ఇ క్రాప్, ఇ కె వై సి కి గడువు సెప్టెంబర్ 30.... జిల్లా వ్యవసాయాధికారిని శ్రీమతి ఉమా మహేశ్వరమ్మ...
రైతులు తాము వేసిన పంటలను ఈ నెలాఖరు లోగ పంట నమోదు చేయుంచుకోవాలని అదే విదంగా రైతుల వేలిముద్రలను వేయుంచి ఇ కె వై సి పూర్తి చేయాలనీ రైతుభరోసా కేంద్ర ఇంచార్జి లను ఆదేశించారు. మండలము లోని ఓబుళపురం గ్రామములో కమీషనర్ వారు పంపిన ర్యాండం సర్వే నెంబర్ లో వేసిన కంది పంటను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసారు.గ్రాములో ఉన్న ప్రతి పంట వేసిన రైతు పంట నమోదు చేసుకుంటేనే పంట మద్దతు ధరకు అమ్ముకోవడానికి నష్టపోయిన పంటకు నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మొదలగునవి వర్తించాలంటే కచ్చితంగా పంట నమోదు చేయాలనీ రైతు భరోసా కేంద్ర ఇంచార్జ్ లను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో సహాయ వ్యవసాయ సంచాలకులు రవి, వ్యవసాయధికారి శ్యాం సుందర్ రెడ్డి, గ్రామ రైతులు సర్వశ్రీ మహానంద రెడ్డి, అమర్నాథ్, వెంకటరామి రెడ్డి, ఉద్యాన సహాయకుడు శ్రీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Sep 24 2023, 13:15