లెంకలపల్లి లో ఘనంగా రెండవ రోజు విఘ్నేశ్వరుడికి పూజలు

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా..  మంగళవారం గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద నవరాత్రి గణేష్ పూజలలో భాగంగా 2వ రోజు, గ్రామానికి చెందిన దంపతులు బిజ్జాల శ్రీధర్ - శ్రీదేవి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. విగ్రహదాత పగిళ్ల రాజశేఖర్, లడ్డు దాత వావిళ్ళ అంజి యాదవ్. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA DIST
చిన్న కొండూరు గ్రామంలో అభివృద్ధి పనుల కోసం పర్యటించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల

మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం, నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలో వాడవాడల పర్యటించారు. ఈ సందర్భంగా  గ్రామంలోని ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో మిగిలి ఉన్న సిసి రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై పర్యవేక్షణ చేపడుతున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల మాట్లాడుతూ.. మిగిలి ఉన్న సిసి రోడ్లు మరియు డ్రైనేజీ పనులను పరిశీలించి, ఆ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. SB NEWS, TELANGANA
అంగన్వాడి ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య

నల్లగొండ జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మంగళవారం 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య హాజరై అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వారికి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం, 26 వేల వేతనం ఇవ్వాలని, అధికారుల వేధింపులు ఆపాలని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చేయని పక్షంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వాన్ని ఓడించడం ఖాయమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం చింతపల్లి మండల నాయకులు ఊడిగుండ్ల రాములు, అంగన్వాడి ఉద్యోగుల సంఘం సిఐటియు నాయకురాలు కే. రజిత ఆర్. శోభ, శారద, అనంతలక్ష్మి, సువర్ణ, కలమ్మ, జయ శ్రీ, విమలాదేవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు

SB NEWS, NALGONDA DIST

NKL: జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలి: గద్దపాటి రమేష్

NLG, నకిరేకల్: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బిఎస్పి నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రమేష్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికలలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల హామీ ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ ప్రజాప్రతినిధుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. లేనట్లయితే జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. SB NEWS NALGONDA DIST

PLEASE DOWNLOAD STREETBUZZ APP
డోర్నకల్ లో దొరల ఆధిపత్య పార్టీలను అంతం చేస్తాం: జిల్లా బీఎస్పీ మహిళా కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్

మహబూబాబాద్ : డోర్నకల్ నియోజకవర్గం లో దొరల ఆధిపత్య పార్టీలను అంతం చేసి బహుజనులకు రాజ్యాధికారం తెస్తామని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా మహిళ కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ పరిధిలోని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో బిఎస్పీ మొదటి పది హామీల గోడ పత్రిక ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పార్వతి రమేష్ నాయక్ మాట్లాడుతూ.. డోర్నకల్ నియోజకవర్గంలో తరతరాలుగా దొరలు, వారి బినామీ పాలకులే పరిపాలనలో ఉంటున్నారని.. అధికారంలో పార్టీలు మారుతున్నాయే తప్ప దొరలు, దొరల బినామీ పాలకులు మారడం లేదని.. వారి ఆధిపత్యంలో బహుజనులు ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండా తీవ్ర వివక్షకు గురయ్యారని ఇక గడీ ల పాలనను,  బిఎస్పీ ఆధ్వర్యంలో భూస్థాపితం చేస్తామని అన్నారు. బిఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో  తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారం తెచ్చి, అధికారంలో బహుజనులందరికి వాటా కల్పిస్తామని బహుజనులందరు బిఎస్పీ తో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ లు తేజావత్ అభి నాయక్, ఎల్ విజయ్ కాంత్, జిల్లా ఉపాధ్యక్షులు తగరం నాగన్న, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐతం ఉపేందర్, జిల్లా కార్యదర్శి, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ ఐనాల పరశురాములు, జిల్లా ఇసి మెంబర్ ఎడ్ల శ్రీను, బిఎస్పీ కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి ఏడెల్లి అఖిల్, డోర్నకల్ అసెంబ్లీ అధ్యక్షులు భాషిపంగు మహేందర్,మరిపెడ మండల అధ్యక్ష, కార్యదర్శులు జినక కృష్ణమూర్తి, గుగులోత్ బాసునాయక్, నాయకులు కోర్ని సురేష్, జినక వీరయ్య తదితరులు పాల్గొన్నారు. SB NEWS, TELANGANA

PLEASE DOWNLOAD STREETBUZZ APP & FOLLOW MANE PRAVEEN
NLG: మార్నింగ్ వాక్ కు వెళ్లిన యువ దంపతులు తిరిగిరాని లోకాలకు...
నల్లగొండ: పట్టణంలోని పానగల్ సమీపాన మంగళవారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని యువ దంపతులు మృతి చెందారు. వివరాలు.. పానగల్ కు చెందిన దంపతులు ఓర్సు విష్ణు (30), స్వప్న (27) ఇద్దరూ రోజువారి కార్యక్రమంలో భాగంగా పానగల్ ఉదయ సముద్రం సమీపంలోని హైవే పై 'మార్నింగ్ వాక్' వెళ్లారు.

పానగల్ ఉదయ సముద్రం కట్ట మధ్య భాగంలో  ఇద్దరు దంపతులను నకిరేకల్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టగా దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన దంపతులకు ఇద్దరూ చిన్న పిల్లలు ఉన్నారు. మృతి చెందిన దంపతులలో ఓర్సు విష్ణు స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నారు. పలువురు  అధ్యాపకులు ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సంతాపం తెలియజేస్తున్నారు. ఘటనతో పానగల్ విషాదంలో మునిగిపోయింది.

SB NEWS, NALGONDA DIST

PLS DOWNLOAD STREETBUZZ APP
లెంకలపల్లి: మండపంలో కొలువుదీరిన గణనాథుడు

మర్రిగూడ మండలం, లెంకలపల్లి: ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా, గణేష్ నవరాత్రి ఉత్సవాల లో భాగంగా.. గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ, గాంధీ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడు, గాంధీ సెంటర్ మండపంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఈ సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ వారు ప్రథమ పూజ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

SB NEWS, NALGONDA DIST

PLEASE DOWNLOAD STREETBUZZ APP FOR INSTANT NEWS
చండూరు: ఒంటి కాలు పై నిలబడి నిరసన తెలిపిన అంగన్వాడీ ఉద్యోగులు
నల్లగొండ జిల్లా, చండూరు: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రీపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె 8వ రోజు చేరుకున్న సందర్భంగా అంగన్వాడి ఉద్యోగులు ఒంటి కాలు పై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, వారి సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడి సిబ్బందితో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆరోపించారు. వీరిచే ఇతర పనులు కూడా చేయించుకుంటూ శ్రమను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.


రికార్డుల నిర్వహణ పేరిట అధికారులు వేధింపులు గురి చేస్తున్నారని, కొత్త యాప్ లు తీసుకొచ్చి మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు కనీస వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.


పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, గతంలో మంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరారు. అదనపు పనులను రద్దు చేయాలని, అంగన్వాడీల పై ప్రజాప్రతినిధుల పెత్తనాన్ని నివారించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న టిఎ, డిఎ ఇతర అలవెన్స్ ను వెంటనే విడుదల చేయాలన్నారు.


అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు అంగన్వాడీ సిబ్బంది చేసే సమ్మెకు పూర్తిగా మద్దతుగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


ఈ కార్యక్రమంలో సత్తమ్మ, తారకమ్మ, నాగమణి, రమణ, విజయలక్ష్మి, కేదారి, జగదీశ్వరి, సునీత, తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడెం మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: నాగిళ్ల మారయ్య
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: మాల మహానాడు మర్రిగూడెం మండల అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత నాగిల్ల మారయ్య మర్రిగూడెం మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు, మరియు గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగిళ్ల మారయ్య మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జరిపే వేడుకల సమయంలో యువకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రశాంత వాతావరణంలో పండుగను ఆనందంతో జరుపుకోవాలని కోరారు.

ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలని, తలచిన కార్యాలు విజయవంతంగా నెరవేరాలని, ఆ ప్రధమ పూజ్యుడు ప్రజలందరికీ మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

రైతులు పండించిన పంటలు సమృద్ధిగా పండాలని, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు రావాలని, ఉద్యోగులకు ప్రమోషన్లు రావాలని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని, శ్రమజీవులకు తగిన ప్రతిఫలం దక్కాలని, విద్యారంగంలో, వైద్యరంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

SB NEWS, NALGONDA DIST

PLEASE DOWNLOAD APP FROM GOOGLE PLAY



లెంకలపల్లి గ్రామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: సర్పంచ్ పాక నగేష్ యాదవ్

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి: వినాయక చవితి మరియు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సందర్భంగా.. లెంకలపల్లి గ్రామ ప్రజలకు, గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.


అదేవిధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాలలో విజయాలు సిద్ధించాలని, వినాయక చవితి పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

SB NEWS, NALGONDA DIST