రైతన్నల నేస్తం ఆర్బీకేలు....* *రైతుకు భరోసా భూ హక్కు పత్రాలు.. : ఆలూరు సాంబ శివారెడ్డి*
రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు ఆర్బీకేల ద్వారా భరోసాను, భూ వివాదాలను పరిష్కరించి యజమానులకు శాశ్వత హక్కులు కల్పిస్తూ భూ హక్కు పత్రాలను అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం గాంధీ నగర్ లోని గ్రామ సచివాలయం - 4 పరిధిలో నూతన రైతు భరోసా కేంద్రాన్ని సాంబశివారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ప్రారంభించారు. మండల పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి రోడ్డు సమీపంలో సొసైటీ (పి.ఏ.సి.యస్) ఆధ్వర్యంలో నూతన వ్యవసాయ మార్కెట్ గోడౌన్ కు భూమిపూజ చేశారు. ఫేస్-2 లో భాగంగా రూ.70 లక్షల ఖర్చుతో నిర్మాణం జరగనుంది. అనంతరం యల్లనూరు మండలం 85.నిట్టూరు గ్రామంలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కురక్ష పథకం పత్రాలను పంపిణీ చేశారు. ఆలూరు సాంబ శివారెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా కేంద్రాల వల్ల ఎంతో మేలు జరుగుతోందన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయం సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతపెద్ద స్థాయిలో భూ రీ సర్వే చేపట్టడం లేదన్నారు. ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా, అక్రమాలకు తావు లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా ఉచితంగా భూ హక్కు పత్రాలు అందిస్తున్నామన్నారు. 85.నిట్టూరు గ్రామంలో దాదాపు 359 మంది రైతులకు జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం కింద పత్రాలు అందజేశారు.
బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్య సలహాదారుడు ఆలూరు సాంబశివరెడ్డి
రైతన్నల నేస్తం ఆర్బీకేలు....
రైతుకు భరోసా భూ హక్కు పత్రాలు.. : ఆలూరు సాంబ శివారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు ఆర్బీకేల ద్వారా భరోసాను, భూ వివాదాలను పరిష్కరించి యజమానులకు శాశ్వత హక్కులు కల్పిస్తూ
ప్రముఖులు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి లోటు లేదని సుభిక్షంగా ఉన్నారని ప్రతి రైతుకు రైతు భరోసా పథకం అందిస్తున్నారని వారు తెలిపారు మనందరం జగనన్నను మరోసారి గెలిపించుకుంటే రైతులకు మరిన్ని
Sep 24 2023, 12:23