తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 19 2023, 19:10

మృత్యు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మృత్యు కుటుంబానికి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు,

ఈరోజు ఉదయం పానగల్ ఉదయ సముద్రం చెరువు కట్ట కింద, మార్నింగ్ వాక్, కు, వెళ్లిన, ఓర్సు విష్ణు, వారి సతీమణి, ఓర్సు స్వప్న, గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి నందున, ఇద్దరు మృతి చెందారు,

భువనగిరిపార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపిన,లక్ష రూపాయలు నలగొండ కాంగ్రెస్ పార్టీపట్టణ అధ్యక్షులు, గుమ్మల మోహన్ రెడ్డి అందచేశారు.

వారి మృతదేహానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోభీమనపల్లి కిషోర్ యాదవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 19 2023, 12:55

నల్గొండ పట్టణంలోని పలు వార్డుల్లోని గణపతి మండపాలను పర్యటించి పూజ మరియు అన్న దాన కార్యక్రమాలల్లో పాల్గొన్న: బిజేపి నాయకులు డా" నాగం వర్షిత్ రెడ్డ

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 18 2023, 20:38

అమృతకాల సమావేశాల పేరుతో తెలంగాణపై విషం చిమ్ముతారా? ప్రధానిపై మండిపడిన మంత్రి కేటీఆర్

పార్లమెంట్ అమృతకాల సమావేశాల పేరుతో తెలంగాణపై విషం చిమ్మడం ఏ సంస్కారానికి గుర్తు? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఐటీ మంత్రి కే. తారక రామారావు ప్రశ్నించారు.

తెలంగాణ ఏర్పాటు పైన పార్లమెంట్‌లో మోడీ చేసిన వ్యాఖ్యలపైన కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం మానేసి, అదే పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ద్వేషం కాదు.. దేశం ముఖ్యమని, దేశం అంటే రాష్ట్రాల సమాహారం అని ప్రధాని తెలుసుకోవాలని కేటీఆర్ సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, తెలంగాణ రాష్ట్రం కోసం 60 ఏండ్ల తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమాలను తక్కువ చేసి మాట్లాడేలా ప్రధానమంత్రి పదేపదే తన అక్కస్సును వెళ్లగక్కుతున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపైన ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా తన గుడ్డి వ్యతిరేకతను వెళ్లగక్కడం ఇప్పటికే అనేకసార్లు చూశామని తెలిపారు. తెలంగాణ సమాజమంతా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ త్యాగాల పునాదులపైన ఏర్పడిందని, అలాంటి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంబురాలు జరగలేదన్న నరేంద్ర మోడీ, చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు.

స్వార్ధ రాజకీయాల కోసం

కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న చారిత్రక అంశాల పట్ల ప్రధానమంత్రి సున్నితంగా వ్యవహరించడం నేర్చుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంబరాలు జరగలేదు అనడం ప్రధానమంత్రి అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే ఉద్దేశంతో ప్రధానమంత్రి పదేపదే కోట్లాదిమంది తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేవలం స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల మనోభావాలతో అడుకోవడం మానుకోవాలని, చారిత్రక అంశాల పట్ల సున్నితంగా వ్యవహరిస్తూ, అర్థం చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ప్రధానమంత్రి ఇలాంటి హోదాల్లో ఉన్న వ్యక్తులకు అత్యంత అవసరమని సూచించారు.

తెలంగాణ అంటేనే గిట్టనట్టు.. పగబట్టినట్టు రాష్ర్ట పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? అని ప్రధానిని మంత్రి పశ్నించారు. మా దశాబ్దాల కల నెరవేరిన నాడు… అంబరాన్ని అంటిన తెలంగాణ సంబరాలు అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఆలంపూర్ దాకా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఉత్సవాలు కనిపించలేదా ? అని ప్రధానిని ప్రశ్నించారు. గాంధేయ మార్గంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం జరిగిందనడం ఆత్మగౌరవ పోరాటాన్ని పార్లమెంట్ సాక్షిగా అవమానించడమే అని కేటీఆర్ అన్నారు.

ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తదా

గతంలో తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం..అహంకారంతో ఇంకెన్నిసార్లు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తారని ప్రధానిపై అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. వడ్లు కొనండని అడిగితే మీ కేంద్రమంత్రి నూకలు బుక్కమని మా రైతుల్ని కించపర్చారని, ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తదా అని కేటీఆర్ అన్నారు. మీలాగే మీ మంత్రులు కూడా తెలంగాణ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, నిధులు మూటలు ఎట్లాగూ మా రాష్ట్రానికి ఇవ్వని ప్రధాని, కనీసం..మాటల్లోనైనా మర్యాద చూపించాలని మంత్రి సూచించారు.

కోటి ఆశలు.. ఆకాంక్షలతో పురుడుపోసుకొన్న కొత్త రాష్ట్రానికి సహకరించక పోగా..ఆదినుంచి కక్షను పెంచుకొని.. ప్రధాని వివక్షనే చూపిస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఏడు మండలాలు గుంజుకొని ..లోయర్ సీలేరు ప్రాజెక్టును లాక్కొని పురిట్లోనే మీరు చేసిన తొలిద్రోహాన్ని తెలంగాణ మర్చిపొదని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. నీతి ఆయోగ్‌ చెప్పినా నీతి లేకుండా మిషన్ కాకతీయ.. మిషన్ భగీరథలకు నిధులను నిరాకరించిన కేంద్రం వైఖరి తెలంగాణ ప్రజలకు గుర్తుండిపొతుందని మంత్రి అన్నారు.

దశాబ్దాల కల కల్లలు

కృష్ణాలో నీటి వాటాలు తేల్చకుండా పదేండ్లుగా దక్షిణ తెలంగాణ రైతుల్ని దగాచేస్తున్న మీ పగను ఎట్లా అర్థం చేసుకోవాలని కేంద్రాన్ని మంత్రి నిలదేశారు. కాజీపేట కోచ్‌ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని తెలంగాణ క్షమించదని స్పష్టం చేశారు. 157 మెడికల్ కాలేజీల్లో.. ఒక్కటి ఇవ్వకుండా గుండుసున్నా చేశారంటే.. మీకు తెలంగాణపై ఎంత కోపమో తెలుసునని అన్నారు. పైన అప్పర్ భద్ర.. కింద పోలవరం.. ఇంకెక్కడో కెన్‌బెత్వాకు జాతీయ హోదాఇచ్చి.. మధ్యలో తెలంగాణకు మొండిచేయి ఎందుకు చూపారో మీ గుడ్డి వ్యతిరేకత చూస్తే అర్ధం అవతుందని కేటీఆర్ చెప్పారు.

బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఉరేసి..గిరిజన వర్సిటీని పక్కన పెట్టి, సింగరేణి బొగ్గుబావుల్ని వేలం వేసి, ఐటీఐఆర్‌ను రద్దు చేసి, హైదరాబాద్‌కు ఆర్బిట్రేషన్ సెంటర్ తరలించి అడుగడుగునా తెలంగాణ ప్రగతికి అడ్డంకులు కల్పించారని మంత్రి తెలిపారు. ఒక వైపు నిధులివ్వరు… సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే ఆంక్షలు విధించిన తీరుని కేటిఅర్ గుర్తు చేశారు. తెలంగాణకు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తే పగతో జుమ్లా.. హమ్లాలు చేసే డబుల్ ఇంజన్‌ సర్కారు మీది అని మంత్రి అన్నారు. ఈడీ.. ఐటీ.. సీబీఐ లాంటి వేటకుక్కలతో ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్న ప్రధాని, ప్రజాస్వామ్యం గురించి సుద్దులు చెప్పడం విచిత్రం అని కేటీఆర్ తేల్చి చెప్పారు.

తెలంగాణపై వ్యతిరేకత భావంతో ఉన్న మీరు డబుల్ ఇంజన్‌ నినాదంతో ఊదరగొట్టినా తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావని మంత్రి స్పష్టం చేశారు. డిపాజిట్లు పోగొట్టుకోవడంలో మీరు మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన బీజేపీకి, ఇక్కడ పుట్టగతులు ఉండవని తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 18 2023, 17:23

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం: మంత్రి హరీష్ రావు

ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు అన్నారు.

ఎంఎన్‌జీ ఆసుపత్రి లో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టంతో పాటు లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్‌ను హరీశ్ రావు ఈరోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. MNJ ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టం రూ.32 కోట్లు,లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ రూ.50 లక్షలు ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 18 2023, 17:20

పార్లమెంట్ లో టీడీపీ ఎంపీల ధర్నా

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుపై సోమవారం పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు.ప్లకార్డులు చేతబట్టి, గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు.

ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పార్లమెంట్ కు చేరుకుని ఎంపీలతో కలిసి ఈ ధర్నాలో పాల్గొన్నారు. టీడీపీ మాజీ ఎంపీలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు.

ఆయనపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మహాత్ముడి విగ్రహం ముందు పార్టీలకు అతీతంగా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఎలా అణచివేస్తున్నారో దేశం మొత్తానికీ తెలియజెప్పేందుకే ఈ ధర్నా చేపట్టామన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా, ఏపీలో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. మచ్చలేని నాయకుడు చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నట్లు ఎంపీ కేశినేని వ్యాఖ్యానించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 18 2023, 17:16

ఈనెలలోనే తెదేపా-జనసేన సమన్వయ కమిటీ సమావేశం!

అమరావతి: పొత్తు బంధాన్ని ముందుకు తీసుకెళ్లేలా తెదేపా-జనసేన వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈనెలలోనే ఇరుపార్టీలు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నాయి..

కమిటీ సభ్యుల నియామకంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇప్పటికే కసరత్తు ప్రారంభించి సీనియర్ నేతలతో చర్చించారు. జనసేన సమన్వయ బాధ్యతలు నాదెండ్ల మనోహర్‌కు అప్పగించారు. తెలంగాణ నుంచీ ఓ సభ్యుడిని నియమించే యోచనలో జనసేన ఉంది. 

త్వరలోనే తెదేపా తరఫున సభ్యుల నియామకం జరగనుంది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పర్యటన దిల్లీలో కొనసాగుతోంది. ఆయన వచ్చిన తర్వాత రేపు చంద్రబాబుతో జరిగే ములాఖత్‌లో చర్చించిన అనంతరం తెదేపా సమన్వయ కమిటీ సభ్యులను ఆ పార్టీ ప్రకటించనుంది. రెండు పార్టీల సమన్వయ కమిటీ ప్రకటన పూర్తయ్యాక ఈనెలలోనే తొలి సమావేశం జరిగే అవకాశముంది..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 16 2023, 12:13

ప్రిన్సిపాల్ వేధింపులు మహిళ అటెండర్ ఆత్మహత్యయత్నం

మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్‌లో ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక అటెండర్ స్వరూప విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.

ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకోగా విషయాన్ని బయటకు రానీయకుండా ప్రిన్సిపాల్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.

ఓవర్ డ్యూటీలు వేయడం, వ్యక్తిగత పనులు చేయించుకోవడం, అనారోగ్యంతో ఉన్నా సెలవు కావాలంటే ఇవ్వకుండా ఒత్తిడికి గురి చేయడం, ఇలాంటి వేధింపులతో సదరు మహిళ అటెండర్ ఆత్మహత్య చేసుకునేందుకు విష గుళికలు మింగినట్లు సమాచారం.

ఈ విషయాన్ని బయటకు తెలియకుండా ప్రిన్సిపాల్ సిబ్బందిని బెదిరించినట్లు తెలిసింది. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో ఆమెను తోర్రూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయంపై కేసముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బాధిత కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 16 2023, 09:59

పాలమూరు ఎత్తిపోతల మహో జ్వల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్


తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు:రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్‌ శనివారం ప్రారంభించనున్నారు.

ఎదురెక్కి రానున్న కృష్ణమ్మకు జలహారతి పట్టనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

పాలమూరు మహోజ్వల ఘట్టానికి నార్లాపూర్‌ వేదిక కానున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్మించిన పాలమూరు ఎత్తిపోతలను ప్రారంభించేందుకు శనివారం సీఎం కేసీఆర్‌ కొల్లాపూర్‌ మండలంలోని నార్లాపూర్‌కు చేరుకొంటారు.

మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలతో కలిసి పూజలు చేయనున్నారు. అనంతరం లిఫ్ట్‌లోని కంట్రోల్‌ రూమ్‌లోకి ప్రవేశించి, మహాబాహుబలి మోటర్లను ఆన్‌ చేస్తారు. అక్కడే సర్జ్‌పూల్‌, పంప్‌హౌస్‌ను పరిశీలించి, అక్కడి నుంచి నార్లాపూర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకొంటారు. రిజర్వాయర్‌ వద్ద డెలివరీ సిస్టర్న్స్‌ నుంచి వచ్చే కృష్ణా జలాలకు పూజలు చేసి, పుష్పాభిషేకం చేస్తారు.

అనంతరం ఎత్తిపోతల పథకంలో భాగస్వాములైన ఇరిగేషన్‌ ఉన్నతాధికారులను అభినందించనున్నారు. అనంతరం ఉన్నతాధి కారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి, మిగిలిన మూడు రిజర్వాయర్లకు నీటిని తరలించే ప్రక్రియను అడిగి తెలుసుకొంటారు. అనంతరం కొల్లాపూర్‌ సభా వేధిక వద్దకు చేరుకుంటారు.

  

ప్రాజెక్టులో కీలకమైన మొదటి పంప్‌హౌస్‌, అంజనగిరి రిజర్వాయర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మోటర్ల బిగింపు కొనసాగుతుండగా.. ఇప్పటికే రెండు మోటర్లు నీటి ఎత్తిపోతలకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే మొదటి పంపు డ్రైరన్‌ను నిర్వహించగా విజయవంతమైంది. అందులో భాగంగా నేడు జలాల ఎత్తిపోతలు చేపట్టనున్నారు.

సీఎం కేసీఆర్‌ నార్లాపూర్‌ పంప్‌హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్‌ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించనున్నారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జలహారతి పట్టనున్నారు. అనంతరం కొల్లాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు....

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 16 2023, 08:45

నాగం ఫౌండేషన్ సౌజన్యంతో గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన ఫౌండేషన్ చైర్మన్ బిజెపి నాయకులు డా" నాగం వర్షిత్ రెడ్డి గారు

హిందూ బంధువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే గణపతి నవరాత్రులకు గాను ఈరోజు సుమారు 400 విగ్రహాలను పంపిణీ చేసిన నాగం ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ నాయకులు నాగం వర్షిత్ రెడ్డి గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 ఫీట్ల నుండి 16 ఫీట్ల వరకు గణపతి విగ్రహాలు అందుబాటులో ఉన్నందున నల్లగొండ నియోజక వర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలలో నుండి దేవరకొండ నకిరేకల్ మునుగోడు మిర్యాలగూడ నాగార్జున సాగర్ నుండి కూడా యువత పెద్ద ఎత్తున తరలివచ్చి గణపతి విగ్రహాలను తీసుకెళ్లడం జరుగుతుంది గణపతి విగ్రహాలను ప్రతిష్టించబోయే వారంతా తీసుకుని వెళ్లి ఎలాంటి ఆటంకాలు కలగకుండా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా వారు కోరారు

హిందూ బంధువులందరికి ముందస్తు గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తీరందాసు కనకయ్య గారు బోగరి అనిల్ కుమార్ గారు పల్లె ప్రకాష్ గారు ఫకీరు మోహన్ రెడ్డి గారు కౌన్సిలర్ కంకణాల నాగిరెడ్డి గారు పల్ రెడ్డి నరేందర్ రెడ్డి గారు గడ్డం మహేష్ గారు పిన్నింటి నరేందర్ రెడ్డి గారు పెరిక మునికుమార్ గారు ముత్యాల శంకర్ రెడ్డి గారు గంట గంప మధుగారు గుండ్లపల్లి శాంతి స్వరూప్ గారు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్న యువత

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 14 2023, 13:26

సంగారెడ్డి జిల్లా లో చిరుత సంచారం


సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఎర్దనూర్ గ్రామ శివారులో చిరుత తిరుగుతున్నట్టు స్థానికులు గుర్తించారు

బుధవారం సాయంత్రం స్థానిక దేవుని గుట్ట పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుండగా స్థానికులు గమనించారు. వెంటనే భయంతో అక్కడ్నుంచి పరుగులు తీశారు. చిరుత సంచారాన్ని స్థానిక యువకులు తమ ఫోన్‌లలో చిత్రీకరించారు.

గ్రామ శివారులో చిరుత సంచరిస్తుందనే విషయం తెలుసుకున్న అక్కడి గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానిక అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.