి. 

సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలైన గ్రామా వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై. యస్. ఆర్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణ పనుల అక్టోబర్ 30 కల్లా పూర్తి చేసి సంబందితా శాఖలకు అందజేయాలని యం పిడిఓ ల ను,పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్లు ను ఆదేశించారు.  

ప్రతి మండలానికి వారానికి నిర్దేశించిన లక్ష్యాలను ఆ వారం లోగా నే పూర్తి చేయాలని ఎంపిడిఓ లను,ఇంజనీర్లు ఆదేశించారు. పూర్తి చేసిన భవనాలను అక్టోబర్ 30 నాటికి సంబందితా శాఖలకు అందజేయాలని సంబందితా శాఖల అధికారుల ను ఆదేశించారు. 

ఇప్పటి వరకు నిర్మించిన భవనాల నిర్మాణాలకు సంబంధించి నిధులు పెండింగ్ లేకుండా చూడాలని, 5 రోజులలో బిల్స్ ఆన్ లైన్లో అప్డేట్ చేసి క్లియర్ చేయాలన్నారు. 833 భవనాలలో ఇప్పటికే 466భవనాలు వివిధ దశలలో నిర్మాణం పనులు జరుగుతున్నాయని తెలిపారు. 367 భవనాలు పూర్తిచేసి సంబంధించిన శాఖ అధికారులకు అప్పగించడం జరిగిందని తెలిపారుప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యత కార్యక్రమాల ప్రగతిలో పర్యవేక్షణ లోపం లేకుండా ఎంపీడీవోలు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే హౌసింగ్ లో కేటాయించిన లక్ష్యం గడపగడపకు మన ప్రభుత్వం కింద చేపడుతున్న పనులు పూర్తయిన పనులకు సంబంధించిన అన్ని వివరాలను అప్లోడ్ చేయాలని ఆదేశించారు.

రేపటి రోజున పైలట్ ప్రాజెక్టు కింద పుట్టపర్తి మండలం జగరాజు పల్లి లో జరగనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని దీనికై అన్ని శాఖ అధికారులు సమన్వయ సహకారాలతో పని చేయాలని

జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

 ఈనెల 27వ తేదీన బుక్కపట్నం  మండలంలో ప్రధాన కేంద్రంలో రైతు భరోసా కేంద్రం కార్యాలయ ఆవరణలో ‌ జగనన్నకు చెబుదాం  కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జ‌గ‌న‌న్న‌కు చెబుదాం స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని మండల ప్రజలు వినియోగించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ పి అరుణ్ బాబు  తెలిపారు  

27.9.23 తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంద‌ని  ఈ కార్య‌క్ర‌మానికి జిల్లా క‌లెక్ట‌ర్‌, ఇంచార్జ్ జాయింట్ క‌లెక్ట‌ర్‌తోపాటు, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు హాజ‌ర‌వుతార‌ని, మండల, డివిజన్ స్థాయి అధికారులు హాజరు కానున్నారు.ఈ అవ‌కాశాన్ని ప్రజలు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.  

స్వచ్ఛతాహి సేవ 2023 ను కార్యక్రమంను జిల్లావ్యాప్తంగా జయప్రదం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మిషన్ దిశగా కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 1న " శ్రమదాన్ " చేపట్టి సంపూర్ణ స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను విస్తృత ప్రచారంలో భాగంగా  ప్రజల భాగస్వామ్యంతో అధికారులందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని విధి విధానాలను జిల్లా పంచాయతీ అధికారి ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు.

ఈరోజు స్పందన గ్రీవెన్స్ లో 280 అర్జీలు వచ్చాయి.కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

వినతుల వివరాలు కొన్ని ఇలా ఉన్నాయి

బత్తలపల్లి మండలం పోట్ల మరి గ్రామ నివాసి బ త్తల రాములమ్మ కు చెందిన సర్వే నెం.353 ఇంటి ప్లాట్ నెం.2 లో ప్రభుత్వం రెండు సెంట్ల పట్టాను మంజూరు చేసిందని,ఆర్డిటి సంస్థ వారు ఇంటిని నిర్మించారని ప్రస్తుతం తన ఇంటికి ప్రహరీ గోడతోపాటు మరుగుదొడ్ల నిర్మాణం చేయించుకొనుటకు సరిహద్దు కొలతను సర్వేయర్ ద్వారా చేయించుటకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ వినతిని సమర్పించింది.

పెనుగొండ మండలం నాగలూరు బి సి కాలనీకు చెందిన బసిరెడ్డి మరియు సంతోష్ బాబులకు క్రాప్ బుకింగ్ కు సంబంధించి కంది పంటకు గాను నగదు అందలేదని పేర్కొంటూ అర్జీని సమర్పించారు.

కొత్తచెరువు మండలం కేశా పురం గ్రామంలో గత నాలుగు రోజులు నుండి విద్యుత్ సరఫరా లేకపోవడంతో రెండు వేల మంది గ్రామ ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈ విషయంలో వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా గ్రామస్తులు శ్రీనాథ్ రెడ్డి, నాగేంద్ర, బాలప్ప రజితమ్మ తదితరులు అర్జెంట్ సమర్పించారు.

ఆమడగూరుకు చెందిన అక్కమ్మకు గతంలో అగ్ని ప్రమాదంలో కాలిపోయిన పూరి గుడిసె స్థానంలో ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలాన్ని మంజూరు చేసిందని ప్రస్తుతం కొందరు ఈ స్థలాన్ని ఆక్రమించాలని దౌర్జన్యం చేస్తున్నారని ఈ విషయంలో తనకు న్యా చేయవలసిందిగా బాధితురాలు కలెక్టర్ ని కలిసి  అర్జీ సమర్పించింది..

కార్యక్రమంలో సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, డిసిఓ కృష్ణ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి చాంద్ భాష, చేనేత జౌళి శాఖ ఏడి రమేష్, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, ఏపిఎంఐపి పిడి సుదర్శన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి,  సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివ రంగ ప్రసాద్ వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 డిఐపిఆర్ఓ, సమాచార పౌర సంబంధాల శాఖ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి వారిచే జారి

కుందుర్పి పట్టణంలో గురుకుల పాఠశాల నూతన భవనం ఏర్పాటు చేయాలి.. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సావన్

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కుందుర్పి మండల కేంద్రంలో AISF,TNSF తెలుగు యువత ఆధ్వర్యంలో విద్యార్థులతో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.కుందుర్పిలో ఉన్నటువంటి MJP గురుకుల పాఠశాల యొక్క నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 25 కోట్ల మంజూరు చేసింది ఈ యొక్క నూతన భవనాన్ని కుందుర్పి మండల హెడ్ క్వార్టర్ లో కాకుండా కొంత మంది ప్రజాప్రతినిధులు ఒత్తిడి వల్ల మారుమూల గ్రామమైన ఎనుముల దొడ్డిలో నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కుందుర్పి మండల కేంద్రంలో గురుకుల పాఠశాల నూతన భవనం నిర్మాణం చేపట్టాలి అలాకాకుండా ఎనుముల దొడ్డిలో గనక నూతన భవనాన్ని నిర్మాణం చేసినట్లయితే AISF మరియు ఇతర విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని హెచ్చరించారు

డా, బి. ఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి బదులుగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న జగన్ రెడ్డి...

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఒక నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష  రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగింది ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు బుక్కరాయసముద్రం మండల నాయకులు పర్వతనేని శ్రీధర్ బాబు గారు, మండల కన్వీనర్ అశోక్, మాజీ సర్పంచ్ లక్ష్మి నారాయణ, సీనియర్ నాయకులు కేశన్న, బాబయ్య, రెడ్డిపల్లి నాయుడు, నాగేష్ మరియు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ అబద్దాలతో అభివృద్ధి చంద్రుడిని అడ్డుకోలేవు జగన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ చంద్రబాబు గారి మీద సీఐడీ పెట్టిన కేసు నూటికి నూరు పాళ్ళూ అక్రమమే. చేసిన ఆరోపణలన్నీ నిరాధారమే. జగన్ రెడ్డి పగ తప్ప, ఈ కేసులో చంద్రబాబు గారి తప్పిదం ఏమీ లేదు. తొందర్లోనే కడిగిన ఆణిముత్యంల, మచ్చలేని చంద్రుడిగా బయటికి వస్తారు. జగన్ రెడ్డి ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని మా అధినాయకుడు పై పెట్టిన అదరడు బెదరడు భయపడడు త్వరలోనే మీ ప్రభుత్వాన్ని మీ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు భవిష్యత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతోందిని అసూయతో ఇలాంటి అక్రమ కుట్రలకు తెరలేపుతున్నారని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే వరకు మా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని మా అధినాయకునికి అండగా ఉంటామని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో నార్పల మండల టీడీపీ నాయకులు, జిల్లా నాయకులు,మండల పార్టీ అధ్యక్షులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,టీడీపీ అనుబంధ సంస్థ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సింగనమల మండల కేంద్రంలోబాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్షలు చేపట్టిన దండు శ్రీనివాసులు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ ఖండిస్తూ సింగనమల మండలంలో బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చం నాయుడు గారు జిల్లా అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర చౌదరి గారు దిశభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగుకేశవరెడ్డి ఆలం నర్స నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో సింగనమలలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో దండు శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి వస్తున్న జనాధారణ ఓర్వలేక కక్ష సాధింపు చర్యగా మా అధ్యక్షులు వారిని అక్రమ అరెస్టు చేయడం జరిగినది దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దీక్షకు సంఘీభావం తెలిపిన cpi నాయకులు నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి మండల కార్యదర్శి రామాంజనేయులు జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కృష్ణమూర్తిమండల కన్వీనర్ తోట ఓబులేసు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ దాసరి గంగాధర్ మాజీ ఎంపీటీసీ కుల్లాయప్ప బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి బండి పరుశురాం పార్లమెంట్ బీసీ సెల్అధికార ప్రతినిధి బండి పరశురాం సింగనమల నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు బెస్త నారాయణస్వామి జిల్లా పార్లమెంట్ బెస్త సాధికార కమిటీ అధ్యక్షులు బెస్త అమర్నాథ్ పార్లమెంట్ టి ఎన్ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు నాగభూషణం మైనార్టీ సెల్ కార్యనిర్వాహ కార్యదర్శి మహమ్మద్ గౌస్ పార్లమెంట్ వాణిజ్య విభాగం కార్యదర్శి డేరంగుల శంకరయ్య ఎస్సీ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మెండిపోగుల ఎర్ర స్వామి గ్రామ కమిటీ అధ్యక్షులు బండి వెంకటనారాయణ సుధాకర్ నాయుడు కుమార్ వెంకట రాముడు రైతు సంఘం అధికార ప్రతినిధి తిప్పన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శివరామకృష్ణ శ్రీరాములు మండల తెలుగు యువత నాయకులు కాయల సురేష్ యాదవ్ దండు ప్రకాష్ రంగస్వామి పుల్లయ్య ప్రసాద్ నాయక్ దాసరి వెంకటరమణ వడ్డే సుంకన్న దైవయత్నం జంగం శెట్టినవీన్ మొండెం ఎర్రి స్వామి శంకర్ నారాయణ జడేజా పేపర్ నల్లప్ప ఆర్టీసీ దైవ యత్నంతరిమెల రమేష్ రెడ్డి వాసు ప్రకాష్ బాలముని శ్రీరాములు అక్బర్ లక్ష్మీనరసింహ సలీం బాబావలి నరేష్ మసుద్ వలి జాన గాని శివ శర్మ రాజు మల్లేష్ రామాంజనేయులు లక్ష్మన్న మల్లికార్జున సోము ధన కుమార్ బాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు డేగల కృష్ణమూర్తి మారుతి నాయుడుని అక్రమ అరెస్ట్ చేసిన సింగనమల పోలీసులు

మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు  శింగనమల నియోజకవర్గం అనంతపురం TO తాడిపత్రి రహదారి పై నాయనపల్లి క్రాస్ వద్ద నిరసన తెలియజేయగా పోలీసులు బలవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారిని అరెస్టు చేసి శింగనమల పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

 ఎమ్మెస్ రాజు గారితో పాటు జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి, సీనియర్ నాయకుడు గోరంట్ల మారుతీ నాయుడు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల క్రిష్ణయ్య,మాజీ జిల్లా కార్యదర్శి గోరకాటి వెంకటేష్,TNTUC రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాళ్ళ నాగేంద్ర, టిడిపి జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఓబులాపురం శ్రీనివాసులు నాయుడు,నడింపల్లి భాస్కర్ నాయుడు, మాజీ ఎంపీటీసీ వెంకటేష్ వేణు,మాజీ ఎంపీటీసీ చిక్కాల చండ్రాయుడు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు నరేంద్ర కుమార్ యాదవ్,కొయ్యగూర పెద్దన్న, తెలుగు యువత పెద్దన్న,రాష్ట్ర ఐటీడీపీ కార్యదర్శి విజయ్ కుమార్,మీడియా కోఆర్డినేటర్ ఏరిస్వామి,డాల్ వీర, కొర్రపాడు రాజు , లోలూరు నారాయణస్వామి, రాగే పరశురాము, బింగి విజయ్,శ్రీనివాస్ నాయక్, సుదర్శన్ నాయక్, నాగలగుడ్డం లక్ష్మి నారాయణ, నాగలగుడ్డం సాకే శివ, మాట్లాగొంది పుల్లయ్య, రమేష్, రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి, శింగనమల గ్రామ కమిటీ అధ్యక్షులు బండి వెంకటనారాయణ, వీరాంజనేయులు,శివపురం నగేష్ ,రామంజి తదితరులు పాల్గొన్నారు

అనంతపురం జిల్లా ని కరువు జిల్లాగా ప్రకటించాలి.. భారత కమ్యూనిస్టు పార్టీ

అనంతపురం జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలి బుక్కరాయ సముద్రం మండలం లో సిపిఐ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగినది. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి నారాయణస్వామి గారు అతిథులుగా హాజరై ధర్నాలో పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనపై తీవ్రస్థాయిలో విమర్శించారు 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అక్టోబర్ మాసం వస్తున్న కూడా హెచ్.ఎల్.సి కెనాల్కు ఆయకట్టు నీరు విడుదల చేయలేదని రైతులు చాలా ఇక్కట్లు పడుతున్నారని ప్రభుత్వాలకు అర్థం కాలేదా అంటూ ప్రభుత్వాలను హెచ్చరించాడు కాబట్టి మన అనంతపురం జిల్లా అని కరువు జిల్లాగా ప్రకటించాలని ఇప్పటికే వేరుశనగ పంట రైతుల చేతులకు కూడా అందలేదని ప్రభుత్వాలపై ధ్వజమెత్తాడు గుజరాత్ లోని విద్యుత్ సంస్కరణలను మన రాష్ట్రంలో అమలు చేయటం.. చిన్న గుడిసె కూడా ఈరోజు 500 700 కరెంట్ బిల్లు వస్తుంది ఇది ఎంతవరకు న్యాయం అంటూ వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సింగనమల నియోజకవర్గం కార్యదర్శి టి నారాయణస్వామి, రైతు సంఘం అధ్యక్షులు బండి రామకృష్ణ చేతి వృత్తుదారుల జిల్లా నాయకులు హరికృష్ణ ఈ సమావేశానికి అధ్యక్షతన మండల సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రావు మండల సహాయ కార్యదర్శి తిరుపతయ్య మండల కార్యవర్గ సభ్యులు నాగేంద్ర డి మధు శివ ఈశ్వర్ సంజీవులు తదితరులు పాల్గొనడం జరిగినది

బుక్కరాయసముద్రంలో ఉపాధి హామీ పథకం కింద అనంతసాగర్ కాలనీ చెరువు కట్ట పైన ముళ్ళ పొదలు తొలగింపు కార్యక్రమం

బుక్కరాయసమద్రం మండలంలోని బికేస్ GP లో ఉపాధి హామీ పథకం కింద ఇరిగేషన్ ట్యాంక్ అనంతసాగర్ చెరువు కట్ట పైన చేపట్టిన కంప తొలగింపు పనిని ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ యన్. వేణుగోపాల్ రెడ్డి సార్ గారు, అనంతపురం క్లస్టర్ సహాయ పథక సంచాలకులు శ్రీమతి బి అనురాధ మేడమ్ గారు, మండల గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి దాసరి సునీత గారు క్షేత్రస్థాయినందు పర్యవేక్షించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బుల్లె నారాయణస్వామి అన్నగారు, ఏపీవో యం. పోలేరయ్య గారు,  జేఈ ఓం ప్రసాద్, సాంకేతిక సహాయకులు కుల్లాయిస్వామి, క్షేత్ర సహాయకుడు రవి ప్రసాద్ పాల్గొనడం జరిగింది

జంతలూరు 14వ బెటాలియన్ లో పని చేస్తూ మరణించిన కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్ వారి భార్య దీపికా కు ఇన్సిడెంటల్ చార్జస్ 25 వేలు రూ.ల చెక్కును పంపిణీ..

జంతలూరు 14వ బెటాలియన్ లో పని చేస్తూ మరణించిన కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్ వారి భార్య దీపికా కు ఇన్సిడెంటల్ చార్జస్ 25 వేలు రూపాయల చెక్కును బెటాలియన్ కమాడెంట్ గంగాధర రావు ఐ.పి.యస్ చేతుల మీదుగా కుటుంబానికి అందించటం జరిగింది ఇంకా వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ వచ్చేటట్లు మరియు కారుణ్య నియామకం కింద జాబ్ వారి భార్య తొందరగా వచ్చేటట్లు చూస్తాము అని చెప్పటం జరుగుతుంది.ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, AO నాగభూషణమ్మ , బెటాలియన్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య పాల్గొనడం జరిగింది.

తిరుమల శ్రీవారిని రాష్ట్ర విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివరెడ్డి తో పాటు స్వామివారిని దర్శించుకున్న స్టోర్ డీలర్ల ఉపాధ్యక్షులు సాకే లక్ష్మీనారాయణ

తిరుమల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి తో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకదర్శనం ద్వారా దర్శించుకున్న బుక్కరాయసముద్రం మండల వైస్ ఎంపీపీ-2 భర్త మరియు మండల స్టోర్ డీలర్ల సంఘం ఉపాధ్యక్షులు రేకులకుంట సాకే లక్ష్మీనారాయణ.

ఆమరణ నిరాహార దీక్షకు మద్ధతుగా సంఘీభావం తెలిపిన సింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు మరియు రిమాండుకి పంపడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాల్వ శ్రీనివాసులు గారు రాయదుర్గం లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు దీక్షకు మద్ధతుగా సంఘీభావం తెలిపిన ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు,ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు,జిల్లా సర్పంచ్ సంఘం మాజీ ఉపధ్యక్షులు ఆలం వెంకటరమణ గారు,రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ గారు,బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి నాగరాజు గారు,జిల్లా నాయకులు రామలింగారెడ్డి గారు,జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి గారు,తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు,రాష్ట్ర గాండ్ల సాధికారిక కన్వీనర్ విశాలాక్షి గారు,రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కూచి హరి గారు మరియు తదితరులు పాల్గొన్నారు