అనంతపురం జిల్లా ని కరువు జిల్లాగా ప్రకటించాలి.. భారత కమ్యూనిస్టు పార్టీ
అనంతపురం జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలి బుక్కరాయ సముద్రం మండలం లో సిపిఐ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగినది. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి నారాయణస్వామి గారు అతిథులుగా హాజరై ధర్నాలో పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనపై తీవ్రస్థాయిలో విమర్శించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అక్టోబర్ మాసం వస్తున్న కూడా హెచ్.ఎల్.సి కెనాల్కు ఆయకట్టు నీరు విడుదల చేయలేదని రైతులు చాలా ఇక్కట్లు పడుతున్నారని ప్రభుత్వాలకు అర్థం కాలేదా అంటూ ప్రభుత్వాలను హెచ్చరించాడు కాబట్టి మన అనంతపురం జిల్లా అని కరువు జిల్లాగా ప్రకటించాలని ఇప్పటికే వేరుశనగ పంట రైతుల చేతులకు కూడా అందలేదని ప్రభుత్వాలపై ధ్వజమెత్తాడు గుజరాత్ లోని విద్యుత్ సంస్కరణలను మన రాష్ట్రంలో అమలు చేయటం.. చిన్న గుడిసె కూడా ఈరోజు 500 700 కరెంట్ బిల్లు వస్తుంది ఇది ఎంతవరకు న్యాయం అంటూ వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సింగనమల నియోజకవర్గం కార్యదర్శి టి నారాయణస్వామి, రైతు సంఘం అధ్యక్షులు బండి రామకృష్ణ చేతి వృత్తుదారుల జిల్లా నాయకులు హరికృష్ణ ఈ సమావేశానికి అధ్యక్షతన మండల సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రావు మండల సహాయ కార్యదర్శి తిరుపతయ్య మండల కార్యవర్గ సభ్యులు నాగేంద్ర డి మధు శివ ఈశ్వర్ సంజీవులు తదితరులు పాల్గొనడం జరిగినది
Sep 25 2023, 18:37