సింగనమల మండల కేంద్రంలోబాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్షలు చేపట్టిన దండు శ్రీనివాసులు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ ఖండిస్తూ సింగనమల మండలంలో బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చం నాయుడు గారు జిల్లా అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర చౌదరి గారు దిశభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగుకేశవరెడ్డి ఆలం నర్స నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో సింగనమలలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో దండు శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి వస్తున్న జనాధారణ ఓర్వలేక కక్ష సాధింపు చర్యగా మా అధ్యక్షులు వారిని అక్రమ అరెస్టు చేయడం జరిగినది దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దీక్షకు సంఘీభావం తెలిపిన cpi నాయకులు నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి మండల కార్యదర్శి రామాంజనేయులు జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కృష్ణమూర్తిమండల కన్వీనర్ తోట ఓబులేసు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ దాసరి గంగాధర్ మాజీ ఎంపీటీసీ కుల్లాయప్ప బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి బండి పరుశురాం పార్లమెంట్ బీసీ సెల్అధికార ప్రతినిధి బండి పరశురాం సింగనమల నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు బెస్త నారాయణస్వామి జిల్లా పార్లమెంట్ బెస్త సాధికార కమిటీ అధ్యక్షులు బెస్త అమర్నాథ్ పార్లమెంట్ టి ఎన్ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు నాగభూషణం మైనార్టీ సెల్ కార్యనిర్వాహ కార్యదర్శి మహమ్మద్ గౌస్ పార్లమెంట్ వాణిజ్య విభాగం కార్యదర్శి డేరంగుల శంకరయ్య ఎస్సీ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మెండిపోగుల ఎర్ర స్వామి గ్రామ కమిటీ అధ్యక్షులు బండి వెంకటనారాయణ సుధాకర్ నాయుడు కుమార్ వెంకట రాముడు రైతు సంఘం అధికార ప్రతినిధి తిప్పన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శివరామకృష్ణ శ్రీరాములు మండల తెలుగు యువత నాయకులు కాయల సురేష్ యాదవ్ దండు ప్రకాష్ రంగస్వామి పుల్లయ్య ప్రసాద్ నాయక్ దాసరి వెంకటరమణ వడ్డే సుంకన్న దైవయత్నం జంగం శెట్టినవీన్ మొండెం ఎర్రి స్వామి శంకర్ నారాయణ జడేజా పేపర్ నల్లప్ప ఆర్టీసీ దైవ యత్నంతరిమెల రమేష్ రెడ్డి వాసు ప్రకాష్ బాలముని శ్రీరాములు అక్బర్ లక్ష్మీనరసింహ సలీం బాబావలి నరేష్ మసుద్ వలి జాన గాని శివ శర్మ రాజు మల్లేష్ రామాంజనేయులు లక్ష్మన్న మల్లికార్జున సోము ధన కుమార్ బాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు డేగల కృష్ణమూర్తి మారుతి నాయుడుని అక్రమ అరెస్ట్ చేసిన సింగనమల పోలీసులు

మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు  శింగనమల నియోజకవర్గం అనంతపురం TO తాడిపత్రి రహదారి పై నాయనపల్లి క్రాస్ వద్ద నిరసన తెలియజేయగా పోలీసులు బలవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారిని అరెస్టు చేసి శింగనమల పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

 ఎమ్మెస్ రాజు గారితో పాటు జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి, సీనియర్ నాయకుడు గోరంట్ల మారుతీ నాయుడు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల క్రిష్ణయ్య,మాజీ జిల్లా కార్యదర్శి గోరకాటి వెంకటేష్,TNTUC రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాళ్ళ నాగేంద్ర, టిడిపి జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఓబులాపురం శ్రీనివాసులు నాయుడు,నడింపల్లి భాస్కర్ నాయుడు, మాజీ ఎంపీటీసీ వెంకటేష్ వేణు,మాజీ ఎంపీటీసీ చిక్కాల చండ్రాయుడు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు నరేంద్ర కుమార్ యాదవ్,కొయ్యగూర పెద్దన్న, తెలుగు యువత పెద్దన్న,రాష్ట్ర ఐటీడీపీ కార్యదర్శి విజయ్ కుమార్,మీడియా కోఆర్డినేటర్ ఏరిస్వామి,డాల్ వీర, కొర్రపాడు రాజు , లోలూరు నారాయణస్వామి, రాగే పరశురాము, బింగి విజయ్,శ్రీనివాస్ నాయక్, సుదర్శన్ నాయక్, నాగలగుడ్డం లక్ష్మి నారాయణ, నాగలగుడ్డం సాకే శివ, మాట్లాగొంది పుల్లయ్య, రమేష్, రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి, శింగనమల గ్రామ కమిటీ అధ్యక్షులు బండి వెంకటనారాయణ, వీరాంజనేయులు,శివపురం నగేష్ ,రామంజి తదితరులు పాల్గొన్నారు

అనంతపురం జిల్లా ని కరువు జిల్లాగా ప్రకటించాలి.. భారత కమ్యూనిస్టు పార్టీ

అనంతపురం జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలి బుక్కరాయ సముద్రం మండలం లో సిపిఐ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగినది. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి నారాయణస్వామి గారు అతిథులుగా హాజరై ధర్నాలో పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనపై తీవ్రస్థాయిలో విమర్శించారు 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అక్టోబర్ మాసం వస్తున్న కూడా హెచ్.ఎల్.సి కెనాల్కు ఆయకట్టు నీరు విడుదల చేయలేదని రైతులు చాలా ఇక్కట్లు పడుతున్నారని ప్రభుత్వాలకు అర్థం కాలేదా అంటూ ప్రభుత్వాలను హెచ్చరించాడు కాబట్టి మన అనంతపురం జిల్లా అని కరువు జిల్లాగా ప్రకటించాలని ఇప్పటికే వేరుశనగ పంట రైతుల చేతులకు కూడా అందలేదని ప్రభుత్వాలపై ధ్వజమెత్తాడు గుజరాత్ లోని విద్యుత్ సంస్కరణలను మన రాష్ట్రంలో అమలు చేయటం.. చిన్న గుడిసె కూడా ఈరోజు 500 700 కరెంట్ బిల్లు వస్తుంది ఇది ఎంతవరకు న్యాయం అంటూ వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సింగనమల నియోజకవర్గం కార్యదర్శి టి నారాయణస్వామి, రైతు సంఘం అధ్యక్షులు బండి రామకృష్ణ చేతి వృత్తుదారుల జిల్లా నాయకులు హరికృష్ణ ఈ సమావేశానికి అధ్యక్షతన మండల సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రావు మండల సహాయ కార్యదర్శి తిరుపతయ్య మండల కార్యవర్గ సభ్యులు నాగేంద్ర డి మధు శివ ఈశ్వర్ సంజీవులు తదితరులు పాల్గొనడం జరిగినది

బుక్కరాయసముద్రంలో ఉపాధి హామీ పథకం కింద అనంతసాగర్ కాలనీ చెరువు కట్ట పైన ముళ్ళ పొదలు తొలగింపు కార్యక్రమం

బుక్కరాయసమద్రం మండలంలోని బికేస్ GP లో ఉపాధి హామీ పథకం కింద ఇరిగేషన్ ట్యాంక్ అనంతసాగర్ చెరువు కట్ట పైన చేపట్టిన కంప తొలగింపు పనిని ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ యన్. వేణుగోపాల్ రెడ్డి సార్ గారు, అనంతపురం క్లస్టర్ సహాయ పథక సంచాలకులు శ్రీమతి బి అనురాధ మేడమ్ గారు, మండల గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి దాసరి సునీత గారు క్షేత్రస్థాయినందు పర్యవేక్షించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బుల్లె నారాయణస్వామి అన్నగారు, ఏపీవో యం. పోలేరయ్య గారు,  జేఈ ఓం ప్రసాద్, సాంకేతిక సహాయకులు కుల్లాయిస్వామి, క్షేత్ర సహాయకుడు రవి ప్రసాద్ పాల్గొనడం జరిగింది

జంతలూరు 14వ బెటాలియన్ లో పని చేస్తూ మరణించిన కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్ వారి భార్య దీపికా కు ఇన్సిడెంటల్ చార్జస్ 25 వేలు రూ.ల చెక్కును పంపిణీ..

జంతలూరు 14వ బెటాలియన్ లో పని చేస్తూ మరణించిన కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్ వారి భార్య దీపికా కు ఇన్సిడెంటల్ చార్జస్ 25 వేలు రూపాయల చెక్కును బెటాలియన్ కమాడెంట్ గంగాధర రావు ఐ.పి.యస్ చేతుల మీదుగా కుటుంబానికి అందించటం జరిగింది ఇంకా వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ వచ్చేటట్లు మరియు కారుణ్య నియామకం కింద జాబ్ వారి భార్య తొందరగా వచ్చేటట్లు చూస్తాము అని చెప్పటం జరుగుతుంది.ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, AO నాగభూషణమ్మ , బెటాలియన్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య పాల్గొనడం జరిగింది.

తిరుమల శ్రీవారిని రాష్ట్ర విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివరెడ్డి తో పాటు స్వామివారిని దర్శించుకున్న స్టోర్ డీలర్ల ఉపాధ్యక్షులు సాకే లక్ష్మీనారాయణ

తిరుమల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి తో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకదర్శనం ద్వారా దర్శించుకున్న బుక్కరాయసముద్రం మండల వైస్ ఎంపీపీ-2 భర్త మరియు మండల స్టోర్ డీలర్ల సంఘం ఉపాధ్యక్షులు రేకులకుంట సాకే లక్ష్మీనారాయణ.

ఆమరణ నిరాహార దీక్షకు మద్ధతుగా సంఘీభావం తెలిపిన సింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు మరియు రిమాండుకి పంపడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాల్వ శ్రీనివాసులు గారు రాయదుర్గం లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు దీక్షకు మద్ధతుగా సంఘీభావం తెలిపిన ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు,ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు,జిల్లా సర్పంచ్ సంఘం మాజీ ఉపధ్యక్షులు ఆలం వెంకటరమణ గారు,రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ గారు,బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి నాగరాజు గారు,జిల్లా నాయకులు రామలింగారెడ్డి గారు,జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి గారు,తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు,రాష్ట్ర గాండ్ల సాధికారిక కన్వీనర్ విశాలాక్షి గారు,రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కూచి హరి గారు మరియు తదితరులు పాల్గొన్నారు

తన స్వగ్రామం లో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీపార్టీకుటుంబ సభ్యులకు ₹20000/- రూ.లు ఆర్థికసాయం చేసిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసి

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్త మంగళ నరసింహులు భార్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారిని  పరామర్శించి ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసి మరియుబండారు బొజ్జ కొండన్న కోడెలు అమృత గారు అనారోగ్యం తో ప్రభుత్వ వైద్యశాల నందు చికత్స పొందుతున్న విషయం తెలుసుకొని పరామర్శించి ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు

ఈ కార్యక్రమం టీడీపీ సీనియర్ నాయకులు అనిల్ చౌదరి గారు,చెన్నమయ్య,ఆదినారాయణ, డీలర్ కొండ తదితరులు పాల్గొన్నారు

ఇ క్రాప్, ఇ కె వై సి కి గడువు సెప్టెంబర్ 30.... జిల్లా వ్యవసాయాధికారిని శ్రీమతి ఉమా మహేశ్వరమ్మ...

రైతులు తాము వేసిన పంటలను ఈ నెలాఖరు లోగ పంట నమోదు చేయుంచుకోవాలని అదే విదంగా రైతుల వేలిముద్రలను వేయుంచి ఇ కె వై సి పూర్తి చేయాలనీ రైతుభరోసా కేంద్ర ఇంచార్జి లను ఆదేశించారు. మండలము లోని ఓబుళపురం గ్రామములో కమీషనర్ వారు పంపిన ర్యాండం సర్వే నెంబర్ లో వేసిన కంది పంటను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసారు.గ్రాములో ఉన్న ప్రతి పంట వేసిన రైతు పంట నమోదు చేసుకుంటేనే పంట మద్దతు ధరకు అమ్ముకోవడానికి నష్టపోయిన పంటకు నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మొదలగునవి వర్తించాలంటే కచ్చితంగా పంట నమోదు చేయాలనీ రైతు భరోసా కేంద్ర ఇంచార్జ్ లను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో సహాయ వ్యవసాయ సంచాలకులు రవి, వ్యవసాయధికారి శ్యాం సుందర్ రెడ్డి, గ్రామ రైతులు సర్వశ్రీ మహానంద రెడ్డి, అమర్నాథ్, వెంకటరామి రెడ్డి, ఉద్యాన సహాయకుడు శ్రీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

రైతన్నల నేస్తం ఆర్బీకేలు....* *రైతుకు భరోసా భూ హక్కు పత్రాలు.. : ఆలూరు సాంబ శివారెడ్డి*

రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు ఆర్బీకేల ద్వారా భరోసాను, భూ వివాదాలను పరిష్కరించి యజమానులకు శాశ్వత హక్కులు కల్పిస్తూ భూ హక్కు పత్రాలను అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం గాంధీ నగర్ లోని గ్రామ సచివాలయం - 4 పరిధిలో నూతన రైతు భరోసా కేంద్రాన్ని సాంబశివారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ప్రారంభించారు. మండల పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి రోడ్డు సమీపంలో సొసైటీ (పి.ఏ.సి.యస్) ఆధ్వర్యంలో నూతన వ్యవసాయ మార్కెట్ గోడౌన్ కు భూమిపూజ చేశారు. ఫేస్-2 లో భాగంగా రూ.70 లక్షల ఖర్చుతో నిర్మాణం జరగనుంది. అనంతరం యల్లనూరు మండలం 85.నిట్టూరు గ్రామంలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కురక్ష పథకం పత్రాలను పంపిణీ చేశారు. ఆలూరు సాంబ శివారెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా కేంద్రాల వల్ల ఎంతో మేలు జరుగుతోందన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయం సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతపెద్ద స్థాయిలో భూ రీ సర్వే చేపట్టడం లేదన్నారు. ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా, అక్రమాలకు తావు లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా ఉచితంగా భూ హక్కు పత్రాలు అందిస్తున్నామన్నారు. 85.నిట్టూరు గ్రామంలో దాదాపు 359 మంది రైతులకు జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం కింద పత్రాలు అందజేశారు.