దివ్యాంగుడు మరియు దివ్యాంగుల కోసం పోరాడే నాయకుడు పల్లకొండ కుమారస్వామిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన...

దివ్యాంగుడు మరియు దివ్యాంగుల కోసం పోరాడే నాయకుడు పల్లకొండ కుమారస్వామిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన...

      

వరంగల్ జిల్లా చెన్నారావుపేట గ్రామానికి చెందిన పల్లకొండ సారయ్య ఎస్టీ,ఎరుకల కులం,నిరుపేద కుటుంబం,పందుల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు.అతనికి భార్య,ఇద్దరు పుట్టుకతో వికలాంగులు ఉన్నారు.వికలాంగుడైన పల్లకొండ కుమారస్వామి,పై చదువులు చేసిన జాబ్ లేదు,అతనికి పెళ్లి చేస్తే భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇంటి పెద్ద యజమాని గత 44సం,,రాలు గా 1979 సం.రంలో 1650 రూ.లకు స్థిర నివాసం దాదాపు గా 2 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసి ఆ స్థలంలో ఇంటిని నిర్మించుకొని ఉంటున్నారు.అప్పుడు రోడ్ కి ఇరువైపులా 50 పీట్లు తీసి కొనుగోలు చేయడం జరిగింది.

వారి ఇంటి వెనుకల పందుల షెడ్ కోసం ఒక గుంట స్థలం వదిలి పెట్టి ఇంటిని నిర్మిచుకునే ముందు అగ్రవర్ణాల కులానికి చెందిన ఒక వ్యక్తి ఇది నా భూమి అని వారిపై డాడీ చేసిన వెనుకాకు కట్ట వలిసిన ఇంటిని రోడ్డుకి ఇరువైపులా 33 పీట్ల తీసి ఇవ్వడం వల్ల ఇటీవల 80 పీట్ల రోడ్ వెడల్పు విస్తీరంలో ఇంటిని తొలిగించడం వల్ల నష్ట పోయారు.ఇంకా 100 పీట్ల హైవే రోడ్ వస్తే పూర్తిగా ఆ ఇంటిని తొలిగిస్తే పూర్తిగా నష్ట పోయే అవకాశం ఉంది.కనుక వెనుక ఉన్న స్థలంలో గృహ లక్ష్మి కింద ఇంటిని నిర్మిచుకుంటుంటే వారిపై దాడి చేసే ప్రయత్ననికి పాల్పడుతూ అడ్డు పడుతున్నారు. వారికి కొందరి నాయకుల నుంచి ప్రాణ హాని ఉందనీ,దయచేసి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని ఆ వికలాంగుల కుటుంబం వేడుకుంటుంది.

నల్లగొండలో 40 వ వార్డు సావర్కర్ నగర్ లోని వినాయకుని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి

 నల్లగొండ శాసనసభ్యులు,

 కంచర్ల భూపాల్ రెడ్డి గారు..

గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు రెండవ రోజు...

 పట్టణంలోని 40 వ వార్డు సావర్కర్ నగర్ లో... నీలగిరి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో... ఏర్పాటు చేసిన వినాయక మండపంలో.., ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం జరిగిన. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు..

ఈ సందర్భంగా ఆ కంచర్ల మాట్లాడుతూ ఆ విఘ్ననాధుడు అందరినీ చల్లగా చూడాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని.. ఆ దేవదేవుని వేడుకుంటున్నట్లు తెలియజేశారు... అదేవిధంగా నల్లగొండలో నల్లగొండలో 1200 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న... అభివృద్ధికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పూర్తయ్యే విధంగా భగవంతుని కోరుకున్నట్టు తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పట్ల పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ కార్యదర్శి సంధినేని జనార్ధన్ రావు మాజీ కౌన్సిలర్ నాంపల్లి శ్రీనివాస్ కాకునూరి వీరాచారి, మామిడి పద్మ సువర్ణ, గుంటూజు బ్రహ్మచారి, ఉత్సవ కమిటీ నాయకులు నాంపల్లి ప్రణయ్ మునాస సాయి మేకల రవి... తదితరులు పాల్గొన్నారు

కేంద్రం ప్రకటించిన 33% మహిళా రిజర్వేషన్ లో భాగంగా తెలంగాణలో 39 స్థానాలు మహిళలకు ఇవ్వాల్సి వస్తే అత్యధిక మహిళలు కలిగిన అసెంబ్లీ స్థానాలు ఇవే..

ఈ స్థానాలు మహిళలకే`

చట్టసభల్లో మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలపై చర్చ నెలకొంది. రాష్ట్రంలో 39-40 స్థానాలు నారీమణులకు కేటాయించే అవకాశం ఉంది. అత్యధిక మహిళా జనాభా ఆధారంగా నియోజకవర్గాల కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇదే కనుక నిజమైతే

నిర్మల్, ముథోల్, పెద్దపల్లి, మంథని, కరీంనగర్, హుజురాబాద్, సిరిసిల్ల, నిజామాబాద్ అర్బన్, రూరల్ స్థానాలు, జహీరాబాద్, కామారెడ్డి, పటాన్ చెరు, గజ్వేల్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, జూబ్లిహిల్స్, నాంపల్లి, కార్వాన్, యాకత్ పురా, శేరిలింగంపల్లి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మక్తల్, వనపర్తి, గద్వాల్, హుజూర్ నగర్, దేవరకొండ, తుంగతుర్తి, మునుగోడు, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, ములుగు, పినపాక, ఇల్లందు, మహబూబాబాద్, సత్తుపల్లి, కొత్తగూడెం తో పాటు మరికొన్ని స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది.

SB news

Streetbuzz news

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా వెంపటి వెంకటేశ్వర రావు నియామకం

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా వెంపటి వెంకటేశ్వర రావు నియామకం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా వెంపటి వెంకటేశ్వరరావు నియామకమయ్యారు. ఈ మేరకు హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అమరవాధి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.

వీరు గతంలో సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ చైర్మన్ బాధ్యతలు నిర్వహించి ఆ పదవికే వన్నె

తేవడంతో పాటు ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదుగుటకు తమ వంతు కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా నియామకమైన సందర్భంగా పలువురు జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాపై నమ్మకంతో రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ నియమించినందుకు అమరవాది లక్ష్మీనారాయణకు, సహకరించినందుకు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మా శెట్టి అనంతరాములకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు.

ఆర్యవైశ్యులు సామాజిక వ్యాపార రంగంతో పాటు రాజకీయరంగంలో సైతం రాణించే విధంగా తన కృషి చేస్తానని తెలిపారు.

నల్లగొండ పానగల్లు రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎన్జీ కాలేజ్ కాంటాక్ట్ లెక్చలర్ దంపతుల పార్థియాదేహాలను దర్శించి ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన ఎమ్మెల్యే

 నేడు నల్లగొండ పానగల్లు రోడ్డు ప్రమాదంలో మరణించిన దంపతుల కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన కంచర్ల*..

ఈరోజు ఉదయం.. పానగల్ వద్ద.. మార్నింగ్ వాక్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని...మరణించిన ఓర్సు విష్ణు మూర్తి, స్వప్న దంపతుల పార్థివ దేహాలను..

 నల్లగొండ శాసనసభ్యులు,

 కంచర్ల భూపాల్ రెడ్డి గారు...

 ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో సందర్శించి నివాళులర్పించారు...

 NG కళాశాల లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పని చేస్తున్న... విష్ణుమూర్తి అతని భార్య స్వప్న... రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత దురదృష్టకరమైన విషయమని ... వారి పిల్లలు అనాధలయ్యారని.. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని... కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు..

 వారి పిల్లల పేరు మీద రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని... ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలియజేశారు.

 

మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి.. సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల మోహన్ బాబు, పట్టణ పార్టీ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు సూర మహేష్ తదితరులు వెంట ఉన్నారు

నల్లగొండ అబ్బాసియా కాలనీకి చెందిన యువకునికి రెండు లక్షల 50 వేల ఎల్ ఓ సి ని అందజేసిన ఎమ్మెల్యే కంచర్ల

నల్లగొండ అబ్బాసియా కాలనీకి చెందిన యువకునికి రెండు లక్షల 50 వేల ఎల్ ఓ సి ని అందజేసిన ఎమ్మెల్యే కంచర్ల

నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు... తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న...

 నల్లగొండ పట్టణం అబ్బాసియా కాలనీకి చెందిన మహమ్మద్ యూసుఫ్ అలీ కి ..

 2,50,000/- రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిది ఎల్ఓసిని అందజేశారు.. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వారి వెంట ఉన్నారు.

SB News

స్ట్రీట్ బచ్ న్యూస్ ఆప్

అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నది: ఎమ్మెల్సీ కవిత

అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నది: ఎమ్మెల్సీ కవిత

ఆధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్‌ఎస్‌ కృషి ఉందన్నారు.

అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్‌ఎస్‌ కృషి ఉందన్నారు. మహిళా బిల్లకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా వెల్లడించారు. మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి కేంద్ర కేబినెట్‌ ఒక మంచి నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సాగతిస్తున్నామని చెప్పారు. అధికారంలో సగం కావాలన్న మహిళ కల సాకారం కాబోతున్నదని, ఇది దేశంలోని ప్రతిఒక్క మహిళ విజయమన్నారు. దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

2014లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో 33 శాతం మహిళా రిజర్వేషన్‌, ఓబీసీ రిజర్వేషన్లను ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపిందన్నారు. తొమ్మిదేండ్ల జాప్యం తర్వాత మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఓబీసీ, మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి లేఖలు రాశారని గుర్తుచేశారు. లోక్‌సభలో అధికార పార్టీకి పూర్తిస్థాయి మెజారీటీ ఉండటంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ బిల్లును ఆమోదించేలా చూడాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

ముస్లిం యువకుడు వినాయకుడి భక్తి

 ముస్లిం యువకుడు వినాయకుడి భక్తి

అభివృద్ధిని కలియ గలుపుతూ వినాయక చవితి వృత కల్పం రూప కల్పన

అభిమాన నేత అభివృద్ధిని వ్రతకల్పంలో ఇంటింటికి చేర్చిన ముస్లిం యువకుడు

గంగా,జమునా, తాహజీబ్ కు నిలువెత్తు నిదర్శనం

#వినాయక చవితి రోజున ప్రత్యేక ఆకర్షణగా ముస్లిం యువకుడి వినాయక చవితి వ్రత కల్ప విధానం

పుస్తకాన్ని చూసి మంత్ర ముగ్దులైన మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు

మట్టి విగ్రహంతో పాటు పట్టణ ప్రజలకు వ్రత కల్ప విధానం అందజేత

 

హిందువులు సంప్రదాయంగా జరుపుకునే వినాయక చవితి ప్రాశస్త్యం తెలుపుతూ వ్రత కల్ప విధానాన్ని పుస్తకం రూపంలో ఓ ముస్లిం యువకుడు అందించిన వైనం ఇప్పుడు సూర్యపేటలో హల్ చల్ సృష్టిస్తుంది.అసలే వినాయక చవితి ఆపై ముస్లిం కుటుంబానికి చెందిన యువకుడు వినాయక చవితి వ్రత కల్పవిధానం పేరుతో ప్రచురించిన పుస్తకాలు సూర్యపేటలో ఇంటింటికి చేరుతుండడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జురుకు చెందిన యస్ కే మాజిద్ 2001 లో టి ఆర్ యస్ ఆవిర్భావం నుండి మంత్రి జగదీష్ రెడ్డికి అనుంగు అనుచరుడిగా ఉన్నాడు.

ఉద్యమ సమయంలో అధినేత జగదీష్ రెడ్డి చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ముందుండడం ఆనవాయితీగా మారింది. ఆయానే కాదు వాళ్ళ కుటుంబం యావత్ గులాబీ బాటలో నడుస్తోంది. ఆయన సోదరుడు యస్ కె మోయిజ్ ఆ గ్రామానికి ప్రస్తుతం సర్పంచ్ గా ఉన్నారు.మిగితా ఇద్దరు సోదరులు ఎలిక్ట్రికల్ విభాగంలో కాంట్రాక్టర్ల గా స్థిర పడినారు.ఈ క్రమంలో అభిమాన నేత మంత్రి జగదీష్ రెడ్డి కొరకు వినూత్నమైన పద్ధతిలో తనకు చేతనైన తోడ్పాటు అందించాలనుకున్నారు.అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన సూర్యపేట పట్టణంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికి చేర్చాలని నిర్ణయించారు. అందుకు అనువైన మార్గం హిందువులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వినాయక చవితి ని ఎంచుకున్నారు.శ్రీశ్రీశ్రీ వినాయక చవితి రోజున హిందువులందరికి చేరే విదంగా పట్టణాభివృద్ధి ప్రతిబింబింప చేయడంతో పాటు శ్రీశ్రీశ్రీ వినాయక చవితి వ్రత కల్ప విధానం పుస్తకాన్ని అందజేయాలని సంకల్పంతో నిర్ణయం తీసుకున్నారు .నిర్ణయానికి అనుగుణంగా క్యాలిటి,క్వానీటి లలో ఎక్కడా రాజీ లేకుండా కలకలానికి గుర్తుండి పోయేలా పుస్తకాన్ని రూపుదిద్దుకుంది .

ఈ పుస్తకం ఈ వినాయక చవితికి ప్రజల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుస్తకాన్ని చూసిన మంత్రి జగదీష్ రెడ్డి,సునీతా జగదీష్ రెడ్డి దంపతులు మంత్ర ముగ్దులు కావడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు గాను ప్రతి సంవత్సరం అందిస్తున్నట్లుగానే భక్తులకు మట్టి వినాయకుడి ప్రతిమలను అందించిన మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి శ్రీమతి సునీతా జగదీష్ రెడ్డి ఈ సంవత్సరం ముస్లిం యువకుడు యస్ కే మాజిద్ రూపొందించిన శ్రీశ్రీశ్రీ వినాయక చవితి వ్రత కల్ప విధానం పుస్తకాన్ని అందించి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం గంగా జమునా తాహజీబ్ కు తార్కాణమని నిరూపించారు.

సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి

సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి

సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని మాజీమంత్రి వర్యులు,పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు దరఖాస్తు చేసుకున్నారు.

శుక్రవారం దామన్న తరుపున పిసిసి సభ్యులు కొప్పుల వేణా రెడ్డి గారు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి క్రిష్ణా రెడ్డి గారితో కలిసి గాంధీ భవన్ లో దరఖాస్తును అందజేశారు.

ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి బాల లక్ష్మీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి రవీందర్ రెడ్డి (కబడ్డీ) తదితరులు పాల్గొన్నారు.

రష్యా ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను అవలంబిస్తుంది..

రష్యా ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను అవలంబిస్తుంది

సల్మాన్ హైదర్ 

రష్యా ప్రధానంగా నాలుగు ముస్లిం తూర్పు ప్రాంతాలలో -చెచ్న్యా, డాగేస్తాన్, బాష్కోర్టోస్తాన్ మరియు టాటర్స్తాన్ (Chechnya, Dagestan, Bashkortostan, and Tatarstan) లో ఇస్లామిక్ బ్యాంకింగ్ పద్ధతులను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

రష్యన్ స్టేట్ డూమా(పార్లమెంట్) లో, రష్యాలో ఇస్లామిక్ ఫైనాన్స్‌ను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన కొత్త బిల్లు ఇప్పటికే ఆమోదించబడింది. బిల్లు ప్రకారం భాగస్వామ్య ఫైనాన్సింగ్ సంస్థలు ముస్లిం తూర్పు ప్రాంతాలలో అభివృద్ధి చెందుతాయి. బ్యాంక్ ఆఫ్ రష్యా మార్కెట్‌ను నియంత్రిస్తుంది మరియు కంపెనీల రిజిస్ట్రీని నిర్వహిస్తుంది

ఖతారీ నాన్-ప్రాఫిట్ మీడియా అవుట్‌లెట్ మిడిల్ ఈస్ట్ మానిటర్ (MEMO), కథనం ప్రకారం రష్యా లో ఇస్లామిక్ బ్యాంకింగ్ అనేది ఉక్రెయిన్ విషయం లో రష్యా పట్ల విధింపబడిన పాశ్చాత్య ఆంక్షలకు ప్రతిస్పందన. ముస్లిం ప్రపంచంలో మరింత లాభదాయకమైన వాణిజ్యం కోసం, రష్యా మధ్యప్రాచ్యం మరియు ఆసియా వైపు చూస్తుంది. 

ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ బ్యాంకులు ఉన్నాయి. ది ఎకనామిస్ట్ యొక్క 2014 నివేదిక ప్రకారం, షరియా చట్టానికి కట్టుబడి ఉన్న ఆర్థిక సంస్థలు ప్రపంచ ఆస్తులలో 1% కలిగి ఉన్నాయి. ముస్లిం మరియు ముస్లిం మెజారిటీ దేశాలలో షరియా-అనుకూల బ్యాంకులు క్రమంగా విస్తరిస్తున్నాయి. 

2004లో, ముస్లిమేతర దేశంలో మొట్టమొదటి ఇస్లామిక్ బ్యాంక్ లండన్‌లో ప్రారంభించబడింది మరియు 2013లో, J.P మోర్గాన్ వినియోగదారులకు ఇస్లామిక్ బ్యాంకింగ్ ఎంపికలను అందించడం ప్రారంభించినది. ఇస్లామిక్ బ్యాంకింగ్ ఇప్పుడు ప్రతిచోటా ప్రజలకు ఒక ఎంపికలాగా మారింది.

రష్యన్ స్టేట్ డూమా ఆర్ధిక కమిటీ అధిపతి అనటోలీ అక్సాకోవ్‌ ప్రకారం "ఆసియా దేశాల నుండి- మలేషియా, ఇండోనేషియా మరియు అరబ్ దేశాల నుండి నిధులను ఆకర్షించే అంశం డూమా ఎజెండాలో ఉంది, ,."

ఇస్లామిక్ బ్యాంకింగ్ మరియు వాణిజ్య ఆచరణలో రష్యా యొక్క తాత్కాలిక ప్రవేశం పూర్తిగా ఊహించనిది కాదు. 2017 US స్టేట్ డిపార్ట్‌మెంట్ సర్వే ప్రకారం, రష్యా మొత్తం జనాభాలో ముస్లింలు దాదాపు 10% ఉన్నారు. వందల సంవత్సరాలుగా, రష్యా ఉత్తర కాకసస్‌లోని కొన్ని భాగాలను పాలించింది. చెచ్న్యా, డాగేస్తాన్, బాష్‌కోర్టోస్తాన్ మరియు టాటర్‌స్తాన్‌లలో గణనీయమైన ముస్లిం జనాభా ఉన్నందున, రష్యా ఇప్పుడు ఐరోపాలో అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉంది.